By: ABP Desam | Published : 07 Apr 2022 08:45 AM (IST)|Updated : 07 Apr 2022 08:45 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam 7th April Episode 1320 (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 7 గురువారం ఎపిసోడ్
జ్వాలకి తాము ఇచ్చిన చీర కట్టుకుంటుందా కట్టుకోదా అని ఆలోచనలో ఉండగా..చీరకట్టుకుని బయటకు వస్తుంది. చీరలో చాలాబావున్నావని పొగుడుతుంటే ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతుంది. పెళ్లిచూపులు అని చెబితే పీకపిసికి చంపేస్తుందేమో అనుకున్న చంద్రమ్మ... నిన్ను చీరలో చూడాలనిపించిందని చెబుతారు. ఈ చీర కొన్నారా కొట్టేశారా అసలీ హడావుడి ఏంటి అని జ్వాల అంటే...సత్యంసార్ డబ్బులిస్తే కొన్నాంఅని క్లారిటీ ఇచ్చిన చంద్రమ్మ అసలే పెళ్లీడుకొచ్చావు కదా అంటారు. నాకు జీవితంలో ఓ లక్ష్యం ఉంది అది అయ్యేవరకూ పెళ్లిచూపులు, పెళ్లి అనే ఆలోచనలు మీ దొంగబుర్రలోకి రానివ్వకూడదు అని చెప్పేసి వెళ్లిపోతుంది జ్వాల. ఆమె అటు వెళ్లగానే ఎవరికో కాల్ చేసి మా అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చింది దూరం నుంచి మాత్రమే చూడు నీ ఆరోగ్యానికి మా ఆరోగ్యానికి మంచిదని కాల్ కట్ చేస్తారు.
Also Read: ఏప్రిల్ 6 ఎపిసోడ్: వెళ్లే (రిషి) ప్రతి అడుగు నీవైపేనా మళ్ళీ ప్రతి మలుపు నిను( వసు) చూపేనా
బస్తీలో మెడికల్ క్యాంప్
అటు బస్తీలో మెడికల్ క్యాంప్ నడుస్తుంటుంది. ఓ వైపు మందులిస్తూనే మరోవైపు వారణాసి, అరుణ, లక్ష్మణ్ గురించి ఆరా తీస్తుంది హిమ. పాపం హిమ శౌర్య కోసం ఎంత తాపత్రయ పడుతోందో అని బాధపడతాడు మానస్. ఇంతలో ఆ మెడికల్ క్యాంప్ దగ్గరకు తండ్రితో కలసి వస్తాడు ప్రేమ్. హిమని చూస్తూ అలాగే ఉండిపోతాడు ప్రేమ్. హిమని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అనుకుంటాడు. మీరేంటి డాడ్ ఇక్కడకు వచ్చారని నిరుపమ్ అడిగితే... మీరు మంచిపనిచేస్తున్నారు అందుకే వచ్చానంటాడు సత్యం(సౌందర్య అల్లుడు). మీ ఇద్దర్నీ ఇలా చూడడం హ్యాపీగా అనిపిస్తుందంటాడు. ఇక్కడేముంటాయని కెమెరా తీసుకొచ్చావ్ అని హిమ అడిగితే...కెమెరా నా జీవితంలో భాగమైంది, పైగా నీ మెడికల్ క్యాంప్ ఫొటోస్ తీసే అదృష్టం కూడా దక్కిందని సంతోషిస్తా అంటాడు ప్రేమ్. మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. ఇక్కడ మీకు చాలా ఆలస్యం అయ్యేట్టుందే అని తండ్రి అనడంతో..అవును డాడీ అని రిప్లై ఇస్తాడు నిరుపమ్. అయితే జ్వాలకి కాల్ చేసి ఇక్కడికే భోజనం తీసుకురమ్మని చెబుతానని సత్యం అంటే.. మంచి ఐడియా డీడీ ఆ రౌడీ బేబీకి కూడా చెకప్ చేస్తానంటాడు.
ఆనందరావు-స్వప్న
ఇంటికొచ్చిన ఆనందరావుని చూసి డాడీ ఒక్కరే వచ్చారా మనసులేని మనుషులతో వచ్చారా అంటాడు. మీరేంటి ఇలా వచ్చారు మీ ఆవిడ నిజస్వరూపం తెలిసిపోయిందా అని స్వప్న అంటే... కూతుర్ని చూడాలని అనిపించిందని చెబుతాడు ఆనందరావు. మీరు ఎన్నిరోజులున్నా సంతోషమే కానీ మిమ్మల్ని చూసేవంకతో ఆవిడ వస్తే బావోదని క్లారిటీ ఇస్తుంది. ఇల్లు విశాలంగా ఉంది కానీ ఇందులో మనుషులు ఏరంటూ... ప్రేమ్ అక్కడ నిరుపమ్ ఇక్కడ, నువ్విక్కడ -అల్లుడుగారు అక్కడ ఏంటమ్మా ఇది... కట్టుకున్నవాడిపై కోపం, పుట్టినింటిపై కోపం ఎందుకొచ్చిందమ్మా ఇదంతా... ఒక్కరిసారి ఆలోచించు అంటాడు ఆనందరావు. ఇంటి గోడలకు రంగుల్ని మార్చగలం కానీ గోడల్ని మార్చలేం..నా మనసుకి మానిపోని గాయం చేసింది మీ ఆవిడ...ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి, ఇకముందు కూడా మనం ఈ విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే బావుంటుందని నా ఉద్దేశం అని చెబుతుంది స్వప్న.
Also Read:మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా- ప్రేమను చెప్పే క్షణం కోసం ప్రేమ్, జ్వాల ఎదురుచూపులు
మెడికల్ క్యాంప్
ప్రేమ్ బిజీబిజీగా హిమకు ఫొటోస్ తీస్తుంటే ఆటో రయ్ మని తీసుకొచ్చి ప్రేమ్ దగ్గర ఆపుతుంది జ్వాల. ఏయ్ కళ్లు కనిపించడం లేదా అని అరిచిన ప్రేమ్..చీరకట్టులో జ్వాలని చూసి అలాగే ఉండిపోతాడు. హారన్ కొడుతున్నా వినపడడం లేదా అసలు ఏ లోకంలో ఉన్నావేంటి..అంతలా ఒళ్లు మరిచిపోయి తీసే ఫొటోస్ ఏంటి అంటూ కెమెరా లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది. కిందపడబోతుంటే పట్టుకున్న ప్రేమ్... మళ్లీ వదిలేస్తాడు. ఇద్దరూ మళ్లీ వాదించుకుంటూ...నిరుపమ్ తనని గమనిస్తున్నాడని తెలిసి ఆగిపోతుంది జ్వాల. నిరుపమ్ అలా చూస్తుండిపోయిన విషయం గమనించిన హిమ...అటు జ్వాలని కూడా చూస్తుంది. నమస్తే డాక్టర్ సాబ్ అంటే హలో రౌడీ బేబి కొత్త లుక్ అంటాడు. చీరలో చాలా బావున్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు.
ఎపిసోడ్ ముగిసింది...
రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
చేతిమీద హెచ్ అనే పచ్చబొట్టు ఉందంటే అది ఎవరిది అని అడుగుతారు ప్రేమ్, నిరుపమ్. అది నా శత్రువుది అని చెబుతుంది జ్వాల. కనిపిస్తే ఏం చేస్తావ్ అంటే..కోపం ఏంటో నాకు తెలుసు కారణం ఏంటో తనకి తెలుసంటుంది. అంటే....హిమని శౌర్య ఎప్పటికీ క్షమించదా అంటూ ఏడుస్తూ వెళ్లిపోతున్న హిమని ఏయ్ తింగరి అని పిలుస్తుంది.
Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య
Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
Karthika Deepam మే 16 ఎపిసోడ్: జ్వాల కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన హిమ- డాక్టర్సాబ్ బ్రెయిన్ వాష్ చేస్తున్న స్వప్న
Guppedantha Manasu మే 16 ఎపిసోడ్: వసుధార బుక్లో ప్రేమ లేఖ చూసి రిషి సీరియస్- ఇంట్లో పంచాయితీ పెట్టిన సాక్షి
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం