అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని దూరం పెడుతున్న వేదవతి! భాగ్యాన్ని ఇంట్లో నుంచి పంపేసిన గవర్నమెంట్ కోడలు!

Illu Illalu Pillalu  Serial Today Episode March 5th నర్మద తనతో మాట్లాడమని వేదవతి చుట్టూ తిరగడం వేదవతి నర్మదతో మాట్లాడకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 

Illu Illalu Pillalu  Serial Today Episode నర్మద వేదవతి దగ్గరకు వెళ్లి అత్తయ్యా అత్తయ్యా అని పిలిస్తే వేదవతి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. భాగ్యం శ్రీవల్లితో వాళ్లిద్దరూ వెళ్లిపోయి మళ్లీ వచ్చారు కదా మీ అత్తామామలు వాళ్లని అస్సలు పట్టించుకోరు.. ముందులా వాళ్లకి ఈ ఇంట్లో ఉండదు.. మీ అత్తయ్య గవర్నమెంట్ కోడలు,.. నా గవర్నమెంట్ కోడలు తెలివైంది అని ఉండేది ఇక నుంచి దాంతో అలా ఉండదు అని అనుకుంటారు. ఇంతలో నర్మద వేదవతితో మాట్లాడాలి అని ప్రయత్నించడం వేదవతి కోపంగా ఉండటం చూస్తారు.

నర్మద వేదవతితో మీ కోపాన్ని భరించగలను.. కానీ మీ మౌనం భరించలేను.. మీ కోపం పోయే వరకు కొట్టండి తిట్టండి కానీ నాతో మాట్లాడండి అన ఏడుస్తుంది. వేదవతి ఏం మాట్లాడకుండా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసేస్తుంది. భాగ్యం, శ్రీవల్లి చూసి చాలా సంతోషపడతారు. ఇక నుంచి నర్మద బతుకు కోరలు పీకేసిన పాము బతుకే ఒంటరి బతుకే అని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో నర్మద వచ్చి నేను వెళ్లిపోయానని చాలా హ్యాపీగా ఫీలైనట్లున్నారు.

మళ్లీ నేను రావడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు అని అంటే అవును అని శ్రీవల్లి అనేసి కవర్ చేయడానికి లేదు లేదు నీ కోసం చాలా ఏడ్చాను కావాలి అంటే నా కళ్లు చూడు.. మా జుట్టు నీ చేతిలో ఉంది కదా అందుకే నువ్వు వెళ్లిపోతే కాస్త హ్యాపీగా అనిపించింది అని అంటుంది. ఇక ఇడ్లీబాబాయ్‌తో నర్మద మీ ఇళ్లు ఎక్కడో మీకు తెలీదా.. మా మామయ్యకి బాలేదు అనే వంకతో ఇక్కడే ఉండిపోయారు. సర్దండి అంతా సర్దండి.. అని అంటుంది. మా అమ్మ వాళ్లు నా దగ్గరే ఉంటారు.. వాళ్లని వెళ్లిపోమని ఎవరూ చెప్పలేరు అని వల్లీ అంటుంది. 

నర్మద వల్లీతో సాగర్ జాబ్ గురించి మామయ్యకి తెలియడం అక్కడికి వచ్చి గొడవ చేయడం వెనక మీ హస్తం ఉందని నా అనుమానం అదే నిజం అని తేలితే మీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావ్ అని శ్రీవల్లి అంటే భాగ్యం ఆపి ఒకసారి ఏదో జరిగింది అని ఈ విషయంలో కూడా  మాకు సంబంధం ఉందని అనడం తప్పు.. ఇప్పుడేంటి మేం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంతే కదా వెళ్లిపోతాం అని అంటుంది.

ప్రేమ పడుకొని ఉంటే ధీరజ్ పక్కనే కూర్చొని ఇన్ని రోజులు నా కళ్లు చూడలేదు కానీ కళ్లు సీతాకోక చిలుకలు.. బుగ్గలు బూరెలు అంటూ పొగుడుతూ దిష్టి తగలకుండా బుగ్గ చుక్క పెడతాడు. ఇంత అందానికి ఒక్క చుక్క సరిపోదు అని మరో బుగ్గ మీద చుక్క పెడతాడు. తర్వాత ప్రేమకి మీసాలు పెడతాడు. ఇంతలో ప్రేమ లేచేస్తుంది. అద్దంలో ప్రేమకి చూపించి ఆట పట్టిస్తాడు. మీసాల పిల్లా అంటూ పాటపాడుతాడు. ప్రేమ ధీరజ్‌ని కొడుతుంది. ఇద్దరూ కలిసి తిరుపతి దగ్గరకు వెళ్లి కొట్టుకుంటారు. తర్వాత గదిలోకి వస్తారు. ధీరజ్ బయటకు వెళ్తున్నా అంటే ఎక్కడికి అని అడుగుతుంది. కారు కొన్నాం కదా డబ్బులు కట్టాలి కదా.. డబ్బు కోసం వెళ్లాలి.. త్వరగా రెడీ అవ్వు అంటాడు. 

సాగర్ ఉద్యోగానికి రెడీ అవుతూ ఉంటాడు. నర్మదకి పర్సు వాచ్ అడిగితే డబ్బు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవడం తెలుసు కానీ పర్సు వాచ్ గురించి తెలీదా అంటుంది. అయిపోయిన విషయం గురించి ఎందుకు అని సాగర్ అంటే ఏంటి అయిపోయింది సాగర్ నువ్వు చేసిన తప్పునకు నేను శిక్ష అనుభవిస్తున్నా.. ఒకప్పుడు అమ్మాలా చూసుకున్న అత్తయ్యా ఇప్పుడు  నన్ను దూరం పెడుతున్నారు.. మాట్లాడటం లేదు.. ముఖం మీద డోర్ వేస్తున్నారు.. ఇంట్లో ఎవరు తప్పు చేసినా నేను నిలదీస్తాను.. అలాంటిది నిన్ను క్షమిస్తా అనుకుంటున్నావా.. నువ్వు సమస్యలో ఉన్నావ్ అని నగలు తాకట్టు పెట్టా కానీ నిన్ను ఇంకా క్షమించలేదు అని అంటుంది. 

భాగ్యం, ఆనంద్‌రావులు బ్యాగ్ సర్దుకొని బయల్దేరుతారు. నర్మద వెళ్లమని సైగ చేస్తుంది. ఇంతలో రామరాజు వచ్చి ఎక్కడికి వెళ్లిపోతున్నారు అంటే వెళ్లాల్సి వచ్చిందని అంటుంది. వేదవతి వాళ్లతో ఇదీ మీ ఇళ్లే కదా ఉండిపోండి అంటుంది. నర్మద వాళ్లతో ఇదీ మీ ఇల్లే అంట ఉండి పోండి.. గోతులు తవ్వాలి కదా అంటుంది. తప్పులు చేసిన వాళ్లు ఇంట్లో ఉంటున్నారు.. మహాలక్ష్మీ లాంటి అమ్మాయిని ఇచ్చిన మీరు ఎన్ని రోజులు అయినా ఉండొచ్చు అంటాడు. మీకు ఎవరైనా ఏమైనా అన్నారా అంటే లేదు లేదు అని చెప్పి భాగ్యం వెళ్లిపోతుంది.

చందు రైస్ మిల్లుకి వెళ్తానని చెప్తే రామరాజు కొడుకు తల సర్ది డ్రస్‌కి గుండీలు పెట్టి ఇంత అమాయకుడివి ఎలా బతుకుతావో ఏంటో.. కొంత మంది ఉద్యోగం కోసం వెంపర్లాడుతున్నారు.. కానీ నువ్వు చేసిన ఉద్యోగం వదిలేసి రైస్మిల్లు చూస్తున్నావ్.. తండ్రి వారసత్వాన్ని నువ్వు చూసుకుంటున్నావ్.. నువ్వురా అసలైన వారసుడివి అంటాడు. సాగర్ వెళ్లిపోతాడు. నర్మద వేదవతికి చెప్తే వేదవతి ఏం మాట్లాడదు.. ఇన్ని రోజులు ఎలా ఒంటరిగా మిగిలిపోయానో ఇప్పుడు అలా ఉందని బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget