Guppedantha Manasu ఏప్రిల్ 8 ఎపిసోడ్: తండ్రి బర్త్ డే సెలబ్రేట్ చేయాలనుకున్న రిషికి వసు ఇచ్చే సలహా ఏంటి

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 8 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్  8 శుక్రవారం ఎపిసోడ్

జగతి మేడం నాకు పెద్ద పని అప్పగించారు..ధరణి మేడంతో రిషి సార్ కి చెప్పించి..రిషి సార్ తో మహేంద్ర సార్ ని అడిగించి తిరిగి ఇంటికి పంపించాలని ఆలోచిస్తున్నారు. మీరు ఎంత గ్రేట్ మేడం అనుకుంటూ దేవయాని ఇంట్లోకి అడుగుపెడుతుంది వసుధార.  ఎదురుగా దేవయాని కనిపిస్తుంది. 
దేవయాని: పాల ప్యాకెట్టు, న్యూస్ పేపర్లా పొద్దున్నే మా ఇంట్లో ఊడిపడ్డావేంటో
వసు: పాలపేకెట్టు కాఫీ అయిఉంటుంది, న్యూస్ పేపర్లో న్యూస్ పాతది అయిపోయి ఉంటుంది... మీకిప్పుడే తెల్లారిందా..
దేవయాని: రిషి ఇంట్లో లేడు...
వసు: తెలుసు మేడం...తెలిసే వచ్చాను...
దేవయాని: రిషి లేకపోతే నీకేం పని...
వసు: మహేంద్ర సార్ పంపించారు
దేవయాని: ఇన్నాళ్లూ జగతికి దూతలా పనిచేసి..మహేంద్రకి దూతలా వచ్చావా
వసు: మీ దృష్టిలో వాళ్లిద్దరూ వేరు...నా దృష్టిలో ఇద్దరూ ఒకటే
దేవయాని: నాతో ఏం మాట్లాడాలో ముందే రాసుకుని వస్తావా
వసు: నిజాలు మాట్లాడేటప్పుడు ధైర్యం ఉంటుంది, అబద్ధాలు మాట్లాడేటప్పుడు బెరుకు ఉంటుంది...మనది మనకు తెలుస్తుంది... అందుకే మీతో అయినా ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడతాను...
ధరణి: చెప్పు వసుధార
వసు: మహేంద్ర సార్ బుక్స్ కొన్ని మీ గదిలో ఉండిపోయాయంట కదా నన్ను తీసుకురమ్మని చెప్పారని బయటకు చెబుతూ( జగతి మేడం పంపించారు మీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తుంది)వసు. మీరు కూడా రండి మేడం...నాపై డౌట్స్ ఉంటే..
దేవయాని: నువ్వు పటుకెళ్లే మణులు మాణిక్యాలు చెక్ చేయాల్సిన అవసరం లేదు..నాకేం పని...నా స్థాయి అది కాదు..
వసు: రూమ్ లోకి తీసుకెళ్లి ధరణికి అసలు విషయం చెబుతుంది వసుధార... అక్కడ మహేంద్ర సార్ ఉండడం మాకు ఆనందం అయినా రిషి సార్ ను మిస్సవుతున్నారు...కాలమే వీళ్లని విడదీసింది. 
ధరణి: చినమావయ్యగారు ఇంట్లోంచి వెళ్లడం ఇప్పటికీ రిషికి అర్థంకావడం లేదు
వసు: మహేంద్ర సార్ సహనం, జగతి మేడం ప్రేమ, రిషి సార్ అపనమ్మకం... మీరే ఏదో ఒకటి చేయాలి

Also Read:  నిరుపమ్ పై ప్రేమతో హిమపై తన పగను బయటపెట్టిన రౌడీ బేబీ
అటు రిషి రూమ్ లో టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీకలు చూస్తూ...అవి ఏ సందర్భంలో వసుధార తనకి ఇచ్చిందో గుర్తుచేసుకుంటాడు. ధరణితో మాట్లాడి వెళ్లిపోతూ రిషి రూమ్ లోకి వెళుతుంది వసుధార...టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీలకు, కాకి ఎంగిలి చేసిన కశ్చీఫ్ చూస్తుంది. 
వసుధార: రిషి సార్ నన్ను అంటారు దాచుకుంటావని... ఇదే మాట నేను రిషి సార్ ని అడిగితే ఏమంటారో తెలుసా...( అద్దంలో చూస్తూ వసుధార ఇవన్నీ నేనేం ఫీలై పెట్టుకోలేదు ఏదో అంతే అంటారు)
రిషి:  ఈ పొగరేంటి ఇక్కడుంది...నిజమా...నా భ్రమ....
వసుధార: ఇవన్నీ ఎందుకు దాచావ్ సీరియస్ సింహం గారూ అంటాను...ఏయ్ వసుధార ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటారు అనుకుంటుంది..
రిషి: ఇంతలో వెనుక నుంచి రిషి..ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటాడు...నువ్వేంటి ఇక్కడ
వసుధార: ఇవేంటి సార్ ఇక్కడ
రిషి: నేను సీరియస్ సింహాన్నా....
వసుధార: జెంటిల్మెన్ అని కూడా పొగిడాను కదా..
రిషి: ఓ సారి పొగిడితే మరోసారి తిట్టాలా
వసుధార: పొగడ్తలు తీసుకున్నప్పుడు తిట్లు కూడా తీసుకోవాలి కదా సార్
రిషి: నన్ను ఇమిటేట్ చేస్తావా... జెంటిల్మెన్, సీరియస్ సింహం, ప్రిన్స్ ఇంకా ఎన్ని పేర్లు పెట్టావో...నేను కూడా నీకో పేరు పెట్టాను తెలుసా... ఏంటని అడిగినా చెప్పడు... ఎందుకొచ్చావ్
వసుధార: ఎవరైనా వస్తే ఎందుకొచ్చావ్ అని అడుగుతారా...
రిషి: హలో వసుధార గారూ రండి కూర్చోండని సెటైర్ వేస్తాడు...
వసుధార: అక్కడి నుంచి వెళ్లిపోతూ..జ్ఞాపకాలు గుండెల్లో, వస్తువులు ఇంట్లో, కోపాన్ని మనసులో దాచుకోవాలని చెబుతుంది...

Also Read: పరుగెడుతోందే నీకేసే వినమంటోంది తన ఊసే, రిషి రూమ్ లో వసుధార
ఏరా ఈ మధ్య మరీ నల్లపూసైపోయావ్ అని గౌతమ్ అంటే.. నల్లపూస అంటే అన్న రిషితో..బిజీగా ఉండి అప్పుడప్పుడు కనిపించకపోతే అలానే అంటారంటుంది ధరణి. ఆ మాత్రం రిషికి తెలియదా అని ఫైర్ అవుతుంది దేవయాని. 
దేవయాని: మహేంద్ర కొంచెం టూమచ్ చేస్తున్నారు...నన్నేమన్నా నేను పట్టించుకోను రిషి, కానీ తనకు పుస్తకాలు కావాలని వసుధారని పంపించారు
ఫణీంద్ర: అందులో తప్పేముంది...
దేవయాని: మీరు ప్రతి దానికీ తప్పులన్నీ నావైపు ఉన్నట్టు మాట్లాడతారు...
ఫణీంద్ర: తినే ప్లేట్ దగ్గర చేయి కడుక్కుని వెళ్లిపోతాడు... వెంటనే దేవయాని కూడా వెళ్లిపోతుంది...
గౌతమ్  కూడా చేయి కడిగేసుకుని...ఈ టాపిక్ నేనే తీశానురా సారీ అనేసి వెళ్లిపోతాడు...
ఏంటి వదినా ఇది అని రిషి అంటే.. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలం అంటుంది... డాడ్ లేని ఇల్లు ఏదోలా ఉందని అంటాడు రిషి. ఏదో విధంగా చినమావయ్యగారిని తీసుకురా రిషి అంటుంది ధరణి...
రూమ్ లో కూర్చుని తండ్రితో కలసి దిగిన ఫొటోలు చూస్తూ బాధపడతాడు. మహేంద్రతో సంతోషంగా గడిపిన క్షణాలు, జగతి మాటలు గుర్తుచేసుకుంటాడు. ఐ లవ్ యూ డాడ్..

Also Read: ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, రౌడీ బేబీకి పడిపోయిన డాక్టర్ సాబ్
జగతి: చాలా సంవత్సరాల తర్వాత మనిద్దరం ఓ స్పెషల్ డే రోజు కలుసుకోబోతున్నాం...ప్రతీసారి నీ పుట్టిన రోజువస్తుంటే బాధేసేది..మహేంద్రని చూడలేకపోతున్నా అని..
మహేంద్ర: ఈ సారి సంతోషపడుతున్నావా...
జగతి: ప్రతీసారి కన్నా ఎక్కువగా బాధపడుతున్నా.. రిషికి దూరం అయ్యావనే బాధ ఉంది
మహేంద్ర: నా పుట్టిన రోజుకి నువ్వు లేవనే బాధ ఉండేది...నన్ను ఎక్కడికో తీసుకెళ్లి కేక్ కట్ చేయించేవాడు, ఎంతో ప్రేమ చూపించేవాడు... ఇంత ప్రేమ చూపిస్తున్నాడు వీడిని వదిలి వెళ్లాల్సి వస్తే ఎలా అని కానీ ఆ రోజు వచ్చింది.... రిషి లేని పుట్టినరోజు నాకు దేవుడు లేని దేవాలయంతో సమానం 
జగతి:  నువ్వు పిలిస్తే రిషి రాడా... నువ్వు నా దగ్గరకు వచ్చావని గ్రాండ్ గా పార్టీ చేయలేను..నేను ఎంత ఎక్కువ పార్టీ చేస్తే రిషి అంత ఎక్కువ బాధపడతాడు...
మహేంద్ర: మనం అనే పదానికి నిర్వచనం నేనొకటి చెబితే, రిషి మరొకటి చెబుతున్నాడు...
జగతి: నువ్వు చెప్పే మనంలో నేనుంటాను..రిషి చెప్పే మనంలో నేనుండను...

రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
డాడ్ మీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దామనుకుంటున్నాను అన్న రిషితో... జగతి నా భార్య అని ప్రపంచానికి తెలిసింది, తనని వదిలేసి సెలబ్రెట్ చేసుకున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాకొద్దని చెబుతాడు...  ఇక్కడ కూర్చున్నారేంటని వసుధార అడిగితే.. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడకూర్చున్నా అంటాడు. మా డాడ్ నాతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతాడు. దీనికి ఒక్కరే సమాధాం చెప్పగలరు అంటుంది వసుధార....

Published at : 08 Apr 2022 10:09 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 8th April Episode 419

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత