అన్వేషించండి

Karthika Deepam Serial ఆగస్టు 2: శౌర్యని మళ్లీ ఏడిపించిన నిరుపమ్, హిమతో తన ప్రేమ వికసిస్తోందనే ఆనందంలో ప్రేమ్

Karthika Deepam August 2 Episode 1420: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం ఆగస్టు 2 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam August 2 Episode 1420)

శౌర్యని శోభ కిడ్నాప్ చేయగా నిరుపమ్ కాపాడతాడు. రౌడీలు అక్కడి నుంచి పారిపోతుండగా ప్రేమ్-హిమ అక్కడకు చేరుకుంటారు. డోర్ బయట గడియపెట్టి ఉంటుంది. డోర్ తీయమని నిరుపమ్, శౌర్య లోపల నుంచి అరుస్తుండగా.. ప్రేమ్ మాత్రం బయట లాక్ వేసి ఉంది పగలగొట్టాలని అబద్ధం చెబుతాడు. వాళ్లిద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ కుదరడానికి ఇదే మంచి సమయం అని హిమకు చెబుతాడు. తాళం కూడా పగులగొట్టడం రాదా అని శౌర్య అంటుంటే..ఈ రోజు తాళం రాకపోతే మీ ఇద్దరూ రూమ్ లో మేం బయట అంటాడు. తాళం తీయడం గురించి శౌర్య-ప్రేమ్ మధ్య డిస్కషన్ జరుగుతుంది.ఏదో ఒకటి చేసి మమ్మల్ని విడుదల చేయండిరా అంటాడు నిరుపమ్..ప్రేమ్  ఓ రాయి తీసుకొచ్చి కావాలనే గొళ్లెంపై కొడుతుంటాడు. హిమ చూసి నవ్వుకుంటుంది.

Also Read: బెడిసికొట్టిన శోభ ప్లాన్, రూమ్ లో డాక్టర్ సాబ్-రౌడీ బేబి, డోర్ బయట ప్రేమ్-హిమ

శౌర్య కోసం కంగారుపడుతుంటారు సౌందర్య, ఆనందరావు. ఈ లోగా కాల్ చేసిన హిమ..శౌర్య క్షేమంగా ఉందని చెప్పి మీరు రండి అంటుంది. ఫోన్ లాక్కున్న ప్రేమ్...ఇక్కడంతా బాగానే ఉన్నాం మీరు మాటిమాటికి కాల్ చేయొద్దని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శౌర్య కనిపించిందన్న మాట వినడంతో ఆనందరావు సంతోషపడతాడు. ఆకలేస్తోంది పద భోజనం చేద్దాం అంటాడు. మరోవైపు తాళం తీయడం కష్టమవుతుంది అందుకే ఈ రాత్రికి ఇక్కడే బస చేయాలని..ఉదయం స్పెషలిస్టులను పిలిచి తాళం తీయిస్తానంటాడు.ఈ రాత్రంతా ఇక్కడ ఉండడం ఇంపాజిబుల్ అంటారు నిరుపమ్-శౌర్య... తప్పదు బ్రో అంటాడు ప్రేమ్..

నిరుపమ్: వాళ్లు నిన్ను కిడ్నాప్ ఎందుకు చేశారు
శౌర్య: వాళ్లు దొంగతనం చేసి పారిపోతుండగా వాళ్లని పోలీసులకు పట్టించాను
హిమ: ఇలా సహాసం చేసినందుకు తనకు అవార్డుకూడా ఇచ్చారు..
ప్రేమ్: వావ్ నువ్ సూపర్ శౌర్య..ధర్యే సాహసే శౌర్య..
నిరుపమ్: పాత పగ తీర్చుకోవడానికి నిన్ను కిడ్నాప్ చేశారా..
హిమ పద మనం తాళం పగలకొట్టడం ఎలాగో చర్చిద్దాం అంటాడు ప్రేమ్..వాళ్లకి ప్రైవసీ కల్పించాలి కదా అని బయటకు అని.. అసలు ప్రైవసీ మనకు కావాలని మనసులో అనుకుంటాడు ప్రేమ్...

Also Read: రిషికి మరోసారి ప్రపోజ్ చేసిన వసు,దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి - సాక్షికి పెద్ద షాకే ఇది!

శోభ: ఎంతో పగడ్బందీగా శౌర్యని కిడ్నాప్ చేయించాను..అంతా బావుందనుకుంటే నిరుపమ్ అక్కడకు ఎలా వెళ్లాడో అర్థం కావడం లేదు. నా ప్లాన్ అంతా చెడగొట్టాడు. స్వప్నాంటీ నాకు హెల్ప్ చేసేలా కనిపించడం లేదు..నిరుపమ్ ని దక్కించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది..

అటు ఇంట్లో కూల్ గా కూర్చున్న నిరుపమ్-శౌర్య..ఎవరికి వారు కూర్చుంటారు.. ఆకలేస్తోందని మనసులో అనుకుంటుంది శౌర్య.
నిరుపమ్: ఆకలేస్తోందా...
శౌర్య: ఆకలేస్తున్నట్టు కనిపిస్తున్నానా
హిమ: లోపలున్నవాళ్లకి ఆకలేస్తోందేమో బావా అనుకుంటూ ఏం కావాలని అడుగుతుంది..
శౌర్య: పెద్ద లిస్టు చెబుతుంది శౌర్య..
నిరుపమ్: నువ్వెళ్లి ఏదైనా తీసుకురారా బాబూ
శౌర్య: తాళం పగులగొట్టొచ్చు కదా..
ప్రేమ్; మాకు బయట కూర్చోవడం సరదా అనుకుంటున్నారా..
నిరుపమ్: ఆకలేస్తోంది ఏమైనా తీసుకురా అని ప్రేమ్ కి చెప్పేసి..నువ్వేం తింటావ్ శౌర్య...
శౌర్య:నాపై జాలి చూపించాల్సిన అవసరం లేదంటూ..కిటికీలోంచి ప్రేమ్ కి డబ్బులిస్తుంది నాకో ఇడ్లీ తీసుకురా..
నిరుపమ్: తను డబ్బులివ్వడం ఏంటి..నువ్వు తీసుకోవడం ఏంటి..
శౌర్య: నేను కష్టపడిన డబ్బులతోనే తింటాను..
వెళ్లి టిఫిన్ తీసుకొస్తాం..అప్పటి వరకూగొడవ పడకండి అని చెప్పేసి ప్రేమ్-హిమ వెళ్లిపోతారు...
కాసేపు మౌనంగా కూర్చున్న నిరుపమ్..సోఫాలో పడుకుంటాడు...దోమలున్నాయంటూ లేస్తాడు..నువ్వేంటి ఏమీ మాట్లాడవ్.. నీకు దోమలు కుట్టడం లేదా..ఇలాంటి ప్లేస్ లో దోమలు కాకుండా సీతాకోక చిలకలు ఉంటాయా చెప్పండి..ఇవి కుడితే జ్వరాలొస్తాయని నిరుపమ్ అనడంతో దోమలకా, మనుషులకా అని సెటైర్ వేస్తుంది. నీకు జోక్ గా ఉందా అని నిరుపమ్ అంటే దోమలు మోసాలు చెయ్యవు..దోమలు అబద్ధాలు చెప్పవ్ కొందరిలా అని మళ్లీ మొదలెడుతుంది. ఈ లోకంలో అన్ని కష్ట సుఖాలు చూడాలని హితబోధ చేస్తుంది..

Also Read: హిమతో ప్రేమ్ ప్రేమపాటలు, శౌర్య కిడ్నాప్ వెనుకున్నది శోభేనా!

ఇంతలో ప్రేమ్ వచ్చి ఇడ్లీ దొరకలేదు వెజ్ బిర్యానీ తీసుకొచ్చాను తీసుకో అంటాడు.మరో ప్యాకెట్ ఏదని నిరుపమ్ అడిగితే ఈ టైమ్ లో దొరకడమే కష్టం..మీరిద్దరూ షేర్ చేసుకోండి అంటాడు. నేను ఎవరికీ ఇవ్వను ఒక్కదాన్నే తింటానంటుంది. శౌర్యకి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాటల్ బాటిల్ నాకిస్తున్నావా అని నిరుపమ్ కోప్పడతాడు. మనం పిక్ నిక్ రాలేదు అడ్జెస్ట్ అవ్వాలంటాడు ప్రేమ్. కింద కూర్చుని బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది శౌర్య..దూరంగా కూర్చుంటాడు నిరుపమ్..

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నిరుపమ్ సోఫాలో నిద్రపోతుండగా దుప్పటి కప్పుతుంది..మీరు అడ్జెస్ట్ కాలేరు కదా అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావ్ శౌర్య..నీ ప్లేస్ లో హిమ ఉంటే ఇంతకన్నా దారుణమైన ప్లేస్ లో అయినా అడ్జెస్ట్ అవగలను అంటాడు. అవును నా ప్లేస్ హిమ తీసుకుంది కదా అనుకుంటూ ఏడుస్తూ నేలపై పడుకుంటుంది శౌర్య....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
CAT 2024: 'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget