By: ABP Desam | Updated at : 28 Mar 2022 09:59 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu 28th March 409(Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 28 సోమవారం ఎపిసోడ్
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటారు రిషి-వసు. నువ్వు దిగి మీ ఇంటికి వెళితే నేను మా ఇంటికి వెళతా అంటాడు. లోపలకు వెళ్లిపోతున్న వసుని పిలిచిన రిషి...బొకే ఇస్తాడు. నాకెందుకు సార్ అంటే..మినిస్టర్ గారిని బాగా ప్రభావితం చేసిన ఆ ఇద్దరికీ నా బహుమతిగా ఇవ్వు అంటాడు.తన తండ్రి ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఓసారి చుట్టూ చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.
మహేంద్ర: రిషి-వసుధార మినిస్టర్ గారిని కలిశారంట పీఏ కాల్ చేసి చెప్పాడు
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, మన కుటుంబ సమస్యను కలపి చూడొద్దు
మహేంద్ర: రిషి కలిపే చూస్తున్నాడు...ఏదో ఒకటి చేయాలి కదా
జగతి: ఓ సమస్యను పరిష్కరిద్దాం అనుకుని మరో సమస్య క్రియేట్ చేస్తున్నావ్, దూకుడుగా ఆలోచించి రాజీనామా చేశావ్, ఇల్లు వదిలి వచ్చేశావ్ ఏంటి మహేంద్ర ఇది
Also Read: హిమ-నిరుపమ్ ఎవరో జ్వాల(శౌర్య)కి తెలిసిపోయిందా, ఇప్పుడేం చేయబోతోంది
ఇంతలో బొకే తీసుకుని వచ్చిన వసుధార...మహేంద్రకి ఇస్తుంది. నాకెందుకు అని అడిగితే... తనకి నీపై కోపం లేదని ఈ బొకే పంపాడని అనుకోవచ్చు కదా అంటుంది జగతి. ఆ మాటేదో నాకే చెప్పొచ్చు కదా అంటాడు మహేంద్ర. అందరూ అన్నీ చెప్పలేరు..రిషి తన మనసులో మాటలు, భావాలు దాచుకుంటాడని క్లారిటీ ఇస్తుంది జగతి. ( గతంలో రిషి తనిచ్చిన బొకే విసిరికొట్టడం, ఆ తర్వాత వెల్ కమ్ చెబుతూ బొకే ఇవ్వడం గుర్తుచేసుకుంటుంది).
మహేంద్ర: ఏం ఆలోచిస్తున్నావ్
జగతి: జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నా
మహేంద్ర: బాధపడుతున్నావా
జగతి: దేవయాని అక్కయ్యలాంటి ఎండ తగిలితే రిషి లాంటి పూలు వాడిపోతాయి...రిషిని జాగ్రత్తగా చూసుకోవాలి
అటు రూమ్ లో కూర్చున్న వసుధార...మహేంద్ర-జగతి మేడం మధ్య దూరం తగ్గినందుకు సంతోషించాలో...మహేంద్ర సార్-రిషి సార్ మధ్య దూరం పెరుగుతున్నందుకు బాధపడాల అనుకుంటుంది. కాల్ చేద్దాం అనుకునేలోగా గుడ్ నైట్ మెసేజ్ పెడతాడు రిషి. కాల్ చేద్దాం అనుకుంటే గుడ్ నైట్ పెట్టారేంటని విసుక్కుంటుంది.
మరోవైపు దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది.... ఏమైంది పెద్దమ్మా అని రిషి అక్కడకు వస్తాడు
దేవయాని: ఏమైనా ఏం చేయగలం
రిషి: ఎవరైనా ఏమన్నా అన్నారా
దేవయాని: మనం అందరం బావుండాలని కోరుకుంటాం...కానీ అందరూ అలా ఉండరు కదా.. మహేంద్ర ఇంట్లోంటి వెళ్లిపోవడంతో...ఇంటికి రమ్మని అడుగుదామని వెళ్లాను...
రిషి: మీరెందుకు అక్కడకు వెళ్లారు...అంత అవసరం ఏంటి
దేవయాని; నువ్వు ఎంత బాధపడుతున్నావో చూస్తున్నా కదా
రిషి: డాడ్ ఇంట్లోంచి వెళ్లి ఉండొచ్చు..నా మనసులోంచి కాదు
దేవయాని: నేను నీ కన్నతల్లిని కాకపోవచ్చు...
రిషి: ఆమె నాకు తల్లికాదు..మీరే నాకు తల్లి
దేవయాని: రెండు మెట్లు దిగి మరీ వాళ్లింటికి వెళ్లాను... ఆ జగతి నీ గురించి-వసుధార గురించి ఏవేవో మాట్లాడింది... ఆమెతో నీకేంటి...
రిషి: వసుధార నాకు అసిస్టెంట్ మాత్రమే...ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు.. ఈ విషయంలో మీరు బాధపడొద్దు..అవసరం లేనివాటిగురించి ఆలోచించొద్దు... మీరు బావుండాలి మీరంటే నాకు గౌరవం
దేవయాని: ఇంత గొప్పగా నటించినా ఆ వసుధార విషయంలో రిషి అభిప్రాయం మారడం లేదు...ఏదేమైనా రిషి ఇంకా నా అదుపులోనే ఉన్నాడు...
మరోవైపు జగతి గారూ కాఫీ ప్లీజ్ అని మహేంద్ర అరిస్తే..పొద్దున్నే ఒకటి తాగావ్ నీకు ఇప్పట్లో కాఫీ లేదంటుంది. అటు కాలేజీ లేదు...ఇటు పనిలేదు బోర్ కొడుతోంది అనుకుంటాడు. ఇంతలో జగతికి కాలేజీ లెక్చరర్ నుంచి కాల్ వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మన కాలేజీ చేయడం లేదంట కదా...మీరెలా ఊరుకుంటారని అంటుంది. ఎండీ నిర్ణయాన్ని మనం ఎలా వ్యతిరేకించగలం అంటుంది జగతి. ఇక్కడ కాలేజీలో లెక్చరర్లు, విద్యార్థులు అందరం వెళ్లి రిషిని అడుగుదాం అనుకుంటున్నాం..మీ సపోర్ట్ కావాలనడంతో జగతి చూద్దాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
Also Read: మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి యూ టర్న్ తీసుకున్నాడా, నోటీస్ బోర్డులో ఏముంది
కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి పెద్ద చర్చ జరుగుతుంటుంది. లెక్చరర్లు ఇద్దరు వెళ్లి రిషిని కలుస్తారు...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు కరెక్ట్ కాదంటారు...ప్రాజెక్ట్ వద్దనుకుని ఎండీగా నా నిర్ణయం తీసుకున్నాను...మీకేమైనా సమస్యలుంటే చెప్పండి , కాలేజీ పద్ధతులు, సిస్టం నచ్చితే సరే లేదంటే మీ ఇష్టం అనేసి సీరియస్ గా వెళ్లిపోతాడు. ఆ లెక్చరర్లు ఇద్దరూ వసుధార దగ్గరకు వెళ్లి ఇదే విషయం ప్రస్తావించడంతో నేను మాట్లాడతాను అని లోపలకు వెళుతుంది.
రిషి: బయటి లెక్చరర్లతో మాట్లాడావా...వాళ్లందరి తరపునా వకాల్తా పుచ్చుకునేందుకు వచ్చావా
వసుధార: ఎండీగా మీ నిర్ణయం మీది...నేనెందుకు ప్రశ్నిస్తాను... మినిస్టర్ గారినుంచి కాల్ వస్తుంటే మీరు లిఫ్ట్ చేయడం లేదంట..
రిషి: అవును..మిస్డ్ కాల్స్ ఉన్నాయి.... ఓ ప్రింట్ ఇచ్చాను నోటీస్ బోర్డులో పెట్టు...మనం బయటకు వెళ్లాలి
మరోవైపు మినిస్టర్ గారు మళ్లీ ఎందుకు పిలిచారో అంటుంది జగతి. రిషి కోసం అస్తమానం భయపడడం నాకు నచ్చలేదు, జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించాలని మహేంద్ర చెబుతాడు.
నాకు మాత్రం రిషి మనసు కష్టపడడం నచ్చదని క్లారిటీ ఇస్తుంది. అటుకాలేజీ నుంచి రిషి కార్ బయటకు వెళుతుండగా గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. రిషి ఎక్కడకు వెళ్లాడు, వసుధార ఎక్కడుందో అనుకుంటాడు. నోటీస్ బోర్డులో ఏదో పెట్టారంట అని పెద్ద హడావుడి జరుగుతుంటే గౌతమ్ కూడా అక్కడకు వెళతాడు....
రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
ప్రాజెక్ట్ రద్దు ఎలా చేస్తారని వసుని ప్రశ్నిస్తారు స్టూడెంట్స్. అది రిషి సార్ నిర్ణయం అంటుంది వసుధార. నువ్వు ఆయన పార్టీలో చేరిపోయావా మేం ఒప్పుకోం అంటూ ధర్నాకు దిగుతారు. దూరం నుంచి చూసిన రిషి...ఇదంతా వసుధారే చేయిస్తోందని అపార్థం చేసుకుని ఆమెపై ఫైర్ అవుతాడు....
Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి
Gruhalakshmi August 6th Update: తప్పు ఒప్పుకున్న అనసూయ - తులసి విషయంలో నందుకు వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్
Devatha August 6th Update: రాధని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తున్న మాధవ - రుక్మిణిని వెతికేందుకు సూరితో వెళ్తున్న దేవుడమ్మ
Guppedanta Manasu August 6th Update: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా
Karthika Deepam August 6th Update: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న
INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది