Karthika Deepam Serial జూలై 30: హిమతో ప్రేమ్ ప్రేమపాటలు, శౌర్య కిడ్నాప్ వెనుకున్నది శోభేనా!
Karthika Deepam july 30 Episode 1418: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జులై 30 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam july 30 Episode 1418)
వాకింగ్ కి వెళ్లి కళ్లుతిరిగి పడిపోయిన శౌర్యని ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు నిరుపమ్. శౌర్యని అలా చూసి సౌందర్య, హిమ టెన్షన్ పడతారు. అంత టెన్షన్ అవసరం లేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతాడు. సోఫాలో పడుకున్న శౌర్య జారి కిందపడిపోతుంది. టెస్ట్ చేసేందుకు హిమ ప్రయత్నించినా నన్ను ముట్టుకోవద్దని చెబుతుంది.
ప్రేమ్: శౌర్య నువ్వు కళ్లుతిరిగి కిందపడిపోతే నిరుపమ్ నిన్ను బొమ్మలా ఎత్తుకుని తీసుకొచ్చాడు
శౌర్య: తిట్టుకుంటూ తీసుకురావడం గొప్పేం కాదు
సౌందర్య: నీకు మెలుకువ ఉందా..
శౌర్య: నేను మధ్యలో మాట్లాడాను డాక్టర్ సాబ్ కి తెలుసు అడగండి
నేను హెల్ప్ చేస్తానంటూ హిమ దగ్గరకు వెళుతుండగా..మొదట్నుంచీ ఒంటరిగా బతకడం అలవాటే అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య.
Also Read: రౌడీబేబిని ఎత్తుకున్న డాక్టర్ సాబ్, చెల్లుకు చెల్లు అంటూ షాకిచ్చిన శౌర్య
తలకు స్నానం చేసి చీర కట్టుకుని సాంబ్రాణి పొగ వేసుకుంటున్న హిమను రెప్పవేయకుండా చూస్తాడు ప్రేమ్. ఇంతలో కార్తీకదీపం సీరియల్ లోకి కొత్తగా జబర్దస్త్ రైజింగ్ రాజు డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. డ్రీమ్స్ లో ఉన్న ప్రేమ్ ని చూసి పగటికలలు కనకు అంటాడు. నువ్వెవరు అంటే డాక్టర్ ని అని చెబుతాడు.ఇక్కడే చాలామంది డాక్టర్లున్నారు నువ్వెందుకు వచ్చావ్ అంటే.. కబురొచ్చింది నేను వచ్చానంటూ జ్వాల రూమ్ ఎక్కడ అని చెబుతాడు. ఇల్లు బావుంది ఎలా సెట్ చేశావ్ అని జ్వాలని అనడంతో సరిగ్గా మాట్లాడకపోతే నీకు ఇంకోడాక్టర్ అవసరం అవుతాడు అంటుంది. కాసేపు కామెడీ చేసి వెళ్లిపోతాడు..
హిమ: శౌర్యా నీకేమైందో ఒక్కసారి చూడనీ
శౌర్య: లేని ప్రేమను నటించకు..నా ట్రీట్మెంట్ అయిపోయింది అందరూ వెళ్లొచ్చు..
బయట కూర్చుని హిమ బాధపడుతుంటే సౌందర్య ఓదార్చుతుంది..
హిమ: ఏంటి నానమ్మా ఇది శౌర్య అంటే నాకు ఎంత ఇష్టం..తనకోసం ఎంత ఆరాటపడుతున్నాను అది నన్ను అర్థం చేసుకోవడం లేదు. తనని నిరుపమ్ బావని కలపాలని ఎంత ఆరాటపడుతున్నాను తనకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా తనకు హెల్త్ బాగాలేకపోతే వేరే డాక్టర్ ని పిలిచి ట్రీట్మెంట్ చేయించుకుంటోంది. నాచేత్తో ఎంతోమందికి ట్రీట్మెంట్ చేశాను కానీ తోడబుట్టినదానికి ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాను
సౌందర్య: అంతా బావున్నప్పుడు మనం ఏంటో మన బలంఏంటో తెలియదు..కష్టాలు వచ్చినప్పుడు ఎదుటివారిని అపార్థం చేసుకోకుండా ఉండడమే గొప్పతనం. అన్నీ సర్దుకుంటాయి ఏడవకు..
Also Read: ముక్కలైన రిషి మనసు తిరిగి అతికించి ఇచ్చిన వసు, భారీ స్కెచ్ వేసిన సాక్షి-దేవయాని
నిరుపమ్ ని తల్చుకుంటూ మురిసిపోతుంటుంది శోభ. ఇంతలో స్వప్న వచ్చి కాఫీ ఇస్తుంది. మీరు సేవలు చేయడం ఏంటి నేను చేయాలి మీకు అని శోభ అంటే..నువ్వు కోడలి హోదాలో సేవలు చేసేలోగా నేనే నీకు సేవలు చేస్తానంటుంది. ఆ రోజు వస్తుందా అని స్వప్న అంటే..తప్పకుండా వస్తుంది ఆంటీ అంటుంది శోభ...ఇంతలో స్వప్న ఫోన్ రింగవుతుంది. ఫ్యామిలీ మొత్తం కొట్టడానికే పుట్టారు..నేను కూడా కొడతాను.. నిరుపమ్ ని అక్కడినుంచి రప్పిస్తేనే తనతో పెళ్లి ఈజీ అవుతుందని ఆలోచిస్తుంటుంది శోభ...
అటు హిమ-శౌర్య ఎవరికి వాళ్లే ఆలోచనలో పడతారు. నిరుపమ్ తనని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చిన విషయం శౌర్య... తన మనసులో మాటని శౌర్య అర్థం చేసుకోవడం లేదని హిమ ఆలోచిస్తారు.ఎంత మరిచిపోదాం అనుకున్నా డాక్టర్ సాబ్ గుర్తొస్తున్నాడు..తనని ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాలి అనుకుంటుంది. మనసుమాట వినమని బావకి చెప్పాను కదా ఇప్పుడు ఆ సూత్రాన్ని నేను ఫాలో అవ్వాలి అనుకుంటూ రూమ్ నుంచి బయటకు వస్తుంది. కాఫీ వద్దన్న హిమని బతిమలాడుతుంటాడు నిరుపమ్. ఇదంతా చూసి శౌర్య ఫీలవుతుంది. ఈ నటనల్ని చూడలేకపోతున్నాను నేనే బయటకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది అనుకుంటూ వెళుతుండగా ఎక్కడకు వెళుతున్నావ్ అని సౌందర్య అడుగుతుంది. నటించే మనుషులకు దూరంగా వెళతాను అని రిప్లై ఇస్తుంది.
సోమవారం ఎపిసోడ్ లో
గతంలో పోలీసులకు ఇద్దరు దొంగల్ని పట్టిస్తుంది శౌర్య. ఆ దొంగలు శౌర్యను కిడ్నాప్ చేస్తారు.