అన్వేషించండి

Meghasandesam Serial Today march 12th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ కోసం గగన్‌ ఇంటికి వచ్చిన బిందు – షాక్‌లో భూమి

Meghasandesam serial today episode march 12th: శివ కోసం ఇంటికి వచ్చిన బిందును గగన్‌, భూమి చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శివ కోసం బిందు గగన్‌ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన బిందును చూసిన శివ షాక్‌ అవుతాడు. శివ ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. ఎల వచ్చావని బిందును   తన రూంలోకి తీసుకెళ్తాడు శివ. 

శివ: ఏంటి బిందు ఇలా వచ్చావు..? ఎవ్వరూ లేని టైంలో వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా ఉండి ఉంటే ఏంటి పరిస్థితి.. 

బిందు: ఏమో శివ ఎవరు ఉన్నారు లేరు అన్నది ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను.. నిన్ను చూడాలనిపించింది. వచ్చేశాను. నీకు పెళ్లి అయిపోతే మళ్లీ మనం కలుస్తామో లేదోనన్న దిగులు నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వకుండా చేస్తుంది. 
అంటూ బిందు, శివను హగ్‌ చేసుకుంటుంది. అప్పుడే బయటి నుంచి గగన్‌, భూమి ఇంటికి వస్తారు. లోపలికి వెళ్తారు. 

భూమి: బావ ఇలా కార్డ్స్‌ పంచుతూ అందరినీ పిలవడం కష్టంగా ఉంది బావ. అదీ కాక పెళ్లికి ఎంతో టైం లేదు కదా..? 

గగన్‌: చాలా వరకు వాట్సాప్‌ చేశాను భూమి. మరీ ముఖ్యం అనుకున్న వాళ్ల దగ్గరికే వెళ్లి కార్డ్స్‌ ఇస్తున్నాం. ఇంకా ఎన్నో లేవులే.. అవి అయిపోతే నువ్వు ఘనంగా పెళ్లి జరిపించొచ్చులే.. కొంచెం కాఫీ ఇస్తావా..? హెడేక్‌గా ఉంది. 

భూమి: సరే బావ నువ్వు ప్రెష్‌ అప్ అవ్వు నేను కాఫీ తీసుకొస్తాను.. 
అని చెప్పగానే.. గగన్‌ పైకి వెళ్తుంటాడు. శివ రూంలో బిందును హగ్‌ చేసుకోవడం భూమి చూసి షాక్‌ అవుతుంది. రూంలోకి వెళ్లబోతుంటే.. గగన్‌ చూస్తాడు. అప్పుడే బిందు, శివలు కూడా భూమిని చూస్తారు. 

గగన్‌: భూమి.. కాఫీ అడిగితే అటు వెళ్తున్నావేంటి..? 

భూమి: ఏం లేదు బావ. గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. బావ నువ్వు వెళ్లు నేను కాఫీ తీసుకొస్తాను. 

గగన్‌: త్వరగా రా భూమి నేను ఆఫీసుకు వెళ్లాలి.. 

భూమి: రావు గారి ఇంటికి వెళ్లాలి అన్నావు కదా..? ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టు అక్కడికి వెళ్లి వచ్చేద్దాం.. 

గగన్‌: సరే నువ్వు త్వరగా తీసుకురా..? 
అంటూ చెప్పి గగన్ పైకి వెళ్లిపోతాడు. భూమి కోపంగా రూంలోకి వెళ్లి శివను కొడుతుంది. 

భూమి: ఏంట్రా నువ్వు చేస్తున్న పని.. 

బిందు: వదినా..? 

భూమి: బిందు నువ్వేం మాట్లాడకు. వయసులో చిన్నదానివే అయినా..నీకు దండం పెడతాను. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో..

బిందు: మీరు మా ప్రేమను అర్తం చేసుకోండి వదిన. 

భూమి: నేను కానీ మీ అన్నయ్య కానీ ప్రేమకు వ్యతిరేకం కాదు బిందు. ఇప్పటికిప్పుడు మీ ప్రేమ గురించి తెలిసినా మీ అన్నయ్య శివని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి వెనకాడడు. కానీ ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించు బిందు. ఆ ఇంటి వలన ఈ ఇల్లు ఎన్ని అవమానాలకు గురైందో ఒక్కసారి గుర్తు చేసుకో..? మీరు ప్రేమించుకున్న సంగతి ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టక ముందు చెప్పి ఉంటే.. ఈ పెళ్లి నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు మీ ప్రేమ ఈ ఇంటి పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి అర్తం చేసుకోవడానికి ప్రయత్నించు బిందు. శివను మర్చిపో.. నీ తలరాతలో ఇంకెవరో రాసి ఉన్నారని సరిపెట్టుకో.. ఈ ఇంటికి ఎప్పుడూ రాకు బయలుదేరు బిందు.. 

బిందు: అది కాదు వదిన.. 

శివ: అక్కా… 

భూమి: ఫస్ట్‌ నువ్వు రా.. 
అంటూ బిందును తీసుకుని భూమి బయటకు రాగానే బయట గగన్‌ ఉంటాడు. గగన్‌ ను చూసి ముగ్గురూ షాక్‌ అవుతారు.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
Godavari Serial Today November 3rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
Nindu Manasulu Serial Today November 3rd: నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
Illu Illalu Pillalu Serial Today November 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget