By: ABP Desam | Updated at : 01 Aug 2022 09:41 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu August 1 Episode 517 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు ఆగస్టు 1 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 1 Episode 517)
స్టేజ్ పై అందరిముందూ రిషిని పెళ్లిచేసుకోబోయేది నేనే అని అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చింది సాక్షి. అప్పటికి కాసేపటి క్రితమే రిషికి ప్రపోజ్ చేసిన వసుధార అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత రెస్టారెంట్లో కూర్చుని రిషి గురించి ఆలోచిస్తున్న వసుదగ్గరకు వెళ్లిన సాక్షి..మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఈ రోజు బిల్లు నేనే కడతాను ఏం తింటావో తిను కాఫీ తాగు అని గతంలో ఏదో అన్నావ్ కదా అని రెచ్చిపోతుంది సాక్షి. రెస్టారెంట్లో ఉన్నవన్నీ మనిద్దరకీ ఆర్డర్ పెట్టు పార్టీ చేసుకుందాం అంటుంది. గేమ్ ఓవర్ వసుధార..ఆట ముగిసింది సాక్షి గెలిచింది అంటుంది..
వసుధార: అప్పటి వరకూ సైలెంట్ గా కూర్చున్న వసుధార లేచి నిలబడి కంగ్రాట్స్ సాక్షి అంటుంది. అప్పుడే ఆట ముగిసింది నేనే గెలిచాను అని అంటున్నావ్, ఆట ముగిసిందని నువ్వెలా చెబుతున్నావ్..ఆట ఎప్పుడు ముగుస్తుందో తెలుసా నా గెలుపు నువ్వు కళ్లారా చూసినప్పుడు, నా ప్రేమ గెలిచినప్పుడు అంతేకానీ మోసం గెలిచినప్పుడు కాదు.
సాక్షి: నీకింకా నమ్మకం ఉందా
వసు: రిషి సార్ ని నువ్వు గెలవగలనని ఎలా అనుకుంటున్నావ్..రిషి సార్ ముందు ఎన్ని వేషాలు వేసినా వర్కౌట్ కావు.. అన్ని రకాలుగా ప్రయత్నించావ్ అన్నింటిలోనూ ఫెయిలయ్యావ్.. రిషి సార్ సైలెంట్ గా ఉన్నంత మాత్రాన నువ్వు సక్సెస్ అయ్యానని ఎలా అనుకుంటున్నావ్. నువ్వు ఎప్పటికీ రిషి సార్ ని గెలవలేవు..గెలిచేదేంటో నాకు తెలుసు
సాక్షి: నువ్వు బాధపడుతుంటావేమో ఒక్కసారి ఓదార్చి పోదామని వచ్చాను సరే..వెళ్లనా.. చాలా పనులున్నాయ్.. రిషితో లాంగ్ డ్రైవ్ లు చాలా పనులున్నాయ్. నువ్వు రిషిని కావాలనుకున్నావో, తన ఆస్తిని కావాలనుకున్నావో నాకు తెలియదు కానీ జీవితం అన్నాక అనుకున్నవన్నీ జరగవు కదా.. రిషిని నేను గెలుచుకున్నాను, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకుని ఎవరో ఒకర్ని పెళ్లిచేసుకుని శేష జీవితం గడిపెయ్.. హెల్త్ జాగ్రత్త..టైమ్ కి తిను.. పెరుగన్నం తిను నిద్ర బాగా వస్తుంది. బై వసుధార...
Also Read: కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది, రిషి-సాక్షి పెళ్లి , వసు పయనం ఎటువైపు!
రిషి: కార్లో వెళుతూ స్టేజ్ పై సాక్షి మాటలు తలుచుకుంటాడు. పక్కనే వసు ఉన్నట్టు ఊహించుకుంటాడు. పగిలిపోయిన గిఫ్ట్ మళ్లీ నాకిచ్చి ఏం చెప్పాలనుకుంటోంది..తనిచ్చిన గిఫ్ట్ నేను వదిలేయడం ఏంటి..ఇన్ని రోజులకు వసుధారకి ఆ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలనిపించింది..నన్ను నేను తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది..నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా... గిఫ్ట్ ఇస్తానన్నావ్..దాన్ని ఇచ్చేసరికి తీసుకునే పరిస్థితిలో నేను లేను.. గిఫ్ట్ ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అర్థం కావడం లేదు..మన మనసులు ఎందుకో కలవడం లేదు.. పక్కపక్కనే ఉన్న రైలు పట్టాల్లా మన జీవిత ప్రయాణం సాగుతుందా...మన మధ్య దూరం లేదు కానీ మనసులు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఏంటి వసుధార
అటు రెస్టారెంట్లో జగతి, మహేంద్ర, గౌతమ్ కూర్చుని ఉంటారు. వసుధార నిల్చుని ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం అని మహేంద్ర అడిగితే మనం చేయడానికి ఏమీ లేదు..మాట్లాడేందుకు ఏమీలేదంటుంది జగతి. నువ్వు మాట్లాడవేంటి వసుధార..
మహేంద్ర: సాక్షికి అంత ధైర్యం ఎందుకొచ్చిందో నాకు అర్థం కావడం లేదు..
జగతి: సాక్షి ధైర్యం ఏంటో, సాక్షి వెనుక ఎవరున్నారో నీకు తెలుసు,నాకు తెలుసు.. అక్కయ్య విసిరిన దుర్మార్గపు వలలో సాక్షి పడింది. ఇప్పుడు రిషి ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి..
గౌతమ్: నాకు చాలా కోపం వచ్చింది..నేనే స్టేజ్ పైకి వెళ్లి సాక్షికి సమాధానం చెబుదాం అనుకున్నాను
జగతి: పదిమంది ముందు అలా మాట్లాడితే సమస్యను పెంచినట్టు ఉంటుంది..అందుకే రిషి సైలెంట్ గా ఉన్నాడు
గౌతమ్: రిషి అంత సైలెంట్ గా ఉండడం నేను నమ్మలేకపోతున్నాను...
ఇంతలో పక్కనుంచి కాఫీ ప్లీజ్ అనే మాట వినిపిస్తుంది.. రిషిని చూసి అందరూ షాక్ అవుతారు..
గౌతమ్: కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసే సిట్యుయేషనా ఇది..
మహేంద్ర: అవును రిషి..
రిషి: ఈ రెస్టారెంట్లో చర్చా వేదిక పెట్టకండి..డిస్కషన్ కోసం రాలేదు..కాఫీ కోసం వచ్చాను. వసుధార కాఫీ తీసుకొస్తావా. మీక్కూడా ఏమైనా చెప్పమంటారా...
గౌతమ్: అక్కడ అంత జరిగాక నువ్వు కూల్ గా ఎలా ఉంటున్నావ్..
రిషి: రెస్టారెంట్ కి కాఫీ తాగేందుకు వచ్చాను..మీక్కూడా కాఫీ కావాలంటే చెబుతాను..నేను మాట్లాడాల్సింది డిస్కస్ చేయాల్సింది మీతో కాదు..ఈ విషయం ఎవరితో తేల్చుకోవాలో నాకు తెలుసు..మీరెందుకు టెన్షన్ పడుతున్నారు. వసుధార కాఫీ తీసుకొస్తావా...
రిషికి కాఫీ ఆర్డర్ చేసేసి వసుధార వెళ్లిపోతుంది...లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా రిషి సార్ పైకి కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అనుకుంటుంది..
Also Read: బెడిసికొట్టిన శోభ ప్లాన్, రూమ్ లో డాక్టర్ సాబ్-రౌడీ బేబి, డోర్ బయట ప్రేమ్-హిమ
దేవయాని-సాక్షి
నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నారని సాక్షి అంటే.. ఓ పెద్ద విజయాన్ని సాధించాం..జగతి వసుకి కలలో కూడా ఉహించని షాక్ ఇచ్చాం. అందరి ముందూ రిషిని మాట్లాడకుండా చేశాం కానీ ఈ విజయంతో నువ్వు రిలాక్స్ అవొద్దు...ఎదుటివారు ఏం చేస్తారో చూసి మన ఎత్తుగడ మార్చాలి. రిషిని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోలేం..రిషిని ప్రేమతో మాత్రమే గెలవగలం. హక్కులు అడగకూడదు, మాట్లాడకూడదు..ఏం అడిగినా ఏం చేసినా మనసు గెలుచుకునేలా అడిగితే కానీ రిషి లొంగడు..
అటు రెస్టారెంట్ లోంచి వెళ్లిపోయిన వసుధార అమ్మవారి గుడి దగ్గర దండం పెట్టుకుంటుంది.
వసుధార: అమ్మా గంపెడంత కళ్లుపెట్టుకుని చూస్తుంటావని అందరూ అంటుంటారు కదా ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదమ్మా. సాక్షి ఏదో కుట్రపన్నుతోంది సాక్షి వలలోంచి రిషి సార్ ని ఎలా కాపాడాలి రిషి సార్ బావుండాలి, రిషి సార్ ఎక్కడున్నా బావుండాలని కోరుకునేవాళ్లలో మొదటి వ్యక్తిని నేను..రిషి సార్ కి నాకు ఉన్న బంధం ఏంటో నా మనసులో ఏముందో నీకు తెలుసుకదమ్మా పగిలిపోయిన బొమ్మని అతికించగలిగాను..చెదిరిపోయిన బంధాన్ని కూడా కాపాడుకోగలను....ఆ సాక్షి రూపంలో రిషిసార్ కి ఏదో ప్రమాదం రాబోతోందని అర్థమవుతోంది..రాబోయే సమస్యని నువ్వే తీర్చాలి...ఎవరి మనసు మారుస్తావో, ఎలా నీ మహిమను చూపిస్తావో అంతా నీ ఇష్టం అమ్మా....( రిషితో స్పెండ్ చేసిన సందర్భాలన్నీ గుర్తుచేసుకుంటుంది)
Also Read: ముక్కలైన రిషి మనసు తిరిగి అతికించి ఇచ్చిన వసు, భారీ స్కెచ్ వేసిన సాక్షి-దేవయాని
రిషి రూమ్ లో కూర్చుని వసుధార-సాక్షి గురించి ఆలోచిస్తుంటాడు. బయట డోర్ కొడుతుంది జగతి. రేయ్ గౌతమ్ ఇప్పుడేం అడగొద్దు నేను చెప్పలేను వెళ్లిపో అంటాడు. సార్ నేను అంటుంది జగతి..
రిషి: ఇప్పుడేం అడగొద్దు మేడం..వెళ్లిపోవద్దు
జగతి: కొన్ని సార్లు మౌనం మందు అయితే.. మరికొన్ని సార్లు విషం
రిషి: విషపు ఆలోచనలు, విషపు మనుషుల మధ్య ఏం చేయలేం. వసుధారగురించి ఏం చెప్పొద్దు..సాక్షిగురించి చర్చించవద్దు
జగతి: నేను చెప్పేది వినండి సార్. ఇది ఎవరి సమస్యో కాదు మీ సమస్య. జీవతంలో కన్ఫ్యూజన్స్ ఏదో రూపంలో వస్తుంటాయి వాటిని మీరు దాటుకుంటూ వెళ్లాలి. వసుగురించి ఏం చెప్పొద్దనన్నారు కానీ మీకు ఓ విషయం చెప్పాలి. వసుధార మీ విషయంలో స్పష్టంగా ఉంది..తను మిమ్మల్ని ఇష్టపడుతోంది సార్..
రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
వసు కాల్ చేస్తుంది.. ఇంకా నిద్రపోలేంటి అంటాడు రిషి. కళ్లు మూసుకుంటే నిద్రపోతాను కానీ కళ్లు మూసుకుంటే నా మనసు తెరుచుకుంటుంది. సాక్షికి మనకు ఏంటి సంబంధం, ఆ సాక్షికి చెప్పండి..ఇప్పటి వరకూ తను చేసింది తప్పు..ఇకపై కూడా ఇలాగే చేస్తే నేనేంటో నా ఆవేశం ఏంటో చూపించాల్సి ఉంటుంది.
Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!
Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్కే దక్కిన సపోర్ట్!
Bramhamudi Today December 7th Episode: అనామిక, కల్యాణ్ పెళ్లి జరగకుండా పుల్లలు పెడుతోన్న కనకం!
Intinti Gruhalakshmi December 7th Episode: కోడలి మీద ప్రతీకారం తీర్చుకున్న రాజ్యలక్ష్మి.. ప్రాణాపాయ స్థితిలో దివ్య!
Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>