అన్వేషించండి

Karthika Deepam మార్చి 28ఎపిసోడ్: హిమ-నిరుపమ్ ఎవరో జ్వాల(శౌర్య)కి తెలిసిపోయిందా, ఇప్పుడేం చేయబోతోంది

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. మార్చి 28 శనివారం 1311 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

కార్తీకదీపం మార్చి 28 సోమవారం ఎపిసోడ్

సౌందర్య అల్లుడు సత్యతో పాటూ హాస్పిటల్ కి వెళ్లిన జ్వాల( శౌర్య).... రండిసార్ వెళదాం అంటుంది. నేను మా అబ్బాయిని డ్రాప్ చేయమని చెబుతానులేమ్మా నువ్వెళ్లు అంటాడు. పర్వాలేదు రండని చెప్పడంతో సరే అంటాడు. ఇంతకీ మీ మావయ్యగారికి ఎలా ఉందని అడిగిన శౌర్యతో బాగానే ఉందని చెబుతాడు. వాళ్లిద్దరూ మీ అబ్బాయిలేనా అని అడిగితే...అవునంటాడు సత్య. ఇద్దరి మధ్యా ఎంతో తేడా ఉందని సత్య అంటే..నేనుకూడా అదే అందాం అనుకుంటున్నా అంటుంది. ఇద్దరూ అన్నదమ్ములే అయినా ఎందుకు వేర్వేరుగా ఉన్నారని అడిగిన జ్వాలతో..నా ఫ్యామిలీ కథ చెప్పాలంటే అమెరికా వరకూ ఆటోలో వెళ్లినా సరిపోదంటాడు. ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు.

సౌందర్య:  హాస్పిటల్ నుంచి బయలుదేరిన సౌందర్య... మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, దీప-కార్తీక్ పేరుమీద గుడిలో అన్నదాయం చేయిద్దాం అనుకున్నాం...ఇంతలో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన పడిపోయారు...బతికున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు, చనిపోయిన తర్వాత అన్నదానానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయని బాధపడుతుంది. దగ్గరుండి అన్నదానం చేయించడం కుదరదు కాబట్టి పూజారికి డబ్బులిచ్చి మొత్తం చూసుకోమని చెప్పాలి అనుకుంటుంది.  మరోవైపు అప్పటికే గుడికి చేరుకున్న జ్వాల.... బాబాయ్ అన్నదానానికి టికెట్ తీసుకున్నారా అని అడుగుతుంది. ఆ పక్కనే సౌందర్య ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోరు. 

Also Read: మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి యూ టర్న్ తీసుకున్నాడా, నోటీస్ బోర్డులో ఏముంది

గుడికి వెళ్లిన జ్వాల(శౌర్య) అమ్మ-నాన్న పేరుమీద అన్నదానానికి డబ్బులు కడుతుంది. అటు సౌందర్య దేవుడికి దండం పెడుతూ నా కొడుకు,కోడలు ఆత్మకి శాంతికలిగేలా చూడు, నా మనవరాలు ఎక్కడున్నా నా దగ్గరకు చేర్చు అని దేవుడికి మొక్కుకుంటుంది. అన్నదానానికి డబ్బులు కట్టి ఆ రసీదు తీసుకెళ్లి గుడిలో పూజారికి ఇవ్వడంతో ఆ పేర్లు బోర్డుపై రాస్తారు.  అన్నదానం చేయించే బాధ్యత బాబాయ్ ( ఇంద్రుడు) మీరు చూసుకోండి అని చెప్పి..అనాధాశ్రమానికి బియ్యం బస్తా ఇచ్చివస్తానని వెళుతుంది. ఆ వెనుకే వచ్చిన సౌందర్య పూజారికి అన్నదానం రసీదు ఇస్తుంది. ఇప్పుడే వీరి పేర్లమీద అన్నదానం చేయించమని ఓ అమ్మాయి డబ్బులు కట్టి వెళ్లిందని పూజారి చెప్పడంతో...అంటే శౌర్య వచ్చి వెళ్లిందా...శౌర్య ఈ చుట్టుపక్కలే ఉందా అని సౌందర్య మురిసిపోతుంది. వెంటనే శౌర్య, శౌర్య అని అరుస్తూ గుడి అంతా తిరుగుతుంది. అప్పటికే జ్వాల అలియాస్ శౌర్య అక్కడినుంచి వెళ్లిపోతుంది. సౌందర్య ...శౌర్య శౌర్య అని వెతకడం ఇంద్రుడు-చంద్రమ్మ చూస్తారు కానీ వాళ్లకి జ్వాల తెలుసుకానీ ఆమె అసలు పేరు శౌర్య అని తెలియదు. 

సౌందర్య ఇంట్లో
ట్యాబ్లెట్స్ వేసుకోండి అన్న సౌందర్యతో నిండు నూరేళ్లు ఉండాల్సినవాళ్లు పోయారు... పండుటాకుల్లాంటి వారం మనం ఇంకా ఉన్నాం అంటాడు ఆనందరావు. మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఓ శుభవార్త చెబుతాను అంటుంది. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఆశ చూపించినట్టు నాకు శుభవార్త ఆశచూపిస్తున్నావా అంటాడు.  
సౌందర్య: శౌర్య ఈ సిటీలోనే ఉందని గుడిలో పూజారి చెప్పిన విషయాలు చెబుతుంది. 
ఆనందరావు: శౌర్య ఈ ఊర్లో ఉందని నువ్వు సంతోషపడుతున్నావు కానీ ఇన్నేళ్లు ఇదే ఊర్లో ఉండికూడా మనల్ని తప్పించుకుని తిరుగుతోందని గుర్తించలేకపోతున్నావ్ 
సౌందర్య: ఇంకా శౌర్యకి హిమపై కోపం ఉందంటారా
ఆనందరావు: కోపం లేకపోతే మనల్ని వెతుక్కుని రావడం జరిగేది
సౌందర్య: ఈ రౌడీకి ఇంత పంతమేంటి
ఆనందరావు: నీ కూతురు ఇంతేకదా..మేనత్త బుద్ధులు వచ్చాయేమో, నేను హాస్పిటల్లో ఉన్నా స్వప్న నన్ను చూసేందుకు రాలేదు
సౌందర్య: ఇవన్నీ ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు..మీకు ఏం కాలేదని నిరుపమ్ చెప్పాడు కదా ప్రశాంతంగా ఉండండి

Also Read:   తన చుట్టూ ఉన్నది తన కుటుంబమే అని జ్వాల( శౌర్య) కి తెలిసిపోయిందా
ఆటోలో ఇంటికి వెళుతున్న జ్వాల...హాస్పిటల్లో నిరుపమ్ అన్న మాటలు గుర్తుచేసుకుంటూ మురిసిపోతుంది. ఫస్ట్ టైం నన్నొకరు పొగిడారు అని పొంగిపోతుంది. ఎపిసోడ్ ముగిసింది

రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
ఈ ఆటో అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నాకు పదే పదే గుర్తొస్తోందని హిమ అనుకుంటే... ఆ ఆటో అమ్మాయిని చూస్తే శౌర్యని చూసినట్టు అనిపిస్తోందని నిరుపమ్ అంటాడు. నా మనసులో ఉన్నమాటే నువ్వు చెప్పావ్ బావా అంటుంది. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన జ్వాల మొత్తం వినేసినట్టే ఉంది.....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget