అన్వేషించండి

Brahmamudi Serial Today march 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్లాన్‌ అదుర్స్‌ - వంటమనిషిగా ఇందు

Brahmamudi serial today episode march 12th: శివరాంతో కలిసి తానే నాటకం ఆడానని వంట మనిషిగా పిలవమని తానే చెప్పానని ఇందు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇందును వంట మనిసిగా పంపిస్తానని రేఖ చెప్పడంతో అపర్ణ కోప్పడుతుంది. శివరాం వెళ్లిపోయాక రేఖను తిడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా మనవరాలినే వంట మనిషిగా పంపిస్తావా..? అంటూ నిలదీస్తుంది. 

రేఖ: పంపిచడానిక ధైర్యమే ఉండాలా..? 

భ్రమరాంబ:  ఆయన ఎవరైనా మామూలు మనిషి అనుకుంటున్నావా..? కోటీశ్వరుడు ఆయన దృష్టిలో మంచిగా ఉంటే కోట్లు కలిసి వస్తాయి.

అపర్ణ: అలాంటప్పుడు నువ్వే వెళ్లి  వంట పని చేసుకో ఇంకా సరిపోదు అనుకుంటే వాళ్ల బూట్లు కూడా పాలిష్‌ చేసుకో అంతే కానీ నా మనవరాలిని ఎక్కడికి పంపించను.. 

ఇందు: నాన్నమ్మ నువ్వు ఊరుకో 

అపర్ణ: ఏంటే ఊరకునేది ఈ విషయంలో నేను ఎవరి మాట వినను 

రేఖ:  వాళ్ల ఇంటికి వెళ్లి పని చేయడానికి నీ మనవరాలికి లేని అభ్యంతరం నీకు ఉండటం ఏంటి..? 

అపర్ణ: ఇంటికి వచ్చిన అతిథి ముందు మీ పరువు తీయడం ఎందుకు అని అలా అని ఉంటుంది. నా మనవరాలు ఎప్పటికీ అలాంటి పని చేయదు.. చెప్పు ఇందు ఆ పని చేయడం నీకు ఇష్టం లేదని చెప్పుతో కొట్టినట్టు వీళ్లందరికీ అర్థం అయ్యేలా చెప్పు.

భ్రమరాంబ: ఏంటే అలా నీళ్లు నములుతావు అడుగుతుంది కదా.? మీ ముసలి నాన్నమ్మ సమాధానం చెప్పు.. రేఖ మాటకు విలువ ఇచ్చి ఒప్పుకున్నానని సమాధానం చెప్పమ్మా..? 

అపర్ణ: ఇందు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.. నీ మనసులో ఉన్నది ఇది అని వీళ్లందరికీ చెవులు పగిలేలా చెప్పు.. 

ఇందు: ఆ వంట పని చేయడానికి వెళ్లడం  నాకు ఇష్టమే నాన్నమ్మ 
అపర్ణ షాక్‌, భ్రమరాంబ నవ్వుకుంటుంది. 

రేఖ: ఫినిష్‌ వినిపించింది కదా ..? నీ మనవరాలు ఏమందో..? దానికే నొప్పి లేనప్పుడు నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావు..  

భ్రమరాంబ: చేసిన గొడవ చాలు కానీ మిగిలిపోయిన ఫుడ్డు చాలా ఉంది వెళ్లి మింగండి 
అపర్ణను ఇందు తీసుకుని వెళ్తుంది. 

భ్రమరాంబ: రేఖ అది పని చేయడానికి ఒప్పుకుంది. శివరాం గారు కూడా నీకు బిజినెస్‌లో హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నారు కదా..? ఇంకా నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదేంటి..? 

రేఖ: అంతా బాగానే ఉంది కానీ ఈ ఇందు అంత సులభంగా ఎలా ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాను.. 

భ్రమరాంబ: అంతగా ఆలోచించడానికి ఏముంది..? మనల్ని ఎదిరించి బతకలేనని అర్థం చేసుకుని ఉంటుంది 

రేఖ: అంతే అంటావా..? 

భ్రమరాంబ: ముమ్మాటికీ అంతే 
అనగానే.. రేఖ ఆలోచిస్తుంది. లోపలికి వెళ్లిన ఇందును అపర్ణ తిడుతుంది. 

అపర్ణ: అసలు నీకు తెలివి ఉండే ఒప్పుకున్నావా..? ఎవరో ఇంటికి నువ్వు వెళ్లి వంట చేయడం ఏంటి..? 

ఇందు: అంతా తెలిసే ఒప్పుకున్నాను

అపర్ణ: తెలిసి కాదు మూర్ఖంగా ఆలోచించి ఒప్పుకున్నావు.. ఆ రేఖ చెప్పినట్టుగా వినుకుంటూ పోతే ఈ రోజు పని మనిషిగా వెళ్లమంది రేపు బానిసగా వెళ్లమంటుంది 

స్వాతి: అవును అక్కా ఈ విషయంలో నువ్వు తొందర పడ్డావు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించాల్సింది 

అపర్ణ: చూశావా నీ చెల్లెలుకే తప్పు అనిపిస్తుంది. అలాంటిది నువ్వెలా ఒప్పుకున్నావే 

ఇందు: కాసేపను నన్ను మాట్లాడనిస్తారా..? ఎంత సేపు మీరు చెప్పేదే కానీ నన్ను మాట్లాడనిస్తారా..? 

అపర్ణ: ఏం చెప్తావు ఇంకా ఏం చెప్తావు ఆ రేఖ మమ్మల్ని ఏం చేస్తుందోనని భయపడి ఒప్పుకున్నాను అంటావు అంతేగా 

ఇందు: ఆ రేఖ ఏం చెప్పినా నేను తలూపడానికి గంగిరెద్దును కాదు నాన్నమ్మ మీ మనవరాలిని.. మీకేం అనిపిస్తుంది నాన్నమ్మ ఆ శివరాం గారికి నిజంగానే నా వంట నచ్చి పిలుస్తున్నాడు అనుకుంటున్నారా..? 

అపర్ణ, స్వాతి షాక్‌.. మరి ఎందుకు పిలిచారు అని అడగ్గానే.. శివరాం తనకు ముందే తెలుసని ఆయనని ఒకరోజు ప్రమాదం నుంచి కాపాడానని ఇంతుకు ముందు ఆయన ఇంట్లోకి వస్తుంటేనే నేను ఎదురెళ్లి ఆయనకు నన్ను ఇలా పిలవమని చెప్పాను అంటూ ఇందు జరిగింది మొత్తం చెప్పగానే.. అపర్ణ, స్వాతి ఆశ్చర్యపోతారు. నువ్వు తక్కువదానివి కాదు అక్కా అంటుంది స్వాతి. మరోవైపు పబ్బులో ఫుల్లుగా తాగిన రాజు బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో తన తమ్ముడి వెంకట్‌ను పిలిచి పోటో తీసి బిల్లు కట్టమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget