Karthika Deepam Serial ఆగస్టు 16 ఎపిసోడ్: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట
Karthika Deepam August 16 Episode 1432: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మరో మలుపు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయింది అనుకున్న వంటలక్క బతికేఉంది...
కార్తీకదీపం ఆగస్టు 16 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam August 15 Episode 1431)
డాక్టర్ బాబు డాక్టర్ బాబూ అంటూ హాస్పిటల్ మొత్తం హోరెత్తించిన దీప...పిలిచి, పిలిచి అలసిపోయి ఓ దగ్గర కూర్చుని ఉండిపోతుంది. అప్పుడు అక్కడకు వచ్చిన డాక్టర్..ఎవరీ డాక్టర్ బాబు అని అడుగుతాడు. అన్నయ్యా అని అభిమానంగా పిలిచి జరిగినదంతా చెబుతుంది దీప. అక్కడ నీతో పాటూ లేరంటే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పిన డాక్టర్.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం డెడ్ బాడీస్ ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచుతారు. అక్కడకు వెళ్లి ఓసారి చూద్దాం అని డాక్టర్ దీపను తీసుకెళతాడు..దీప ఒక్కో అడుగు వేస్తూ..ప్రమాదానికి ముందురోజు డాక్టర్ బాబుతో సంతోషంగా పార్టీ చేసుకున్న విషయాలు గుర్తుచేసుకుంటుంది. ఇంతకన్నా ఆనందం ఏముంది ఈ రోజు నాకు ఆఖరు రోజైనా పర్వాలేదన్న మాట గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. డాక్టర్ తో కలసి మార్చురీలోకి వెళుతుంది.
డాక్టర్: అన్ని డెడ్ బాడీస్ చూడాల్సిన అవసరం లేదు కానీ..ప్రమాదం జరిగిన రోజే ఓ డెడ్ బాడీ వచ్చింది అదొక్కటీ చూసి చెబితే చాలంటాడు
దీప: ఇంతలో దీప ఆ పక్కనే టేబుల్ పై ఉన్న షూ చూస్తుంది..ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ బాబు ఇవే షూస్ వేసుకున్నారని గుర్తుచేసుకుంటుంది..ఆ రోజు దొరికిన బాడీ ఆయనది కాకూడదంటూ దేవుడిని వేడుకుంటుంది.
డాక్టర్: డెడ్ బాడీపై ఉన్న ముసుగు తీసిన డాక్టర్ వచ్చి చూడమ్మా అని పిలుస్తాడు...ఆయన అయిఉండరమ్మా ఓసారి చూసి కన్ఫామ్ చేయి అని బతిమలాడుతాడు. అన్ని ఆపరేషన్లు చేశాను కానీ ఇక్కడ మాత్రం చేయి వణుకుతోంది ఏంటి..అన్నయ్యా అన్న పిలుపు అంత బలమైందా అనుకుంటాడు డాక్టర్. తీరా ముసుగు తీశాక ఆ డెడ్ బాడీ డాక్టర్ బాబుది కాదని కన్ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత ధైర్యం చెప్పి బయటకు తీసుకెళతాడు
దీప: నా ప్రేమ్ నా భర్తని బతికిస్తుందని చెప్పారు కదా..అదంతా మీ నోటి చలవే అన్నయ్యా
డాక్టర్: ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం జరిగినా..డెడ్ బాడీస్ వచ్చేది ఈ హాస్పిటల్ కే..ఇక్కడకు డెడ్ బాడీ రాలేదంటే ఆయన బతికే ఉన్నట్టు లెక్క అని ధైర్యం చెబుతాడు... ఇంటికి వెళ్లి కాస్త కుదుటపడ్డాక ఆయన్ను వెతుకుదాం పద అంటాడు..
Also Read: తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ
అక్కడ ఇంట్లో సౌందర్య, ఆనందరావు, హిమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. జరిగిన ప్రమాదం గుర్తుచేసుకుని బాధపడతారు. ఆవేశంగా పైకి లేచిన సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సౌందర్య: ఇక్కడుండి మనం ఏ బాగుపడ్డాం చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం, ఈ ఇంట్లో మనకు జరిగిన మంచేంటి చెప్పండి, ఈ ఇంటికి వచ్చాక ఒక్కరోజైనా మనశ్సాంతిగా ఉన్నామా...పెద్దోడు పెళ్లిచేసుకోను అన్నాడు, దీపను ప్రేమించి పెళ్లిచేసుకుంటానంటే నాకు నచ్చలేదు, ఆ తర్వాత తన మంచితనంతో దగ్గరయ్యేసరికి దీప మనకు దూరమైంది, మోనిత నా కొడుకు కాపురాన్ని అతలాకుతలం చేసింది ఇక్కడే, ప్రతీరోజూ నరకం చూశాం,తీరా వాళ్లిద్దరూ కలిశారు అంతా సంతోషమే అనుకునే సరికి వాళ్లు శాశ్వతంగా దూరమయ్యారు, జరిగిన కీడులే తప్ప చెప్పుకోడానికి ఒక్క మంచైనా జరిగిందా..ఇంక నా వల్ల కాదు , పీడకలల్లా వెంటాడుతున్న జ్ఞాపకాలను భరిస్తూ ఇక్కడ ఉండలేను..మనం అమెరికా వెళ్లిపోదాం
ఆనందరావు: ఇల్లు వదలి వెళ్లిపోతే అవి మనల్ని విడిచిపెడతాయా..
సౌందర్య: ఇంట్లో అణువణువు గతాన్ని గుర్తుచేస్తుంటే కంటిమీద కునుకురావడం లేదు...ఇక్కడుంటే ప్రతీక్షణం నరకంలో ఉన్నట్టే ఉంది..మనం అమెరికా వెళ్లిపోదాం..
హిమ: వద్దు నానమ్మా నేను ఇక్కడే ఉంటాను...మనం ముగ్గురం అమెరికా వెళ్లిపోతే శౌర్య వస్తే ఎలా నానమ్మా. శౌర్యని బాగా చూసుకోవాలన్నది అమ్మ నాన్నల ఆఖరి కోరిక నానమ్మా..బాగా చూసుకోవాల్సింది పోయి అసలు చూసే అవకాశమే లేకుండా అమెరికా వెళ్లిపోదాం అంటే ఎలా..శౌర్యను వదిలి నేను రాను..
సౌందర్య: నేను వదిలేస్తానా..శౌర్య ఎక్కడుందో తెలుసుకుంటాను తను కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది.
హిమ: కావాలంటే శౌర్య వచ్చాక అప్పుడు అందరం కలసి వెళ్లిపోదాం..
సౌందర్య: ఎప్పుడూ ఏదో ఒక బంధాన్ని దూరం చేస్తోంది ఈ ఇల్లు..అందుకే ఈ ఇల్లు అమ్మేస్తే శని వదిలిపోతుంది.. అమెరికా వెళ్లిపోదాం..ఇదే నా నిర్ణయం...
Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
దీపను ఇంటికి తీసుకెళ్లిన డాక్టర్..అమ్మా నీకు కూతుర్ని తీసుకొస్తా అన్నాకదా చూడు తీసుకొచ్చానంటాడు. నీకు ప్రమాదం జరిగి హాస్పిటల్లో చేరినప్పటి నుంచీ నీ గురించి మాట్లాడుకోని రోజే లేదు..నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఎంతలా కోరుకున్నానో తెలుసా..చివరకు నా మొర ఆలకించి నీ ప్రాణాలు నిలబెట్టాడమ్మా..దేవుడున్నాడు తల్లీ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
దీప: దేవుడున్నాడు..ఉండే..నమ్మిన వాళ్లకి బాధలు మిగుల్చుతున్నాడు..
డాక్టర్ అమ్మ: ఒక్క విషయం గుర్తుపెట్టుకో..ఈ రోజు మనకు కష్టం కలిగిందని దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడని అనుకోవద్దు..దేవుడి దృష్టిలో ప్రతీదీ న్యాయమే..ఏం జరిగినా మంచికే అనుకుని ధైర్యంగా ఉంటే తప్పకుండా మంచే చేస్తాడమ్మా....
ఎపిసోడ్ ముగిసింది...
Also Read: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్