IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Guppedantha Manasu మార్చి 26 ఎపిసోడ్: మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి యూ టర్న్ తీసుకున్నాడా, నోటీస్ బోర్డులో ఏముంది

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 26 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 26  శనివారం ఎపిసోడ్

ఎక్కడికి ఎక్కడికి అని పదే పదే వసుధార అడగడంతో మినిస్టర్ గారి దగ్గరకు అంటాడు రిషి. నేనెందుకు అనగానే కారు ఆపేసి దిగు అంటాడు. ఊరికే అన్నాను సార్ అని వసు అంటే వెళ్లి రెండు ఫ్లవర్ బొకేలు తీసుకురా అని చెప్పడంతో కోపం వచ్చి అన్నారేమో అనుకున్నా అనుకుంటుంది. నువ్వు అనుకున్నంత హెడ్ వెయిట్  లేదులే అని కౌంటర్ ఇస్తాడు. రెండ బొకేలు ఎందుకు అన్న వసుతో.. ఒకటి మినిస్టర్ గారికి మరొకటి నీకు అంటాడు. నాకు హెడ్ వెయిట్ అంటావా అని ఫీలైపోతుంటాడు రిషి...

వదినా కాఫీ కావాలని అడుగుతాడు గౌతమ్. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని రిషి ఎక్కడ అని అడుగుతుంది. మినిస్టర్ గారితో మీటింగ్ కి వెళ్లాడని గౌతమ్ అనడంతో..  వసు వెళ్లిందని చెబుతాడు.  
దేవయాని: కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉండగా వసు మాత్రమే పీఏ ఎందుకైంది
ధరణి: తను తెలివైంది కాబట్టి
గౌతమ్: వసుధార కాలేజీలో టాపర్, యూత్ ఐకాన్, సోషల్ సర్వీస్ చేస్తుంది, పార్ట్ టైం జాబ్ చేస్తుంది..
దేవయాని: వసు వచ్చినప్పటి నుంచే జగతికి బలం అయిపోయింది... రిషి-జగతి-మహేంద్ర ఈ ముగ్గురికీ కేంద్ర బిందువు అయిపోయింది... వసు సంగతేంటో చూడాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రిషి, వసుధార మినిస్టర్ ని కలుస్తారు
మినిస్టర్:  ఏదో మెయిల్ పెట్టినట్టున్నావ్ దానికి రిప్లై ఇవ్వడం వీలు కాలేదు.. మిషన్ ఎడ్యుకేషన్ వల్ల కాలేజీకి పేరొచ్చింది-కానీ ఆ ప్రాజెక్ట్ రద్దు చేస్తూ ఎందుకు మెయిల్ పెట్టావ్, డీబీఎస్టీ కాలేజీ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది నేనూ ఆ కాలేజీలో చదివాను, కాలేజీ ఇప్పుడు నంబర్ వన్ స్థాయిలో ఉంది... నీలాంటి ఎండీ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మీ అమ్మా-నాన్న చాలా తెలివైన వాళ్లు-గొప్పవాళ్లు...జరిగిందేదో జరిగిపోయింది..ఆ విషయం నేను మాట్లాడను పెద్ద వాళ్ల ఆశీర్వాదం ఉంటే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు...నువ్వు ఇంత గొప్పవాడివి అయ్యావంటే నీ కృషి-పట్టుదల-పెద్దల ఆశీర్వాదాలు కలిసొచ్చాయని అనుకుంటున్నా... కొత్త ఆలోచనలు చేస్తున్నారా
రిషి: అదేం లేదు సార్
మినిస్టర్: చిక్కు ముడులున్నీ విప్పుతూ సావధానంగా ముందుకు వెళ్లిపోవాలి....ప్రతి విషయంలోనూ భూతద్ధంలో చూడకూడదు... నీకు ఇంతకన్నా చెప్పలేను..ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లండి...ఆలోచించండి..మీ నిర్ణయం మార్చుకుంటారని ఆశిస్తున్నాను
రిషి: నేను బాగా ఆలోచించే ప్రాజెక్ట్ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాను సార్..అందులో మార్పు చేయాల్సింది లేదని నా అభిప్రాయం..ఉంటాను సార్ 
Also Read: తన చుట్టూ ఉన్నది తన కుటుంబమే అని జ్వాల( శౌర్య) కి తెలిసిపోయిందా
జగతి ఇంట్లో: కాలింగ్ బెల్ మోగడంతో ఎవరో చూడు అని మహేంద్ర అంటాడు... రిషి ఏమైనా వచ్చాడా అని అనుకుంటూ వెళ్లి తలుపు తీసిన జగతి ఎదురుగా దేవయానిని చూసి షాక్ అవుతుంది. 
దేవయాని: ఏంటి జగతి మొత్తానికి సొంత కుంపటి కల నెరవేరిందా... లోపలకు రావొచ్చా..కొత్తకాపురం ఎలా ఉంది జగతి..బావుందా.. ఇన్నాళ్లకు మహేంద్రని మా నుంచి విడగొట్టావ్
జగతి: విడగొట్టడంతో ఎవ్వరైనా మీ తర్వాతే
దేవయాని: ఏం మహేంద్ర ఎలా ఉన్నావ్.. జగతి బాగా చూసుకుంటోందా.. మొత్తానికి చాలా ఏళ్లకి ఇద్దరూ ఒకటయ్యారు..అభినందనలు.. ఆహా... గుర్తురాలేదే...ఒక పూలదండ తెచ్చేదాన్నికదా..నా దీవెనలు మీకెప్పుడూ ఉంటాయ్..
మహేంద్ర: మీ దీవెనలు ఎక్కువ అయ్యాయనే కదా మా బాధ
దేవయాని: ఆ షార్ట్ ఫిలిం పుణ్యమా అని ప్రపంచానికి మీ బంధం తెలిసిపోయింది...అదే అదనుగా మీరు వేరు కుంపటి పెట్టారు.. ఆ గొడవ నా కెందుకు కానీ నా అబ్బాయి గురించి మాట్లాడేందుకు వచ్చాను... ఏంటి షాకయ్యావా రిషిని పెంచింది నేనే కదా తను నా అబ్బాయే కదా...రిషి చుట్టూ ఆ అమ్మాయిని ఎందుకు తిప్పుతున్నావ్ జగతి...  ఆ వసుధారని రిషి వెంట ఎందుకు తిరగనిస్తున్నారు..ఇదేం పద్ధతి..హద్దు-పద్దు లేకుండా వయసుకి వచ్చిన వాళ్లని అలా వదిలిపెట్టొచ్చా..రేపు ఏదైనా జరగరానిది జరిగితే...
జగతి: తన జీవితం తన ఇష్టం...ఏదైనా జరిగితే జరగనివ్వండి..అది రిషి సమస్య..
దేవయాని: జగతి ఏం మాట్లాడుతున్నావ్
జగతి: రిషిని పెంచినందుకే నీకు అంత ప్రేమ ఉంటే..వాడిని కన్న తల్లిని నాకెంత ప్రేమ ఉండాలి చెప్పు...మీకు ఇప్పుడు తెలిసిందేమో... నేను కన్నతల్లిని కదా ఎప్పుడో అనిపించింది డైరెక్ట్ గా అడిగేశాను...
దేవయాని: ఏమన్నాడు
జగతి: వెళ్లి మీ అబ్బాయిని అడగండి..ఏమన్నాడు అని.. అక్కయ్యా రిషి మీద మీకున్న ప్రేమేంటో మీ ఉద్దేశం ఏంటో నాకు పూర్తిగా తెలుసు...
దేవయాని: జగతి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావ్... రిషి విషయంలో మీరు తప్పుచేస్తున్నారు..ఆ వసుధారని తన వెంట తిప్పకండి... 
జగతి: ఈ విషయం రిషినే అడగండి కాల్ చేస్తాను
దేవయాని: ఫోన్ లాక్కున్న దేవయాని కాల్ చేయనీయకుండా అడ్డుపడుతుంది
జగతి: ఎందుకు అంత కంగారుపడుతున్నారు ఫోన్ ఇవ్వండి
కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని... అక్కయ్యా వచ్చినందుకు థ్యాంక్స్ కాస్త మజ్జిగ తాగి వెళతారా కడుపుమంట చల్లారుతుంది అని కౌంటర్ ఇస్తుంది జగతి. 

Also Read: ఫ్రస్టేషన్ లోనూ ఫన్ మిస్ చేయని ఈగో మాస్టర్ రిషి , అస్సలు తగ్గని వసుధార
అటు కార్లో ఇంటికి వెళుతున్న రిషి-వసుధార... ప్రాజెక్ట్ గురించి మినిస్టర్ గారు మాట్లాడిన విషయాలు గుర్తుచేసుకుంటారు....
వసుధార: మినిస్టర్ గారి మాటలు మీకు తప్పుగా అనిపించాయా
రిషి: నీకేం అనిపించిందో చెప్పు
వసుధార: మీరు ఏమీ అనుకోనంటే చెబుతాను
రిషి: నేను అనుకున్నా అనుకోపోయినా చెబుతావ్ కదా..చెప్పు
వసుధార: ఎందుకుసార్ అలా అంటారు..నేను చాలా క్లియర్ గా ఉంటాను
రిషి: నువ్వు క్లియర్ గా ఉంటావ్ ఎదుటివాళ్లని కన్ఫ్యూజ్ చేస్తావ్
వసుధార: నేను చెప్పను
రిషి: చెప్పు...
వసుధార: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పై ఆయనకున్న ఇంట్రెస్ట్ చూసి సంతోషం అనిపించింది...
రిషి; మినిస్టర్ గారు ఈ మాటలు అన్నప్పటి కన్నా నువ్వు చెప్పినప్పుడు బాగా అనిపిస్తోంది.. బాగా ఇన్ఫ్యులెన్స్ చేస్తావ్. మీ మేడం సార్ నిన్ను , మినిస్టర్ గారిని ప్రభావితం చేశారు. తప్పుచేశావని ఎవరూ డైరెక్ట్ గా చెప్పరు కదా ఎదుటివాళ్లకి నచ్చకపోతే తప్పు చేసినట్టే కనపడతాను.. నిజం చెప్పు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని అంతా అనుకుంటున్నారు కదా..
వసుధార: వ్యక్తిగతంగా నా మనసుకి అనిపించింది మాత్రం..మీరు చేసింది తప్పే...కానీ మీరు తప్పు ఒప్పుకోరు కదా... ఇంతలో కారు ఆగడంతో ఏంటిసార్ దిగి ఏమైనా తీసుకారావావా
రిషి: మీ ఇల్లు వచ్చింది...

సోమవారం ఎపిసోడ్ లో
కాలేజీలో లెక్చరర్లు అందరూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పై రిషిని క్వశ్చన్ చేస్తారు. ఎండీగా అది నా నిర్ణయం అని సమాధానం చెబుతాడు రిషి. మాట్లాడేందుకు వెళ్లిన వసుధారతో ఓ ప్రింట్ ఇచ్చాను అది నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పు అంటాడు. నోటీస్ బోర్డులో అది చూసి అంతా షాక్ అవుతారు....

Published at : 26 Mar 2022 10:05 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 26th March Episode 408

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి