News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu ఆగస్టు 2 ఎపిసోడ్: దేవయానికి షాక్ ఇచ్చి సాక్షికి ఫుల్ స్టాప్ పెట్టి వసు చేయందుకున్న రిషి

Guppedantha Manasu August 2 Episode 518:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్రలకు చెక్ పెట్టిన రిషి వసుధార చేయందుకున్నాడు... ఆగస్టు 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఆగస్టు 2 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 2 Episode 518)

స్టేజ్ పై సాక్షి మాటలు తలుచుకుంటూ బాధపడుతున్న రిషి దగ్గరకు వెళుతుంది జగతి
జగతి: వసుధార గురించి మీరు చెప్పొద్దన్నారు కానీ ఓ విషయం చెప్పాలి. వసు మీ విషయంలోనూ తన విషయంలోనూ స్పష్టంగా ఉంది..తను మిమ్మల్ని ఇష్టపడుతోంది సార్..
రిషి: భలే చెప్పారు మేడం అయినా నేనేమీ అనను లెండి..ఇప్పుడొచ్చి మీరు కొత్తగా చెప్పిందేముంది.. ఒకప్పుడు డీఐజీ గారింటికి భోజనానికి వెళ్లినప్పుడు నేను వసుని ప్రేమిస్తున్నాని మీరే చెప్పారు. ఇప్పుడు అదే మాటను తిప్పి చెబుతున్నారా. ఇందులో కొత్తగా చెప్పేదేముంది మేడం. అప్పుడు మీరు ఎందుకు అన్నారో తెలియదు కానీ నా మనసులో లేనిది మీరు చెప్పారు. అంటే నా ప్రేమ గురించి జోస్యం చెప్పారు. నా మనసులో తర్వాత కలిగిన భావనను నేను తెలుసుకున్నాక వసుకి చెప్పాను. అప్పుడు తను ఏమందో తెలుసా.. నాకు క్లారిటీ లేదంది, నాకు మనుషులను అంచనా వేయడం రాదంది.. నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో స్పష్టంగా ఒక్కమాటలో చెప్పలేదు కానీ ఆరోపణలు చేసింది. ( సాక్షిపై గెలవడానికే మీకు ప్రేమ పుట్టింది). నన్ను రిజెక్ట్ చేయడానికి సరైన కారణం మీకైనా చెప్పాలి కదా. అసలు నాకు జీవితంలో క్లారిటీనే లేదంది. మీరు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయంతో ఉన్నారని నేను అనుకుంటాను
జగతి: నేను ఎందుకిలా అనుకుంటాను
రిషి: ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోవడం లేదా..ఈ ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోవడం లేదా అన్నది డౌట్ గా ఉంది. చిన్నప్పుడు నా కన్నతల్లి వదిలేసి వెళ్లిపోయింది..అప్పుడు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ వెళ్లడం రావడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అయినా కన్నతల్లి మనసుని అర్థం చేసుకోలేని వాడిని అని ముఖంమీదే చెప్పేసింది. కన్నతల్లిని అర్థం చేసుకోవడం అంటే నేను ఎవర్ని అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు వదిలేసి వెళ్లిపోయిన కన్నతల్లినా, మధ్యలో సంవత్సరాలు కనిపించని తల్లినా..అనుకోకుండా ఇప్పుడు మళ్లీ వచ్చిన తల్లినా..ఏ తల్లి మనసుని అర్థం చేసుకోవాలి. మీరన్నా చెప్పండి మేడం.. ఈప్రశ్నకు మీరు నేను ఇద్దరం తప్ప ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. నాకైతే తెలియదు. 
జగతి: కొన్ని ప్రశ్నలకు కన్నతల్లి కన్నా కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. వసుని మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో అంతకు రెట్టింపు వసు మిమ్మల్ని ఇష్టపడుతోంది. తనను మీరు వదులుకోవద్దు.. మిమ్మల్ని తను వదులుకోదు.
రిషి: తను నన్ను వద్దంది చెప్పాను కదా
జగతి: నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది జగతి. 

Also Read: శౌర్యని మళ్లీ ఏడిపించిన నిరుపమ్, హిమతో తన ప్రేమ వికసిస్తోందనే ఆనందంలో ప్రేమ్

రిషి: వస్తువు పోతే మరొకటి తెచ్చుకుంటాం.. ఓ ట్రైన్ మిస్సైతే మరో విధంగా ప్రయాణం కొనసాగించగలం..కాన జీవితం అలా కాదు కదా మేడం. మనసుకి సంబంధించిన అంశం కదా..ఒకరు కాకపోతే మరొకరు అనుకోలేం కదా..అదేంటో మేడం.. నా జీవితంలో నాకు తారసపడిన అందరు స్త్రీలు ఏదో ఒక రూపంలో గాయాలు మిగిల్చిన వారే. ఒకరు బాల్యంలో నా జీవితంతో ఆడుకున్నారు... వివాహ బంధంతో వచ్చిన సాక్షి బాధను మిగిల్చింది..చివరికి వసుధార ప్రేమ బంధం కూడా చెల్లకుండా పోయింది. మీరు ఇక్కడకు వచ్చి చెబుతున్నది మీ సొంత అభిప్రాయాలా..మీ శిష్యురాలు చెప్పమందా..
జగతి: ఎవరో చెప్పిన విషయాలు మోసుకొచ్చే అలవాటు నాకు రాలేదు.. వసు విషయంలో మీ మనసుని ముందుగానే అంచనా వేసినట్టే తన మనసుని కూడా అంచనా వేశాను.. కరిగే గుణం ఉందని మనసుకి తెలియదు కదా..నేను ఏనాడ సలహా ఇవ్వడం లేదు. కానీ స్పష్టతకు రావాల్సింది వసు గురించా..సాక్షి గురించా అన్నది మీరే నిర్ణయించుకోండి...ఇంత సేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ...
జగతి రూమ్ లోంచి వెళ్లిపోగానే..వసు ఇచ్చిన గోళీలు, నెమలీక, కశ్చీఫ్ చూస్తూ నిల్చుంటాడు. 

అటు వసుధార కూడా రిషికి ఇస్తుండగా చేజారిన గిఫ్ట్ చూస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. ఫోన్లో వసు ఫొటో చూస్తూ కూర్చున్న రిషి  కాల్ చేద్దామా అనుకుంటాడు.వసు కూడా కాల్ చేస్తుంది. ఇద్దరూ ఒకేసారి కాల్ చేసుకోవడంతో బిజీ వస్తుంది. ఈ టైమ్ లో ఎవరితో మాట్లాడుతున్నారు..అయినా ప్రతిసారీ నేనే కాల్ చేయాలా అని అనుకుంటారు. మొత్తానికి వసుధారే కాల్ చేస్తుంది.
చెప్పండి సార్ అని వసు అంటే చెప్పు అంటాడు రిషి..ఇద్దరి మధ్యా కాసేపు మౌనం..
రిషి: ఏం చేస్తున్నావ్...
వసు: ఏం లేదు సార్..
రిషి: ఇంకా నిద్రపోలేదేంటి
వసు: నేను కళ్లుమూసుకుంటే నా మనసు తెరుచుకుంటోంది సార్
రిషి: అర్థం కాలేదు
వసు: నా పరిస్థితి కూడా అర్థమయ్యీ అర్థం కానట్టే ఉంది..
రిషి: ఏమైంది వసుధారా కొత్తగా మాట్లాడుతున్నావ్...
వసు: మీరు మాట్లాడండి సార్ నేను వింటాను..
రిషి: వసుధార నేను కలుస్తాను..
వసు: ఓకే సార్ అంటూ ఏడుస్తుంది..
రిషి: ఏమైంది ..గొంతు మారిందేంటి..
వసు: ఏం కాలేదు సార్..
రిషి: ఏడుస్తున్నావా..ఏమైంది..చెప్పు..
వసు: బాధ కలిగితేనే ఏడుస్తారనుకున్నాను కానీ ఏడుద్దామన్నా ఏడుపు రాకపోవడం పెద్ద విషాదం సార్
రిషి: నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు..నేను కలుస్తాను..కలసినప్పుడు మాట్లాడుదాం..
వసు: సరే సార్..

Also Read: రిషికి మరోసారి ప్రపోజ్ చేసిన వసు,దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి - సాక్షికి పెద్ద షాకే ఇది!

అందర్నీ రమ్మన్నావేంటి దేవయాని అని ఫణీంద్ర అంటే.. అందరితో ఓ విషయం చర్చించాలి రిషి కూడా రానీయండి అంటుంది దేవయాని. ఏదైనా కొత్తగా ప్లాన్ చేశారా అత్తయ్యగారు అనుకుంటుంది ధరణి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి అంటుంది. ఇంతలో రిషి వస్తాడు..నీకోసమే వెయిటింగ్ రిషి అంటుంది దేవయాని. పెద్దమ్మ ఏదో చెబుతానన్నారు అంటాడు గౌతమ్..
దేవయాని: మన ఇంటి సమస్య..మన కుటుంబానికి సంబంధించిన సాక్షి గురించి..మాట్లాడేందుకు రమ్మన్నాను
జగతి, మహేంద్ర, ఫణీంద్ర షాక్ అయి నిల్చుంటారు
రిషి: సాక్షిది అసలు సమస్యే కాదు
దేవయాని: అదేంటి రిషి తన చదువుల పండుగలో ప్రెస్ వాళ్లకి చెప్పింది కదా
రిషి: తన ఆశలు ఆలోచనలకు మనకేంటి సంబంధం..
దేవయాని: అలా అంటావేంటి..ఇది సమస్యకాదని ఎలా అంటావ్
ఫణీంద్ర: తను అందరి ముందూ చెబుతుంటే నువ్వు మాట్లాడలేదు కదా
రిషి: అందరి ముందూ మాట్లాడకపోతే నేను ఒప్పుకున్నట్టు ఎలా అవుతుంది
దేవయాని: ఇక పెళ్లిపనులే తరువాయి అని సాక్షి అనుకుంటోంది
రిషి: సాక్షితో ఎంగేజ్ మెంట్ ఎప్పుడో బ్రేక్ అయింది..సాక్షితో ఎలాంటి సంబంధం లేదు..
దేవయాని: ప్రెస్ వాళ్ల ముందు అలా అంటుంటే..
రిషి: కాలేజీ పరువుకోసం మాట్లాడలేదు..సాక్షిమీద కోపంతో చదువుల పండుగను డిస్టబ్ చేయకూడదనే ఆగాను. ఆ రోజు సైలెంట్ గా ఉన్నాను కాబట్టే ఆ టాపిక్ అంతటితో ఆగింది..లేదంటే పెద్ద చర్చగా మారేది...
దేవయాని: సాక్షి ఆశపడడంలో తప్పేముంది..
రిషి: పెద్దమ్మా..మీరంటే నాకు గౌరవం ఉంది..సాక్షిని పాపం అనడం మీ మంచితనం..అసలు ఆ సాక్షి ఏం చేసిందో మీకు తెలుసా.. ఓ రోజు లైబ్రరీలో ఫైర్ అలారం మోగింది తెలుసా అంటూ లైబ్రరీలో సాక్షి బెదిరింపులు బయటపెడతానంది. తనని నేను అల్లరి చేశానని అందరిముందూ నటిస్తానని బెదిరించింది. చదువుల పండుగ ఈవెంట్ లో కొన్ని ఫొటోలు పంపించి వాటిని అడ్డం పెట్టుకునిబ్లాక్ మెయిల్ చేస్తానంది..

Also Read: కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది, రిషి-సాక్షి పెళ్లి , వసు పయనం ఎటువైపు!

రేపటి(బుధవారం)ఎపిసోడ్ లో
వసు-రిషి ఓ చోట నిల్చుంటారు. వసు చేయి పట్టుకున్న రిషి...ఏమీ మాట్లాడకుండా నాతో రా అంటాడు. ఇంతలో సాక్షి కాల్ చేయడంతో వసుతో ఉన్నానంటాడు. ఆ ఆవేశంలో ఇంటికి వెళ్లిన సాక్షి...రిషికి ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలియడం లేదంటుంది. రిషికి నువ్వంటే ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో అని మరింత రెచ్చగొడుతుంది దేవయాని...

Published at : 02 Aug 2022 09:49 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu august 2 Episode 518

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bramhamudi Today December 7th Episode: అనామిక, కల్యాణ్‌ పెళ్లి జరగకుండా పుల్లలు పెడుతోన్న కనకం!

Bramhamudi Today December 7th Episode: అనామిక, కల్యాణ్‌ పెళ్లి జరగకుండా పుల్లలు పెడుతోన్న కనకం!

Intinti Gruhalakshmi December 7th Episode: కోడలి మీద ప్రతీకారం తీర్చుకున్న రాజ్యలక్ష్మి.. ప్రాణాపాయ స్థితిలో దివ్య!

Intinti Gruhalakshmi December 7th Episode: కోడలి మీద ప్రతీకారం తీర్చుకున్న రాజ్యలక్ష్మి.. ప్రాణాపాయ స్థితిలో దివ్య!

Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!

Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ -  వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!

Krishna Mukunda Murari December 7th కృష్ణకు పెళ్లి అయిందన్న షాక్‌లో మురారి.. భవాని దగ్గర ఏడ్చేసిన ముకుంద!

Krishna Mukunda Murari December 7th కృష్ణకు పెళ్లి అయిందన్న షాక్‌లో మురారి.. భవాని దగ్గర ఏడ్చేసిన ముకుంద!

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం