News
News
X

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam August 13 Episode 1430: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మరో మలుపు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయింది అనుకున్న వంటలక్క బతికేఉంది...

FOLLOW US: 

కార్తీకదీపం ఆగస్టు 13 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam August 13 Episode 1430)

పెళ్లి దగ్గరపడుతోందని హిమ టెన్షన్ పడుతుంటే నేనున్నాగా అంటాడు ప్రేమ్. ఏం చేద్దాం బావా అని అడిగితే.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని మాటిస్తాడు. అసలు నేను నిన్ను పెళ్లిచేసుకుంటే ఈ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది కదా అని మనసులో అనుకుంటాడు. నా లవ్ ప్రపోజల్ చూశాక కూడా హిమ ఏం మాట్లాడలేదనుకుంటాడు. ఇంతకీ ఏం చేస్తావ్ బావా అంటే.. ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉందిలే అని రిప్లై ఇస్తాడు. ఇంతలో మళ్లీ వచ్చిన సౌందర్య గుడికి వెళ్లాలని చెప్పాను కదా అని లాక్కెళ్లిపోతుంది. 

ఎంచక్కా చీరకట్టుకుని రెడీ అయిన శౌర్యని చూసి తాతయ్య ఆనందరావు మురిసిపోతాడు. చీరలో ఎంతో చక్కగా ఉన్నావమ్మా ఇవన్నీ వదిలేసి ఆ డ్రెస్సులేంటి, చేతికి రుమాలు చుట్టుకుని కొడతాఅన్నట్టు చూస్తావేంటి అంటాడు.
శౌర్య: నీకేం పనిలేదా తాతయ్యా అస్తమానం నన్ను పొగడ్డం, రాయబారాలు చేయడం చేస్తుంటావ్ . తప్పదన్నారని చీరకట్టుకున్నాను..బావుంది అంటే చాలు
ఆనందరావు: పొగడ్తలకు పొంగిపోని వారుండరు అంటారు కానీ ఆ మాట తప్పు అని నిరూపించావ్ . సెల్ఫీ తీసుకుందాం అని మనవరాలితో ఫొటో దిగుతాడు ఆనందరావు. నాకు తెలిసి మొదటిసారి సెల్ఫీ తీసుకున్నానేమో అంటూనే ఇప్పుడు నిన్ను చూస్తే ఆటో నడిపే శౌర్య అనుకోరు ఎవ్వరూ...అసలు నీ జీవితంలోకి ఆటో ఎలా వచ్చింది..
శౌర్య: చెబుతాను విను అంటూ..అప్పట్లో ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం గుర్తుచేసుకుంటుంది... హిమ నుంచి తప్పించుకుని పారిపోతున్న శౌర్యకి వారణాసి ఎదురుపడతాడు..నిన్ను ఎవరు పంపించారు, నన్ను వెతుక్కుంటూ వచ్చావుకదా అని నిలదీస్తుంది
వారణాసి: ఆనందరావు సార్ పంపించారని చెబితే నన్ను వదిలేసి వెళ్లిపోతుంది అనుకుంటూ నన్ను ఎవ్వరూ పంపించలేదు. అయినా నువ్వు ఇంటినుంచి పారిపోయి రావడం తప్పుకదా.  యాక్సిడెంట్ అయిందన్నారు, చివరి చూపులు కూడా లేవన్నారు, శవాల గదిలోకి వచ్చిన శవాలను చూస్తున్నాను...
శౌర్య: నా గురించి ఆరా తీయను అంటే..నేను కూడా నీతో పాటూ శవాల గదికి వచ్చి చూస్తాను
వారణాసి: వద్దమ్మా.దీపక్కను ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు
శౌర్య: నువ్వింకా ఆటో నడుపుతున్నావా..ఎప్పటికైనా నువ్వే నాకు ఆటో నేర్పించాలి..నేనుకూడా ఆటో నడుపుతాను..
వారణాసి: అంత పెద్దింటి పిల్లవి నువ్వు ఆటో నడపడం ఏంటి..
శౌర్య: నువ్వు నాకు ఆటో నేర్పించాలి అంతే..ఆ హిమ ఉన్నచోటుకి నేను రాను..నేను కలిశానని మా నానమ్మ, తాతయ్యకి చెప్పొద్దు..హాస్పిటల్ కి వెళదామా...
శౌర్య-వారణాసి హాస్పిటల్ కి వెళతారు...( దేవుడా మా అమ్మా నాన్నలు కనిపిస్తారా..కనిపించేలా చేయి స్వామీ అని వినాయకుడికి దండం పెట్టుకుంటుంది)... ఆ వెనుక రూమ్ లోనే దీప ఉంటుంది.... శౌర్య-వారణాసి మార్చురీకి వెళ్లి శవాలను చూసి..ఇక్కడ లేరంటే అమ్మా-నాన్న బతికే ఉన్నారు కదా అంటుంది శౌర్య...
వారణాసి: దేవుడి దయవల్ల వాళ్లు బతికి ఉంటే చాలు..
శౌర్య: అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారనిపిస్తోంది..అందుకే ఇదే ఊర్లో ఉన్నాను..అమ్మా నాన్న ఎక్కడున్నారు త్వరగా కనిపించండి...
ఇదంతా శౌర్య...ఆనందరావుకి చెబుతుంది.. 

Also Read:  శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!

శౌర్య: ఆటో అంటే నాకెందుకు ఇష్టం అంటే అమ్మ వారణాసి ఆటోలో వెనకాల కూర్చుని వెళ్లేది..అమ్మా త్వరగా రా అని ఆటో వెనుక స్టిక్కర్ అంటించాను..ఇప్పటికీ అమ్మ ఆటోలో కూర్చుని చిరునవ్వు చిందిస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మని ఆటోలో కూర్చోబెట్టుకుని నడపాలనే కోరిక తీరలేదు తాతయ్య. అందరకీ ఆటో తక్కువగా కనిపిస్తుందేమో కానీ నాకు చాలా పెద్ద వరం తాతయ్య...
ఆనందరావు: నువ్వు తిట్టను కొట్టను అంటే ఓ మాట చెబుతాను..నీ దగ్గరకు వారణాసిని పంపించింది మేమే తెలుసా..
శౌర్య: నిజమా..మీరు నన్ను అప్పటి నుంచే మోసం చేయడం మొదలెట్టారా...
ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య లాగిపెట్టి చెంపపై కొడుతుంది...
సౌందర్య: మేం నిన్ను మోసం చేశామా..చిన్నపిల్లగా ఉన్నప్పుడే వచ్చి రమ్మన్నాను రానన్నావ్... 
శౌర్య: చిన్న పిల్లలం అని నువ్వే అన్నావ్ గా..అప్పుడే ఇలా చెంపదెబ్బ కొట్టి ఆ రోజు తీసుకొచ్చి ఉంటే మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ ని అయ్యేదాన్ని కదా..
హిమ: అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చలేదని నీకెంత బాధగా ఉందో..నేను కూడా అమ్మా నాన్నకి ఇచ్చిన మాట నెరవేర్చలేదని అంతే బాధపడుతున్నాను..
శౌర్య: నువ్వు కట్టుకథలు ఆపుతావా
హిమ: అమ్మా నాన్న కారు లోయలో పడేముందు నాతో ఏమన్నారో తెలుసా..
శౌర్య: నన్ను మోసం చేయమని చెప్పారా
సౌందర్య: ఏయ్ ఆపండి..ఏంటే మీరు..చిన్నప్పుడు ఎంత బాగా కలిసుండేవారు ఇప్పుడేమైందే మీకు..నానమ్మా అని శౌర్య అనేలోగా.. నేను చెప్పింది విననప్పుడు నువ్వు చెప్పింది ఎందుకు వినాలి...రాను అంటే అస్సలు ఊరుకునేది లేదు. వస్తూ వస్తూ మీ అమ్మా నాన్నలకు దండం పెట్టుకుని రండి
శౌర్య, హిమ దండం పెట్టుకుంటుండగా...సౌందర్య...ఈ ఫొటలకు దండలు ఉండాలి కదా ఎవరు తీశారంటుంది. ఇంతలో స్వప్న కాల్ చేయడంతో అంతా గుడికి వెళ్లిపోతారు...

Also Read: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!
అటు నిరుపమ్ మాత్రం హిమ మాటలు తల్చుకుని బాధపడుతుంటాడు..అక్కడకు వచ్చిన ప్రేమ్..అమ్మో వీడు మళ్లీ ఏదేదో అడుగుతాడు అనుకుంటూ వెళ్లిపోవాలి అనుకుంటాడు.నా పెళ్లి కాగానే నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని నిరుపమ్ అంటే.. నీ పెళ్లే పెద్ద ప్రాబ్లెం అంటాడు...ఇంతలో హిమ కాల్ చేస్తుంది...
ఎపిసోడ్ ముగిసింది..

సోమవారం ఎపిసోడ్ లో
వంటలక్క చనిపోలేదు..బతికేఉంది...కళ్లు తెరిచి డాక్టర్ బాబూ అని అరుస్తుంది...

Also Read: ఇది మామూలు ట్విస్ట్ కాదు - వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత రీ ఎంట్రీ!

Published at : 13 Aug 2022 08:42 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam August 13 Episode 1430

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!