By: ABP Desam | Updated at : 30 Jul 2022 09:03 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu July 30 Episode 516 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు జులై 30 శనివారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 30 Episode 516)
మీటింగ్ జరుగుతుండగా రిషి దగ్గరకు వచ్చిన వసుధార మీతో మాట్లాడాలి అంటుంది. తను ప్యాక్ చేసిన గిఫ్ట్ తీసి రిషికి ఇస్తుంది.రిషి ఓపెన్ చేస్తుంటే టెన్షన్ పడుతుంటుంది వసుధార. ఓపెన్ చేసిన రిషి..అందులో గతంలో వసుకి తాను ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఉండడం చూసి షాక్ అవుతాడు.( అప్పుడు తాను ప్రపోజ్ చేయడం వసు రిజెక్ట్ చేయడం నా గుండెను ముక్కలు చేసి వెళుతున్నావ్ అంటూ గిఫ్ట్ పగలగొట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు). ఈ గిఫ్ట్ అతికించి మళ్లీ నాకే ఎందుకు ఇచ్చింది..ఏం చెప్పాలనుకుంటోంది..నన్నెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావ్ అనుకుంటూ ముందుకు తిప్పుతాడు.. అక్కడ ఐ లవ్ యూ అని వసు రాస్తుంది కానీ
Also Read: ముక్కలైన రిషి మనసు తిరిగి అతికించి ఇచ్చిన వసు, భారీ స్కెచ్ వేసిన సాక్షి-దేవయాని
మరోవైపు స్టేజ్ పై మాట్లాడుతున్న సాక్షి వీళ్లిద్దర్నీ గమనిస్తుంటుంది. డీబీఎస్టీ కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అంతకుమించిన బంధం ఉంది. ఒకరిని సాయం చేసేందుకు బంధం ఉండాలా అవసరం లేదుకదా అంటూ మాట్లాడుతుంది. కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదుకానీ ఈ కాలేజీ నాది.. ఈ కాలేజీ ఎండీ రిషికి కాబోయే భార్యని నేనే అయినప్పుడు అని ఈ కాలేజీ నాది కదా అంటుంది.. ఆ మాట విని షాక్ అయి రిషి పైకి లేచినిల్చుంటాడు...మళ్లీ ఆ గిఫ్ట్ కిందపడబోతుండగా వసుధార పట్టుకుంటుంది.
రిషికి నాకు యంగేజ్ మెంట్ అయింది..కాదని రిషి సార్ ని చెప్పమనండి అంటుంది. స్టేజ్ పైకి వెళ్లిన రిషి ఏం చేస్తున్నావ్ అని క్వశ్చన్ చేస్తాడు. నీ ఫోన్ కి చాలా ఫొటోస్ పంపించాను ఇప్పుడైనా చూడు రిషి అంటుంది. ఆ ఫొటోస్ ఏంటంటే స్టోర్ రూమ్ లో పొరపాటున వసు పడిపోతుండగా రిషి పట్టుకున్న ఫొటోస్..
సాక్షి: నువ్వేమైనా మాట్లాడితే ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ మీడియాకు చూపిస్తాను..ఈ ఫొటోలకు అందమైన ప్రేమకథను జోడిస్తాను అని బెదిరిస్తుంది
రిషి: ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఆగిపోతాడు రిషి..
యంగేజ్ మెంట్ జరిగిన మా జంట పెళ్లి త్వరలో మీ అందరి ఆశీశ్సులతో జరుగుతుందని స్టేజ్ పై అనౌన్స్ చేస్తుంది సాక్షి..
దేవయాని వికృతంగా నవ్వుకుంటుంది...
వసు: సాక్షి ఏంటి రిషి సార్ ని ఇలా ఇరికించింది అనుకుంటుంది..
సాక్షి: వసుధార నువ్వేం చేయలేని పరిస్థితి కల్పించాను..ఈ రోజు ఆటా నాదే గెలుపూ నాదే అనుకుంటుంది..
జగతి, మహేందర్, ఫణీంద్ర చూస్తూ నిల్చుండిపోతారు...
సాక్షి: ఇంత జరిగినా నువ్వు తననే చూస్తున్నావా..చూసుకో..నువ్వు చూడడం తప్ప ఇంకేం చేయలేవు..
స్టేజ్ కింద ఉన్నవాళ్లంతా వెళ్లి కంగ్రాట్స్ చెబుతారు...
వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది...వసుని చూస్తూ నిల్చుంటాడు రిషి...
Also Read: హిమతో ప్రేమ్ ప్రేమపాటలు, శౌర్య కిడ్నాప్ వెనుకున్నది శోభేనా!
అసలేం జరిగింది జగతి..నాకేం అర్థంకాలేదు మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా..
జగతి: మాట్లాడడానికి ఏముంది..ఇలా జరగాల్సింది కాదు కానీ జరిగింది.
మహేంద్ర: అసలు నాకే ఇలా ఉంటే..రిషి సంగతి ఆలోచించావా..తన మొహంలో నాకు ఎలాంటి భావాలు కనిపించలేదు
జగతి:గొప్పవాళ్ల లక్షణం అదే..సమయం సందర్భం చూసి ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవడమే..
మహేంద్ర: రిషి ఎందుకంత సైలెంట్ గా ఉన్నాడు..ఎందుకు అరవలేదు.. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడా..
జగతి: అవును..డీబీఎస్టీ కాలేజీ పరువుకోసం...చదువుల పండుగలో అపశృతి జరగకుండా ఉండడం కోసం. కోపం పదునైన ఆయుధం..దాన్ని సరైన సందర్భంలో వాడాలి.రిషి తెలివైన వాడు కోపాన్ని కొన్ని సందర్భాల్లో నిగ్రహించుకుంటాడు, గొప్పవాడు. కాలేజీ పరువు ప్రతిష్టలు తన పర్సనల్ మేటర్స్ కన్నా ఎక్కువని రిషి భావించాడు..
ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్..అందరూ వెళ్లిపోయారు పదండి వెళదాం అంటే..జగతి నువ్వుండు అంటుంది దేవయాని.
ఇదీ దేవయాని అంటే..అర్థమైందనుకుంటాను..
జగతి: దేవయాని అక్కయ్య అంటే నాకు 20 ఏళ్ల క్రితమే అర్థమైంది..అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు.. సాక్షి నా ఆయుధం, నీ ఓటమి నా గెలుపు. నేను స్థిరంగా ఉంటాను..నా చుట్టూ నీడలా నువ్వు మారుతావు..
దేవయాని: సాక్షి-రిషి పెళ్లికి నువ్వుండాలి..
జగతి: రిషి పెళ్లి నా చేతుల మీదుగా నా కళ్లముందే జరుగుతుంది..మీరనుకుంటున్నట్టు సాక్షితో జరగదు
దేవయాని: ఇంకా ఓటమిని ఒప్పుకోవడం లేదు
జగతి: రిషి ఎప్పటికీ సాక్షిని ఒప్పుకోడు..వాడు నా కొడుకు
దేవయాని: నేను పెంచాను
జగతి: గంజాయి మొక్క పక్కన తులసి మొక్క పెరిగినా దాని పవిత్రతనుకోల్పోదు..
బయట కారు దగ్గరకు వెళ్లిన రిషి..స్టేజ్ పై సాక్షి మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిపోర్టర్ పెళ్లి గురించి మాట్లాడుతుంటే నో పర్సనల్ క్వశ్చన్స్ అనేసి తప్పించుకుంటాడు. వసుధార కనిపించడం లేదేంటి అని ఆలోచిస్తాడు.. కట్ చేస్తే వసు రెస్టారెంట్లో కూర్చుని ఎదురుగా గిఫ్ట్ పెట్టుకుని ఆలోచిస్తుంటుంది. సాక్షి అలా మాట్లాడుతుంటే మీరెందుకు మాట్లాడలేదు అనుకుంటుంది..ఇంతలో అక్కడకు వచ్చిన సాక్షి నాకు కంగ్రాట్స్ చెప్పవా..నేను చాలా హ్యపీగా ఉన్నాను అంటుంది. సాక్షి ఏదేదో మాట్లాడుతున్నా వసుధార సైలెంట్ గా ఉండిపోతుంది..
Also Read: అర్థరాత్రి దేవయాని ముందు బుక్కైపోయిన రిషి-వసు,వదిలేదేలే అంటున్న సాక్షి
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్చల్!
Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో
Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున
Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్
Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
/body>