అన్వేషించండి

Guppedantha Manasu ఏప్రిల్ 4 ఎపిసోడ్: నడిరేయిలో నీవు నిదురైన రానీవు- అర్థరాత్రి ముసుగేసుకుని మరీ రిషిసార్ తో వసుధార చాటింగ్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 4 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 4 సోమవారం ఎపిసోడ్

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీటింగ్ ఎగ్గొట్టిన రిషి...తన క్యాబిన్లో కూర్చుని చెస్ ఆడుకుంటాడు. ఏంటో రెండువైపులా రిషి సార్ ఆడుకుంటున్నారు..ఈయన మూడ్ బావున్నట్టా లేనట్టా అనుకుంటూ లోపలకు అడుగుతుంది.
రిషి: నువ్వేంటి ఏదైనా రాజీనామా చేస్తావా ఏంటి... 
వసుధార: నాకేం పోస్ట్ ఉందని రాజీనామా చేస్తాను
రిషి: అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా
వసుధార: నేను మీకు అసిస్టెంట్ నా, జగతిమేడంకి అసిస్టెంట్ నో అర్థంకావడం లేదు
రిషి: కొన్ని క్లారిటీ రాకపోతేనే బావుంటుంది, చెస్ ఆడుదాం రా...నీకు రాదని అనుకోవడం లేదు
వసుధార: రాదు అని చెప్పనుకానీ...మీలా రెండువైపులా ఆడేంత రాదు
రిషి: అందరూ వదిలివెళ్లిపోతే ఒంటరిగా ఏం చేస్తా చెప్పు అందుకే రెండువైపులా ఆడుతున్నా
వసుధార: మీరు ఓడిపోతే నేను చెప్పిన ఓ మాట వినాలి...
రిషి: ఈ ఆటనలో వసుధారని ఓడించడం ఈజీకానీ కావాలని ఓడిపోయి చూద్దాం ఏం అడుగుతుందో...
వసుధార: నేనే గెలిచాను...మీపై గెలుస్తానని అనుకోవడం లేదు...
రిషి: ఏదో అడిగావ్ కదా ఏం కావాలో చెప్పు....
వసుధార: ఈ పేపర్స్ మేడం మిమ్మల్ని చూడమన్నారు...ఇవి చూడండి చాలు...
రిషి: అనవసరంగా ఆప్షన్ వేస్ట్ చేసుకుంటున్నావ్...
వసుధార: పర్వాలేదు సార్...
రిషి: దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే..కంట్లో నలుసు పడింది తీసిపో అన్నారట నీలాంటి వాళ్లు...గెలుపుని వాడుకోలేదు
వసుధార: అవకాశాన్ని వాడుకోపోవడమే గొప్పతనం...మీరు కావాలనే ఓడిపోయారని నాకు తెలుసు..ఈ ప్రొపొజల్ పై మీ అభిప్రాయం ఏంటి...
రిషి: ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా నియమించాను...బాధ్యత వాళ్లకి అప్పగించాక నేను జోక్యం చేసుకోవద్దు అనుకున్నా...
వసుధార: మీకు చూపించాకే ఏదైనా ఫైనల్ అని మేడం అనుకుంటున్నారు...ఇది మేడంకి మీపై ఉన్న గౌరవం
రిషి: మీ మేడం గొప్పతనం చెప్పే తీరక నీకుంది కానీ వినే ఓపిక నాకు లేదు, జీవితం కూడా చెస్ లాంటిదే..ఎవరి ఎత్తుగడలు వారివి, గెలుపా-ఓటమా అనే కానీ మంచి చెడులు ఎవ్వరూ చూడరు..

Also Read: డాక్టర్ సాబ్-రౌడీ బేబి, ఫొటో గ్రాఫర్-డాక్టరమ్మ, జోరందుకుంటున్న ప్రేమకథలు
రెస్టారెంట్లో డ్యూటీ చేసుకుంటున్న వసుధార పదే పదే ఎంట్రన్స్ వైపు చూస్తుంటుంది...రిషి సార్ వస్తారనుకున్నాను రాలేదేంటి అనుకుంటుంది. వస్తారనుకుంటే రారు ...రారు అనుకుంటే వస్తారు...నిజంగానే రాకపోతే ఎలా...ఓసారి ధరణి గారికి కాల్ చేద్దాం అనుకుని డయల్ చేస్తుంది. ఆ కాల్ ని దేవయాని రిసీవ్ చేసుకుంటుంది. 
దేవయాని: ధరణి మేడం బిజీగా ఉన్నారు చెప్పండి వసుధార మేడం
వసుధార: ఓసారి ఫోన్ ధరణి మేడంకి ఫోన్ ఇవ్వండి..మాట్లాడాలి
దేవయాని: ధరణి మేడంకి నేను అసిస్టెంట్ ని కాదు...
వసుధార: వెళ్లి ఆవిడకు ఫోన్ ఇవ్వండి...
దేవయాని: ఏం పనిలేదా...
వసుధార: పని ఉండే కాల్ చేశాను.. రిషి సార్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది అందుకే ధరణి మేడంకి కాల్ చేశాను
దేవయాని: ఇంకోసారి ధరణికి కాల్ చేయకు...పొద్దున్న నుంచీ కాలేజీలోనే ఉంటారుకదా... మళ్లీ రిషికి కాల్ చేయడం అవసరమా
వసుధార: మహా అవసరం...అత్యవసరం... 
దేవయాని: ఏంటో అది..
వసుధార: అవన్నీ మీకెందుకులెండి... ఆయన మా బాస్, నేను ఆయన స్టూడెంట్ ని
దేవయాని: చిన్నా పెద్దా మంచి మర్యాద లేకుండా మాట్లాడతావ్
వసుధార: మీరంటే గౌరవం ఉంది... ఇంక మంచి చెడు అంటారా... ఇతరుల పర్మిషన్ లేకుండా ఫోన్ తీయడం తప్పు అది మీకు తెలియదని కాదు...ధరణిపై ప్రేమతో కాల్ లిఫ్ట్ చేసి ఉంటారు...
దేవయాని: వసుధారకి బుద్ధి చెప్పాలి.... అందరికీ అలుసైపోయాను...చెప్తాను అందరి సంగతి చెబుతాను....

Also Read: వసుధారకు ముద్దుపెట్టేసిన రిషి, మ్యాథ్స్‌ సార్‌ షాక్‌లు మామూలుగా లేవు
దూరం నుంచి ఇదంతా విన్న రిషి సైలెంట్ గా అక్కడి నుంచి నేరుగా రెస్టారెంట్ కి వెళతాడు.
రిషి: ఏదో మాట్లాడాలి అన్నావ్
వసుధార:  రెస్టారెంట్ క్లోజ్ అయ్యాక వచ్చారు..ఇప్పుడేం మాట్లాడతాను
రిషి: మనసుంటే మార్గాలుంటాయ్...ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు
వసుధార: మనసనేది ఉంటే కదా
రిషి: నీకు నాతో మాట్లాడాలని ఉంటే నాకు కాల్ చేయాలి...వరుస పెట్టి ఇంట్లోవాళ్లకి కాల్ చేయడం ఎందుకు
వసుధార: ఫస్ట్ మీకే కాల్ చేశాను...ఆ తర్వాతే ధరణి గారికి కాల్ చేశాను
రిషి: పెద్దమ్మ నిన్ను ఏదో అంటుంది..నువ్ హర్టవుతావ్... పెద్దమ్మ అన్న మాటలకు నువ్వు ఫీలయ్యావా
వసుధార: మన అనుకుంటే కోపం రాదు... పరాయివాళ్లు అనుకుంటే కోపం వస్తుంది..
రిషి: మన పర అని కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి..
వసుధార: మనవాళ్లు అనుకుంటే తప్పేంటి.. అపార్థం చేసుకుంటే తప్పేంటి...
రిషి: (ఆటోని పిలిచి ఎక్కమని చెబితే... తిరిగి పంపించేస్తుంది వసుధార) ఇప్పుడెలా వెళతావ్
వసుధార: మా ఎండీగారి కారుంది..లిఫ్ట్ ఇస్తారు...
రిషి: మీ ఎండీగారు కోపంగా ఉన్నారు కదా...
వసుధార: నేను భరిస్తాను
రిషి: నీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువైంది వసుధార...
వసుధార: ధైర్యం కాదు దాన్ని నమ్మకం అంటారు...

వదినా మీకేమైనా పని చేయాలంటే హెల్ప్ చేస్తానంటాడు గౌతమ్. గిన్నెలు కడిగే పనితప్ప ఇంకేంలేదని ధరణి అంటే..అదేనా చేస్తాను అంటాడు గౌతమ్. ఇంతకీ ఏంటి గౌతమ్ అని ధరణి అడిగితే..
గౌతమ్: రిషి ఎక్కడికి వెళ్లాడు..
ధరణి: ఇంట్లో ఏదో ఆలోచిస్తూ ఉండేకన్నా బయటకు వెళ్లడమే మంచిది
గౌతమ్: రిషి అంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, తప్పుచేసినా ఒప్పు అంటారు వాడిని బాగా కవర్ చేస్తారు
ధరణి: అర్థం చేసుకుంటే రిషి అద్దం లాంటోడు...అందరూ రిషి కోపం గురించి రిషి మూడ్ గురించి మాట్లాడతాడు... తను ఎవర్నీ ఏ మాటా అనడు
గౌతమ్: రిషి అద్దం లాంటోడని మీరోమాట అన్నారు..ఇంక నేనేం మాట్లాడతాను
ధరణి: భోజనం చేస్తావా....
గౌతమ్: వాడొచ్చే వరకూ వెయిట్ చేస్తాను... ఇంతకీ ఎక్కడికి వెళ్లాడు వదినా...
ధరణి: తనకి ఎన్నో పనులుంటాయ్..మనకెందుకు చెప్పండి....
దేవయాని: పక్కనుంచి గౌతమ్-ధరణి డిస్కషన్ విన్నాక... ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్లి ఉంటాడు...ఇప్పుడు నేను టార్గెట్ చేయాల్సింది కచ్చితంగా వసుధారనే అనుకుంటుంది...

రోడ్డుపక్కన కారు ఆపి దిగమంటాడు రిషి...
రిషి: అందమైన ఆకాశం, చీకటి బావున్నాయి కదా...నాతో మాట్లాడేందుకు ప్రిపేర్ అయి వచ్చిఉంటావ్ కదా..
వసుధార: నేను ఏదీ ముందుగా అనుకోను సార్...
రిషి: అనుకోపోతేనే అలా మాట్లాడతావ్...అయినా మనిద్దరి అభిప్రాయాలు ఎందుకు కలవవ్
వసుధార: ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు
రిషి: నువ్వేం మాట్లాడటం లేదుకదా..అందుకే మాట్లాడుతున్నాను
వసుధార: అభిప్రాయాలు కలవడం కాదు...ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడంలోనే గొప్పతనం ఉంది
రిషి: నువ్వేం చెప్పినా అందంగా చెబుతావ్..ఇన్ డైరెక్ట్ గా ఎందుకు..డైరెక్ట్ గా చెప్పు
వసుధార: చెప్పాకా...కాదనకూడదు
రిషి: నన్ను ఇరకాటంలో పెట్టకుండా చెప్పు

రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
ముసుగేసుకుని రిషితో చాటింగ్ చేస్తుంటుంది వసుధార.  గమనించిన జగతి..ముసుగేసుకుని ఎందుకు మామూలుగానే చాటింగ్ చేయొచ్చుకదా... అవునులే మా రోజుల్లో ఇవన్నీ లేవులే అంటుంది. వసుధార ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఏంటి సైలెంట్ గా ఉన్నావని రిషి మెసేజ్ చేయడంతో... తొందరగా రిప్లై ఇవ్వు అంటుంది జగతి..అయోమయంలో పడుతుంది వసుధార...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget