అన్వేషించండి

Brahmamudi Serial Today march 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును కొట్టిన రేఖ – సుభాష్ ను తోసేసిన భూషణ్‌ 

Brahmamudi serial today episode march 5th: రుద్రాణి ఫోటో పగులగొట్టిందన్న కోపంతో ఇందును కొడుతుంది రేఖ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది. 

Brahmamudi Serial Today Episode: వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ఆడవాళ్లను కొట్టి నీళ్లు నింపుకుని వస్తాడు రాజు. రాజు పరిస్థితి చూసి వాళ్ల నాన్న నవ్వుతుంటాడు. రాజు ఇరిటేటింగ్‌ గా చూస్తూ.. 
రాజు: ఇదిగో నాన్న ఆ ఆడగుంపుతో నేను పడలేకపోతున్నాను ఇంకోసారి నన్ను నీళ్లకోసం పంపించొద్దు 
నాన్న: అదేంట్రా నీతోనే పడలేకపోతున్నామని వాళ్లు కంఫ్లైంట్‌ ఇచ్చారు 
రాజు: నా మీద కంఫ్లైంట్‌ ఇచ్చారా..? 
నాన్న: అవును రోజు నువ్వు వాళ్లను మాయ చేసి నీళ్లు పట్టుకొస్తున్నావట. నువ్వు చేస్తున్న గొడవలకు వాళ్ల మొగుళ్లతో విడాకులు అయ్యే పరిస్థితి వస్తుందని మీ అమ్మతో ఒకటే చెప్తున్నారు
రాజు: అబ్బో అంతకుముందు ఏదో వాళ్ల మొగుళ్లతో సంపారం చేసినట్టు 
నాన్న: ఆడవాళ్లతో గొడవపెట్టుకుని తన్నులు తింటావు సిగ్గు లేదురా నీకు
రాజు: అందుకే రేపటి నుంచి నేను నీళ్లకు వెళ్లను 
నాన్న: నీళ్లకు వెళ్లనంటావు కానీ వాళ్లతో గొడవ పెట్టుకోను అని మాత్రం చెప్పవా
రాజు: గొడవపెట్టుకోకుండా నీళ్లు తీసుకురావడమంటే.. ఎగ్జామ్‌ రాయకుండా పాస్‌ అవ్వడం లాంటిది.. రెండు కుదరవు నాన్న 
నాన్న: మరి నీళ్లు ఎవరు తెస్తారు
రాజు: ఉన్నాడుగా మీ ముద్దుల చిన్న కొడుకు 
నాన్న: వాడు ఉన్నాడు కాబట్టి వంతులు వేసుకుంటున్నావు.. రేపు నీకు పెళ్లి అయ్యాక పెళ్లాం వస్తుంది. అప్పుడు మాత్రం దాని కోసం వెళ్లవా..?
లక్ష్మీ వస్తుంది. 
లక్ష్మీ: పెళ్లి అయ్యాక కూడా వాడు ఇదే బస్తీలో ఉండాలని మీరు ఫిక్స్‌ అయ్యారా..? 
రాజు: నా మనసులో మాట కరెక్టుగా చెప్పావు అమ్మ 
నాన్న: వీడి ముఖానికి ఈ బస్తీలో పిల్ల కాకుండా కోటలో మహరాణి వస్తుందా..?
రాజు: అవును నా కోసం మహరాణే వస్తుంది 
నాన్న: అబ్బో ఆ మహరాణి ఎక్కుడుందో.. 
రాజు: ఏదో ఒక కోటలో ఏసీ గదిలో పనివాళ్లతో కోల్డ్ కాఫీ తాగుతూ నా కోసం కలలు కంటూ ఉంటుంది.
అంటూ రాజు ఫాంటసీలోకి వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు హాల్లో ఉన్న రుద్రాణి ఫోటో తుడుస్తూ ఉంటుంది. స్వాతి వచ్చి తనకు ఏదో సబ్జెక్ట్‌ అర్థం కావడం లేదని చెప్పమని ఇందును లాగుతుంటుంది. వాళ్లిద్దరూ మధ్య రుద్రాణి ఫోటో కింద పడిపోతుంది. ఆ సౌండ్‌కు అందరూ వస్తారు. రేఖ వస్తుంది. కింద పడిపోయిన రుద్రాణి ఫోటో చూసి కోప్పడుతుంది. 
రేఖ: మా అమ్మ నాకు దూరం అయినప్పటి నుంచి తనను ఈ ఫోటోలోనే చూసుకుంటున్నానని నీకు బాగా తెలుసు.. అయినా దీన్ని పగులగొట్టావంటే నేను అంటే భయం పోయిందా..? లేకపోతే మీ నాన్నమ్మ మాటలు విని ధైర్యం వచ్చిందా..? 
ఇందు: అది పగిలింది అద్దమే కదా నేను మళ్లీ సరి చేస్తాను.. 


రేఖ: పగిలిన అద్దమే కనిపిస్తుంది కానీ కింద పడిన మా అమ్మ ఫోటో కనిపించడం లేదా..? నీకు 
అని కోపంగా చేయేత్తి కొట్టబోతుంటే.. 
అపర్ణ: రేఖ నా మనవరాలి మీద చేయి పడితే నేను ఊరుకోను.. కావ్య బతికి ఉన్నప్పుడు మీ అమ్మను ఏం చేసిందో గుర్తుంది కదా..? దాని రక్తమే ఇందులో ఉందని మర్చిపోకు
రేఖ: మీలో పుట్టుకొచ్చిన ఈ ధైర్యాన్ని ఈరోజే ఇప్పుడే చంపేస్తాను భూషన్‌ 
అంటూ రేఖ సైగ చేయగానే.. భూషణ్‌ కోపంగా వచ్చి సుభాష్‌ను బయటకు మెట్ల దగ్గరకు తీసుకెళ్లి కిందకు తోసేస్తాడు. వెంటనే అపర్ణ, ఇందు పరుగెత్తుకుంటూ వెళ్లి సుభాష్‌ ను ఎత్తుకుని కుర్చీలో కూర్చోబెడతారు. రేఖ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. అపర్ణ, ఇందు, సుభాష్ బాధపడుతుంటే.. స్వాతి వచ్చి జోక్స్‌ చెప్పి అందరినీ నవ్విస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!  

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget