అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu March 13th Episode: రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu March 13th Episode: ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు రోహిణి-మనోజ్ కొత్త ప్లాన్ వేస్తారు. మరోవైపు సుమతి పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu 2025 March 13th Episode Telugu Serial

మీనా కుటుంబంలో పెళ్లి చూపుల సందడి మొదలవుతుంది. సుమతికి మంచి సంబంధం వచ్చిందని ఇంట్లో అంతా హడావుడి చేస్తారు. నేను ఇప్పుడే కదా జాబ్ లో చేరాను..కొన్నాళ్లు ఆగి..శివకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఆ తర్వాత సుమతిని ఒప్పిస్తారు అంతా. ఈ లోగా పెళ్లివారు వస్తారు. పెళ్లికొడుకుతో విడిగా మాట్లాడిన సుమతి..తన కుటుంబం నుంచి ఎన్ని కష్టాలు పడ్డామో అని అన్నీ చెబుతుంది, పెళ్లి తర్వాత కూడా మా అమ్మకి సాయంగా ఉండాలి అనుకుంటున్నా అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు ఆ వ్యక్తి. బయటకు వెళ్లి మాట్లాడుకుని వచ్చిన తర్వాత ఇద్దరూ ఒకరికొకరు నచ్చామని చెబుతారు. మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని సుమతి తల్లి అంటే.. కట్నకానుకలు వద్దు సుమతిని ఇస్తే చాలు అంటారు. త్వరోలనే ముహూర్తం పెట్టుకుందాం అంటారు. మీరు పెళ్లి చేసి పంపించండి మాకు ఏమీ కానుకలు వద్దు అంటారు. పెళ్లి నేను ఘనంగా జరిపిస్తాను అంటాడు. హడావుడి పడి అప్పులపాలు అవొద్దు..మీ పెద్ద అల్లుడిలా మీకు నేను కూడా అండగా ఉంటానని మాటిస్తాడు. అంతా సంతోషిస్తారు. సుమతి అదృష్టవంతురాలు మంచి అబ్బాయ్ దొరికాడు అంటుంది మీనా.. అంటే నేను కాదా అని బాలు అడగ్గానే..మీరు దేవుడు అని రిప్లై ఇస్తుంది మీనా. 
 
రోహణి బాయ్ ఫ్రెండ్ దినేష్... విద్య ఇంట్లో ఎంట్రీ ఇస్తాడు. ఎందుకొచ్చావ్ అంటూ కంగారుపడుతుంది విద్య.  పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ సంగతి చెబుతా అనగానే...ఆ పని చేయి అప్పుడు నీ ఫ్రెండ్ సంగతి, నీ సంగతి బయటపెడతా అని బెదిరిస్తాడు. చేసేది లేక రోహిణికి కాల్ చేస్తుంది.. కాల్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి. ఎక్కడున్నావే దినేష్ వచ్చాడంటుంది విద్య. ఇంతలో రోహిణి వచ్చి ఫోన్ తీసుకుంటుంది. ప్రభావతి అక్కడే ఉంటుంది..అందుకే కంగారుగా మాట్లాడుతుంది రోహిణి. నెలలోపు డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు విద్య ఇంటికి వచ్చాను..రేపు నీ ఇంటికి వస్తానని బెదిరిస్తాడు. సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రోహిణి. 

దినేష్ ఎవరని క్వశ్చన్ చేస్తుంది ప్రభావతి..ఏదో కథ అల్లేస్తుంది రోహిణి. మా నాన్న అకౌంటెంట్ దుబాయ్ నుంచి వచ్చాడు అని చెప్పి కవర్ చేస్తుంది. మలేషియా నుంచి వచ్చాడా? ఇక్కడకు రాకుండా విద్య దగ్గరకు ఎందుకు వెళ్లాడు? మీనాన్నని విడుదల చేస్తున్నారా? ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారు? వరుస ప్రశ్నలు వేస్తుంది ప్రభావతి. ఏవేవో కథలు చెబుతుంటుంది రోహిణి. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు అంటుంది రోహిణి. మీనాన్న అకౌంట్లో ౩ కోట్లు ఉంటాయా అంటే..300 కోట్లు ఉంటాయని చెబుతుంది. ఆ  మాట విని ఊహల్లో తేలుతూ వెళ్లిపోతుంది ప్రభావతి. ఆ డబ్బుతో మనోజ్ పెద్ద వ్యాపారవేత్త అవుతాడని కలలు కంటుంది. సత్యం రాగానే అవన్నీ చెబుతుంది కానీ.. ముందు వాస్తవంలో బతుకు అని క్లాస్ వేసి వెళ్లిపోతాడు.  

రోహిణి తన ఫ్రెండ్ విద్యతో కలసి మరోసారి గుణ దగ్గరకు వెళుతుంది. ముందు వీడియో ఇచ్చాకే మీ పని చేస్తానని క్లారిటీ ఇస్తాడు దినేష్. ముందుగా దినేష్ కి వార్నింగ్ ఇవ్వొచ్చు కదా అంటుంది విద్య. వీడియో ఇస్తేనే దినేష్ సమస్యను హ్యాండిల్ చేస్తానని తేల్చేస్తాడు. త్వరోలనే ఆ వీడియో ఇస్తానని మాటిస్తుంది రోహిణి.  

సుమతి పెళ్లి చూపులు సక్సెస్ అవడంతో మీనా బాలు ఇద్దరూ కారులో తిరిగి వస్తుంటారు. ప్రతి అమ్మాయికి పెళ్లి విషయంలో కొన్ని కలలు ఉంటాయి కదా నీకేం లేవా అని అడుగుతాడు బాలు. ఎందుకు లేవు... నా భర్త డిగ్రీ చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, అత్తను అమ్మలా, తోడికోడళ్లను అక్కచెల్లెళ్లులా చూడాలని కలలు కనేదాన్ని అంటుంది. ఈ లక్షణాలు ఒక్కటీ నాకు లేవు నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయాను అంటాడు బాలు. అన్నీ లేకపోయినా నన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు చాలు అంటుంది. బాలుని అదే ప్రశ్న వేస్తుంది మీనా. తనకు పెద్దగా కోరికలు లేవని బామ్మ, నాన్న, కుటుంబం ఆనందంగా ఉండడమే కావాలి అంటాడు.  

ఫర్నిచర్ వ్యాపారం బాగాసాగడం లేదని కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటాడు మనోజ్. ఇంతలో మనోజ్ పార్క్ ఫ్రెండ్ వచ్చి నీకు ఇంటర్నేషనల్ డీల్ వచ్చిందని చెబుతాడు. నీ గురించి చాలా హైప్ ఇచ్చాను వాళ్లకు..నీకే ఆ డీల్ వస్తుందని చెబుతాడు. వాళ్లు రెండు రోజుల్లో ఇండియాకు వస్తారని..వాళ్లను ఇంప్రెస్ చేయడానికి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయాలంటాడు. మనోజ్ ఆలోచనలో పడతాడు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని చెబుతుంది రోహిణి. పార్టీ ఏర్పాటు చేయడానికి ఓ ఐడియా ఇస్తుంది రోహిణి..మనోజ్ కూడా సరే అంటాడు  

ఇంట్లో బాలు-ప్రభావతి మధ్య వార్ నడుస్తుంటుంది. ఇంతలో రవి శ్రుతి వస్తారు. ఏంటి తొందరగా వచ్చేశారు అంటుంది మీనా. నువ్వు వీళ్లతో మాట్లాడుతున్నావా అని ప్రభావతి అడుగుతుంది. మీనా ...శ్రుతితో కాదు రవితో మాట్లాడింది సరిగ్గా వినలేదా అంటాడు బాలు. మనోజ్ అన్నయ్య ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశారు అందుకే వచ్చాం అంటారు. మనోజ్ గాడు నెల తప్పాడా అని బాలు సెటైర్స్ వేస్తాడు. ఇంతోల మనోజ్ రోహిణి వస్తారు. నేను కూడా గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు బాలు. నీకేం ఉంటాయ్ గుడ్ న్యూస్..మహా అయితే ఓ ట్రిప్ వచ్చి ఉంటుంది అంటుంది. అందుకే రోజూ నిన్ను మూడు కోతుల బొమ్మ చూడమని చెబుతాను అంటాడు సత్యం. ప్రభావతి సైలెంట్ అయిపోతుంది... 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today April 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today April 13th: నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
Meghasandesam Serial Today April 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
Podharillu Serial Today April 13th: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
Embed widget