By: ABP Desam | Updated at : 06 Apr 2022 08:58 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam 6th April Episode 1319 (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 6 బుధవారం ఎపిసోడ్
సౌందర్య ఇంటికి జ్వాల: ఆటోలో ఎక్కిన ఓ మహిళతో ఏంటి పెద్దమ్మా ఇంత లగేజ్ అంటే..ఓ ఇంట్లో పనికి కుదిరాను సరుకులు తీసుకెళుతున్నా అని చెబుతుంది. ఈ వయసులో ఏందుకు ఇంత కష్టం పెద్దమ్మా అని జ్వాల అంటే... చిన్నప్పుడే నా మనవడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు నేను పోయేలోగా వాడిని చూస్తే చాలని ఎదురుచూస్తున్నా అంటుంది. ఇట్లోంచి వెళ్లిపోతే ఇంతలా బాధపడతారా అని ఆలోచించిన జ్వాల...అయినా వాళ్లెవరకూ నా కోసం వెతకలేదు కదా అనుకుంటుంది. జ్వాల ఆటోలో ఎక్కిన ఆమె సౌందర్య ఇంటిముందు దిగుతుంది. ఆమె ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుంటూ ఆ ఇంటిపైన మేడపై ఎవరో నిల్చుని ఉండడం చూస్తుంది కానీ ఆనందరావు వెనక్కు తిరిగి నిలబడడంతో గుర్తుపట్టదు. ఆ తర్వాత ఆటోలో కవర్ మరిచిపోవడంతో అది ఇచ్చేందుకు లోపలకు వెళుతుంది. జ్వాల(శౌర్య) ఇంట్లో అడుగుపెట్టగానే సౌందర్య సిక్త్ సెన్స్ ఏదో చెబుతుంది. ఎంట్రన్స్ వైపు కాసేపు చూసి ఎవరూ లేరే అనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది జ్వాల. మా నాన్నమ్మ వాళ్లు కూడా ఇలాంటి పెద్దింట్లోనే ఉంటారంట అనుకుంటూ ద్వారం దగ్గర నిల్చుని పిలుస్తుంది. ఎవరో వచ్చినట్టుంది చూడు అని పనిమనిషిని బయటకు పంపిస్తుంది సౌందర్య. ఆటోలో మరిచిపోయావ్ ఈ కవర్ అని ఇస్తుంది. లోపలకు రామ్మా మంచి నీళ్లు తాగి వెళుదుగానివి అని అంటే... వద్దులేమ్మా వస్తా పెద్దమ్మ అని వెళ్ళిపోతుంది. ఆనందరావు పైనుంచి చూస్తాడు.
Also Read: ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, రిషి-వసుది సేమ్ ఫీలింగ్
సౌందర్య-ఆనందరావు: ఇందాక వచ్చినమ్మాయి ఎవరు అని సౌందర్య అడిగితే..ఆటోలో కవర్ మర్చిపోయాను తీసుకొచ్చి ఇచ్చిందని చెబుతుంది పనిమనిషి. మంచి అమ్మాయిలా ఉంది ఎక్కడున్నా బావుండాలని దీవిస్తుంది. అటు ఆనందరావు ఆటో నడుపుతున్న జ్వాలని చూసి..కష్టజీవిలా ఉంది పాపం ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తున్నట్టుందని అనుకుంటాడు. స్వప్న అన్న మాటలకు బాధపడుతున్నావా అని ఆనందరావు అడిగితే...అంతా బావుంటే ఇద్దరు మనవళ్లకు ఇద్దరు మనవరాళ్లను ఇచ్చి పెళ్లిచేద్దాం అనుకున్నాను, శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోయింది, హిమను ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లిచేద్దాం అనుకుంటే స్వప్న ఇలా మాట్లాడుతోంది అంటుంది.
ప్రేమ్: మరోవైపు ప్రేమ్ తన ఫోన్లో హిమ ఫొటోలు చూస్తూ మురిసిపోతుంటాడు. అమ్మాయి ఎలాఉండాలని ఎవరైనా అడిగితే నేను నిన్నే చూపిస్తానను అనుకుంటాడు. అమాయకత్వం, అణుకువ, అందం, తెలివితేటలు అన్నీ నీలో ఉన్నాయి... నిజంగా నువ్వు నా జీవితంలోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి నీకు అందమైన ఫొటోని బహుమతిగా ఇచ్చి నా ప్రేమను తెలియజేస్తాను అనుకుంటాడు. నిజానికి నాకు మెడికల్ క్యాంప్ కు రావాలని లేదు కానీ నువ్వక్కడ ఉంటావ్ కాబట్టి నీకోసం వస్తా అనుకుంటాడు.
జ్వాల: ఆటో తుడుచుకుంటున్న జ్వాలకి అద్దంలో నిరుపమ్ కనిపిస్తాడు. ఆటోలో నిరుపమ్ కూర్చున్నట్టు ఫీలవుతుంది. ఇదంతా నా భ్రమా అనుకుంటుంది. ఇంతలో వెనుక నుంచి ఏ పిల్లా ఆటో వస్తుందా అనే పిలుపు వినిపిస్తుంది..డాక్టర్ సాబ్ మీరా ...మీరు నన్ను అడగడం ఏంటని వచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇది కూడా జ్వాల భ్రమే...ఎందుకంటే అక్కడున్నది డాక్టర్ నిరుపమ్ కాదు. నాకైమందబ్బా అనుకుంటుంది. ఇంకా అదే ఊహల్లో ఉంటుంది. రాయిలాంటి మనసున్న నన్ను కూడా డాక్టర్ సాబ్ డిస్టర్ చేస్తున్నాడేంటి అనుకుంటుంది. నేను నేనానా...నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను...నన్ను పొగుడుతాడు, అమ్మాయంటే ఇలానే ఉండాలంటాడు, నన్నేదో మాయ చేస్తున్నాడు డాక్టర్ సాబ్ అనుకుంటూ...ఆటో వెనుకే వదిలేదేలే అని రాసిఉన్నది చూసి మళ్లీ పాత శౌర్య అయిపోతుంది. తల్లిదండ్రుల యాక్సిడెంట్ ని తలుచుకుని హమా...నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా-ప్రతీకారం తీర్చుకుంటా అనుకుంటుంది...
Also Read: అత్యంత దీనంగా ఎంట్రీ ఇచ్చిన మోనిత కొడుకు, ఓ చోటుకి చేరుతున్న సౌందర్య ఫ్యామిలీ
నిరుపమ్: ఉన్నట్టుండి బస్తీలో మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టావ్...
హిమ: సేవా భావంతో పాటూ నా స్వార్థం కూడా ఉంది...మెడికల్ క్యాంపులకు మా ఫ్యామిలీకి విడదీయరాని బంధం ఏదో ఉందని నానమ్మకం. ఓ మెడికల్ క్యాంప్ లోనే మా అమ్మ మొదటిసారి నాన్నని కలుసుకుందట, శౌర్య కూడా నాన్నని మొదట మెడికల్ క్యాంప్ లోనే వెతికి పట్టుకుందట... బస్తీలో మెడికల్ క్యాంప్ పెడితే నా చిన్నప్పుడు తెలిసిన వాళ్లు ఎవరో ఒకరు రాకపోతారా అనే ఆశ. శౌర్య ఎప్పుడైనా అక్కడకు వచ్చిందేమో...శౌర్యని చూసిన వాళ్లు, శౌర్యతో మాట్లాడిన వాళ్లు అక్కడకు వస్తారేమో అని ఆశ...
నిరుపమ్: గుడ్ హిమ...త్వరలోనే శౌర్య కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. శౌర్య ఎలా ఉందో ఇప్పుడు ఎక్కడుందో కదా హిమ...
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
ఏయ్ జ్వాల ఏంటిది..చేతిపై హెచ్ అనే పచ్చబొట్టు ఉందంటే ఎవరిది అనుకోవాలని నిరుపమ్, ప్రేమ్ అడుగుతారు. నా శత్రువుది ...నేను అందరితో పంచుకోలేను..నా కోపం ఏంటో నాకు తెలుసు, నా శత్రువుకు తెలుసు అంటుంది...ఇదంతా హిమ వినేస్తుంది...
Bigg Boss Telugu Season 7: జుట్టు పాయే - అమర్ దీప్, ప్రియాంకలకు ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష,
Shobha Shetty: 'ఘాటెక్కిన' బిగ్ బాస్ హౌస్ - స్పైసీ చికెన్ టాస్క్ లో ఏడ్చేసిన శోభా శెట్టి
Trinayani September 21st Episode:సుమనకు ఆస్తి ఇవ్వనని చెప్పేసిన నయని - చిన్నారికి పేరు వెతుకుతున్న సుమన!
Prema Entha Madhuram September 21st: అనుకి గిఫ్ట్ కొనేందుకు ఆర్య సహాయం తీసుకున్న అక్కి- తండ్రే అని తెలుస్తుందా!
Gruhalakshmi September 21st: లాస్య రీ ఎంట్రీ - సామ్రాట్ కంపెనీ సీఈఓగా తులసి బాధ్యతలు తీసుకుంటుందా!
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>