Karthika Deepam Serial ఆగస్టు 3:ప్రేమ్ తనని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న హిమ, అస్సలు మారని నిరుపమ్-శౌర్య
Karthika Deepam August 3 Episode 1421: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం ఆగస్టు 3 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam August 3 Episode 1421)
శోభ చేసిన కుట్ర శౌర్య-నిరుపమ్ మధ్య స్నేహం మళ్లీ చిగురించేలా చేస్తే... ప్రేమ్ కి హిమతో స్పెండ్ చేసే టైమ్ దొరుకుతుంది. రూమ్ లో చిక్కుకుపోయిన శౌర్య-నిరుపమ్ కి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి హిమ ప్రేమ్ ఓ బిర్యాని ప్యాకెట్ తీసుకుంటారు. ఈ బిర్యానీ నేనే తినేస్తాను నాకు సరిపోతుంది మీకు అస్సలు పెట్టనన్న శౌర్య..ఆ తర్వాత తినేందుకు రమ్మంటుంది. తింటూ తింటూ శౌర్యని చూసిన నిరుపమ్.. ‘పాపం శౌర్య మంచిదే.. అప్పుడప్పుడు తిక్కగా ప్రవర్తిస్తుందంతే’ అనుకుంటాడు. ‘ఏంటి డాక్టర్ సాబ్.. నన్ను తినేలా చూస్తున్నారు.. బిర్యానీ తినండి’ అంటుంది. దాంతో చూపు మార్చుకుంటాడు నిరుపమ్. ‘నేను డాక్టర్ సాబ్ ఒకే గదిలో ఎదురెదురుగా ఉన్నాం.. కలిసి భోజనాన్ని పంచుకుంటున్నాం.. కానీ జీవితాన్ని పంచుకోలేకపోతున్నాం..’ అని మనసులో అనుకున్న శౌర్య పొలమారుతుంది. నిరుపమ్ వాటర్ బాటిల్ ఇవ్వడంతో ప్రేమగా తీసుకుంటుంది శౌర్య.
Also Read: శౌర్యని మళ్లీ ఏడిపించిన నిరుపమ్, హిమతో తన ప్రేమ వికసిస్తోందనే ఆనందంలో ప్రేమ్
హిమ-ప్రేమ్
‘బావా నాకో డౌట్.. వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అవ్వాలని ఒక్కటే బిర్యానీ ప్యాకెట్ తెచ్చావ్ సరే.. మరి మనిద్దరికీ కూడా ఒక్కటే ప్యాకెట్ తెచ్చావేంటి బావా’ అంటుంది హిమ. ‘వాళ్ల మధ్య కాదు..మన మధ్య కూడా ప్రేమ చిగురించాలి’ అనుకుంటాడు మనసులో. అవును బావా ఈ క్యాడింల్ ఏంటని హిమ అంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇలా ప్లాన్ చేశాను అంటాడు ప్రేమ్. చాలాసార్లు వెజ్ బిర్యానీ తిన్నాను కానీ ఇంతటేస్ట్ గా ఎప్పుడూ లేదంటాడుప్రేమ్. ఇంతలో నిరుపమ్ పిలవడంతో ఎంట్రా అప్పుడే తినేశారా? మాట్లాడుకుంటూ తినొచ్చు కదా’ అంటాడు. ఇక్కడ దోమలు కుడుతున్నాయి. నా దుప్పటి కారులో ఉంటుంది తీసుకునిరా అని నిరుపమ్ అడగడంతో తీసుకొచ్చి ఇస్తాడు ప్రేమ్. ఇక పిలవొద్దు నిద్రపోండి అంటాడు ప్రేమ్.
హిమ కోసం మంటవేస్తాడు. ‘ఎందుకు బావా?’ అని హిమ అడిగితే.. ‘బయట చలిగా ఉంది. పైగా ఇలాంటి ప్లేస్‌లో నిన్ను ఉంచినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా..’ అంటాడు ప్రేమ్. నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అని హిమ అంటే..అది నువ్వే కానీ మన పెళ్లి కాస్త లేటవుతుంది అనుకుంటాడు. అప్పుడే హిమ కళ్లలో ఏదో పడడంతో ఊదినట్టు ఊహించుకుంటాడు ప్రేమ్. హిమ...బావా బావా అని పిలవడంతో తేరుకుంటాడు ప్రేమ్. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది. ‘ప్రేమించావా కాదు హిమా.. ప్రేమిస్తున్నాను’ అంటాడు ప్రేమ్. ఎవరు అని అడిగిన వెంటనే.. ‘ఒక్క నిమిషం హిమా..వాళ్ల సంగతేంటో చూసొస్తానంటూ వెళతాడు.
Also Read: దేవయానికి షాక్ ఇచ్చి సాక్షికి ఫుల్ స్టాప్ పెట్టి వసు చేయందుకున్న రిషి
ప్రేమ్ తన ఫోన్ అక్కడే వదిలేసి వెళతాడు. ఆ ఫోన్ తీసిన హిమ...గతంలో ప్రేమ్ హిమను ఉద్దేశించి ఐ లవ్ యూ చెప్పిన సెల్ఫీ వీడియో చూసి షాక్ అవుతుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి ‘నాకు ఫోన్లు వచ్చాయా’అంటూ ఫోన్ తీసుకుని చూస్తాడు. ఆ వీడియో హిమ ఓపెన్ చేసిందని తెలిసి ప్రేమ్ కూడా షాక్ అవుతాడు. ఇది నీకోసమే రికార్డు చేశాను, నీకు పంపించాను కూడా కానీ అప్పుడే నీ ఫోన్ రిపేర్ కి వచ్చింది. అక్కడి నుంచి హిమ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సమాధానం చెప్పు హిమా అని అడుగుతాడు. జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ అవుతాయా ఏంటి అని సమాధానం చెప్పేసి వెళ్లిపోతుంది. హిమ అవునన్నట్టా కాదన్నట్టా అనే విషయం అర్థం కాలేదనుకుంటాడు ప్రేమ్.
రూమ్ బయటకు హిమ-ప్రేమ్ వచ్చేసరికి... తను కప్పుకున్న దుప్పటి తీసి నేలపై ఉన్న శౌర్యకి కప్పుతాడు. అది చూసిన హిమ-ప్రేమ్ అప్పుడప్పుడు జాలి నుంచి ప్రేమ్ పుడుతుంది అనుకుంటారు. అక్కడి నుంచీ ఇద్దరూ వెళ్లి కారులో నిద్రపోతారు. అప్పుడే లేచి చూసిన శౌర్య..తనపై దుప్పటి ఉండడం చూసి..ఇంతజాలి అవసరమా అనుకుంటూ ఆ దుప్పటిని నిరుపమ్ కి కప్పేస్తుంది. ‘ఏంటి తిరిగి ఇచ్చేస్తున్నావా?’ అంటాడు నిరుపమ్. ‘నాకు ఈ త్యాగాలు వద్దు డాక్టర్ సాబ్.. అయినా మీరు తట్టుకోలేరు. కష్టం తెలియకుండా పెరిగారు కదా’అంటుంది. ‘అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ సౌర్యా.. నీ ప్లేస్‌లో హిమ ఉండి ఉంటే ఇంత కన్నా చెత్త ప్లేస్‌లో కూడా నేను ఉండగలను. ప్లేస్ కాదు ముఖ్యం.. మనం ఎవరితో ఉన్నాం అనేది ముఖ్యం అంటాడు నిరుపమ్. ఆ మాటకు కన్నీళ్లు పెట్టుకున్న శౌర్య ఏడుస్తూ నేలపై నిద్రపోతుంది. తెల్లారగానే ప్రేమ్-హిమ వచ్చి.. రాయి దొరికింది తాళం తీస్తున్నాం అంటారు... ఎపిసోడ్ ముగిసింది.....
Also Read: బెడిసికొట్టిన శోభ ప్లాన్, రూమ్ లో డాక్టర్ సాబ్-రౌడీ బేబి, డోర్ బయట ప్రేమ్-హిమ