Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
Karthika Deepam August 15 Episode 1431: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మరో మలుపు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయింది అనుకున్న వంటలక్క బతికేఉంది...
కార్తీకదీపం ఆగస్టు 15 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam August 15 Episode 1431)
నిరుపమ్... హిమ మాటలు తల్చుకుని బాధపడుతుంటాడు..అక్కడకు వచ్చిన ప్రేమ్..అమ్మో వీడు మళ్లీ ఏదేదో అడుగుతాడు అనుకుంటూ వెళ్లిపోవాలి అనుకుంటాడు.నా పెళ్లి కాగానే నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని నిరుపమ్ అంటే.. నీ పెళ్లే పెద్ద ప్రాబ్లెం అంటాడు...ఇంతలో హిమ కాల్ చేస్తుంది...గుడికి వెళుతున్నారా రాగానే కాల్ చేయరా నీతో పని ఉంది అని కాల్ కట్ చేస్తాడు నిరుపమ్. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా అని ప్రేమ్ అంటే డీటేల్డ్ గా చెబితేసరిపోతుందంటాడు నిరుపమ్. ఇక ఈ విషయం వీడికి చెప్పడం కన్నా మమ్మీ డాడీకి చెప్పడం కరెక్ట్ అనుకుంటాడు.
స్వప్నా ఇన్నాళ్లూ నీకు ఏమీ కొనలేదని సత్యం అంటే..షాపింగ్ కి వెళదమంటారా ఏంటని అడుగుతుంది.నాకేం వద్దండీ ఈ పెళ్లి హడావుడి అయ్యాక అమ్మానాన్నకి ఏదైనా కొనివ్వాలంటుంది.అప్పుడే అక్కడకు వచ్చిన ప్రేమ్ ఇక ఈ టెన్షన్ నేను భరించలేను అమ్మా నాన్నకి చెప్పేస్తాను అనుకుంటాడు. అటు స్వప్న మాత్రం..శోభ టెన్షన్ నుంచి ఇప్పటికీ బయటపడలేదు ఇప్పట్లో నన్ను టెన్షన్ పెట్టే విషయాలు చెప్పొద్దంటుంది.
కట్ చేస్తే అందరూ గుళ్లో ఉంటారు. ఏంటే దండం పెట్టుకో అని సౌందర్య అంటే..నాకేం పెద్దగా కోరికలు లేవు.. ఆ దేవుడికి కూడా నా దగ్గర్నుంచి తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు అంటుంది. తీసుకోవడం తెలిసిన దేవుడికి ఇవ్వడం తెలుసులేవే అంటుంది సౌందర్య
శౌర్య: నాకేం కావాలో నీకు తెలుసు
సౌందర్య: నా మనవరాళ్లు ఇద్దరూ కలసి ఉండాలి
ఆనందరావు: ఎప్పటిలా నా ఇంట్లో సంతోషం వెల్లివిరియాలి
హిమ: శౌర్యకి నిరుపమ్ బావకి నువ్వె పెళ్లిచేయాలి దేవుడా
శౌర్య:మా అనాన్న బతికి ఉండడం నిజమే అయితే తొందరగా కనిపించేలా చేయి..
మీరంతా తెలిసి వచ్చారో , తెలియక వచ్చారో తెలియదు కానీ..ఈ ఘడియలు చాలా పవర్ ఫుల్ అంటాడు పూజారి
హిమ: ఇవి మంచి ఘడియలు అంటున్నారు కాబట్టి తన కోసం ఏం చేశానో శౌర్యకి చెప్పి తీరాలి అనుకుంటూ వెళ్లి పిలుస్తుంది
శౌర్య: మళ్లీ ఏదో కొత్త స్క్రిప్టు రెడీ చేసుకున్నట్టుంది..ఏంటో అందరూ ఇలా చూడడం , నేను సైలెంట్ గా ఉండడం నాకు నచ్చడం లేదంటూ పద అని హిమ చేయి పట్టుకుని లాక్కెళుతుంది... ఏం చెబుతావో చెప్పు...నువ్వే చెప్పేవన్నీ అబద్ధాలని నేను ముందుగానే ఫిక్సైపోయి వింటాను
హిమ: నీకు దండం పెడతాను శౌర్యా..నీకు నేను అన్నీ నిజాలే చెబుతున్నాను కానీ...
శౌర్య: నేనే వినడం లేదు అంటున్నావ్..అంతేనా...వింటాను చెప్పు...
హిమ: శౌర్య..ఆ రోజు చిక్ మంగుళూరులో కారు లోయలో పడే ముందు చివరి నిముషంలో నన్ను కార్లోంచి బయటకు తోసేశారు.. అమ్మా -డాడీలు చివరి సారిగా ఏమన్నారో తెలుసా..శౌర్య జాగ్రత్తమ్మా,నువ్వే చూసుకోవాలమ్మా...అన్నారు.
అమ్మా నాన్నల విషయంలో నావైపు నుంచి తప్పో ఒప్పో...
శౌర్య: నోర్ముయ్..వాళ్లను పొట్టనపెట్టుకుంది నువ్వే కదా..
హిమ: కారు లోయలో పడిపోయింది..నేను లోయలో చెట్టుకొమ్మకి చిక్కుకున్నానంట..నన్ను కాపాడిన వాళ్లు చెప్పారు. నిన్ను పెంచిన ఇంద్రుడు, చంద్రుడు వాళ్లే ఆ రోజు నన్ను కాపాడారు..వాళ్లే నన్నిక్కడకు తీసుకొచ్చారు..అనుకోకుండా నేను వాళ్లనుంచి విడిపోయాను. శౌర్య దేవుడి సమక్షంలో చెబుతున్నాను నేను చెప్పేవన్నీ నిజాలే.. నీకోసమే ఎదురు చూశాను.. నువ్వొచ్చాక బావంటే నీకిష్టం అని తెలిశాక మీ ఇద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తున్నాను.
శౌర్య: కొత్త కథలు చెప్పడం మానేసి నానమ్మ-తాతయ్యలు చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో..
హిమ: నా మాటలు నమ్ము..నేను నిజమే చెబుతున్నాను..
శౌర్య: నువ్వు నాకు ద్రోహం చేశావ్..ఇదొక్కటే నిజం..
హిమ: ఏం చెబితే నమ్ముతావ్..ఎలా చెబితే నమ్ముతావ్..
శౌర్య: అమ్మా-నాన్నలు వచ్చి చెబితే నమ్ముతాను..ఇది చెప్పేది నిజమే అవ్వాలి అంటే అమ్మా నాన్నలు బతకడం నిజమవ్వాలి..
సౌందర్య: ఎలా నిజమవుతుంది..వాళ్లెలా బతికి వస్తారు...
శౌర్యమ్మ అనుకున్నది నిజమే అని అప్పుడే ఎంట్రీ ఇస్తాడు వారణాసి....వాళ్లు బతికే ఉన్నారని షాకిస్తాడు...
సౌందర్య: ఏం మాట్లాడుతున్నావురా..నా కార్తీక్, నా కోడలు దీప బతికే ఉన్నారా...
Also Read: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
కొన్ని సంవత్సరాల ముందు ప్రమాదం జరిగాక....
హాస్పిటల్లో ఉన్న దీప...కార్తీక్ తో పెళ్లి నుంచి చిక్ మంగుళూరులో యాక్సిడెంట్ వరకూ అన్నీ తలుచుకుని డాక్టర్ బాబూ అని గట్టిగా అరిచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది.డాక్టర్ వచ్చి మీకేం కాలేదమ్మా మృత్యువును జయించావని చెబుతాడు. నా డాక్టర్ బాబు ఎక్కడ అని అరుస్తూ హాస్పిటల్ మొత్తం తిరుగుతుంది. కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీతోపాటూ ఇంకెవరైనా ఉన్నారా అని డాక్టర్ అడిగితే..అవునంటుంది. లోయలో రంగురాళ్లు ఏరుకుంటున్నవారు మిమ్మల్ని ఒక్కర్నే తీసుకొచ్చి చేర్పించారని చెబుతాడు. డాక్టర్ బాబు అని అరుస్తూ హాస్పిటల్ మొత్తం తిరుగుతుంటుంది...ఇంతలో శౌర్య-హిమ గుర్తొచ్చి పిల్లలు ఎక్కడున్నారని అనుకుంటుంది..
అదే సమయానికి అక్కడ శౌర్య...అమ్మా అని ఏడుస్తుంది. ఎప్పటిలా నేను అమ్మ దగ్గర, హిమ నాన్న దగ్గర ఉండిపోయినా బావుండేది. వాళ్లు ఎందుకు కలవాలి, ఇక్కడకు ఎందుకు రావాలి, కారుడ్రైవింగ్ చేయాలి ఇదంతా అమ్మా నాన్నలు కలవకుండా ఉండేందుగా అని ఏడుస్తుంది. శౌర్యని పెంచుతున్న ఇంద్రుడు-చంద్రమ్మ ఓదార్చుతారు. మీ అమ్మానాన్నను తీసుకురాకపోవచ్చు కానీ వాళ్లు చూసుకున్నంత ప్రేమగా నిన్ను చూసుకుంటాం అంటారు.అమ్మానాన్న దూరమయ్యారని బాధపడొద్దు వాళ్లెక్కడున్నా ఏ రూపంలో ఉన్నా నీకోసమే ఆలోచిస్తుంటారంటారు...
రేపటి( మంగళవారం ఎపిసోడ్)
డాక్టర్ బాబు ఎవరని హాస్పిటల్లో డాక్టర్ అడిగితే..నా భర్త అని చెబుతుంది. డాక్టర్ బాబు డెడ్ బాడీ మార్చురీలో ఉందేమో చూడు అని దీపను తీసుకెళతారు....
Also Read: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!