Guppedantha Manasu మార్చి 30 ఎపిసోడ్: హోలీ రంగుల రూపంలో వసుపై ప్రేమవెన్నెల కురిపించిన రిషి

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 30 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 30 బుధవారం ఎపిసోడ్

దేవయాని ఏర్పాటు చేసిన ప్రెస్ రిపోర్టర్ కాలేజీలో పెద్ద దుమారానికి తెరతీస్తాడు. స్టూడెంట్స్ అంతా ఆందోళనకు దిగితే మొత్తం కారణం వసుధారే అని భ్రమపడతాడు రిషి. వసుధారపై కోపంతో రగిలిపోతుంటాడు. ఇంతలో కాలేజీకి వచ్చిన ప్రెస్ వాళ్లు మరింత హడావుడి పెంచుతారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేశారంట కదా అంటూ వరుస కాల్స్ వస్తుంటాయి. రిషిలో ఆవేశం మరింత పెరిగిపోగా... ఇంట్లో దేవయాని కూల్ గా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. అటు మహేంద్ర, జగతి ఇదంతా టీవీలో చూసి కంగారుపడతారు.

జగతి: ఇది రిషికి చాలా చెడ్డపేరు తెస్తుంది, అసలు స్టూడెంట్స్ ఎందుకిలా రియాక్టవుతున్నారో నాకు అర్థంకావడం లేదు
మహేంద్ర:  వాడికి ప్రాజెక్ట్ అవసరం లేదన్నప్పుడు మనమేం చేయగలం 
జగతి: రిషికి ప్రాజెక్ట్ అవసరం లేకపోవచ్చు కానీ మనకు రిషి కావాలి కదా..నువ్వెళ్లు 
మరోవైపు దేవయాని...రిషికి కాల్ చేసి మరింత రెచ్చగొడుతుంది. ఇదంతా కావాలనే ఆ జగతి, వసుధార చేయిస్తున్నారు, ఇప్పటికైనా వాళ్ల నిజస్వరూపం తెలుసుకో నాన్నా అని ప్రేమ ఒలకబోస్తుంది. 
మినిస్టర్: జగతికి కాల్ చేసిన మినిస్టర్..ఏంటమ్మా ఇదంతా అని అడుగుతారు. కాలేజీ పరువు, ప్రాజెక్ట్ పరువు పోతోంది కదా ఏదో ఒకటి త్వరగా చేయండని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
వసుధార: మహేంద్రకి కాల్ చేసి ఇక్కడ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయ్ మీరు త్వరగా రండి సార్

Also Read: రౌడీ అన్న పిలుపుతో తండ్రి డాక్టర్ బాబుని గుర్తుచేసుకుని డాక్టర్ సాబ్ నిరుపమ్ కి పడిపోయిన జ్వాల
రిషి సార్ తో మాట్లాడాలి లాక్ ఓపెన్ చేయండని రిక్వెస్ట్ చేసిన వసుధార క్యాబిన్ కి వెళుతుంది. క్యాబిన్లో వసుధారని చూసి మండిపడతాడు రిషి. చేసిందంతా చేసి ఏం మాట్లాడతావ్ గెటవుట్ అని అరుస్తాడు. వాళ్లతో మాట్లాడండి ప్లీజ్ అంటే...నువ్విక్కడి నుంచి వెళ్లిపో వసుధార అని ఫైర్ అవుతాడు. చేయాల్సిందంతా ప్లాన్ ప్రకారం చేశావ్ అన్న రిషితో...అసలు విషయం చెప్పేందుకు ట్రై చేస్తుంది వసుధార. కానీ అవేమీ పట్టించుకోని రిషి...మీ జగతిమేడం ప్రాజెక్ట్ రద్దుచేశానని నాపై పగతీర్చుకున్నావ్ అంటాడు. నువ్వు ఏం చెప్పినా వినను నువ్వెళ్లు అని అరుస్తాడు.... మీరొచ్చి స్టూడెంట్స్ తో మాట్లాడితే బావుంటుంది వాళ్లు శాంతిస్తారని వసు చెప్పినా రిషి అరుస్తూనే ఉంటాడు.... 

ఫణీంద్ర, మహేంద్ర కాలేజీకి చేరుకుంటారు... ఎదురొచ్చిన వసుధారతో ఏమైందని అడిగితే మీరు వెళ్లండి అని చెబుతుంది. ఏంటి ఇదంతా పద బయటకు వెళ్లి మాట్లాడుదాం అని ఫణీంద్ర, మహేంద్ర రిషిని తీసుకెళతారు. 
మహేంద్ర: డీబీఎస్టీ కాలేజీ పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు...కానీ..ఈ రోజు జరిగిన సంఘటన గురించి మాట్లాడేందుకు వచ్చాం. ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చేందుకే మన కాలేజీ  ఎండీగారు వచ్చారు.
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీబీఎస్టీ కాలేజీ మొదలుపెట్టింది...దీన్ని ఎలా తీసుకెళ్లాలనేది పూర్తిగా మా నిర్ణయం....
రిపోర్టర్: ప్రాజెక్ట్ అందరకీ మంచి చేస్తున్నప్పుడు ఎలా ఆపేస్తారు
రిషి: ఇది మా అంతర్గత వ్యవహారం....దీనిపై ఎవరి ప్రభావం ఉండకూడదు... అందరికీ విద్య ప్రాముఖ్యత తెలిపేందుకే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రూపొందించాం...ఎందరికో స్ఫూర్తిగా నిలిచాం... 
రిపోర్టర్: అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు
రిషి:  విద్యాసంస్థ చదువు చెప్పకుండా ప్రాజెక్ట్ నడిపినప్పుడు ఎవ్వరూ అడగలేదు..ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఆపేస్తే పదే పదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మా కాలేజీకి మాత్రమే సంబంధించిన విషయం అని నా నమ్మకం...దీన్ని ఎందుకో మా స్టూడెంట్స్ అపార్థం చేసుకుంటున్నారు...కాలేజీ ఎండీగా వారి అపార్థాలు తొలగించడం నా బాధ్యత... మొక్క నాటి చెట్టుకొట్టేస్తున్నాం అన్నారు అది మీ ఊహాగానమే నిజం లేదు... మాకున్న వీలుని బట్టి ప్రస్తుతానికి ప్రాజెక్ట్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నాం...దీనికి మా స్టూడెంట్స్ కి స్టాఫ్ కి 24 గంటల్లో నేను సమాధానం చెబుతాను..,.
రిపోర్టర్: ఈ ప్రాజెక్ట్ రూపకర్త అయిన జగతి మేడం ఇక్కడ కనిపించడం లేదు...
రిషి: జగతి మేడం కనిపించకపోవడం పెద్ద సమస్య కాదు కదా
రిపోర్టర్: జగతి మేడంని కాలేజీ నుంచి పంపించారంట కదా... జగతి మేడం ఇక్కడ ఎందుకు లేరు...
ఇంతలో ఎంట్రీ ఇస్తుంది జగతి......
జగతి: నేను లేనని ఏదేదో అంటున్నారు...అనుకుంటున్నారు..నేను ఎక్కడికీ వెళ్లలేదు... మిషన్ ఎడ్యుకేషన్ అన్నది డీబీఎస్టీ కాలేజీకి సంబంధించిన అంశం...మీరేదే ఊహించుకున్నారా, ఎవరైనా చెప్పారా.... యాజమాన్యానికి-స్టూడెంట్స్ కి చిన్న గ్యాప్ వచ్చింది...దీన్ని మేం పరిష్కరించుకుంటాం... 24 గంటల్లోగా రిషి సార్ దీనిపై వివరణ ఇస్తారు..మీరంతా మీ పనులు చేసుకోండి.... 
మీడియా మిత్రులందరీ ధన్యవాదాలు అని సున్నితంగా పొమ్మని చెబుతుంది.....
మహేంద్ర:  జగతి పద అనడంతో మహేంద్ర, జగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు...
వసుధార: రిషి అన్నమాటలు గుర్తుచేసుకున్న వసుధార...సార్... మీరు నన్ను చాలా అన్నారు..నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు..కాలేజీలో జరిగిన గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ గొడవకు నేను కారణం కాదు..వాళ్లంతా తప్పుంగా ఆలోచిస్తుంటే సర్దిచెప్పేందుకు ప్రయత్నించాను..అదిచూసి మీరు అపార్థం చేసుకున్నారు... 
Also Read:  జగతిని కాదని రిషిని సపోర్ట్ చేస్తున్న వసు, ఈక్వేషన్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్న లెక్కల మాస్టారు
 
ఇంట్లో ఆలోచనలో పడిన రిషి...కాలేజీలో జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుచేసుకుంటాడు. ఇదే అదనుగా అక్కడకు ఎంట్రీ ఇచ్చిన దేవయాని మరో డ్రామాకి తెరతీస్తుంది.  దేవయాని: అంతా ఒక్కటై నీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, నిన్ను బ్లేక్ చేయాలని చూస్తున్నారు నువ్వు మంచివాడివి అందర్నీ నమ్మేస్తావ్..జగతిని తీసుకొచ్చి కాలేజీలో చేరుస్తున్నప్పుడే వద్దని నేను మొత్తుకున్నాను, అయినా నీ మంచితనంతో తనని కాలేజీలోకి తీసుకున్నావ్...అది మొదలు..అంచెలంచెంలుగా నిన్ను అవమానిస్తున్నారు..కాలేజీకి వచ్చే గొప్ప పేరంతా వాళ్లే తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు... మీటింగ్ చివర్లో వచ్చి ఏదో గొప్పగా మాట్లాడిందట కదా...ఇదే తన నిజస్వరూపం..మీ నాన్న అమాయకుడు, మీ అమ్మోమో అనగానే....తను నా అమ్మ అని మీరు అనకండి అంటాడు.. నువ్వేం బాధపడకు నీ మనసులో ఏముందో అదే చేయ్...ఎవ్వరికీ భయపడకు...నిన్ను అందరూ ఒంటరిని చేసినా నీకు ఈ పెద్దమ్మ ఉంది నాన్నా అంటుంది.  ఎపిసోడ్ ముగిసింది..

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
రిషి చేయి లాక్కుని థ్యాంక్స్ చెబుతుంది వసుధార...ఏం అవసరం లేదని విసుక్కుని వెళ్లిపోతున్న రిషి చేయి పట్టుకుని  ఈ రోజు మీరు నాతోపాటూ  రావాల్సిందే అంటూ ఓ చోటుకి తీసుకెళుతుంది..రేపటి ఎపిసోడ్ అంతా హోలీ సందడే..కన్నుల పండువే....

Published at : 30 Mar 2022 10:01 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 30th March Episode 411

సంబంధిత కథనాలు

Karthika Deepam  జూన్ 28 ఎపిసోడ్:  ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

Karthika Deepam జూన్ 28 ఎపిసోడ్: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

Guppedantha Manasu జూన్ 28 ఎపిసోడ్: అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది

Guppedantha Manasu జూన్ 28 ఎపిసోడ్:  అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది

Karthika Deepam జూన్ 27 ఎపిసోడ్: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్

Karthika Deepam  జూన్ 27 ఎపిసోడ్:  శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి  షాక్ అయిన డాక్టర్ సాబ్

Devatha June 27th (ఈరోజు) ఎపిసోడ్: బయటపడ్డ మాధవ్‌ నిజస్వరూపం- డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రుక్ముణీ

Devatha June 27th (ఈరోజు) ఎపిసోడ్: బయటపడ్డ మాధవ్‌ నిజస్వరూపం- డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రుక్ముణీ

Guppedantha Manasu జూన్ 27 ఎపిసోడ్: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం

Guppedantha Manasu జూన్ 27 ఎపిసోడ్:  మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు  - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం

టాప్ స్టోరీస్

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్