IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Guppedantha Manasu మార్చి 31 ఎపిసోడ్: అప్పుడే అపరిచితుడు అంతలోనే రెమో, వసు ప్రేమలో మునిగిపోయిన రిషి

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 31గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 31 గురువారం ఎపిసోడ్

జగతి ఇంట్లో:
కాలేజీలో జరిగిన గందరగోళం గుర్తుచేసుకుంటూ కూర్చుంటారు జగతి-మహేంద్ర. కాలేజీలో జరిగిన దానిగురించి ఫోన్లో ఏమైనా ఇంటర్యూ ఇవ్వగలరా అంటూ జర్నలిస్ట్ కాల్ చేస్తే...Sorry అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మహేంద్ర. మహేంద్ర దగ్గరకు వచ్చిన జగతితో
మహేంద్ర: ఎక్కడ చూసినా ఇదే టాపిక్...
జగతి: నాక్కూడా చాలా కాల్స్ వచ్చాయ్ మహేంద్ర..రిషి ఏం చేస్తాడంటావ్...
మహేంద్ర: ఎవ్వరి ఆలోచనలకూ అందడు, ఎవ్వరి మాటా వినడు..తనకు అనిపించిందే చేస్తాడు...కాలేజీ ఎండీగా తనకు నచ్చిన నిర్ణయం తీసుకుంటాడు రిషి
జగతి: మనకంటూ బాధ్యత లేదా
మహేంద్ర: మనకు బాధ్యత ఉంది కానీ మనం అడిగినా చెప్పడు, చెప్పినా వినడు..
జగతి: నువ్వు మాత్రం రిషిపై కోపం తెచ్చుకోవద్దు
మహేంద్ర: కోపం తెచ్చుకునే పనులే చేస్తున్నప్పుడు...కోపం తెచ్చుకోకుండా ఎలా ఉంటాను... కాలేజీకి వెళ్లి సన్మానం చేయాలా
జగతి: రేపు నువ్వు కాలేజీకి వెళ్లాలి....
మహేంద్ర: నువ్వు చెప్పాక తప్పుతుందా..కాలేజీకి వెళతాను....

Also Read: తనతో ఉన్నది హిమ అని తెలుసుకున్న జ్వాల(శౌర్య) రియాక్షన్ ఎలా ఉండబోతోంది
కాలేజీలో పెద్ద మీటింగ్ అరెంజ్ చేస్తారు. అసలేం జరుగుతోందని దేవయాని అడిగితే నాకుమాత్రం ఏం తెలుసని అంటాడు ఫణీంద్ర. అటు మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఏంటిదంతా మహేంద్ర గారూ సమస్యను సాల్వ్ చేసుకోమంటే ఇంత దూరం తీసుకొచ్చారేంటని అడుగుతారు. ఇంకా రిషి రాలేదేంటని అంతా డిస్కస్ చేసుకుంటుండగా ఎంట్రీ ఇస్తాడు రిషి....
రిషి: అందరికీ నమస్కారం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి... ( వసుధార వీడేంటి ఇంత సీరియస్ గా కనిపిస్తున్నాడని గౌతమ్ అంటే..నాక్కూడా భయంగా ఉందంటుంది వసుధార)
రిపోర్టర్: మిషన్ ఎడ్యుకేషన్ ఎందుకు ఆపేశారో తెలుసుకోవచ్చా
రిషి: మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తాను, కాలేజీ స్టాఫ్ కి చాలా సందేహాలున్నాయి, స్టూడెంట్స్ లో ఆవేశం కొత్తగా చూస్తున్నాను...అన్నింటికీ అన్ని ప్రశ్నలకీ సమాధానం ఇచ్చేందుకే వచ్చాను.... డీబీఎస్టీ కాలేజీ ఏండీగా నాకున్న అధికారాలను ఉపయోగిస్తూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చేస్తున్నానని మరోసారి అంటాడు ( చుట్టూ ఉన్నవారంతా షాక్ అయితే దేవయాని సంతోషిస్తుంది). ఇకపై మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీబీఎస్టీ కాలేజీ నిర్వహించడం లేదు...ఈ విషయంలో రెండో ఆలోచన లేదు...మిషన్ ఎడ్యుకేషన అనే ఆలోచన చాలా చిన్నగా మొదలైంది.. ఓ నాలుగు గోడల గదిగా కట్టి పైకప్పు వేసి విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ ఇల్లులా మారింది. మిషన్ ఎడ్యుకేషన్ అనే పెంకుటిల్లులో చాలా తక్కువ మందికే ఆశ్రయం ఇస్తున్నాం అందుకే దాన్ని కూల్చివేస్తున్నాను. దాని స్థానంలో ఓ పెద్ద బంగ్లా కట్టాలని నా ఆలోచన....అర్థంకాలేదా.... 

మిషన్ ఎడ్యుకేషన్ ఓ పెంకుటిల్లులా కొంతమందికే ఉపయోగపడుతోంది... దాన్ని కూల్చివేసి ఓ మేడ కట్టి మరెందరికో ఉపయోగపడేలా చేయాలని నా ఆలోచన...డీబీఎస్టీ కాలేజీ అనే ఓ విద్యాసంస్థ నిర్వహిస్తేనే ఇంత గొప్ప పేరు వచ్చినప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను ప్రభుత్వమే తీసుకుని నిర్వహిస్తే ఇంకెంత గొప్ప ఫలితాలు వస్తాయో మీరే ఆలోచించండి...  అందుకే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను డీబీఎస్టీ కాలేజీ ర్దదుచేసుకుని ప్రభుత్వానికి అంకితం చేస్తోంది....( ఈ నిర్ణయం విన్న తర్వాత అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతుంటే దేవయాని ముఖం చిన్నబోతుంది). ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కాలేజీ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళుతుందని చెబుతాడు. హాల్ మొత్తం చప్పట్ల ధ్వనితో నిండిపోతుంది....వేలమందికి ఉపయోగపడేదాన్ని లక్షల మందికి ఉపయోగపడేలా నేను మార్చాలి అనుకుంటున్నాను...ఇది మీరు అర్థం చేసుకోలేదు..

ఈ ప్రాజెక్ట్ ను ఇంకో స్థాయికి తీసుకువెళతాను... ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు... ఒకరు కాలేజీ తరపున ప్రాజెక్ట్ జైరెక్టర్ గా మహేంద్ర భూషణ్ గారు వ్యవహరిస్తారు, రెండో డైరెక్టర్ గా నా మనసులో ఒకరున్నారు...ఆవిడంటే నాకెంతో గౌరవం అంటాడు ( నేనంటే ఎంతో ఇష్టం నాకు డైరెక్టర్ పదవి కట్టబెట్టబోతున్నాడని దేవయాని మురిసిపోతుంది).  ప్రభుత్వానికి-కాలేజీకి అనుసంధానంగా రెండో డైరెక్టర్ గా నేను ప్రకటిస్తున్నాను అంటూ మినిస్టర్ పర్మిషన్ తీసుకుంటాడు రిషి. తనెవరో కాదు అంటూ అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన జగతి మేడం అని అనౌన్స్ చేస్తాడు (దేవయానికి ఇది గట్టి షాకే ). 

Also Read: హోలీ రంగుల రూపంలో వసుపై ప్రేమవెన్నెల కురిపించిన రిషి
రిషి సార్ మీరు సూపర్ అనుకుంటుంది వసుధార.... ( వసు ఏం జరిగిందని జగతి అడిగితే...జరిగిన విషయం మొత్తం చెబుతుంది వసుధార). రిషి నాకు మెసేజ్ పెట్టి అర్జెంట్ గా రమ్మని చెప్పింది ఇందుకా అనుకుంటుంది జగతి. దేవయాని కోపంగా బయటకు వెళ్లిపోతుంది. (జగతిని మళ్లీ కాలేజికి తీసుకొచ్చి తననే గెలిపించావా రిషి...మిమ్మల్ని ఎవ్వర్నీ ప్రశాంతంగా వదలను అనుకుంటుంది దేవయాని).  నా మనసులో మాటని నిజం చేశావ్..నువ్వు అద్భుతంగా ఆలోచించావ్ అని మినిస్టర్ గారు పొగిడేస్తారు. నాకు ఇప్పుడే తెలిసిందని అంటుంది జగతి.  రిషి కంగ్రాట్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు...జగతి సంతోషంగా కొడుకు చేయందుకుంటుంది. ఇప్పుడు అందరి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయ్ అనుకుంటున్నాను అని ఎండ్ చేస్తాడు రిషి....

రిషి క్యాబిన్లో పంచాయితీ పెడుతుంది దేవయాని.... పెద్దమ్మా మాట్లాడండి అని రిషి అంటే...ఏంటి దేవయాని ఇది ఇంటికెళదాం పద అంటాడు ఫణీంద్ర. ఇంటికి-కాలేజీకి పెద్ద తేడా తెలియడం లేదంటూ ఫైర్ అవుతుంది. ఏంటండీ ఇది..జరిగింది మీకు సంతోషాన్నిచ్చిందేమో...ప్రతిభకు పట్టం కట్టినట్టు ఆవిడకు పదవి వచ్చింది...ఆ పదవికి ఆవిడ వన్నె తెస్తుంది..మీరంతా సంతోషించండి.  జరిగింది మీకు నచ్చలేదని నాకు అర్థమైంది...కాలేజీని కాలేజీలా చూడండి అంటాడు. చిన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్లిన జగతి లేదని మీనాన్న, పెదనాన్న బాధపడ్డారు... నిన్ను చూసింది నేనే కదా... అప్పుడు లేని జగతి ఇప్పుడు వచ్చి ఎలా మంచిగా మారిందని ఫైర్ అవుతుంది...  ఎపిసోడ్ ముగిసింది...

రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
రిషి చేయి లాక్కుని థ్యాంక్స్ చెబుతుంది వసుధార...ఏం అవసరం లేదని విసుక్కుని వెళ్లిపోతున్న రిషి చేయి పట్టుకుని  ఈ రోజు మీరు నాతోపాటూ  రావాల్సిందే అంటూ ఓ చోటుకి తీసుకెళుతుంది..రేపటి ఎపిసోడ్ అంతా హోలీ సందడే..కన్నుల పండువే....

Published at : 31 Mar 2022 09:58 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 31st March Episode 412

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Right To Dignity: సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !

Right To Dignity:  సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?

Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?

TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

TTD Darshan Tickets For July, August  : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం