News
News
X

Karthika Deepam July 29 Update Episode 1417: రౌడీబేబిని ఎత్తుకున్న డాక్టర్ సాబ్, చెల్లుకు చెల్లు అంటూ షాకిచ్చిన శౌర్య

Karthika Deepam july 29 Episode 1417: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 29 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam july 29 Episode 1417)

తలనొప్పిగా ఉందనుకుంటూ కూర్చుంటుంది శౌర్య. ఆ మాట విన్న హిమ అమృతాంజనం తీసుకొచ్చి రాస్తుంది. ముందు సౌందర్య అనుకుని నువ్వు సేవలు చేయడం ఏంటి నానమ్మా అన్న శౌర్య..ఆతర్వాత అక్కడున్నది హిమ అని తెలిసి కోప్పడుతుంది. నన్ను బయటకు వెళ్లమంటే డాక్టర్ సాబ్ ని లోపలకు పంపిస్తాను అంటూ నవ్వుతూ వెళ్లిపోతుంది. దీన్ని తిట్టినా నవ్వుతూ వెళుతోంది ఏంటి..ఏమైనా ప్లాన్స్ వేస్తోందా అనుకుంటుంది శౌర్య.

జాగింగ్ కి వెళదాం రామ్మా అని శౌర్యని పిలుస్తాడు ఆనందరావు. ముందు కాసేపు బెట్టుచేసినా కార్తీక్ సెంటిమెంట్ వాడేసరికి సరేనంటుంది శౌర్య. తాతయ్య ఆనందరావుతో జాగింగ్ కి వెళుతుంది శౌర్య. మరోవైపు సౌందర్య దగ్గరకు వచ్చిన నిరుపమ్ కాఫీ అడిగుతాడు. ఆ తర్వాత హిమ-శౌర్య వార్ గురించి మాట్లాడుతూ కార్తీక్-ఆదిత్య ఎలా ఉండేవారని అడుగుతాడు. సౌందర్య-నిరుపమ్ కాసేపు మాట్లాడుకుంటారు. చిన్నప్పుడు ఇద్దరూ సరదాగా ఉండేవారు ఇప్పుడేంటో ఇలా తయారయ్యారంటుంది.

Also Read: 'కార్తీకదీపం' సీరియల్ లోకి మోనిత రీఎంట్రీ, ఇదిగో క్లారిటీ

స్వప్న-శోభ
శోభ ఏం చేస్తున్నావ్ కాపీ కావాలా అని వస్తుంది స్వప్న. కాఫీలు తాగి, టిఫిన్లు తిని, నిద్రపోవడానికి ఇక్కడకు రాలేదు.. నిరుపమ్ తో పెళ్లిచేస్తానన్నారు మరిచిపోయారా అంటూ నిలదీస్తుంది. శోభకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నా అనుకుంటుంది స్వప్న.

బావతో శౌర్య గురించి మాట్లాడాలంటే జాగింగ్ కి వెళ్లాలి అనుకుంటుంది హిమ. నిరుపమ్ కూడా హిమతో మనసువిప్పి మాట్లాడాలంటే కుదరడం లేదు అందుకే జాగింగ్ కి రమ్మన్నాను అనుకుంటాడు. శౌర్య-హిమ కలవాలని దేవుడిని ప్రార్థిస్తుంది సౌందర్య. ఈ లోగా అక్కడకు వచ్చిన ప్రేమ్..వీళ్లంతా ఏరి అని అడుగుతాడు. అంతా జాగింగ్ కి వెళ్లారని చెబుతుంది సౌందర్య.నిరుపమ్-శౌర్యని ఎలాగైనా కలిపేసి హిమతో తనకు పెళ్లిచేయాలని దేవుడిని కోరుకుంటాడు ప్రేమ్. 

హిమ, నిరుపమ్ జాగింగ్ చేస్తుండగా ఓ దగ్గర పెద్ద గుంపు ఉండడంతో ఏమైందంటూ అక్కడకు వెళతారు. వెళ్లి చూసేసరికి శౌర్య కళ్లు తిరిగి పడిపోయి ఉంటుంది. అప్పుడు నిరుపమ్ శౌర్యను ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు. నిరుపమ్ తనని ఎత్తుకున్న విషయం శౌర్యకి తెలియాలంటే ఎలాగైనా కళ్లు తెరవాలని ఆలోచించిన హిమ.. ఆటో ఆటో అని కావాలని అరుస్తుంది. హిమ అరుపులకు శౌర్య కళ్లు తెరుస్తుంది. డాక్టర్ సాబ్ తనని ఎత్తుకోవడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది. శౌర్య కళ్లు తెరవడం చూసిన నిరుపమ్ కిందకు దించాలనుకుంటాడు. కానీ శౌర్య మాత్రం చెల్లుకు చెల్లు అంటుంది. అప్పుడు మీరు మత్తులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి దింపాను అందుకే నన్ను ఇంటివరకూ దింపండి అంటుంది. 

Also Read: అర్థరాత్రి దేవయాని ముందు బుక్కైపోయిన రిషి-వసు,వదిలేదేలే అంటున్న సాక్షి
ఏపిసోడ్ పూర్తైంది....

Published at : 29 Jul 2022 09:08 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 29 Episode 1417

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Gruhalakshmi August 9th Update: తులసి ఆంటీని 'అమ్మా' అని పిలవాలనుందన్న హనీ - సామ్రాట్ కలలో విహరిస్తున్న తులసి

Gruhalakshmi August 9th Update: తులసి ఆంటీని 'అమ్మా' అని పిలవాలనుందన్న హనీ - సామ్రాట్ కలలో విహరిస్తున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 9 ఎపిసోడ్: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు

Guppedantha Manasu ఆగస్టు 9 ఎపిసోడ్: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు

Devatha August 9th Update: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ

Devatha August 9th Update: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ