Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!
Guppedantha Manasu August 11 Episode 526:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్ర నుంచి రిషిని కాపాడేందుకు జగతి అండ్ కో ప్రయత్నాలు సాగుతున్నాయి.
గుప్పెడంతమనసు ఆగస్టు 11 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 11 Episode 526)
మనిద్దరి స్వార్థంతో రిషికి దూరమయ్యాం అని మహేంద్ర బాధపడుతుంటే..మన బంధాన్ని రిషి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదేమో అందుకే మానసికంగా దూరమయ్యాడంటుంది జగతి. అసలు వసుని కాదని రిషి సాక్షిని ఎందుకు పెళ్లిచేసుకుంటున్నట్టు అంటాడు. నాకు రిషిపై నమ్మకం ఉంది మహేంద్ర..రిషి ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు,తొందరపడి నిర్ణయాలు తీసుకోడని నా మనసుచెబుతోంది, మనసుకి నచ్చనిది, తనకు ఇష్టంలేనిది ఏదీ చేయడు..ఈ పెళ్లి జరగదని నా మనసు చెబుతోంది అంటుంది. ఏకంగా లగ్నపత్రిక రాసుకుంటుంటే ఇంకా జరగదని అనుకుంటున్నావ్ ఏంటన్న మహేంద్ర ప్రశ్నకు సమాధానంగా రిషి తొందరపడతాడు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోడని క్లారిటీ ఇస్తుంది..
అటు రిషి ఓ దగ్గర ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తుంటాడు. హాయ్ రిషి అంటూ ఎంట్రీ ఇస్తుంది సాక్షి. హాయ్ రిషి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని సాక్షి అంటే..నువ్వు పిలిచావని కాదు నేను రావాలనుకుని వచ్చానంటాడు..
రిషి: అన్ని పనులు బెదిరింపులతో అవవు..వసుధారపైకి నీ దృష్టి అస్సలు వెళ్లకూడదు..
సాక్షి: వసు టాపిక్ ఎందుకు మనం మాట్లాడుకుందాం..
రిషి: నేను కేవలం ఇదిమాత్రమే చెప్పడానికే వచ్చాను
సాక్షి: మా ఇద్దరి గురించి మాట్లాడతాడు అనుకుంటే వసుగురించి చెప్పాడు వెళ్లాడు..ఏంటి ఇదంతా..
Also Read: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు
దేవయాని: జగతి నువ్వు నాపై గెలిచి ఈ ఇంటికి వచ్చాను అనుకున్నావ్.. వసుధార నాపై పైచేయి సాధించా అనుకుంది..రిషి మాత్రం నేను చెప్పిన మాటే వింటున్నాడు..ఆలస్యం అయినా దేవయాని విజయం సాధించింది అనుకుంటుంది. ఇంతలో సాక్షి కాల్ చేస్తుంది. రిషి సంగతి అర్థం కావడం లేదంటే..అంతా బాగానే జరుగుతోంది, పెళ్లికి ఒప్పుకున్నాడు, మనిద్దరం బాగానే నటిస్తున్నాం అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్..
సాక్షి: నన్ను పిలిచి నాతో మాట్లాడతాడు అనుకుంటే ఇంకా వసు గురించి ఆలోచిస్తాడేంటి..
దేవయాని: రిషిని నువ్వు దక్కించుకోవడమే వరం..రిషి మనసులో వందమంది ఉంటే నీకేంటి..నీకు తాళికట్టబోతున్నాడు..
సాక్షి: ఓ మనిషిని కోరుకున్నా..తను నాతో మాట్లాడతాడని ఆశించాను..వసుగురించి మాట్లాడుతుంటే ఎలా భరించగలను..
దేవయాని: మూడు ముళ్లు పడ్డాక రిషి ఎవరో,వసు ఎవరో..అంతా మారిపోతుంది..రిషిని నీ కొంగున కట్టుకోవచ్చు అంతవరకూ ఓపికపట్టు...అనేలోగా జగతి వచ్చి ఫోన్ లాక్కుంటుంది.. మాట్లాడుతుంటే ఫోన్ లాక్కుంటావేంటి..
జగతి: నేను కూడా ఓమాట చెప్పాలి అక్కయ్యా అంటూ..హలో సాక్షి..ఏం చేసినా నువ్వు అనుకున్నది జరగదు సాక్షి
సాక్షి: అంతా అయిపోయింది..మీరు వచ్చి అక్షింతలు వేస్తే చాలు...
దేవయాని: ఏంటి జగతి ఏం మాట్లాడుతున్నావ్..
జగతి: ప్రపంచంలో చిన్న జంతువైనా , పక్షి అయినా తన పిల్లల్ని కాపాడుకుంటుంది..నా కొడుకుని ఎలాగైనా సాక్షి బారినుంచి రక్షించుకుంటాను..
Also Read: పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్న హిమ-ప్రేమ్, తగ్గేదే లే అంటున్న శౌర్య, పగతో రగిలిపోతున్న శోభ
వసు-గౌతమ్: ఐ లవ్ యూ చెప్పి రిషి ఇచ్చిన గిఫ్ట్ ని చూస్తూ వసు ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంతలో గౌతమ్ కాల్ చేస్తాడు. వసుధార నువ్వు వింటున్నావని నాకు తెలుసు కాల్ కట్ చేయకు విను...నువ్వు ఏం చేయకపోతే ఎలా, రిషితో మాట్లాడవా అంటాడు. నాకు ఆ అవకాశం ఇవ్వలేదని వసు అంటే..వాడు తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని తెలుసు నువ్వు మాట్లాడితే రియలైజ్ అవుతాడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు అంటాడు. వసు ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది.
రిషి సార్ లగ్నపత్రిక రాయమన్నారంటే నేను ఏం చేయాలి అనుకుంటుంది. అటు రిషి కూడా వసుని , వసుతో మాట్లాడిన మాటలు తల్చుకుంటూ ఇంట్లో కూర్చుంటాడు. ఇంతలో ధరణి వచ్చి లోపలకు రావొచ్చా రిషి అని అడుగుతుంది..
ధరణి: రిషి నాకు డొంకతిరుగుడుగా మాట్లాడడం రాదు, మనసులో ఒకటి బయటొకటి పెట్టుకుని ఉండలేను..నువ్వు సాక్షిని పెళ్లిచేసుకోవడం ఏంటి..ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు తెలుసు..కానీ నీపై అభిమానంతో అడుగుతున్నా కానీ అధికారంతో కాదు..వసుధార అంటే నీకిష్టం అని నాకు తెలుసు,తనంటే నీకిష్టం కద రిషి..అలాంటప్పుడు సాక్షితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావ్...
రిషి: ఈ రోజు ఏం కూర చేశారు...
ధరణి: బీరకాయ
రిషి: మీకిష్టం ఏది
ధరణి: వంకాయ
రిషి: రోజూ ఇష్టమైనదే చేయలేం..ప్రేమ వేరు,జీవితం వేరు..వసుకి మంచి భవిష్యత్ ఉంది..తన గురించి నాకు తెలుసు, నా గురించి తనకు తెలుసు
ధరణి : నేను కలసి ఉండడం గురించి మాట్లాడుతుంటే నువ్వు కూరల గురించి మాట్లాడుతున్నావ్
రిషి: మనం కోరుకున్నవి జరగకపోవడమే జీవితం..జీవితంలో ఆశలు,ఆశయాలు అన్నీ నెరవేరాలంటే కుదరవు కదా..
ధరణి: నేను సూటిగా అడుగుతుంటే ఉపమానాలు, ఉదాహరణలు చెబుతున్నావ్..
రిషి: మీరు ఎక్కువగా ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి..జరిగేదేదో జరుగుతుంది..
నాకు అర్థమైంది రిషి నువ్వు సమాధానం చెప్పవని అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది.. ఇంతలో వసునుంచి మెసేజ్ వస్తుంది...
వసు మెసేజ్ లో...సార్ ఆఖరి సారిగా ఒకే ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది రాగలరా అని ఉంటుంది.. రిషి కంగారుపడి కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది..దీంతో కంగారుపడి వెళతాడు రిషి...రూమ్ లోకి వెళ్లగానే అక్కడ నెమలీక, గోళీలు కనిపిస్తాయి.. వసుకి ఏమైంది, ఎక్కడికి వెళ్లిందనుకుంటూ మళ్లీ కాల్ చేస్తాడు.. స్విచ్చాఫ్ వస్తుంది..ఏం జరిగి ఉంటుంది..ఏమై ఉంటుంది.. నువ్వు ధైర్యవంతురాలివి అనుకున్నాను కదా ఇలాంటి పిరికిపనులు నువ్వు కూడా చేస్తావాఅనుకుంటూ బయటకు పరుగుతీస్తాడు...
Also Read: కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో
వసుధార మాత్రం ఓ చోట బెంచ్ పై కూర్చుని ఆకాశాన్ని చూసినా, చందమామని చూసినా, ఎగిరేగాలిపటాన్ని చూసినా, సీతాకోక చిలుకను చూసినా, అద్దంలో నన్నునేను చూసుకున్నా రిషిసార్ గుర్తొస్తారు అనుకుంటుంది...రిషి సార్ గుర్తుకు రానిదెప్పుడు అని ప్రశ్నించుకుంటే నాకు సమాధానం దొరకదేమో..అందనంత దూరంలో ఉన్న ఓ చందమామ మీకో కథ చెబుతాను వినండి.. అది రిషి సార్ కథే..కానీ తన కథ చెబితే తనకి కోపం వస్తుంది..ఆయన కోపాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను... రిషి సార్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పనివ్వడం లేదు..నేను చెప్పింది వినడం లేదు.. రిషిసార్ మారిపోయారు.. ఒకప్పటి రిషి సార్ కాదనిపిస్తోంది..నువ్వేం అంటావ్ అని తనలో తాను మాట్లాడుకుంటుంది..ఇంతలో ఆవేశంగా వచ్చిన రిషి కొట్టబోయి ఆగిపోతాడు..అసలేంటి ఆ మెసేజ్ అని వరుస ప్రశ్నలు అడుగుతాడు...
నేను ఆకాశంతో మాట్లాడుతున్నాను..నా బాధని చెప్పుకుంటున్నాను..నా సంతోషాలు నాఫీలింగ్స్ పంచుకుంటున్నాను.. మీ కథే చెబుతున్నాను సార్..అంటే..నేను చెబితే మీరు వినరు కదా..అందుకే విశాలమైన ఆకాశానికి చెబుతున్నాను...
రిషి: ఆ మెసేజ్ ఏంటి..ఆఖరి సారిగా చూడాలంటే ఏమనుకోవాలి..ఎంత భయపడ్డానో..
వసు: నేను చనిపోతాను అనుకున్నారా..నాకు మాట్లాడాలి అనిపించింది..మీరు ఎటూ రారనే డిసైడ్ అయ్యాను అందుకే ఇంట్లోంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను..
రిషి: నేను రానని ఎలా అనుకున్నావ్
వసు: మీరు ఇంతకుముందు రిషి సార్ కాదు..మీరు మారిపోయారు...
ఎపిసోడ్ ముగిసింది...