అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 29 ఎపిసోడ్: జగతిని కాదని రిషిని సపోర్ట్ చేస్తున్న వసు, ఈక్వేషన్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్న లెక్కల మాస్టారు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 29 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 29 మంగళవారం ఎపిసోడ్

మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం నోటీస్ బోర్డులో పెట్టడంతో స్టూడెంట్స్ అంతా రగిలిపోతారు. అది చూసిన గౌతమ్ ఈ విషయం పెద్దమ్మకి చెప్పడం మంచిది అనుకుంటా కాల్ చేస్తాడు...కాలేజీలో గొడవ జరుగుతోంది, పెదనాన్నగారు వచ్చారా అని అడుగుతారు. రిషి ఎక్కడున్నాడని దేవయాని అడిగితే రిషి బయటకు వెళ్లాడంటాడు, వసుధార ఎక్కడుందని అడిగితే ఇక్కడే ఎక్కడో ఉందని రిప్లై ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఫణీంద్ర కాలేజీకి బయలుదేరుతాడు. మరోవైపు కార్లో బయటకు వెళుతున్న రిషితో వసుధార ఓ మాట చెప్పొచ్చా అని అడుగుతుంది.
రిషి: సలహానా, సూచనా, సూక్తా
వసుధార: అభిప్రాయం సార్... స్వీకరిస్తే సలహా అవువుంది, బోధిస్తే సూక్తి అవుతుంది... ఒక్కోసారి పరిస్థితులు మనల్ని తప్పుతోవ పట్టిస్తాయి వాటికి మనం ప్రభావితం అవుతాం, అందరం మీ ఆలోచనల్ని వ్యతిరేకిస్తున్నారు కదా , ఎవరి హక్కులు వాళ్లకి ఉంటాయి కదా అంటుంది.
రిషి: అభిప్రాయం మార్చుకోపోతే ఏమవుతుంది...నువ్వు కోరుకున్నది అవకపోతే ఏం చేస్తావ్
వసుధార: గాయానికి మందు రాయాలి కదా.. మినిస్టర్ గారిదగ్గరకు వెళుతున్నాం కదా ఆయన ఏదైనా చెబితే సరే అనండి సార్..
రిషి: కారు వెనక్కు తప్పిన రిషి నేరుగా కాలేజీ దగ్గరకు తీసుకొచ్చి ఆపుతాడు...నువ్వు కాలేజీకి వెళ్లు నేను మినిస్టర్ గారి దగ్గరకు వెళతాను 

అటు ఇంట్లో దేవయాని..వసుధార గురించి దేవయాని-జగతి అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ఏవో స్కెచ్ లు వేస్తుంది. ఎవరికో కాల్ చేసి ప్రశాంతత నాకు నచ్చదు అంటుంది. అట్నుంచి అర్థమైంది మేడం అంటచాడు. కాలేజీలో ఓ స్టూడెంట్ కి కాల్ చేసిన ఆ వ్యక్తి... సిద్ధంగా ఉండు స్కీమ్ ఏంటో చెబుతాను రాత్రికి రాత్రే హీరో అవుతావ్ అని కాల్ కట్ చేస్తాడు. 

Also Read: జ్వాలే తమ శౌర్య అని హిమ-నిరుపమ్ గుర్తించారా, సౌందర్య రియాక్షన్ ఏంటి

కట్ చేస్తే మినిస్టర్ గారి దగ్గర కూర్చుని ఉంటారు మహేంద్ర,జగతి..ఇంతలో రిషి కూడా వస్తాడు. వీళ్లు ఇక్కడే ఉన్నారా అనుకుంటూ వచ్చి కూర్చుంటాడు. 
మినిస్టర్: మీ ముగ్గురినీ ఇలా చూడడం ఆనందంగా ఉంది, తల్లీ కొడుకు గోల్డ్ మెడలిస్ట్, తండ్రి కాలేజీ బాధ్యతలు నిర్వహించే జమ్..గొప్పవాళ్లంతా ఒకే కుటుంబంలో ఉన్నారు
రిషి: సార్ రమ్మన్నారు
మినిస్టర్: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు మీ అందర్నీ కలపి కూర్చోబెట్టి మాట్లాడుదాం అని పిలిచాను... మీరంతా ఎప్పటిలా కలసి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లండి...సార్ అంటూ అడ్డుపడిన జగతితో...మేడం నేను మంత్రిగా కాకుండా డీబీఎస్టీ కాలేజీ పూర్వ విద్యార్థిగా చెబుతున్నా ఎప్పటిలా ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లండి 
రిషి: ఈ విషయంలో ఇంతకు ముందే నేను నా అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పారు..వెళ్లొస్తాను సార్ అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు రిషి
మినిస్టర్: ఈ సమస్యను 24 గంటల్లోగా మీరే సాల్వ్ చేసుకోండి..లేదంటే మేమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది..మేం దిగితే ఇక విషయం నాన్చడం ఉండదు

మరోవైపు కాలేజీలో వసుధార కోసం వెతికిన పుష్ప...ప్రాజెక్ట్ విషయంలో స్టూడెంట్స్ అంతా కలసి రిషి సార్ ని ఎదిరించేందుకు సిద్ధమయ్యారని చెబుతుంది. ఇంతలో స్టూడెంట్స్ అంతా వచ్చి మేం గట్టిగా పోరాడుతాం, నువ్వు కాలేజీ టాపర్ వి ఎందుకు సపోర్ట్ చేయవు అని నిలదీస్తారు.. వసుధార వాళ్లకి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోరు. మీరు అనవసరంగా ఆవేశపడొద్దని చెబితే..వసుధార మనకు సపోర్ట్ చేయడం లేదు,ఆమె రిషిసార్ పార్టీ కదా...వసు మనకి సపోర్ట్ చేయదని ఆందోళన మొదలెడతారు. దేవయాని అరెంజ్ చేసిన మనిషి కాలేజీలో ఆందోళన జరుగుతున్న విషయం ప్రెస్ కి కాలే చేసి చెబుతాడు. మరోవైపు గౌతమ్ కాలేజీలో ఈ గొడవలేంటో, రిషి ఎక్కడున్నావ్ అనుకుంటాడు. ఇంతలో రిషి అక్కడకు రానే వస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేశావ్ కదా స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారని గౌతమ్ చెబితే..కాసేపు బాధపడి మరిచిపోతారులే అంటాడు. నువ్వు అనుకున్నంత ఈజీగా పరిస్థితి అక్కడలేదని గౌతమ చెబుతాడు. మరోవైపు వసుధార సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇంతలో అక్కడకు వెళ్లిన రిషి..వసుధారని అక్కడ చూసి మొత్తం ఆందోళనకి తానే కారణం అనుకుంటాడు. నీ వెనుక ఎవరున్నారో, ఎవరు చెబితే నువ్వు ఇదంతా చేస్తున్నవో నాకు తెలుసు అనుకుంటాడు.

Also Read: వసుధారని మళ్లీ అపార్ఠం చేసుకున్న ఈగో మాస్టర్ రిషి, వసు రియాక్షన్ ఏంటి
గొడవకు కారణం అయిన దేవయాని..రిషికి కాల్ చేసి... కాలేజీలో ఏదో గొడవ జరుగుతోందట కదా వసు, జగతి కారణం అయిఉంటారు.. నువ్వు జాగ్రత్త నాన్న చెప్పి కాల్ కట్ చేస్తుంది. రిషిని చూసిన స్టూడెంట్స్ అంతా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా... వసు కూడా రిషికి ఎదురుగా వెళ్లి అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఈగో మాస్టర్ అస్సలు పట్టించుకోడు..ఆమెను మాట్లాడనివ్వడు. 
రిషి: ఏం జరిగిందో, ఏం జరుగుతోందో నాకు అంతా తెలుసు అంటాడు. నువ్వేం చేస్తున్నావో అందర్నీ ఎలా రెచ్చగొడుతున్నావో నా కళ్లారా చూశాను నేను. 
వసుధార: నేను రెచ్చగొట్డడం ఏంటి...
రిషి: అంతా నువ్వే నడిపిస్తున్నావని నాకు తెలుసు
స్టూడెంట్స్: సార్ ప్రాజెక్ట్ అని ఎవరో మాట్లాడుతారు...
రిషి: షటప్...ఏం చేయాలో ఏం చేస్తున్నానో నాకు తెలుసు..మీ అందరితో తర్వాత మాట్లాడతాను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి...

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ప్లాన్ ప్రకారం అంతా చేసి మాట్లాడేందుకు వచ్చావా అని వసుపై ఫైర్ అవుతాడు రిషి. ఓ సారి స్టూడెంట్స్ తో మాట్లాడేందుకు ప్రయత్నించండి అని చెప్పినా గెటవుట్ అని అరుస్తాడు. ఇంతలో ప్రెస్ అంతా రావడంతో మహేంద్ర కూడా అక్కడకు వెళతాడు... జగతి మేడంని కాలేజీ నుంచి పంపించేశారంట కదా అని దేవయానితో కుమ్మక్కైన రిపోర్టర్ అడుగుతాడు...అప్పుడే సీరియస్ గా ఎంట్రీ ఇస్తుంది జగతి....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Embed widget