Guppedantha Manasu ఏప్రిల్ 5 ఎపిసోడ్: ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, రిషి-వసుది సేమ్ ఫీలింగ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 5 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 4 సోమవారం ఎపిసోడ్
రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిన రిషి-వసుధార ఓ చోట కారు ఆపి మాట్లాడుకుంటారు..
ఇన్ డైరెక్ట్ గా ఎందుకు...ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు
మిషన్ ఎడ్యుకేషన్లో మీతో వర్క్ చేసిన ప్రతిక్షణం నేను ఆస్వాదించాను, సంతోషించాను
నేను కూడా
ఆ ప్రాజెక్టును మీరు వదిలిపెట్టొద్దు... జగతి మేడంతో...
వసుధార నీకు ఇంతకుముందే చెప్పాను...ప్రాజెక్ట్ కోసం ఇద్దరు డైరెక్టర్లుగా అపాయింట్ చేశాను
మీరు-జగతి మేడం ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ కు రెండు కళ్లు....మీ గొప్పతనం మీ దూకుడు వల్లే ప్రాజెక్ట్ ఇంత గొప్పగా ఎదిగింది
ఓ నిముషం ఆగు...నా కార్లో శాలువా, బొకేలు ఉన్నాయి..అవి ఇచ్చి చెబుదుగానివి
నేను నిజాలు చెబుతున్నాను, మీకెలా చెబితే అర్థమవుతుంది సార్ అంటూ రిషి చేయందుకుంటుంది. నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు అవన్నీ, మీకు ఎన్ని శాలువాలు కప్పినా ఎన్ని బొకేలు ఇచ్చినా తక్కువే అవుతాయ్... ఆ ప్రాజెక్టుని వదలకండి సార్...
వసుకి దగ్గరగా వచ్చిన రిషి...అలా చూస్తూ ఉండిపోతాడు..దగ్గరగా వెళ్లి ముద్దుపెడదాం అనుకుని మళ్లీ వెనక్కు తగ్గిపోతాడు... ( బ్యాగ్రౌండ్ లో ఓ లవ్ ట్రాక్ బావుంది)
కాసేపు ఆగిన తర్వాత వెళదామా అని అడుగుతాడు రిషి
Also Read: అత్యంత దీనంగా ఎంట్రీ ఇచ్చిన మోనిత కొడుకు, ఓ చోటుకి చేరుతున్న సౌందర్య ఫ్యామిలీ
జగతి ఇంట్లో
వసుధారని ఇంటిముందు దించుతాడు రిషి. మహేంద్ర లోపలి నుంచి కొడుకుని చూసి మురిసిపోతాడు. ఓసారి కారు దిగొచ్చు కదా అంటుంది వసుధార. ఇప్పటివరకూ పొగిడావ్ కదా సరిపోలేదా అంటాడు. నేను చెప్పినవన్నీ నిజాలు సార్ అంటుంది వసుధార. వీళ్లద్దరూ అప్పుడే గొడవపడతారు, అలుగుతారు, నవ్వుకుంటారు..ఇద్దరి మధ్యా ఏదో ఉంది కానీ చూసేవాళ్లకి ఏమాత్రం డౌట్ రాకుండా అతికిపోయే ఆన్సర్స్ చెబుతుంటారు..ఎవరు బయటపడతారో చూద్దాం అనుకుంటాడు మహేంద్ర. వెళ్లిపోతూ విండో దగ్గరున్న మహేంద్రని చూస్తాడు రిషి...కాసేపు చూసి వెళ్లిపోతాడు....
ముసుగేసుకున్న వసుధారని ఏంటి వసు నిద్రవస్తోందా అని అడుగుతుంది జగతి. అవును మేడం అలాగే ఉందని ముసుగేసుకుంటుంది వసుధార. అటు రిషి కూడా వసుధార ఆలోచనల్లో ఉంటాడు.
రిషి: నిద్రపోయావా అని మెసేజ్ చేస్తాడు
వసుధార: ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్...
రిషి: ప్రయత్నం ఏంటో అనుకుంటూ...ఈ మధ్య కొటేషన్స్ జ్ఞానబోధ తగ్గించావేంటి....
వసుధార: మసేజ్ కి రిప్లై ఇస్తుండగా...జగతి లేచి ఠక్కున ముసుగుతీస్తుంది...
జగతి: ఏంటి వసు ఇది...ఈ టైంలో ఏంటి
వసుధార: నాతో చాటింగ్ చేసేవారు ఎవరుంటారు..మీ అబ్బాయి....
జగతి: మా అబ్బాయి ఏంటి మీ ఎండీ కాదా...అది కూడా మిషన్ ఎడ్యుకేషన్ కోసమా...
వసుధార: తిన్నావా, ఏం చేస్తున్నావ్ తప్ప ఏముంటాయ్...
జగతి: ఈ చాటింగ్ ముసుగు వేసుకోకుండా కూడా చేయొచ్చు కదా... నాకు తెలియదు ఊరికే అడుగుతున్నాను...నాకు ఇవన్నీ తెలియవు కదా...
రిషి: ఏంటి రిప్లై ఇవ్వడం లేదనుకుంటూ మరో మెసేజ్ చేస్తాడు....
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదో డౌట్ అడిగి ఉంటారు చెప్పు అంటూ సెటైర్ వేస్తుంది జగతి
రిషి: హలో ఏంటి సైలెంట్ అయ్యావ్....
జగతి: ఇద్దరూ తోడు దొంగలే...ఎవ్వరూ బయటపడరు..గొడవ పడతారు మళ్లీ ఈ చాటింగ్ ఏంటో..వీళ్లిద్దరిలో ఎవర్ని కదిలిస్తే మనసులో మాట బయటపెడతారో ఇప్పటికీ అర్థంకావడం లేదు... గుడ్ నైట్ వసు అంటూ నవ్వుకుంటుంది జగతి...
కాలేజీలో
ఫోన్ చూసుకుంటూ నడుస్తుంటాడురిషి. ఇంతలో మహేంద్ర-జగతి కలసి కార్లోంచి దిగుతారు. వెంటనే మహేంద్ర రిషి దగ్గరకు వస్తాడు.
రిషి: మీరే డ్రైవ్ చేయొచ్చు కదా దర్జాగా కూర్చుంటే ఎలా
మహేంద్ర: నేను చేస్తానన్నాను..ఆరోగ్యం బాగాలేదని జగతి వద్దంది...
రిషి: ప్రేమ అంటే దగ్గరగా ఉండడం దూరంగా వెళ్లడం కాదు
మహేంద్ర: నేను తన దగ్గరగా వెళ్లాను...నీకు దూరంగా ఉన్నాను... రాత్రి నిన్నుచూశాను రిషి...
రిషి: నేను కూడా మిమ్మల్ని చూశాను...
చూస్తే పలకరించొచ్చు కదా అని ఇద్దరూ అనుకుంటారు....నీకు కావాల్సిన వాళ్లకోసం వచ్చావ్ కదా అన్న మహేంద్రతో...
రిషి: మీరెంత దూరం వెళ్లినా నా మనసు మీ నీడలా మీ వెంటే ఉంటుందని అంటాడు రిషి. అది మీకు అర్థమైతే చాలు..సంతోషం అంటే చాలామంది చాలా రకాలుగా చెబుతారు. మనకి ఇష్టమైన వాళ్లు సంతోషంగా ఉండటమే సంతోషం అని ఈ మధ్యే చదివాను. దూరాలను మీటర్లు, కిలోమీటర్లలో కొలిచే ఈ రోజుల్లో మనసుల మధ్య దూరాన్ని కొలతల్లో చెప్పడం కష్టం డాడ్.. మీ ఆరోగ్యం జాగ్రత్త...
Also Read: నడిరేయిలో నీవు నిదురైన రానీవు- అర్థరాత్రి ముసుగేసుకుని మరీ రిషిసార్ తో వసుధార చాటింగ్
క్లాస్ రూమ్ లో...
పుష్ప నోట్ బుక్ తీసి బయటపెట్టు..నిన్నో-నన్నో నోట్ బుక్ అడుగుతారు అంటుంది. నోట్ బుక్ నిన్నే అడుగుతారు పుష్ప అంటుంది వసుధార. మనుషుల్ని చదవడంలో నేను నంబర్ వన్ అంటుంది. ఇంతలో స్పందించిన రిషి..అంజలి నోట్ బుక్ ఇవ్వు అంటాడు. రిషి బోర్డుపై ఏదో రాస్తుంటే...ఈ చాప్టర్ అయిపోయింది కదా మళ్లీ చెబుతున్నారేంటి అనుకుంటూ... లేచి నిలబడి అడిగేస్తుంది వసుధార... మళ్లీ చెప్పడంలో తప్పేముందని పుష్ప చెప్పిన ఆన్సర్ చెబుతాడు రిషి. ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మా ఆయన మా అబ్బాయిని మిస్సవుతున్నారు..తను ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదని చెప్పి ట్యాబ్లెట్స్ కవర్ రిషి ముందు పెట్టి వెళ్లిపోతుంది జగతి. ఆ తర్వాత కార్లో వెళుతున్న జగతి-వసుధార... మహేంద్ర సార్ ని రిషి సార్ ఎక్కడికి తీసుకెళుతున్నారు, ఆయనకి ఇష్టం లేకుండా రిషి సార్ ఇంటికి తీసుకువెళ్లలేరు కదా అంటుంది... జగతి నుంచి ఎలాంటి సమాధానం రాదు...