News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!

Guppedantha Manasu August 12 Episode 527: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్ర నుంచి రిషిని కాపాడేందుకు జగతి అండ్ కో ప్రయత్నాలు సాగుతున్నాయి.

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఆగస్టు 12 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 12 Episode 527)

ఆఖరి సారిగా చూడాలనుందిని వసు చేసిన మెసేజ్ చూసి కంగారుగా వెళతాడు రిషి. తీరా వెళ్లి చూస్తే రూమ్ బయట కూల్ గా కూర్చుని ఉంటుంది. మీరు ఎలాగూ రారని డిసైడ్ అయ్యే ఇక్కడకు వచ్చి కూర్చున్నాను అంటుంది. 
రిషి: నేను రానని నువ్వెలాడిసైడ్ అయ్యావ్
వసు: మీరు ఇంతకుముందులా కాదు..మీరు మారిపోయారు సార్..
రిషి: మనిషంటే మారకుండా ఎలా ఉంటారు..
వసు: చదువుల పండుగప్పుడు నన్ను, సాక్షిని మూడు ప్రశ్నలు అడిగారు గుర్తుందా.. మనిషి ఎలా ఉండాలో చెప్పాం కదా.. అప్పుడు నేను చెప్పిన సమాధానాలు నిజానికి వేరే చెప్పాలి అనుకున్నాను.. జీవితం అంటే మనకి ఇష్టమైనప్పుడు జీవించడం, మనిషి ఎలా ఉండాలంటే మీలా ఉండాలి అనుకున్నాను సార్..కానీ ఇవన్నీ అప్పుడు చెప్పడానికి అవకాశం లేదు.. పోటీలో ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు.. చెప్పాల్సినవి నా మనసులో చాలా ఉన్నాయి కానీ చెప్పే అవకాశం మీరివ్వడం లేదు.
రిషి: నీ పాటికి నువ్వు మెసేజ్ చేసి చందమామతో కబుర్లు చెబితే సరిపోదు..ఎదుటి వారు ఎలా ఫీలవుతారో కొంచెం ఆలోచించాలి. అలాంటి మెసేజ్ పెట్టి నువ్వింత కూల్ గా ఉన్నావ్.. నిన్నిలా కాదు రా చెబుతాను అంటూ చేయి పట్టుకుని లాక్కెళతాడు..
ఇంటికి డోర్ వేసి వస్తానంటే..నువ్విక్కడే ఉండు నేను వేస్తానని వెళ్లి వేసొస్తాడు రిషి... ఇద్దరూ కార్లో బయలుదేరుతారు.. ఒక్క ప్రశ్న కూడా వేయకూడదని ముందే చెప్పేస్తాడు రిషి... వసు మాత్రం కూల్ గా కూర్చుని నా జీవితంలో మీరు అద్భుతం ఇంతకన్నా ఒక్క లైన్లో ఏం చెప్పలేను అనుకుంటుంది..
రిషి: అసలు మెసేజ్ ఎందుకిలా పెట్టింది..మనసులో ఏదైనా బాధ పెట్టుకుని ఇలా నవ్వుతోందా..నిజంగానే వసు మనసులో ఏం బాధలేదా అనుకుంటాడు...

Also Read: శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!

అటు జగతి-మహేంద్ర ఇద్దరూ ఇంట్లో కూర్చుని రిషి గురించి కంగారుపడుతుంటారు. అసలేం అనుకుంటున్నాడు,ఫోన్ చేస్తే తీయడం లేదని మహేంద్ర అంటే.. రిషి చిన్న పిల్లాడు కాదుకదా అంటుంది జగతి. రిషి ఏమైనా మైండ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే తన మనసుని కష్టపెట్టుకుంటూ బయటకు చెప్పడం లేదా అని మహేంద్ర అంటే..నా కొడుకు నువ్వనుకున్నంత పిరికివాడు కాదు ఏం చేసినా చెప్పి చేస్తాడు అంటుంది జగతి. ఇంతలో కారొచ్చి ఆగడంతో రిషి వచ్చాడు అనుకుంటారు. వసుధారని తీసుకుని లోపలకు వచ్చిన రిషిని చూసి షాక్ అవుతారు జగతి-మహేంద్ర. ఏంటి రిషి ఎక్కడికెళ్లావ్ మేం టెన్షన్  పడుతున్నాం అని మహేంద్ర అంటే..అవసరం లేనివాటిగురించి ఆలోచించకండి అని చెప్పిన రిషి.. వసుధార ఇక్కడే ఉంటుంది ఆ ఏర్పాట్లు చూడమని వదినకు చెప్పండి అనేసి వెళ్లిపోతాడు. 

తెల్లారినా హాయిగా నిద్రపోతున్న రిషిని చూసి..చేసిందంతా చేసి నిద్రపోతున్నావా అని గౌతమ్ అనుకుంటాడు. వసుధారే జీవితం అనుకుని సాక్షితో పెళ్లికి సిద్ధపడ్డావ్ అడిగేవారు లేక ఇలా తయారయ్యావ్ అనుకుంటూ రిషిని నిద్రలేపుతాడు. నీ సంగతేంట్రా లే ముందు అని అరుస్తుంటాడు...
రిషి: ఏంటి ఎందుకు అని అడగానికి వస్తే నువ్వెళ్లిపోవచ్చు
గౌతమ్: అడగడానికే వస్తే  వెళ్లిపోమంటున్నాడేంటి...
రిషి: రాత్రి వసుధారని నేనే తీసుకొచ్చాను...
అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సాక్షి..నేనే పిలుద్దాం అనుకున్నాను నువ్వే తీసుకొచ్చావ్ మంచి పని చేశావ్ రిషి అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని వసుధార ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావ్ అని అడిగితే.. దూరంగా ఉంటే కుట్రలు చేస్తారు, దగ్గరుంటే ఏం చేస్తారో తెలుసుకోవచ్చు అంటుంది. గుడ్ మార్నింగ్ చెప్పవా నువ్వు చెప్పకపోయినా నేను చెబుతానులే అని గుడ్ మార్నింగ్ రిషి అంటుంది.

అరేయ్ బయటకు వెళదాం పద అనిగౌతమ్ అంటే..నువ్వీరోజు బయటకు వెళ్లే పని పెట్టుకోవద్దు ఏదైనా కావాలంటే గౌతమ్ ని పంపించు అంటుంది. గౌతమ్ ఏదో చెప్పబోతుంటే నా మాట విను అనేసి..నువ్వు రా సాక్షి అంటుంది దేవయాని. 
సాక్షి: ఈ రిషి ఏంటో పెళ్లికి ఒప్పుకున్నాడన్న మాటే కానీ మొహంలో చిరునవ్వు లేదు ప్రేమగా పలకరింపు లేదు.. పెళ్లి వరకూ తీసుకొచ్చాను రిషి మనసు మార్చుకోవడం నా చుట్టూ తిప్పుకోవడం ఎంతసేపు అనుకుంటుంది...
గౌతమ్ ఏదో మాట్లాడబోతుంటే పెద్దమ్మ పిలుస్తోంది కదా వెళ్లు అంటాడు రిషి...

Also Read: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

రిషి గాడికి అస్సలు బుద్ధిలేదు.. వాడు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటో నేను తోరణాలు కట్టడం ఏంటో అనుకుంటాడు గౌతమ్. ఇంతలో వచ్చిన వసుధార నాకు హెల్ప్ చేయండి నేను కడతాను అంటుంది. వసుధార మనసులో అగ్నిపర్వతాలు మోస్తూ బయటకు నవ్వుతున్నావా అనుకుంటుంది జగతి. అటు గౌతమ్ కూడా అదే మాట అంటాడు... ఈ తోరణాలు కట్టడానికి నాకే మనసు రావడం లేదు నువ్వెలా కడుతున్నావ్ అంటాడు. కొన్ని జీవితంలో నచ్చకపోయినా ముందుకెళ్లిపోవాలి సార్ అంతే .. అయినా మనం ఇది ఎవరి కోసం చేస్తున్నాం రిషి సార్ కోసం మరి మనం ఎంత హడావుడి చేయాలి, మీరేమో బెస్ట్ ఫ్రెండ్, నేను అసిస్టెంట్ ని...ఈ రోజు హడావుడి అంతా మనమే చేయాలి అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన జగతి మేడంని రండి మీరూ ఓ చేయి వేయండి అంటుంది. గౌతమ్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది..

ఏదో ఒకటి చెప్పి ఆ వసుధారని పంపిద్దాం అనుకుంటే నువ్వు వినడం లేదు కదా..ఆ వసు మొహంలో బాధ కనిపించడం లేదు తనేమైనా చేస్తుందంటావా అని దేవయాని అంటే..తను చచ్చిన పాము తోకమాత్రమే ఊపుతుంది అంటుంది సాక్షి. కొన్ని గంటలు గడిస్తే చాలు లగ్న పత్రిక రాసుకుంటాం..ఇంక ఏం జరిగినా ఏవ్వరూ ఏం చేయలేరు అంటుంది...

Also Read: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

అటు రిషి రూమ్ లో ఉండగా మహేంద్ర వచ్చి ఏవో ఆన్ లైన్లో ఆర్డర్ చేశావ్ అంటూ రెండు బాక్సులు తెచ్చి ఇస్తాడు. ఓపెన్ చేస్తుంటే వద్దు డాడ్..తర్వాత ఓపెన్ చేద్దుగానివి అంటాడు. మరోసారి మహేంద్ర హిత బోధ మొదలెడతాడు. నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావ్ దీన్ని సరిచేసుకోలేవు..ఇప్పుడైనా నీ మనసు మార్చుకో ప్లీజ్ అంటాడు. 
రిషి: మీరు డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉంటారా 
మహేంద్ర: పెళ్లి నిర్ణయం వెనక్కు తీసుకోమంటే కాలేజీ గురించి మాట్లాడతావేంటి
రిషి: పెద్ద విద్యా సంస్థకు ఎండీగా ఉండే నేను..జీవితంలో పెళ్లి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకూడదు. మీ కాలేజీకి ఎండీగా ఉండండి..అప్పుడు నా నిర్ణయం మార్చుకుంటాను
మహేంద్ర: ఒకటడిగితే ఇంకోటి చెబుతావేంటి..అయినా ఆ సీట్లోకూర్చునే అధికారం నాకు లేదు..
జగతి డోర్ వరకూ వచ్చి వెనక్కువెళ్లిపోవడం చూసి రండి మేడం అని పిలుస్తాడు...
రిషి: మేడం డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా మిమ్మల్ని నియమిస్తాను..మీరుంటారా 
జగతి: షాక్ అయిన సార్....
రిషి: మీరు భూషణ్ ఇంటి కోడలు, మహేంద్ర సతీమణి.. సమర్థులు..మీరు ఎండీగా పదవిని స్వీకరించి నన్ను విముక్తుడ్ని చేయండి
జగతి: ఆ పదవిని మోయడానికి అర్హురాలిని అన్నందుకు ధన్యవాదాలు.. ఓ బిడ్డను చూసుకోవడానికి పనికిరాని నేను ఓ బంధం మోయలేని నేను ఆ బాధ్యతలు మోయలేను సార్..కాలేజీ అంటే నాలుగు గోడలు, నల్లబోర్డుకాదు... స్టూడెంట్స్ భవిష్యత్.. అంత మంచి స్థాయిలో కూర్చోవడానికి మహేంద్ర భూషణ్ భార్యగానో, ఈ ఇంటి కోడలిగానో అర్హత ఉంటే సరిపోదు.. ఆ సీట్లో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది...
ఎపిసోడ్ ముగిసింది...

Also Read:  కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో

Published at : 12 Aug 2022 09:23 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu august 12 Episode 527

ఇవి కూడా చూడండి

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

టాప్ స్టోరీస్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!