News
News
X

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

కార్తీకదీపం సీరియల్ లో పాతవాళ్లంతా తిరిగి వస్తున్నారు. ఇప్పటికే దీప, వారణాసి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టాడు.

FOLLOW US: 

Karthika Deepam Serial Update

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్, క్రికెట్ ప్రియుల్ని ఊపేసిన ఐపీఎల్ కూడా ఈ రేటింగ్స్ ని దాటలేకపోయింది. అందుకే బుల్లితెర బాహుబలిగా స్థిరపడిపోయింది కార్తీకదీపం. అయితే కారుప్రమాదంతో దీప-కార్తీక్-మోనిత పాత్రలను ముగించి కొత్త జనరేషన్ తో సరికొత్తగా నడిపిస్తున్నారు నిర్వాహకులు. గత కొద్ది రోజులుగా పాత టీమ్ మొత్తం మళ్లీ వస్తుందనే ప్రచారం జరుగింది.ఆ మాట నిజమే అన్నట్టు పాత టీమ్ మొత్తం ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. కారు ప్రమాదం జరిగిన కొద్దిరోజుల తర్వాత అంటూ ..దీపని చూపించారు. డాక్టర్ బాబుతో పెళ్లి నుంచి యాక్సిడెంట్ వరకూ జరిగిన సంఘటనలన్నీ తలుచుకున్న వంటలక్క...డాక్టర్ బాబూ అంటూ గట్టిగా అరుస్తూ కళ్లు తెరిచి లేచి కూర్చుంది.

Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

తాజా ఎపిసోడ్ లో అక్కచెల్లెళ్లు అయిన హిమ-శౌర్య వాదించుకుంటుండగా..వారణాసి ఎంట్రీ ఇచ్చాడు. కార్తీక, దీప బతికే ఉన్నారని చెప్పాడు. ఇప్పటికే రీఎంట్రీ ఇచ్చిన దీప..డాక్టర్ బాబుకోసం హాస్పిటల్ మొత్తం వెతుకుతోంది. ఇందులో భాగంగా మార్చురీకి వెళ్లి కారు ప్రమాదం జరిగిన రోజు హాస్పిటల్ కి వచ్చిన శవం డాక్టర్ బాబుదేనా కాదా అని గుర్తించే పనిలో పడింది. ఈ హడావుడి నడుస్తుండగా... ఇప్పుడు డాక్టర్ బాబు కూడా రీఎంట్రీ ఇస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పేశాడు..

View this post on Instagram
 
A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

ఈ క్రమంలో డాక్టర్ బాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. కార్తీకదీపం సెట్ లో తలకు కట్టు కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న ఫొటోలను నిరుపమ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. గెట్ రెడీ.. డాక్టర్ బాబు ఆన్ డ్యూటీ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డాక్టర్ బాబు పోస్ట్ చూసిన అభిమానులు సంబరాల్లో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ బాబు అంటూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక మోనిత ఎంట్రీ ఒక్కటే తక్కువైంది..

Also Read: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Published at : 15 Aug 2022 06:41 PM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam August

సంబంధిత కథనాలు

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Karthika Deepam September 26th: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

Karthika Deepam September 26th: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

Devatha September 26th Update: సత్య షాకింగ్ నిర్ణయం- హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, రాధని దాచిపెట్టిన చిన్మయి

Devatha September 26th Update: సత్య షాకింగ్ నిర్ణయం- హాస్పిటల్ కి వచ్చిన దేవుడమ్మ, రాధని దాచిపెట్టిన చిన్మయి

Ennenno Janmalabandham September 26th: వేద ప్లాన్ తెలుసుకున్న యష్- శర్మ దగ్గర సులోచనని ఇరికించిన మాలిని

Ennenno Janmalabandham September 26th: వేద ప్లాన్ తెలుసుకున్న యష్- శర్మ దగ్గర సులోచనని ఇరికించిన మాలిని

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి