News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu August 13 Episode 528: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్ర నుంచి రిషిని కాపాడేందుకు జగతి అండ్ కో ప్రయత్నాలు సాగుతున్నాయి.

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఆగస్టు 13 శనివారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 13 Episode 528)

లగ్న పత్రిక రాయించుకునే వేడుక సందడిగా సాగుతుంటుంది. రిషిని మరోసారి ఆలోచించుకోమని చెప్పేందుకు మహేంద్ర, జగతి వస్తారు. వాళ్లు మాట్లాడుతుండగా ఇంతలో అక్కడకు వచ్చిన సాక్షి..ఈ రెండు డ్రెస్సులో ఏది బావుందని అడుగుతుంది. వసుని ఊహించుకున్న రిషి...ఈ డ్రెస్సులు నీకు బాగోవు వసుధారా అంటాడు. నేను వసుధారని కాదు ఛీ అనేసి కోపంగా వెళ్లిపోతుంది సాక్షి. జగతి-మహేంద్ర ఇద్దరూ ముఖాలు చూసుకుంటారు.

అటు బాల్కనీలో నిల్చున్న వసుధార...రిషిని తల్చుకుంటూ ఫోన్లో ఫొటో చూస్తూ నిల్చుంటుంది. ఒక పొరపాటుని సరిచేసుకునే అవకాశం కోసం చూశాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. గిఫ్ట్ పగిలిన చప్పుడు మాత్రమే విన్నారు కానీ నా మనసు పగిలిన చప్పుడు మీరు వినలేదు అనుకుంటుంది. వెనుకనుంచి భుజం మీద చేయి వేస్తుంది జగతి. 
జగతి: ఎందుకొచ్చావ్..ఏం చూద్దామని వచ్చావ్..ఓడిపోయావని మాకు గుర్తుచేద్దామనా..
వసు: ఏంటి మేడం మీరు..ఇప్పుడేమైందని
జగతి: చిరునవ్వు నవ్వుతున్నావా.నువ్వు బాధపడ్డా నేను బాధపడకపోయేదాన్నేమో..నువ్వు ఏం జరగనట్టున్నావ్ చూడు అది ఇంకా బాధగా ఉంది
వసు:బాధను కొలిచే మీటర్లు సాధనాలు ఇంకా రాలేదు కదా మేడం..నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్టు ఒక్కోసారి బాధపడేందుకు కూడా చిరునవ్వును ఆశ్రయించాలి. నేను పెద్దగొప్పగా మీకు చెబుతున్నాను మీకు తెలియదా ఏంటి...
జగతి: వసు..నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు..
వసు:  ఓ మాట చెప్పాలి అనుకున్నాను మేడం..మీ అబ్బాయి అవకాశం ఇవ్వలేదు..
జగతి: నేను ఓ మాట అడగాలి అనుకున్నాను నాక్కూడా అవకాశం ఇవ్వలేదు. కొన్నిసార్లు ఏటికి ఎదురీదడమే కరెక్ట్.. మెండిగా వెళితేనే విజయం సాధిస్తాం
వసు: ప్రతి ఓదార్పు వెనుకా చాలా అబద్ధాలుంటాయి
జగతి: నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏదో జరిగి ఈ పెళ్లి ఆగోపోతుంది..
ఇంతలో అక్కడకు జగతీ అని అరుస్తూ వస్తుంది దేవయాని.. ఏంటి జగతి ఇక్కడేం మాట్లాడుతున్నావ్ ... ఎంత కాదన్నా కన్నతల్లివి కదా ప్రపంచానికి పనులన్నీ అలాగే ఉన్నాయ్..రా...వసుధారా నువ్వూ రా..నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అంటుంది..

Also Read: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

రిషి: అటు రూమ్ లో రెడీ అయిన రిషి... వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. నేను ఏం చేస్తున్నానో అర్థమవుతోందా.. నాకు క్లారిటీ ఉంది నేను నమ్మిందే చేస్తున్నాను అని అద్దంలో చూసుకుని అనుకుంటాడు. వెనుకే వసుధార నిల్చుని మాట్లాడినట్టు ఊహించుకుంటాడు.  ఏంటి వసుధార రిషి సార్ అర్థంకారు అనుకుంటున్నావా..లైఫ్ అంటేనే చిక్కు లెక్కకదా.. పరీక్ష పెట్టుకుంటున్నాను వసుధారా..నాకు నేనే పరీక్ష పెట్టుకుంటున్నాను..ప్రేమకు పరీక్ష పెట్టుకుంటున్నాను..గెలుపైనా, ఓటమైనా అన్నిటికీ నాదే బాధ్యత అనుకుంటాడు...ఏంటి వసుధారా మాట్లాడవు అయినా నీకు మాట్లాడే అవకాశం ఏముంది అనుకుంటున్నావా నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా నా మనసు చెప్పేదే నేను వింటున్నాను...నాది ఒకే మాట, ఒకే ప్రేమ.. నమ్మినదానికోసం ప్రాణం ఇస్తాను..ప్రాణం ఇచ్చేదాన్నే నమ్ముతాను. ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుందో నీకు-నాకు తెలియదు.. గమ్యం మాత్రం తెలుసు..కాలం మారినా రిషి మనసు మారదు..దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా దూరం కానిది ప్రేమ ఒక్కటే వసుధార..ఇది ఎవరికో పరీక్ష కాదు..నా ప్రేమలో నిజాయితీకి పరీక్ష..గెలుపు నాదా కాదా .. గెలుపు ఓటమి కలిపితే ప్రేమా లేదా నాజీవితమా అనుకుంటాడు...రిషి తనలో తాను మాట్లాడుకుంటుండగా అక్కడకు వస్తుంది ధరణి... ఏంటిదంతా అని అడిగితే జరగాల్సింది ఏదో జరుగుతుందని చెప్పి మీరు వెళ్లండి వదినా అంటాడు.

Also Read: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

మహేంద్ర: అసలేం జరుగుతోంది ఇంట్లో..వాడు చేసే ప్రతిపనినీ మౌనంగా అంగీకరిస్తున్నాం..ఇది కరెక్ట్ కాదు
జగతి: నాకు చెప్పడానికి అవకాశం లేదుకదా
మహేంద్ర: చూస్తూ మాట్లాడకుండా ఊరుకోవాలా.. సాక్షితో రిషి ఇంతదూరం వస్తాడనుకోలేదు..ఏం జరిగినా చూస్తూ ఉండాలా.. మాట్లాడవేంటి జగతి. నాకు నచ్చని పని చేస్తున్నాడు, కరెక్ట్ గా చెప్పాలంటే వాడికి కూడా నచ్చని పని చేస్తున్నాడు. వాడు చేసేది తప్పని నీకూ తెలులు, నాకూ తెలుసు.. వసుని తీసుకొచ్చాడు ఏమీ మాట్లాడడం లేదు.. నువ్వు,నేను, అన్నయ్య,వసుధార ఎవ్వరూ మాట్లాడకపోతే ఎలా..ఏదో ఒకటి చేయాలి జగతి... దీనికి ఒక్కటే మార్గం ఉంది జగతి.. మనం ఇంట్లోంచి వెళ్లిపోదాం పద..
జగతి: మనం ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి..
మహేంద్ర: ఇంట్లో జరిగేది ఆగాలంటే మనం వెళ్లిపోతోనే ఆగుతుంది.. సాక్షితో రిషి పెళ్లేంటి..నీకేం బాధలేదా.. వెళదాం పద
జగతి: నేనే రాను మహేంద్ర.. రిషిని అంచనా వేయడంలో ప్రతీసారీ తప్పు చేస్తున్నాం.. మనం వెళ్లిపోతే జరిగేది ఆగుతుంది అనుకుంటున్నావా..ఆగదు..పైగా ఇంకా తొందరగా ఈ తంతు జరుగుతుంది..మనం లేవని తెలిస్తే ఏకంగా రిషి సాక్షి మెడలో తాళి కట్టే పరిస్థితులు వస్తాయేమో. అక్కయ్య విషపు ఆలోచనలు నీకు తెలుసుకదా..మనిద్దరం వెళ్లిపోతే తప్పు చేసినవారం అవుతాం. వద్దు మహేంద్ర..
మహేంద్ర: ఏంటి జగతి..ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా.. ఏమీ చేయలేక కుమిలిపోవాలా..
జగతి: వెళ్లిపోయి రిషి మనసు గాయపర్చే బదులు..ఉండిపోయి ఆ బాధని మనమే భరిద్దాం..
మహేంద్ర: ఏం జరిగినా సైలెంట్ గా చూస్తుండాలా..చిరునవ్వు నవ్వాలా
జగతి: కొన్నింటిని కాలమే పరిష్కరిస్తుంది.. చూడ్డం తప్ప ఏం చేయలేం...

Also Read: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

లగ్న పత్రిక రాసుకునే ఏర్పాట్లు జరుగుతుంటాయి. ధరణి మాత్రం వసుధారని గమనిస్తుంటుంది. నువ్వేం మాట్లాడవేంటి అంటుంది ధరణి. ఈ సంతోషంల నాకు మాటలు రావడం లేదంటుంది వసుధార. వసు నువ్వు ఓకేనా అని జగతి అంటే.. నాట్ ఓకే అని లేదు మేడం.. నేను సంతోషంగా ఉన్నానంటుంది.. దండలు తీసుకురా ధరణి అని జగతి అంటే నేను తీసుకొస్తా అంటూ వెళుతుంది వసుధార.. చిన్నత్తయ్యా వసుని చూస్తుంటే బాధేస్తోంది..అసలు వసు మనసులో ఏముంది అత్తయ్యా...తనని చూసినప్పుడల్లా గుండెల్లో ముళ్లు గుచ్చుకున్నట్టుంది. జరిగేవాటిని మనం ఆపలేం..మనకు ఏం కావాలో మనసులో కోరుకుందాం..గట్టిగా కోరుకుంటే అవుతుందంటారు..ఇంతకు మించి ఏం చేయలేం అంటుంది జగతి... సాక్షి తల్లిదండ్రులు ఎంట్రీ ఇస్తారు...

ఎపిసోడ్ ముగిసింది..

Also Read: ఇది మామూలు ట్విస్ట్ కాదు - వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత రీ ఎంట్రీ!

Also Read:

Published at : 13 Aug 2022 09:27 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu august 13 Episode 528

ఇవి కూడా చూడండి

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్  - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

టాప్ స్టోరీస్

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!