Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: మొదటి రోజే లక్ష్మీకి అవమానం.. కోడలికి హారతిచ్చి పంపిన యమున!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనక మహాలక్ష్మీకి జాబ్ ఇవ్వడంతో పద్మాక్షి వాళ్లు గొడవ చేయడం విహారి లక్ష్మీ ఆఫీస్‌కి రావాల్సిందే అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ జాబ్ ఆఫర్ లెటర్ చూసి పద్మాక్షి షాక్ అయిపోతుంది. లెటర్ విసిరి కొట్టి ఏంటి విహారి ఇది అని అడుగుతుంది. కాదాంబరి, భక్తవత్సలం ఏమైందని అడిగితే ఇంట్లో పెట్టుకున్న దరిద్రాన్ని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్తారు అని అంటుంది. లక్ష్మీకి అన్ని క్వాలిటీలు ఉన్నాయని చెప్తాడు. మన కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే లక్ష్మీనే కారణం అని అంటాడు.
విహారి: మన గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు పడిపోకుండా పరువుగా ఉన్నామంటే దానికి కారణం లక్ష్మీ. అలాంటి లక్ష్మీకి ఈ జాబ్ నేను ఇచ్చే గౌరవం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేను తనకు జాబ్ ఇస్తున్నాను.
అంబిక: పదో పరకో ఇస్తే సరిపోతుంది కదా ఈ జాబ్ ఎందుకని అందరి అభిప్రాయం.
చారుకేశవ: ఏం ఎక్స్‌పీరియన్స్ లేని లక్ష్మీ లాంటి దానికి జాబ్ ఎలా ఇస్తావని మీ అత్తయ్య వాళ్ల అనుమానం విహారి.
వసుధ: ఏం రాని మీకే ఇచ్చినప్పుడు లక్ష్మీకి ఇవ్వడంలో మాకు ఏం అభ్యంతరం లేదు.
భక్తవత్సలం: బిజినెస్ చేస్తుంది వాడు ఏం చేయాలో ఎలాంటి వారిని తీసుకోవాలో వాడి ఇష్టం.
వహారి: లక్ష్మీ ఇది నీ జాబ్ ఆఫర్ లెటర్. నేను చెప్తున్నా కదా తీసుకో.
యమున: చాలా మంచి పని చేశావు నాన్న.
అంబిక: సహస్రతో ఇంట్లో ఉంటేనే ఎంత ప్రమాదమో నీకు తెలుసు ఆఫీస్‌కి వెళ్తే ఇక విహారిని ఇంకెంత దగ్గరవుతుందో.
సహస్ర: పిన్ని నువ్వే ఎలా అయినా తనని అవమానించి ఆఫీస్‌కి రాకుండా చేయాలి.
అంబిక: అది నేను చూసుకుంటా.
విహారి: లక్ష్మీ వెళ్లి రెడీ అవ్వు.
లక్ష్మీ ఆఫర్ లెటర్ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి దండం పెడుతుంది. పండు అక్కడికి వచ్చి లక్ష్మీని చూసి మనసులో విహారి బాబు, సహస్రమ్మల పెళ్లి ఆగిపోయింది అంటే అది నీ కోసమే అనిపిస్తుందని అనుకుంటాడు. లక్ష్మీ ఆఫీస్‌కి బయల్దేరుతుంటే యమున హారతి తీసుకొచ్చి ఉద్యోగానికి వెళ్తున్నావు కదా అందుకే అని అంటుంది. పద్మాక్షి, అంబిక అది చూస్తారు. పద్మాక్షి కోపంతో హారతి పళ్లెం విసిరేస్తుంది. శుభమా అని హారతి ఇస్తుంటే ఇదేంటి వదినా అంటే ఏంటి శుభం ఇంట్లో కోడలిని పట్టించుకోవు కానీ పని మనిషిని నెత్తిన పెట్టుకుంటున్నావ్ అని అంటుంది. అంబిక అక్కతో నీలా అడిగేవాళ్లు లేకపోతే ఈ ఇంట్లో పని వాళ్లే పెత్తనం చేస్తారని అంటుంది. అక్కా గొడవ వద్దు వదిలేయ్ అని వసుధ చెప్పి లక్ష్మీని ఆఫీస్‌కి వెళ్లమని అంటుంది. లక్ష్మీ ఆఫీస్‌కి వెళ్లి విహారిని రాసి పూసుకొని ఉంటే సహస్ర తట్టుకోలేదని దాన్ని నువ్వే చూసుకోవే అంటే దానికి అంబిక అది ఇక్కడ పని మనిషే అక్కడ పని మనిషే అంటుంది. పద్మాక్షి అంబికతో విహారి, సహస్రల పెళ్లి అయితే లక్ష్మీతో పాటు యమునని బయటకు గెంటేస్తా అంటుంది.
ఆదికేశవ్, గౌరీల దగ్గరకు ఓ అమ్మాయి వచ్చి తనకు జాబ్ వచ్చిందని అంటుంది. దానికి ఆదికేశవ్ తన కూతురు కూడా గోల్డ్ మెడలిస్ట్ అని తనకు కూడా గొప్ప ఉద్యోగం వచ్చేదని అంటాడు. మరోవైపు కనకం ఆఫీస్‌కి వెళ్తుంది. దేవుడికి దండం పెట్టుకొని హెచ్ ఆర్ దగ్గరకు వెళ్తుంది. ఆఫర్ లెటర్ ఇస్తుంది. అక్కడున్న హోచ్ ఆర్ బాయ్‌ని పిలిచి అతని దగ్గర కాఫీ తీసుకొని బయట ఉన్న వాళ్లకి ఇవ్వమని లక్ష్మీకి చెప్తారు. లక్ష్మీ తీసుకొని వెళ్లి అందరికీ ఇస్తుంది. హెచ్ ఆర్ లక్ష్మీ పని మనిషి అనుకొని అందరికీ టీ కాఫీలు ఇస్తూ ఉండాలని చెప్పి ఏం పని చెప్పినా చేయాలని అనుకొని ఫైల్స్ కాన్ఫెరెన్స్ గదిలో ఇవ్వమని చెప్తాడు. లక్ష్మీ వాటిని తీసుకెళ్తూ చూస్తుంది. వాటిని తీసుకెళ్లి విహారికి ఇస్తుంది. విహారి నువ్వు తీసుకొచ్చావేంటి అని లక్ష్మీ తీసుకొని హోచ్ ఆర్ దగ్గరకు వెళ్తాడు. తనకెందుకు ఆ పనులు చెప్పావని అంటే తను ఆఫీస్ పనులు చేయడానికి వచ్చింది కదా అంటారు. దాంతో విహారి ఆఫర్ లెటర్ చూడలేదా అని చూడమంటాడు. అది చూసి హోచ్ ఆర్ షాక్ అయిపోతాడు. అది తన స్థాయి అలాంటి తనకు ఇలాంటి పనులు చెప్తావా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

