Nindu Manasulu Serial Today March 5th: నిండు మనసులు: ప్రేరణ తండ్రి మిస్సింగ్.. రచ్చ చేసిన గణ! సిద్ధూని హగ్ చేసుకున్న ప్రేరణ!
Nindu Manasulu Serial Today March 5th తండ్రి కనిపించడం లేదని తెలిసిన గణ ప్రేరణ ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ సర్‌ఫైజ్ ఇవ్వాలి అనుకున్నాడని తెలుసుకున్న ప్రేరణ కేఫ్లో ఓ టేబుల్ మీద గులాబిలతో డెకరేషన్ చేసి అందులో ఒక డైమండ్ రింగ్ ఉంటుంది. ప్రేరణ అది చూసి సిద్ధూ తన కోసం ఏర్పాటు చేశాడు అనుకొని దాన్ని తీసుకొని కోపంగా సిద్ధూ దగ్గరకు వెళ్లి ఏంటి ఇది.. నీ పద్ధతి నాకు ఏం నచ్చలేదు అని చెప్పి ఆ రింగ్ చూపిస్తుంది. ఇది నువ్వు నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ కదా అంటుంది. ఎందుకు ఇలా చేశావ్.. అందుకే నేను మనం దూరంగా ఉందాం అన్నాను.. స్నేహం మీద నాకు ఉన్న నమ్మకం పోగొట్టేశావ్.. ఎందుకు ఇలా చేశావ్ సిద్ధూ అని ప్రేరణ చెడామడా తిట్టేస్తుంది. ఇంతలో ఒకాయక అక్కడికి వచ్చి ఆ రింగ్ నాది అని అంటాడు.
కుమార్, ప్రేరణల్ని ఆయన నా రింగ్ నా పర్మిషన్ లేకుండా తీసుకుంటారా అని తిడతాడు. సారీ చెప్పి ప్రేరణ రింగ్ ఇచ్చేస్తుంది. సిద్ధూ ప్రేరణతో నేను నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చిన మాట నిజమే కానీ అది నీ మనసుకి కష్టపెట్టేది కాదు మనసుకి నచ్చేది అని చెప్పి గిఫ్ట్ తీసుకొచ్చి ప్రేరణకు ఓపెన్ చేయమని అంటాడు. ప్రేరణ ఓపెన్ చూసే సరికి ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర, రాజశేకరం కలిసి తీసుకున్న ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. అది చూసి ప్రేరణ చాలా ఎమోషనల్ అయిపోతుంది. నీకు దూరం అవుతుంది అన్న ఆనందం త్వరలోనే నీ సొంతం అవుతుంది అని చెప్పడానికే ఈ గిఫ్ట్ ఇస్తున్నా ప్రేరణ అని సిద్ధూ చెప్తాడు. థ్యాంక్యూ సిద్ధూ అని ప్రేరణ సిద్ధూని హగ్ చేసుకుంటుంది. సారీ సిద్ధూ నేను నిన్ను అపార్థం చేసుకున్నా అని అంటాడు. కుమార్ కూడా సారీ అని చెప్తాడు. సిద్ధూ ఇచ్చిన గిఫ్ట్ వల్ల నిన్ను ఏం అనడం లేదు అంటుంది. ఇక సిద్ధూతో నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ నేను జీవితంలో మర్చిపోలేను అని అంటుంది.
గణ ఇంటికి వచ్చి తండ్రి కోసం మందులు తీసుకొస్తాడు. ఈశ్వరికి ఇస్తే మీ నాన్న ఇంట్లో లేరు అని ఎలా చెప్పాలా అని కంగారు పడుతూ ఐశ్వర్య నాన్నని తీసుకెళ్లిందని చెప్తుంది. దానితో ఎలా పంపావ్ అని గణ అరుస్తాడు. ఇంతలో ఐశ్వర్య, రంజిత్ వచ్చి నాన్న కనిపించడం లేదు అని గణ వాళ్లతో చెప్తుంది. మా నాన్న ఎక్కడా అని గణ అరిస్తే ఐశ్వర్య ఏడుస్తూ విషయం చెప్తుంది. ఆయన్ని ఏం చేశారు అని ఈశ్వరి కంగారుగా అడుగుతుంది. వీళ్లు వాళ్ల ఇంట్లో దాచేశారేమో అని ఈశ్వరి అంటే మా నాన్నని తీసుకురమ్మని చెప్పు అని అంటాడు. వీళ్ల ఇంటికి వెళ్దాం అని ఈశ్వరి అంటుంది. నాన్న పార్క్‌లోనే మిస్ అయ్యారని ఏడుస్తుంది. అందరూ ప్రేరణ వాళ్ల ఇంటికి వెళ్తారు.
ప్రేరణ, సిద్ధూ అప్పుడే వచ్చి వీళ్లు మీ ఇంటికి ఎందుకు వచ్చారు అని కంగారుగా లోపలికి వెళ్తారు. గణ ఇళ్లంతా వెతుకుతాడు. ఇందిరతో ఎక్కడ మా నాన్న.. ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. ఏమైందో తెలీక ఇందిర షాక్ అయి చూస్తుంది. ప్రేరణ కూడా మా నాన్న మీ ఇంట్లో ఉండాలి మా ఇంటికి వస్తారు అని ప్రేరణ అడుగుతుంది. ఆ విషయం మీ చెల్లిని అడుగు అని రంజిత్, ఐశ్వర్య రాజశేఖరాన్ని తీసుకెళ్లిన విషయం చెప్తాడు. సీసీ టీవీ ఫుటేజ్ కూడా చూపిస్తాడు. ఈశ్వరి ఇందిరతో మర్యాదగా మా ఆయన ఎక్కడో చెప్పు అంటుంది. నాకు నిజంగా తెలీదమ్మా అని ఇందిర అంటుంది. ఇక ఐశ్వర్య జరిగింది అంతా చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నట్లు అని ఇందిర ఏడుస్తుంది. గణ మాత్రం మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. మీకు నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా అని గణ అంటాడు. ఎక్కడో ఏదో జరిగింది అని ప్రేరణ అంటే ఈ ప్లానే నీదే నువ్వు తెలీదు అంటే నేను ఎలా నమ్మాలి అని గణ అంటాడు.
ఇంతలో గణ ప్రేరణ చేతిలో ఉన్న ఫొటో చూసి అది లాక్కొని చూసి తల్లికి చూపించి చూశావా అమ్మా నాన్నతో వీళ్లంతా కలిసి ఉన్న ఫొటో కూడా రెడీ చేశారు.. అంటే వీళ్లు నాన్నని దాచేసి ఆయన్ను బాగు చేసి మేమేం అంతా చేశాం అని మార్కులు కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేశారో చూడమ్మా అంటాడు. వీళ్లు ఎంతకైనా తెగించే మనుషులు అని ఈశ్వరి అంటే మాటలు మర్యాదగా రాని అని ప్రేరణ అరుస్తుంది. ఫొటో చాలా బాగుంది కానీ మా నాన్నతో కలిసి మీరు ఉండటమే బాలేదు అని ఫొటో పగలగొట్లాలని చూస్తే ప్రేరణ అడ్డుకుంటుంది. దాన్ని లాక్కొని నీకు నచ్చాల్సిన అవసరం లేదు.. ఆ విలువ మాకు తెలుసు.. అని అంటుంది.
నేను తలచుకుంటే మీలో ఒక్కరు కూడా మిగలరు అని గణ అంటే అవునా తలచుకోరా అని సిద్ధూ అంటాడు. రేపు ఉదయంలోపు మా ఆయన మా దగ్గర లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుంది. వాళ్ల నాన్నని నువ్వు దాచలేదు అని గ్యారెంటీ ఏంట్రా అని సిద్ధూ అడుగుతాడు. రేపు ఉదయం వరకు టైం మా ఆయన్ను మాకు అప్పగించకపోతే అప్పుడు చెప్తా అని ఈశ్వరి అంటుంది. ప్రేరణ నీకు కౌంట్ డౌన్ మొదలైంది అని గణ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు





















