News
News
X

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

వంటలక్క వచ్చేసింది. దీంతో మీమ్ మేకర్స్ పండుగ చేసుకుంటున్నారు. జోకుల వర్షం కురిపిస్తున్నారు. అవేంటో చూసేయండి మరి.

FOLLOW US: 

వంటలక్క, ఇది పేరు కాదు.. బుల్లితెర ప్రేక్షకుడి ఎమోషన్. టీవీ సీరియల్స్ చూసేవారికి ఈ పేరు వింటే వస్తుంది వైబ్రేషన్. ఆ సీరియల్ చూడనివారికి ఆ పేరంటే ఫ్రస్ట్రేషన్. కానీ, మీమ్ మేకర్స్ మాత్రం ఆమె ఒక సొల్యుషన్. ఎందుకంటే.. మీమ్స్ క్రియేట్ చేయడమంటే చాలా కష్టం. సింపుల్‌గా నవ్వించగలగాలి. అయితే, వంటలక్క వంటి ఫేమస్ క్యారెక్టర్ మీద క్రియేట్ చేసే ప్రతి మీమ్‌కు మాంచి రీచ్ ఉంటుంది. అందుకే, మీమ్ మేకర్స్ డౌన్లో ఉన్నప్పుడు వంటలక్క ఆదుకుంటుంది. పరిష్కారాన్ని చూపుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. చాలా రోజులుగా వంటలక్క కనిపించకపోయేసరికి ‘కార్తీక దీపం’ సీరియల్ అభిమానులే కాదు, మీమ్ మేకర్స్ సైతం బెంగ పెట్టుకున్నారు. అయినా కార్తీక్, దీప లేని ‘కార్తీక దీపం’ ఏమిటీ? ‘ఉయ్ వాంట్ దీపక్క రైట్ నౌ’ అంటూ గత కొన్ని ఎపిసోడ్లుగా అభిమానులు పోరాడుతున్నారు. అందుకే, ‘వంటలక్కా ఈజ్ బ్యాక్’. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

ప్రస్తుతం సోషల్ మీడియాలో #VantalakkaIsBack బాగా ట్రెండవ్వుతోంది. ముఖ్యంగా మీమ్స్‌కు కళ వచ్చింది. తాజాగా ‘స్టార్ మా’.. ‘‘లక్షలాది ఎదురుచూపులు నిజమై కోలుకున్న దీప’’ అంటూ ప్రోమో వదిలేశారు. దీప హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్లుగా చూపించారు. ప్రమాద ఘటన గుర్తుచేసుకుంటూ ఆమె కోమాలో నుంచి బయటకు వచ్చినట్లు.. లేవగానే ‘‘డాక్టర్ బాబు’’ అని అరవడాన్ని ఈ ప్రోమోలో చూడవచ్చు. ఈ ప్రోమో చూడగానే ‘కార్తీక దీపం’ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ‘వంటలక్క ఈజ్ బ్యాక్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ‘‘ఆసియా కప్ వస్తోంది. మీ టీఆర్పీ కోసం.. మా క్రికెట్ లవర్స్‌ను చంపొద్దు. ఇంకొన్ని రోజులు వంటలక్కను అండర్‌గ్రౌండ్‌కు పంపేయండి’’ అని ఒకరు.. ‘‘కార్తీక్, మోనితాలను కూడా తీసుకొస్తున్నారంట’’ అని మరొకరు. ఇలా కామెంట్ల వరద పారుతోంది. ఇదిగో ఈ మీమ్స్, కామెంట్స్ చూస్తే తప్పకుండా మీరు కూడా పగలబడి నవ్వుతారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VIP_TROLLERS 😎 (@vip_trollers)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by extralu endhukayya (@extralu__endhukayya)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ⚠️ TELUGU ADDA MEME ⚠️ (@telugu_adda_meme)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CINEMA_WALA_ (@cinemawalaa)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telugu girl meme page 😎 (@unique_girl_memes)

కార్తీకదీపం సీరియల్‌లోకి వంటలక్క రీ ఎంట్రీ ఇస్తోందా అనే సందేహం చాలా రోజుల నుంచి ఉంది. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్ నటనకు పిధా కానివారు లేరు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో డాక్టర్ బాబు -వంటలక్క కలిసేది ఎప్పుడంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. ఎట్టకేలకు మోనిత కుట్రలకు చెక్ పెట్టి దీప-డాక్టర్ బాబు ఒక్కటయ్యారు. అప్పట్లో హనీమూన్ కోసం వెళ్లిన చిక్ మంగుళూరు టూర్‌కు మళ్లీ వెళ్లారు. తమకు కలతలు మొదలైన ప్లేస్ లో మళ్లీ సంతోషంగా గడిపి తిరిగిరావాలనుకున్నారు. కానీ హిమ డ్రైవింగ్ సరదా కారణంగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ కారులోంచి హిమను తోసేసిన డాక్టర్ బాబు-వంటలక్క.. శౌర్య జాగ్రత్తమ్మా అని చెబుతారు. ఆ తర్వాత ఆ కారు లోయలో పడి పేలిపోయింది. హిమలానే డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఆ కార్లోంచి బయట పడ్డారా? ఎప్పటికైనా తిరిగొస్తారా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఎట్టకేలకు వంటలక్క రీ-ఎంట్రీ అది తేలిపోయింది. మరి డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నారనేది తెలియాలి. వంటలక్క ఆ రోజు ఏం జరిగింది? తాను ఎలా బయటపడింది? డాక్టర్‌ బాబు పరిస్థితి ఏమిటనేది గుర్తుతెచ్చుకుని చెబితేగానీ ఉత్కంఠత వీడదు. 

Also Read: పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్న హిమ-ప్రేమ్, తగ్గేదే లే అంటున్న శౌర్య, పగతో రగిలిపోతున్న శోభ

గమనిక: మీరు కాసేపు సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఈ మీమ్స్. ఇతరుల మనోభావాలు, అందులోని పాత్రధారులు, సంబంధిత మీడియాను కించపరిచే ఉద్దేశం లేదు. ఇందులో చూపించిన మీమ్స్ అన్నీ ఆయా వ్యక్తుల అభిప్రాయం మాత్రమే. వాటికి ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్‌’ బాధ్యత వహించదని గమనించగలరు. 

Published at : 13 Aug 2022 01:04 PM (IST) Tags: Karthika Deepam Memes Karthika Deepam Vantalakka is Back Vantalakka Memes Vantalakka Jokes

సంబంధిత కథనాలు

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam