అన్వేషించండి

Nindu Manasulu Serial Today March12th:హోలీ సంబరాల్లో ప్రేరణ చేతుల్లో ఓడిపోయిన గణా... ప్రేరణను చంపడానికి గణా వేసిన ఎత్తుగడ ఏంటి...?

Nindu ManasuluSerial Today Episode March 12th: హోలీ సంబరాల్లో ప్రేరణ చేతుల్లో ఓడిపోయిన గణా... ప్రేరణను చంపడానికి గణా వేసిన ఎత్తుగడ ఏంటి...?

Nindu Manasulu Serial Today Episode: ప్రేరణ వాళ్ల ఇంట్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఉట్టికొట్టే పోటీల్లో అందరూ ఓడిపోతుంటే....ఐష్‌ ఇంటి ఓనర్‌ రంజిత్‌ను బరిలో దిగమని ఒత్తిడి చేస్తుంది. రంజిత్ చాలా ఇబ్బందిపడుతున్నా సరే  ఐష్‌ ఒత్తిడి కాదనలేక ఉట్టి కొట్టడానికి  వస్తాడు. ఐష్‌ తాడులాగుతుంది. రంజిత్ ఉట్టికొట్టలేకపోయేసరికి ఈసారి వంతు ఐష్‌ తీసుకుంటుంది. ఐష్‌ కూడా ఉట్టి కొట్టలేకపోయేసరికి  సిద్ధూ బరిలోకి దిగుతాడు. ఇప్పుడు ప్రేరణ తాడు లాగుతుంది. ఇలా ఎంత మంది బరిలో దిగినా  ఉట్టి కొట్టలేకపోతుంటారు. 

ఇంకా ఎవరైనా ఉట్టి కొడతారా అని అడగ్గా....గణా నేను ఉట్టి కొడతాను అని అనగానే అందరూ షాక్‌ తింటారు. నన్ను ఓడించానని తెగ విర్రవీగుతున్నావు కదా ఇప్పుడు  తాడు లాగి నన్ను ఓడించు అంటూ గణా ప్రేరణకు ఛాలెంజ్ విసురుతాడు. దీంతో ప్రేరణ సరేనంటుంది.  గణా ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ  ఉట్టి కొట్టలేక ఓడిపోతాడు. అయితే ఈసారి నేను ఉట్టి కొడతాను...నువ్వు తాడు లాగు అంటూ  ప్రేరణ ఛాలెంజ్ విసురుతుంది. దీనికి గణా సరేనంటాడు. దీంతో ప్రేరణ ఉట్టి కొట్టడానికి సిద్ధమై విఫలమవుతుంది. అప్పుడే గణా ఆమె పరుగెత్తుకుని వచ్చే మార్గంలో గాజు పెంకులు వేస్తాడు.ఈ విషయం చూసిన సిద్ధూ ఆమె కాలుకు ఎలాంటి దెబ తలగలకుండా  ప్రేరణను ఎత్తుకుని ఉట్టి కొట్టిస్తాడు.   

ప్రేరణను ఎత్తుకుని ఉట్టి కొట్టించడంపై గణా అభ్యంతరం చెబుతాడు. అసలు వాడు ఎవడు నిన్ను ఎత్తుకోవడానికి అని అంటాడు. మీరంతా మోసగాళ్లని...మొదటి నుంచి మోసం చేసే నైజం మీదని మండిపడతాడు. దీంతో  సిద్ధూ కలుగజేసుకుని మోసం తనది కాదురా నీది అని అంటాడు. ప్రేరణకు గాయం చేయాలన్న ఉద్దేశంతో నువ్వు ఈ గాజుపెంకు ఇక్కడ వేశావని....అది నేను చూసే ఆమెను ఎత్తుకుని ఉట్టి కొట్టించానని అంటాడు. కుట్రలు,మోసాలు చేసేది నువ్వు రా అంటూ నిలదీస్తాడు. 

దీంతో  ఓడిపోయానన్న అపరాదభావంతో గణా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కోపంతో రగిలిపోతూ..తాను తీసుకొచ్చిన రౌడీకి ఫోన్ చేసి ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలని మండిపడతాడు. నేను ఆ పనిలోనే ఉన్నానని...మీరే కదా ఎలాంటి గొడవ లేకుండా సైలెంట్‌గా  చంపేయమన్నారు. అందుకు  మంచి పథకంవేశానని చెబుతాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తీసుకొస్తుంటాడు.  ఆ మత్తు మందు కలిపిన డ్రింక్ ప్రేరణకు ఇద్దామని తీసుుకొస్తుండగా   గణా అటుగా వెళ్తూ  తగిలి కిందపడేస్తాడు. దీంతో రౌడీ ఆయన్ను  తిడతాడు. మీరే చంపమంటారు...మళ్లీ మీరే ప్లాన్‌ మొత్తం  చెడగొట్టేస్తారని అంటాడు. ఈ డ్రింక్‌లో మత్తు మందు కలిపానని....మొత్తం నేలపాలు చేశారని అంటాడు.ఇలాంటిది ఏదైనా చేసేప్పుడు ముందుగా నాకు చెప్పాలి కదా అని గణా అంటాడు.  జరిగిందేదో జరిగిపోయింది గానీ....దాన్ని ఎలాగైనా ఇవాళ చంపాలని చెప్పి వెళ్లిపోతాడు.

హోలీలో రంగులు చల్లుకోవడం అయిపోవడంతో  తర్వాత కార్యక్రమం ఏంటని అడగ్గా....నేను నా పాట కచేరీ పెడతానని ఐష్ అనడంతో  అందరూ అమ్మో అంటారు. దయచేసి నేను వెళ్లిపోయిన తర్వాత పాడమని రంజిత్ అంటాడు. సిద్ధూ కూడా ఇంత ఆనందంగా ఉన్న సమయంలో నువ్వు గొంతెత్తి పాడటం అవసరమా అని అంటాడు. దీంతో ఐష్‌ చిన్నబుచ్చుకుంటుంది. దీని కోసం నేను చాలా సాధన కూడ చేశానని చెప్పినా...వాళ్లు వద్దంటే వద్దంటారు. అందుకే డ్యాన్స్ ఫ్రోగాం పెట్టించామని చెప్పడంతో  అందరూ డీజీ పాటలకు డ్యాన్స్‌లు వేస్తుంటారు. అందరూ  ఆనందంలో మునిగి తేలుతుండగా....రౌడీ కత్తి తీసుకుని ప్రేరణను పొడిచి చంపేందుకు వస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget