Guppedantha Manasu ఎప్రిల్ 1 ఎపిసోడ్: కొత్తకొత్తగా ఉన్నది, ప్రేమ రంగుల్లో తడిసిముద్దైన రిషి-వసుధార
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. ఏప్రిల్ 1 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంత మనసు (Guppedantha Manasu) ఏప్రిల్ 1 శుక్రవారం ఎపిసోడ్
కాలేజీలో జగతి మళ్లీ అడుగుపెట్టడం చూసి రగిలిపోతుంది దేవయాని. తనలో మంచితనం వీళ్లకి ఎలా కనపడుతోందో నాకు అర్థంకాలేదు...ఇది నీ తప్పు అనడం లేదు, నా పెంపకంలోనే లోపం ఉందేమో, నాదే తప్పేమో అని దొంగ ఏడుపు ఏడుస్తుంటుంది.
రిషి: మీరు దయచేసి ఇలా మాట్లాడకండి, మీ పెంపకంలో లోపం లేదు..కానీ నేను చెప్పినదాంట్లో న్యాయం ఉంది..డీబీఎస్టీ కాలేజీ పరువు కోసం తనని తీసుకున్నాను, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ కోసమే తనని తీసుకున్నాను, నా దృష్టిలో తను కేవలం జగతి మేడం మాత్రమే...మీరు అనుకున్నట్టు నేను మారలేదు..మారను కూడా...బాధ వేరు-బాధ్యత వేరు పెద్దమ్మా, కాలేజీ నా బాధ్యత- మీరు చెప్పేది నా వ్యక్తిగత బాధ...
ఫణీంద్ర: ఓ వ్యక్తికోసం ఓ వ్యవస్థని, ఓ సంకల్పాన్ని దెబ్బతీయకుండా బాగా ఆలోచించావ్... డీబీఎస్టీ కాలేజీకి పేరు తెచ్చిన ప్రాజెక్ట్ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నావ్. మా నాన్నగారు స్థాపించిన ఈ కాలేజీని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు రిషి...దేవయానీ ఇలాంటి టైమ్ లో ఇలాంటివి ఆలోచించకు
అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతున్న దేవయానిని ఆపేందుకు రిషి ప్రయత్నించగా...అడ్డుపడిన ఫణీంద్ర నేను చూసుకుంటాలే అంటాడు....
Also Read: మోనిత కొడుకు ఆనంద్ ఎంట్రీకి టైమొచ్చిందా, హిమ మాటలు విన్న శౌర్య ఏం చేయబోతోంది
రిషి సార్ మంచి నిర్ణయం తీసుకున్నారని వసుధార అంటే...ఇలాంటి టైమ్ లో ఓ చిన్న పార్టీ చేసుకుందాం అంటాడు గౌతమ్. స్వీట్ పార్టీ అయితే బెస్ట్ అని వసుధార అంటుంది. మురిసిపోయిన గౌతమ్... మొత్తానికి వసుని పార్టీకి ఒప్పించావ్ ఎక్కడికి వెళదాం ఇప్పుడు అనుకుంటాడు. ఇంతలో బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసి చేతిలో పెట్టి ఇదే పార్టీ అని షాక్ ఇస్తుంది వసుధార.
గౌతమ్: పార్టీ అంటే ఇదా... చాలా ఆలోచించాను... బైక్ పై అలా అలా వెళ్లి....
వసుధార: ఇంకో చాక్లెట్ ఇమ్మంటారా
గౌతమ్: అమ్మో వద్దులే ఈ చాక్లెట్ తో మనసు నిండిపోయింది... పోనీలే...పార్టీపోతే పోయింది వసుధారని బైక్ పై ఇంట్లో డ్రాప్ చేస్తాను అనుకుంటాడు...
వీళ్లని చూసి కుళ్లుకున్న రిషి.... పెద్దమ్మ, పెదనాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని మెసేజ్ పంపిస్తాడు... అది చూసి గౌతమ్ మనసులోనే ఫీలవుతాడు...
మరోవైపు మెట్లపైనుంచి కిందకు దిగుతూ..ప్రాజెక్ట్ రద్దు చేసినప్పటి నుంచీ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుచేసుకుంటాడు. బయటకు వచ్చిన రిషిని సార్ అని పిలుస్తుంది....
రిషి: నువ్వేంటి ఇక్కడ
వసుధార: మీతో మాట్లాడేందుకు ఇక్కడ ఆగాను
రిషి: మాట్లాడేందుకు ఇంకేముంది...అంతా హ్యాపీ కదా
వసుధార: మీరు గ్రేట్ నిర్ణయం తీసుకున్నారు సార్..మీరు జెంటిల్మెన్ సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది...
రిషి: ఇప్పుడు అలాగే అంటావ్..ప్రాజెక్ట్ రద్దు చేసిన విషయం తెలియగానే ఎన్ని మాటలన్నావో ...
వసుధార: మీ మనసులో ఏముందో నాకేం తెలుసు
రిషి: నా మనసులో ఏముందో ఎవ్వరూ అర్థం చేసుకోరు..... నువ్వు, డాడ్, చివరకి మినిస్టర్ గారు కూడా అలాగే అర్థం చేసుకున్నారు..నన్ను రాక్షసుడిగా ఎందుకు ముద్రవేసుకున్నారు, నలుగురికి ఉపయోగపడే ప్రాజెక్ట్ రద్దు చేస్తే నాకేం వస్తుంది... మనం అభిప్రాయాలు మార్చుకోవచ్చు కానీ ఎదుటివారి అభిప్రాయాలు మార్చుకోమని చెప్పే హక్కు ఉండదు..
వసుధార: మీ గొప్పతనం ఏంటో ఇప్పుడు తెలిసింది కదా...
రిషి: పదిసార్లు తిట్టి పదకొండోసారి చప్పట్లు కొడితే సరిపోదు కదా... సరే..నువ్వెళ్లు...
వసుధార: ఎక్కడికి వెళుతున్నారు సార్....
రిషి: ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్....
వెనుకే వెళ్లి రిషి చేయిపట్టుకున్న వసుధార ఈ రోజు మీరు నాతోపాటూ రావాల్సిందే అని చేయిపట్టి తీసుకెళుతుంటుంది. వద్దంటూనే వసుని అనుసరిస్తాడు రిషి. ముందు మీరు కారెక్కండి సార్ చెబుతాను అంటుంది.
Also Read: అప్పుడే అపరిచితుడు అంతలోనే రెమో, వసు ప్రేమలో మునిగిపోయిన రిషి
మరోవైపు మహేంద్ర....జగతి కార్లో వెళుతుంటారు
మహేంద్ర: ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది పెద్ద తుఫాన్ వెలిసింది కదా..మొత్తానికి సమస్య శాంతియుతంగా పరిష్కారమైంది. నువ్వు ఏం మాట్లాడటం లేదేంటి.. నీకు సంతోషంగా లేదా..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంటే నీకు ఇష్టం లేదా....
జగతి: కార్లోంచి కిందకు దిగి...మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం కానీ రిషి అంటే ప్రాణం.... తుపాన్ వెలిసిందని నువ్వంటున్నావ్ కానీ రిషి మనసులో ఎంత తుపాన్ ఉందో కదా...
మహేంద్ర: ప్రాజెక్ట్ ను ప్రభుత్వానికి అంకితం చేశాడు..ఇది ఆనందపడే విషయమే కదా
జగతి: ఇది ప్రాజెక్ట్ గెలుపే కానీ రిషి తల్లిగా నా ఓటమి...
మహేంద్ర: ప్రాజెక్ట్ విషయంలో మంచే జరిగింది కదా
జగతి: నీకు ఇప్పటికీ అర్థంకాలేదు...
మహేంద్ర: వ్యక్తిగత కోపంతోనో, మరో కారణంతోనో రిషి అప్పుడప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు..అంతమాత్రాన ప్రతిదానికీ నువ్వు ఇలా బాదఫడితే ఎలా...ఎప్పుడూ తల్లిలానే కాదు అప్పుడప్పుడు లెక్చరర్ గా ఆలోచించు..రిషి నీ కొడుకు కాదు, స్టూడెంట్ అనుకో ...కొన్ని పరీక్షలు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే కానీ అర్థంకాదు... రిషి బాధపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావ్, తనని తాను తెలుసుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను....
రిషి-వసు: కారుని ఓ గ్రౌండ్ లో ఆపించిన వసుధార... కిందకు దిగి గట్టిగా ఓ విజిల్ వేస్తుంది. హోలీ సందడి మొదలైంది. చేతుల్లోకి రంగులు తీసుకున్న వసుధార హ్యాపీ హోలీ అంటూ రిషి ముఖానికి రాస్తుంది. వసుని వెంటబెట్టి మరీ రంగులు చల్లుతాడు రిషి.. ( హోలీ సాంగ్ లో ఈ సీన్ మొత్తం కలర్ ఫుల్ గా సాగింది).
రేపటి (శనివారం ఎపిసోడ్ లో)
శనివారం ఎపిసోడ్ లో కూడా హోలీ సందడే సందడి. ఈ రంగులు,కొత్త అవతారంతో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అంటాడు రిషి. నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ అన్న వసుధార... ఓ సెల్ఫీ తీసుకుందామా అని అడిగితే రిషి వెంటనే ఫొటో తీస్తాడు....