Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
Guppedantha Manasu August 15 Episode 529: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్ర నుంచి రిషిని కాపాడేందుకు జగతి అండ్ కో ప్రయత్నాలు సాగుతున్నాయి.
గుప్పెడంతమనసు ఆగస్టు 15 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 15 Episode 529)
రిషి-సాక్షి లగ్నపత్రిక రాసే హడావుడి జరుగుతుంటుంది. రూమ్ లోంచి వచ్చిన రిషి, మరో రూమ్ లోంచి పూలదండలు తీసుసకొస్తున్న వసుధార ఎదురుపడతారు. తమ పరిచయం దగ్గర్నుంచి ఐ లవ్ యూ చెప్పినంత వరకూ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటారు. ఎప్పటిలా వసుధార మెట్లపైనుంచి తూలి పడబోతుంటే రిషిపట్టుకుంటాడు. వసుచేతిలో ఉన్న పూలదండ ఇద్దరి మెడలో పడుతుంది. కొద్దిసేపు చూపులు కలిశాక..అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతారు.
లగ్నపత్రిక వేడుక జరుగుతుంటుంది. రిషి మాత్రం మౌనంగా ఉంటాడు.
సాక్షి: వసుధార తనతో రిషిని చేరుకోలేవని చేసిన ఛాలెంజ్ గుర్తుచేసుకుంటుంది
వసు: అన్నీ జ్ఞాపకంగా మలుచుకుంటానని జీవితాన్ని కూడా జ్ఞాపకంగా మార్చారా సార్ అనుకుంటుంది వసుధార. సాక్షిని బట్టలు మార్చుకోమని చెప్పడంతో.. దేవయాని వసుని పిలిచి సాక్షిని రెడీ చేయమని చెబుతుంది. నేను రెడీ చెస్తానని ధరణి అనడంతో వద్దులే వసు వెళుతుందని క్లారిటీ ఇస్తుంది దేవయాని. మహేంద్ర బాధపడిపోతుంటాడు. ఇలా జరగడం ఏంటని క్వశ్చన్ చేస్తే..కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుందని అంటుంది జగతి. సాక్షిని రెడీ చేస్తున్న వసుధారతో.. తానే గెలిచాను అన్నట్టు మాట్లాడుతుంది. బాధపడకులే నీక్కూడా ఎవరో ఒకరు దొరుకుతారని మాట్లాడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన జగతి..సాక్షిని తీసుకెళుతుంది. మరోవైపు రిషి..దేవుడి ముందు తను చేస్తుంది తప్పా.. ఒప్పా అని ఆలోచిస్తాడు.
Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
జగతి వెళ్లి సాక్షిని తీసుకొస్తుండగా..రిషి మాత్రం వసు వస్తున్నట్టు ఊహించుకుంటాడు. ఆ తర్వాత సాక్షి రిషి పక్కన నిలబడి దండం పెట్టుకుంటుంది. రిషిని తీసుకుని మహేంద్ర వెళ్లిన తర్వాత..తానే గెలిచాను అన్నట్లుగా జగతితో మాట్లాడుతుంది సాక్షి. జగతి మాత్రం ఈ తంతు జరగదన్నట్టు మాట్లాడుతుంది.
సాక్షి: ఏంటి ఆంటీ ఓడిపోతున్నామని ఉక్రోషంతో మాట్లాడుతున్నారు కదా..
జగతి: రిషి మనసులో నువ్వు లేవన్న విషయం నీకు బాగా తెలుసంటుంది.
సాక్షి:లగ్నపత్రిక రాసుకోబోతుంటే ఇంకా మనసులో లేవంటారేంటి.. ఇప్పుడు రిషి పక్కన కూర్చుంటాను, రేపు రిషి మనుసులో ఉండేలా జాగ్రత్త పడతాను
జగతి: జీవితం అంటే ప్లాన్స్ వేయడంకాదు..ప్రేమ అనురాగం,బంధం ఉండాలి
సాక్షి: మీరు బుక్స్ చదువుతారు..ఇప్పుడున్న జంటల్లో ఇవన్నీ ఎక్కడున్నాయ్. ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలా అనిబుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా
జగతి: భార్యభర్త అంటే ఎక్కడో పుట్టినా కలసి ప్రయాణిస్తారు..వారి ప్రయాణం బంధం,ప్రేమ పై కొనసాగుతుంది. నువ్వు రిషిని పెళ్లిచేసుకుంటావేమో కానీ ప్రేమను మాత్రం పొందలేవు కదా..
సాక్షి: మీరు రిషికి తల్లి కాబట్టి చెప్పినవన్నీ వింటున్నాను..వెళదాం పదండి...
Also Read: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
పూజ జరగుతుండగా రిషి పక్కకు వెళ్లి నిలబడుతుంది సాక్షి. కూర్చో వసుధార అని రిషి అనడంతో అందరూ షాక్ అవుతారు. ఆ మాట విని సాక్షి ఫైర్ అవడంతో దేవయాని నచ్చచెప్పి కూర్చోబెడుతుంది. ఉంగరాలు మార్చుకోమని పూజారి చెబుతాడు. సాక్షి కోసం తీసుకొచ్చిన రింగును పెట్టబోతాడు...అయితే ఆ రింగ్ పై ''S'' అని కాకుండా ''V'' అని ఉంటుంది. అందరూ మరోసారి షాక్ అవుతారు.. వసు మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంటుంది.
సాక్షి: నా పేరు సాక్షి..కానీ ఇక్కడ వి అని ఉందని సాక్షి ఫైర్ అవుతుంది..
రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు..ఎపిసోడ్ ముగిసింది...