అన్వేషించండి

Karthika Deepam జులై 11 ఎపిసోడ్ 1401: సౌందర్య ఆనందరావు దగ్గరకు చేరిన శౌర్య (జ్వాల), ఇంట్లో కనిపించని హిమ - మరింత పెరిగిన శోభ పైశాచికత్వం

Karthika Deepam july 11 Episode 1401: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జులై 11 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam july 11 Episode 1401)

గత ఎపిసోడ్‌లో హిమ.. జ్వాల(శౌర్య) ఇంటి ముందు వర్షంలో నిలబడి బాగా తడిసిపోతుంది. జ్వాల బయటికి రాగానే.. ‘నీకు కోపం తగ్గాలంటే నేనేం చెయ్యాలి’ అని మొండితనంతో అడుగుతుంది. కానీ జ్వాల కరగదు.  ఇంటికి తీసుకుని వెళ్లి డ్రాప్ చేసి.. హిమ ఎంతగా ఆపినా ఆగకుండా వెళ్లిపోతుంది. శనివారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. సోమవారం ఎపిసోడ్ ఇక్కడే ప్రారంభమైంది. జ్వాల ఆగకుండా వెళ్లిపోవడంతో.. హిమ చాలా ఏడుస్తుంది. ‘డాడీ ఇంటి వరకూ వచ్చిన మన శౌర్య వెళ్లిపోతోంది. లోపలికి రాను అంది’ అంటూ ఏడుస్తుంది. ఇంతలో ఆనందరావు, సౌందర్యలు వస్తారు. ఏమైందని అడిగితే వాళ్లతో చెప్పి ఏడుస్తుంది. ఎక్కడుందో ఇన్నాళ్లకు తెలిసింది కదా అదే వస్తుందిలే అని ఓదార్చుతారు.

Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య
 
అటు జ్వాల(శౌర్య) కి ఎదురుపడిన శోభ.. నువ్వు ఆశ్చర్యపోయే విషయం చెబుతాను. పద కార్లో వెళుతూ మాట్లాడుకుందాం అంటుంది. నేను రాను అని జ్వాల అనడంతో సరే ఇప్పుడే చెబుతాను...
శోభ: నువ్వే శౌర్యవి అనే విషయం... హిమకి ఎప్పుడు తెలుసో తెలుసా? బ్లెడ్ డొనేషన్ క్యాంప్‌లో నువ్వు నీ శత్రువు గురించి చెబుతున్నప్పుడు హిమ దూరం నుంచే వింది. అప్పటి నుంచే నువ్వు ఎవరివో హిమకు తెలిసిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా చెప్పలేదంటే ఏంటర్థం..? నిన్ను నైస్‌గా మోసం చేసినట్లే కదా?
జ్వాల: అయిపోయిందా?
శోభ: అయ్యో ఇక్కడే ఉంది మరో ట్విస్ట్.. నువ్వు మీ డాక్టర్ సాబ్‌ని ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత.. అప్పటికే నిరుపమ్‌ని ఇష్టపడుతున్న హిమ గుండె జారిపోయింది. అయ్యయ్యో ఏం చెయ్యాలి..? డాక్టర్ సాబ్‌ నుంచి శౌర్యని ఎలా దూరం చెయ్యాలి అని ఆలోచించి.. ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది.. ఆ ప్లానే.. తనకి క్యాన్సర్ ఉందని చెప్పింది.
జ్వాల: హేయ్ ఏం మాట్లాడుతున్నావ్? 
శోభ: నిజాలు మాట్లాడుతున్నాను...హిమకు క్యాన్సర్ లేదు...నువ్వు నమ్మవు కదా..? నా దగ్గర రిపోర్ట్ ఉన్నాయి తీసి చూపిస్తాను అంటూ కారులోంచి తీసి చూపిస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమే.. పాపం నువ్వేమో వదిలేదే లేదు.. వదిలేదే లేదు.. అని ఆటో వెనుక రాసుకుని తిరుగుతున్నావ్? ఏం జరిగింది.? మోసం జరిగింది.. నిన్ను వెన్నుపోటు పొడిచిన నీ శత్రువుపైన పగ తీర్చుకుంటావ్ కదా? ఎలా పగ తీర్చుకుంటావో నీ ఇష్టం.. షాక్ అయ్యావా? నాకు తెలుసు షాక్ అవుతావని.. సరే.. ఏం చెయ్యాలో నువ్వే తేల్చుకో.. మరి ఇంత మంచి రహస్యం చెప్పినందుకు నాకు థాంక్స్ చెప్పవా? అంటుంది.
జ్వాల:  కోపంగా లాగిపెట్టి కొట్టి థాంక్యూ అంటుంది. ఒక థాంక్స్ చాలా? ఇంకొకటి కావాలా? అంటుంది కోపంగా. హేయ్..అంటూ శోభ అరవబోతుంటే.. హూ..అంటూ చేత్తో ఆపుతుంది జ్వాల. నా శత్రువు.. నా పగ.. నా ప్రేమ.. నా జీవితం.. నా ఇష్టం.. దాన్ని ఏం చెయ్యాలో నాకు తెలుసు.. నువ్వు ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇవ్వకు.. ఇలాంటి మాటలు ఇంకొక్కసారి నాకు చెప్పకు..అనేసి జ్వాల అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

Also Read: వసు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్న రిషి, వేగంగా పావులు కదుపుతున్న దేవయాని-సాక్షి

హిమ:  హిమ భోజనానికి కూర్చుంటుంది కానీ.. జ్వాల పదే పదే గుర్తు రావడంతో.. నానమ్మ-తాతయ్యకి చెప్పి బాధపడుతుంది. వాళ్లు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఆ బాధ నుంచి బయటకు రాదు. నేను శౌర్య దగ్గరకు వెళతానంటుంది. ఇంత ప్రేమని శౌర్య కోల్పోతోంది కదా అంటే నేనే శౌర్య ప్రేమను కోల్పోతున్నాకదా అంటుంది హిమ.   తినకుండానే మధ్యలోంచి వెళ్లిపోతుంది. హిమ బాధని చూసి అల్లాడిపోతారు సౌందర్య, ఆనందరావు. ఈ శ్వరా వీళ్లిద్దర్నీ ఎప్పుడు కలుపుతావ్ అనుకుంటుంది సౌందర్య..
జ్వాల:  జ్వాల ఇంట్లో నిద్రపోతూ.. హిమ గురించి శోభ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. లేని క్యాన్సర్ తెచ్చిపెట్టుకుని డాక్టర్ సాబ్ ని దగ్గర చేసుకుందా అనుకుంటుంది. అప్పుడే తనకి జ్వరం వచ్చిందని గుర్తిస్తుంది శౌర్య(జ్వాల). 
శోభ: ఇంటికి వెళ్లి రగిలిపోతుంది. అసలు ఈ జ్వాల మామూలుది కాదు.. అరే ఈ సౌర్య నా అంచనాలన్నీ తారుమారు చేస్తుంది. దాని మీద కోపం అంటుంది. మళ్లీ ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అంటుంది.. ఆ హిమ.. సౌర్యలు గొడవ పడుతుంటే.. నేను లాభపడాలి అనుకున్నాను.. ఇదంతా అయ్యేలా లేదు.. డైరెక్ట్‌గా స్వప్న ఆంటీ దగ్గరకు వెళ్లి.. హిమకు క్యాన్సర్ లేదు.. అంతా నాటకం అని నిజం చెప్పేస్తాను.. వీళ్లు నన్ను చెంపల మీద కొడితే.. నేను తెలివిగా కొడతాను అనుకుంటూ ఫోన్ తీసుకుని స్వప్న దగ్గరకు బయలుదేరుతుంది శోభ.

Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య

అటు జ్వాలకి జ్వరం తగ్గలేదని బాధపడిన ఇంద్రుడు, చంద్రమ్మ...డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంతలో హిమ అక్కడకు వస్తుంది. అసలు జ్వాలకి జ్వరం ఎందుకొచ్చిందంటే అని చంద్రమ్మ బాధను చెబుతుంది. వాళ్లిద్దరూ ఎంతకాదన్నా అక్కా చెల్లెళ్లు చంద్రుడు అని సర్దిచెబుతాడు ఇంద్రుడు. ఆ తర్వాత జ్వాల(శౌర్య)ని తీసుకుని ఇంటికెళుతుంది హిమ. జ్వాల నిద్రలేచి చూసేసరికి సౌందర్య, ఆనందరావు ఎదురుగా నిల్చుని ఉంటారు....ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget