Guppedantha Manasu ఏప్రిల్ 2 ఎపిసోడ్: వసుధారకు ముద్దుపెట్టేసిన రిషి, మ్యాథ్స్‌ సార్‌ షాక్‌లు మామూలుగా లేవు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. ఏప్రిల్ 2 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారంటూ రిషికి థ్యాంక్స్ చెప్పిన వసుధార...చేయపట్టుకుని లాక్కెళ్లి మరీ హోలీ ఆడిస్తుంది. రంగులు చల్లుకుంటూ హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు రిషి-వసుధార. 
రిషి: నిజంగా అంతా ఓ మాయ జరిగినట్టుంది కదా
వసుధార: మీకు కోపం వచ్చింది కదా
రిషి: మొదట కోపం వచ్చింది... ఆ తర్వాత ఆశ్చర్యం వేసింది..ఇప్పుడు ఆనందంగా ఉంది.  ఈ రంగుల్లో ఇంత మాయ ఉందా.. ఇన్నేళ్లుగా హోలీ చూస్తూనే ఉన్నాను కానీ ఇంతలా ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి. మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలు ఎగిరిపోయాయి..చాలా సంతోషంగా ఉన్నాను... 
వసుధార: మనిషికి జబ్బు చేస్తే మందులుంటాయ్...మనసుకి జబ్బు చేస్తే ఆనందమే మందు. ఈ పండుగలన్నీ అందర్నీ కలపి ఉంచేందుకే పెట్టారేమో సార్...
రిషి: ఈ రంగులు ఈ కొత్తఅవతారం నాకు నేనే సరికొత్తగా అనిపిస్తున్నాను
వసుధార: మీతో హోళీ ఆడినందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది..
రిషి: ఇవన్నీ ఎందుకు చేశావ్...
వసుధార: తెలిసి కూడా అలా అడుగుతావ్ ఏంటి..మీ ఆనందం కోసమే కదా...
రిషి: కాలేజీ ఎండీని అనేనా...
వసుధార: సూటిగా అడిగారు కాబట్ట నిజాయితీగా సమాధానం చెబుతున్నా...మా ఎండీగారి ఆనందం కోసం అని అంటుంది..
రిషి: నమ్మోచ్చా...
వసుధార: నేను చెప్పేది చెప్పాను మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం...ఈ గెటప్ లు బావున్నాయ్ ఓ సెల్ఫీ తీసుకుందామా... ఆలోచనలో పడిన రిషిని చూసి వద్దంటే వద్దులెండి...
రిషి: ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావ్...
వసుధార: మీరు కాదనరు అనే అనుకుంటున్నా...
రిషి: నువ్వు ఇలా అనుకుంటావని నాకు తెలుసు అంటూ...సెల్ఫీ తీస్తాడు....
అక్కడినుంచి ఇద్దరూ బయలుదేరుతారు...

Also Read: తండ్రి కార్తీక్ ని మోనిత మోసం చేసిందని తెలుసుకున్న హిమ,శౌర్య- తమ్ముడు ఆనంద్ పై ఒకరికి ప్రేమ మరొకరికి పగ
దేవయాని ఇంట్లో కూర్చుని కాలేజీలో జరిగిన విషయాన్నే తలుచుకుంటూ రగిలిపోతుంటుంది....ఫణీంద్ర మాత్రం అవేమీ పట్టనట్టు పుస్తకం చదువుకుంటూ ఉంటాడు.  ఆ బుక్ విసికొట్టేసిన దేవయాని ఇక్కడ నా కడుపు మండిపోతుంటే మీరు అలా చూస్తూ కూర్చుంటారా... 
ఫణీంద్ర: అంతలా నువ్వు బాధపడేలా ఏం జరిగింది..
దేవయాని: జగతి గౌరవం పెరిగింది..రిషిగౌరవం తగ్గింది... మిషన్ ఎడ్యుకేషన్ మొత్తం జగతి చేతికి వెళ్లిపోయింది...
ఫణీంద్ర: ఆగు ఓసారి ఇది విను అని కాల్ చేస్తాడు ఫణీంద్ర... కాలేజీ గొప్పతనాన్ని అందరూ అభినందిస్తుంటే..నువ్వేమో పరువు పోయిందని అంటున్నావ్... చూశావు కదా ఇప్పటికైనా నమ్ముతావా..
దేవయాని: రిషిని పొగడగానే కాదు..జగతికే పేరొచ్చింది.... అయినా రిషి ఎలా వస్తాడో ఏ పరిస్థితుల్లో వస్తాడో అని యాక్షన్ చేస్తుంటుంది...

హోలీ ఆడిన రంగులతో రిషి ఎంట్రీ ఇస్తాడు....అది చూసి దేవయాని షాక్ అయితే... ఫణీంధ్ర సంతోషంగా చూస్తుంటాడు. రిషి ఏదో చెప్పబోతుంటే... నాకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా హోలీ ఆడుకున్నావ్ అంటాడు ఫణీంద్ర. హ్యాపీ హోలీ అనే చెప్పేసి వెళ్లిపోతాడు. 
ఫణీంద్ర: బాధపడతాడు అన్నావ్ హ్యాపీగా హోలీ ఆడి వచ్చాడు...
దేవయాని: బస్తీలో హోలీ ఆడడం ఏంటి
ఫణీంద్ర: ఇందులో ఇంకో తప్పు తీసి మాట్లాడకు..రిషి హ్యాపీగా ఉన్నాడు చాలు...
 
గౌతమ్:  రూమ్ లోపలకు వెళ్లిన రిషిని చూసి గౌతమ్ షాక్ అవుతాడు. నువ్వు హోలీ ఆడావా...ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టున్నావ్...నేను నీ ఫ్రెండ్ కదా నన్ను పిలవొచ్చు కదా... నీకు రంగులు పూసి నీతో క్లోజ్ గా హోలీ ఆడేంత క్లోజ్ ఫ్రెండ్ ఈ భూమ్మీద ఎవరున్నారు ...చెప్పరా ఎవరితో హోలీ ఆడావ్...
రిషి: వసుధారతో ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తుచేసుకుంటూ ఆనందంగా తన ఒంటిపై ఉన్న రంగు తీసి గౌతమ్ కి బొట్టులా పెట్టేసి వెళ్లిపోతాడు 

Also Read: కొత్తకొత్తగా ఉన్నది, ప్రేమ రంగుల్లో తడిసిముద్దైన రిషి-వసుధార
అటు వసుధార కూడా హోలీ ఆడిన క్షణాలు గుర్తుచేసుకుని మురిసిపోతుంటుంది. హ్యీపీ కలర్ ఫుల్ హోలీ రిషిసార్ అంటుంది..అక్కడ రిషి కూడా అవే ఆలోచనల్లో ఉంటాడు.  పండుగకు సంబంధఇంచి ఏవేవో చెబుతుంటారు కానీ పండుగ ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది...థ్యాంక్స్ వసుధార హ్యాపీ హోలీ అంటాడు. అదే సమయానికి హ్యాపీ హోలీ రిషి సార్ అని మెసేజ్ చేస్తుంది. సేమ్ టూయూ అని రిప్లై ఇస్తాడు రిషి. మాట్లాడొచ్చా అని వసు మెసేజ్ చేస్తే నో అని రిప్లై ఇస్తాడు. ఇంతలోనే కాల్ చేస్తాడు...( మాట్లాడొచ్చా అంటే నో అని చెప్పి సార్ కాల్ చేస్తున్నారేంటి అనుకుంటుంది) కాల్ లిఫ్ట్ చేస్తుంది. భోజనం చేశారా అని వసు అడిగితే మనసు నిండిపోయింది ఆకలిగా లేదు... హోలీ సందడితో రంగులతో కడుపునిండిపోయిందంటాడు. హోలీ గురించి కవిత్వం స్టార్ట్ చేస్తుంది...ఏంటి మొదలెట్టావా అన్న రిషి బావుంది. హోలీ రంగుల్లో మనకు మనమే కొత్తగా కనిపిస్తుంటాం.... ఇంకా ఏంటి సార్ అని వసు అంటే చాలా ఉంది చెప్పడానికి అంటూ గుడ్ నైట్ అంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత కూడా అవే ఊహల్లో తేలియాడతారు....

కాలేజీలో:
ఈ రోజు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో ఏఏ విషయాలు చర్చించుకుంటున్నాం అని లెక్చరర్లు  అంటే రిషి సార్ వచ్చాక చూసుకుంటారంటుంది వసుధార. అయినా రిషి  సార్ కి ఏంటి సంబంధం... విద్యాశాఖకి అప్పగించారు కదా అని అంటే.. జగతి మేడం చెట్టైతే...రిషి సార్ వేర్లు లాంటివారు...ఈ ప్రాజెక్ట్ కి రిషి సార్ అవసరం అని క్లారిటీ ఇస్తుంది వసుధార. ఇదంతా విన్న రిషి...రూమ్ లోపలకు వెళ్లకుండా వెళ్లిపోతాడు. బయటనుంచి వస్తోన్న మహేంద్ర....రిషి రా మీటింగ్ కి అని అడిగితే... నా పెత్తనం అవసరం లేదు అనిపిస్తోంది మీరు వెళ్లి చూసుకోండని చెప్పేసి వెళ్లిపోతాడు.  ఇంతలో ఎదురుపడిన జగతి గుడ్ మార్నింగ్ చెప్పగా..గుడ్ మార్నింగ్ అని తిరిగి చెప్పేసి వెళ్లిపోతాడు. మీటింగ్ మొదలుపెడదామా అని మహేంద్ర అంటే...రిషి సార్ రావాలి కదా అని జగతి అంటుంది. మీటింగ్ కి రానని నాతో చెప్పారని మహేంద్ర అనడంతో...ఏం జరిగి ఉంటుందని ఆలోచనలో పడతారు జగతి, వసుధార....ఈ మీటింగ్ లో జరిగిన పాయింట్స్ నోట్ చేసి రిషిసార్ కి మెయిల్ పెట్టు అంటుంది జగతి. ఇందాక లెక్చరర్ మాటలేమైనా విన్నారా అనుకుంటుంది...

సోమవారం ఎపిసోడ్ లో
చెస్ ఆడుదామా...నీకు రాకుండా ఉంటుందా అంటాడు రిషి. ఊరికే ఆడితే కిక్కేంటి సార్ అంటుంది వసుధార. కావాలని ఓడిపోయి చూద్దాం ఏం అడుగుతుందో అనుకుంటాడు.  రానున్న ఎపిసోడ్ మరింత రొమాంటిక్ గా ఉండబోతోందని మాత్రం అర్థమవుతోంది. 

Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 2st April Episode 414

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!

Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!

Karthika Deepam మే 16 ఎపిసోడ్: జ్వాల కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన హిమ- డాక్టర్‌సాబ్‌ బ్రెయిన్ వాష్ చేస్తున్న స్వప్న

Karthika Deepam మే 16 ఎపిసోడ్: జ్వాల కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన హిమ- డాక్టర్‌సాబ్‌ బ్రెయిన్ వాష్ చేస్తున్న స్వప్న

Guppedantha Manasu మే 16 ఎపిసోడ్: వసుధార బుక్‌లో ప్రేమ లేఖ చూసి రిషి సీరియస్‌- ఇంట్లో పంచాయితీ పెట్టిన సాక్షి

Guppedantha Manasu మే 16 ఎపిసోడ్: వసుధార బుక్‌లో ప్రేమ లేఖ చూసి రిషి సీరియస్‌- ఇంట్లో పంచాయితీ పెట్టిన సాక్షి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం