News
News
X

Karthika Deepam Serial ఆగస్టు 1: బెడిసికొట్టిన శోభ ప్లాన్, రూమ్ లో డాక్టర్ సాబ్-రౌడీ బేబి, డోర్ బయట ప్రేమ్-హిమ

Karthika Deepam August 1 Episode 1419: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం ఆగస్టు 1 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam August 1 Episode 1419)

డాక్టర్ సాబ్ తో కలసి అమెరికా వెళదాం అనుకున్నా,తను పక్కన కూర్చుంటే కారు నేను డ్రైవ్ చేద్దాం అనుకున్నా అనుకుంటూ ఆటో డ్రైవ్ చేస్తుంటుంది జ్వాల. రోడ్డుపై అడ్డంగా ఎవరో పడి ఉండడం చూసి ఆటో ఆపి కిందకు దిగుతుంది. వాళ్లెవరంటే గతంలో జ్వాల పోలీసులకు పట్టించిన దొంగలు వాళ్లు. జ్వాలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అటు ఇంట్లో శౌర్య ఇంకా రాలేదని కంగారుపడతారు సౌందర్య, హిమ. 
హిమ: కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోంది..శౌర్య చెప్పకుండా మళ్లీ ఎక్కడికైనా వెళ్లిపోయిందా. నేను ఇంత కష్టపడింది తన కోసమే కదా.. 
నిరుపమ్: మొబైల్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది ఇంత టెన్షన్ పడాలా
హిమ: శౌర్య గురించి నీకు తెలియదు..తనకు కోపం వస్తే ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లిపోతుందా అనే భయంలో ఉన్నాం
ఆనందరావు: ఫోన్ స్విచ్చాఫ్ అయి ఉంటుంది కంగారెందుకు
సౌందర్య:అసలే దానికి ఒంట్లో బాలేదు అందుకే కంగారుపడుతున్నాం..
ఆనందరావు: పోలీస్ కంప్లైంట్ ఇద్దామా
సౌందర్య: వద్దండీ..అది ఇంటికి వచ్చి మనపైనే అరుస్తుంది..
మేం బయటకు వెళ్లి చూసొస్తాం అని హిమ-నిరుపమ్ బయటకు వెళతారు...

Also Read:  హిమతో ప్రేమ్ ప్రేమపాటలు, శౌర్య కిడ్నాప్ వెనుకున్నది శోభేనా!

జ్వాలను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రౌడీలు..ఓ ఇంట్లో కట్టిపడేస్తారు.బయటకు వచ్చి శోభకు కాల్ చేసి పనైపోయిందని చెబుతారు. వీడియో కాల్ లో శౌర్యను చూసిన శోభ..నన్ను చెంపదెబ్బ కొడతావా ఇప్పుడు చూడు ఏమైందో అని నవ్వుకుంటుంది. మరోవైపు నిరుపమ్, ప్రేమ్, హిమ...శౌర్యని వెతుకుతూ తిరుగుతారు. రోడ్డు పక్కన శౌర్య ఆటో ఆగి ఉండడం చూసిన నిరుపమ్..వెంటనే శౌర్యకు కాల్ చేసినా కనెక్ట్ కాదు. శౌర్యని కిడ్నాప్ చేసినప్పుడు రోడ్డు పక్కనే ఉన్న పిచ్చోడు... పాపని ఎత్తుకెళ్లిపోయారుగా నేను చూశానంటాడు. పది రూపాయలు ఇస్తానంటే చెబుతానన్న పిచ్చోడికి పది రూపాయలు ఇచ్చిన నిరుపమ్ ...శౌర్యని ఎక్కడికి తీసుకెళ్లారని అడుగుతాడు. వీధి చివర బంగ్లా ఉంటుంది అందులో ఉండి ఉంటుందని చెబుతాడు. నిరుపమ్ వెంటనే శౌర్యని వెతుకుతూ వెళతాడు. శౌర్యకి ఏమై ఉంటుందని హిమ కంగారుపడుతుంటే.. తను అసలే మొండిది కదా మనల్ని సాధించాలని ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంటుంది కంగారుపడొద్దు అంటాడు ప్రేమ్. నిరుపమ్ కి కాల్ చేస్తుంది హిమ. శౌర్య ఆటో రోడ్డుపక్కన కనిపించింది కానీ శౌర్య కనిపించలేదు వెతుకుతున్నా అంటాడు నిరుపమ్. 

అటు శౌర్యని కట్టిపడేసిన రౌడీలు ఆ పక్కనే కూర్చుని మందు కొడదామా అనుకుంటారు. ఇంతలో కారు బయట ఆగిన సౌండ్ వినిపిస్తుంది. నిరుపమ్ లోపలకు వెళతాడు. బయట ఎవరొచ్చారో చూశాక మందు తాగుదాం అనుకుంటూ డోర్ తీస్తారు. బయటకు వచ్చిన చూసి లోపలకు ఎవరూ లేరని చెప్పి లోపలకు వెళ్లి తలుపేసుకుంటుండగా నిరుపమ్ ఎంట్రీ ఇస్తాడు. కట్టి పడేసి ఉన్న శౌర్యని చూసి కంగారుగా వెళ్లి కట్లు విప్పుతాడు. సినిమా స్టైల్లో ఓ ఫైట్ జరుగుతుంది. నిరుపమ్ నుంచి తప్పించుకు వచ్చిన రౌడీలు బయట గడియ పెట్టేసి వెళ్లిపోతారు. 

నిరుపమ్: థ్యాంక్స్ చెప్పవా నాకు 
శౌర్య: ముందు వెళదాం పద అంటుంది
బయట డోర్ లాక్ గడియ పెట్టేసి ఉన్నట్టు గమనిస్తారు. 

Also Read: కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది, రిషి-సాక్షి పెళ్లి , వసు పయనం ఎటువైపు!

బయట ఉన్న రౌడీలు శోభకు కాల్ చేసి..ఎవరో వచ్చారు, పెద్ద గొడవ జరిగిందని చెబుతారు. వాళ్లని లోపలుంచి గడియ పెట్టాం అని చెప్పడంతో వచ్చిన వాళ్లెవరు వీడియో కాల్ చేసి చూపించు అన్న శోభ..నిరుపమ్ ని చూసి షాక్ అవుతుంది. అర్జెంటుగా అక్కడి నుంచి పారిపోండి అని చెబుతుంది. 

ఇంకా ఎంత దూరం వెళ్లాలని హిమ కంగారుపడుతుంది.. శౌర్యకి ఏం కాలేదుకదా అంటూ టెన్షన్ పడుతుంది. బయటకొచ్చి పారిపోయిన రౌడీలను చూసి హిమ-ప్రేమ్ మరింత కంగారుపడతారు. శౌర్య మళ్లీ కుర్చీలో కూర్చోవడం చూసి ఆ సీటు అలవాటైపోయిందా అని అడుగుతాడు నిరుపమ్. ఇంతలో హిమ-ప్రేమ్ కంగారుగా వస్తారు. వరుస ప్రశ్నలు అడుగుతుంటే ముందు డోర్ తీయండంటాడు నిరుపమ్. కానీ ప్రేమ్-హిమ కలసి ఇద్దర్నీ లోపలే ఉంచేందుకు ప్లాన్ చేస్తారు. ఎపిసోడ్ ముగిసింది...

Also Read:   రౌడీబేబిని ఎత్తుకున్న డాక్టర్ సాబ్, చెల్లుకు చెల్లు అంటూ షాకిచ్చిన శౌర్య
రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
రూమ్ లోపలే చిక్కుకుపోయిన శౌర్య-నిరుపమ్ ఇద్దరూ కలసి భోజనం చేస్తారు. బయట ప్రేమ్-హిమ మాత్రం తాళం వేసి ఉన్నట్టు, దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు యాక్షన్ చేస్తారు...

Published at : 01 Aug 2022 08:24 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam August 1 Episode 1419

సంబంధిత కథనాలు

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..