Guppedantha Manasu మార్చి 25 ఎపిసోడ్: ఫ్రస్టేషన్ లోనూ ఫన్ మిస్ చేయని ఈగో మాస్టర్ రిషి , అస్సలు తగ్గని వసుధార

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 25 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 25 శుక్రవారం ఎపిసోడ్

మినిస్టర్ ముందు కూర్చుంటారు జగతి మహేంద్ర
మంత్రి: అంతా సవ్యంగా జరిగిపోతున్నప్పుడు ఇలా జరిగి ఉండాల్సి కాదు. డీబీఎస్టీ కాలేజీలోనే నేను చదువుకున్నాను, అందుకే ఆ కాలేజీ అంటే నాకు చాలా ఇష్టం . ఈ ప్రాజెక్ట్ విషయంలో రిషి లెటర్ పంపించాడు నేను చూశాను కానీ కావాలనే బదులివ్వలేదు. రిషి మళ్లీ అందుబాటులోకి రావడం లేదు.. ఈ మిషన్ ఎడ్యుకేషన్ మంచి సంకల్పం... డీబీఎస్టీ కాలేజీకి మీరు-రిషి రెండు కళ్లలాంటివారు. ప్రాజెక్ట్ అత్యద్భుతంగా ముందుకు వెళుతోంది..ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం సరైంది కాదు...
మహేంద్ర: ఏం చేద్దాం సార్
మంత్రి: డీబీఎస్టీ కాలేజీ అండర్లోనే మిషన్ ఎడ్యుకేషన్ నడవాలి.. ఆలోచించండి..ఈ విషయంలో నేను కల్పించుకోవద్దనే ఆగాను..చూడండి ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు...
మహేంద్ర: సరే సార్ వెళ్లొస్తాం

Also Read: అప్పుడు డాక్టర్ బాబు-వంటలక్క, ఇప్పుడు డాక్టర్ సాబ్-ఆటో డ్రైవర్

లేజీలో: తన క్యాబిన్లో కూర్చున్న రిషి... తండ్రిని-వసుమాటల్ని గుర్తుచేసుకుంటాడు. మీరిద్దరూ మాట్లాడుకోనంతగా గొడవేం పడ్డారన్న వసు మాటలు గుర్తుచేసుకుని... అసలు నేను ఏమైపోతున్నాను.. నిన్నటి వరకూ నా డాడ్ ఇప్పుడు అంత దూరం ఎలా అవుతారు..ఇద్దరి మధ్యా దూరం పెరిగిందా..నేను అలా ఆలోచిస్తున్నానా అనుకుంటాడు. కట్ చేస్తే  మహేంద్ర-జగతి కార్లో వెళుతుంటారు.
మహేంద్ర: మినిస్టర్ గారు కూడా అచ్చం నీలానే ఆలోచిస్తున్నారు
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ అందరికీ ఉపయోగపడుతుందని ఆయన అనుకోవడం గ్రేట్, మినిస్టర్ గారు రిషిని పిలిచి మందలించాలని ఆలోచిస్తున్నావా
మహేంద్ర: నీ కొడుకుమీద ఈగ కూడా వాలనివ్వవు... ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబితే వింటారు కదా....
ఇంతలో రిషి నుంచి కాల్ వస్తుంది.... 
మహేంద్ర: రిషి చెప్పు
రిషి: హలో డాడ్..మీతో మాట్లాడాలి
మహేంద్ర: ఎక్కడికి వస్తావ్
రిషి: మీరు రాలేరా
మహేంద్ర: ఎక్కడ కలుద్దాం..
రిషి: అంటే ఇంటికి రారనే కదా అర్థం అనుకుని మీరు చెప్పండి అంటాడు
ఇద్దరూ ఓ చోట కలుస్తారు
రిషి: ఎందుకు వెళ్లిపోయారో తెలుసుకోవచ్చా
మహేంద్ర: ఎందుకు వెళ్లిపోయానో తెలియదా
రిషి: తెలియదనే అడుగుతున్నా
మహేంద్ర: కొన్ని బంధాలు రబ్బరు బంతుల్లాంటివి..ఎంత తొక్కి పెడదామని చూస్తే అంత పైకి లేస్తాయి.. నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు-నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను
రిషి: మీరు కాలేజీ గురించి మాట్లాడుతున్నారా.ఇంటి గురించి మాట్లాడుతున్నారు
మహేంద్ర: కాలేజీలోనూ ఇంట్లోనూ నువ్వు నాకు కొడుకువే... కాలేజీని ఇంటిని వేర్వేరుగా చూడడం తప్పులేదు కానీ బాధ్యతల విషయంలో రెండూ ఒకటే...బంధాల విషయంలో వేర్వేరుగా చూస్తే నేను ఒప్పుకోను
రిషి: నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చేసినందుకు నిరసనగా మీరు రాజీనామా చేశారు..నన్ను వదిలి వెళ్లిపోవాలని ఎందుకు అనిపించింది.
మహేంద్ర:  నువ్వు నేను ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్యా ఉండాల్సినంత దగ్గరతనం లేదనిపించింది. నేను ఒంటరిని అవుతున్న ఫీలింగ్ కలిగింది
రిషి: ఇద్దరు వ్యక్తులు ఎంత దూరం ఉన్నా మధ్యలో మూడో వ్యక్తి వచ్చేసరికి ప్రాబ్లెం అవుతుంది
మహేంద్ర: ఇద్దరున్నా మనం అనొచ్చు..ముగ్గురున్నాం మనం అనొచ్చు..నువ్వు ఇద్దర్ని కలపి మనం అంటున్నావ్-నేను మనం ముగ్గురం కలిస్తే మనం అంటున్నా... అదే తేడా. నువ్వు ఎందుకిలా ఆలోచిస్తున్నావో అర్థంకావడం లేదు.. విత్తనం లేనిదే మొక్క లేదు... విత్తనానికి-మొక్కకు సంబంధం ఏంటి.. సృష్టిలో ఒకదానికి మరొకటి అంతర్గత సంబంధం ఉంటుంది. అర్థం చేసుకోవడం లోనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది.
రిషి: నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయడం లేదు
మహేంద్ర: నేను నీకు సమాధానం చెప్పాను..అర్థం చేసుకోవడం లేదో..అర్థం  చేసుకునే పరిస్థితుల్లో లేవో తెలియం లేదు.. మనం అనే భావన నువ్వు ఏనాడో వదిలేశావ్.. నీ ఆలోచనలేంటో నీ మనసులో ఏముందో దాన్నే నువ్వు మోస్తున్నావ్.. నీపై నాకు కోపం లేదు..నాకు నువ్వంటే ఎంతో ఇష్టం...కానీ ..నేను ఒంటరిని అనే ఫీలింగ్ కలిగింది..
రిషి: మీరు లేని ఇంట్లో నేనుండటం కష్టంగా ఉంది
మహేంద్ర: నీకు నేనెలా గుర్తొస్తున్నానో..నాకు జగతి అలా గుర్తొస్తుంది
రిషి: ఇంటికి రాలేరా...
మహేంద్ర: నీ మనసులో ప్రేమ ఉండాల్సిన చోట ద్వేషం దాగుంది..ఆ ద్వేషంలో నువ్వు ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నావ్... మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల మన కుటుంబం నవ్వుల పాలవుతోంది.. విషయం మినిస్టర్ గారివరకూ వెళ్లింది. ఇవన్నీ ఎందుకు జరిగాయో తెలుసా నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. నీ నిర్ణయం నీదైతే నా నిర్ణయం నాది..ఇందులో ఎలాంటి వివాదాలకూ తావులేదు...

Also Read: రిషి మనసులో మాట చెప్పి షాక్‌ ఇచ్చిన వసు, ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయిన మ్యాథ్స్‌ లెక్చరర్‌

జగతి ఇంట్లో మహేంద్ర రాకకోసం జగతి టెన్షన్ గా ఎదురుచూస్తుంటుంది.  
జగతి: రిషి ఏమన్నాడు ఏమైంది నువ్వేంటి అలా ఉన్నావ్.. రిషి ఏమన్నాడు రమ్మన్నాడా....
మహేంద్ర:  ( అటు జగతి వెళ్లగానే నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్లారు డాడ్ అన్న మాటలు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు) జగతి రావడం చూసి మళ్లీ నార్మల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. 
జగతి: రిషి రమ్మన్నాడా
మహేంద్ర: రావొచ్చు కదా డాడ్ అన్నాడు.. గట్టిగా వాడిని హత్తుకుని నీపై ఏకోపం లేదురా అని అరవాలని అనిపించింది... కానీ..వెళ్లడానికి రాలేదు కదా..ఎలాఅయినా వాడి ఆలోచనలు మారతాయని ఆశ జగతి
జగతి: బాధపెడితేనే ఆలోచనలు మారుతాయని ఎలా అనుకుంటున్నావ్
మహేంద్ర: 22 ఏళ్లుగా మంచిగా చేస్తూనే ఉన్నాను కానీ ఏం జరిగింది మారలేదు కదా..కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పదు కదా...
జగతి: సున్నితమైన రిషి మనసు కఠిన పరీక్షలు తట్టుకోగలదా
మహేంద్ర: ప్రతిసారీ రోగానికి తియ్యని మందులే ఇవ్వలేం కదా..కొన్నిసార్లు కఠిన మందులు ఇవ్వాలి కదా
జగతి: మినిస్టర్ దగ్గర జరిగిన విషయాలేవీ చెప్పలేదు కదా
మహేంద్ర: చెప్పలేదు..అయినా ఇంతజరిగినా రిషి ఇంకా తాను చేసింది కరెక్ట్ అనుకుంటున్నాడు...వాడికే అంతుంటే వాడి బాబుని నాకెంతుండాలి...
జగతి: నీ పట్టుదల రిషిలో కోపాన్ని పెంచుతోంది...నీ పట్టుదలతో రిషిని ఒంటరి చేస్తున్నావ్
మహేంద్ర: రిషి ఒంటరి కాకూడదనే ఒకర్ని నియమించానంటూ అటుగా వస్తున్న వసుధారని చూపిస్తాడు
జగతి: వసు రెస్టారెంట్ కి వెళుతున్నావా తినేసి వెళ్లు అని చెబుతుంది...

ఇంతలో రిషి నుంచి కాల్ వస్తుంది....
ఎక్కడున్నావ్ అని అడిగితే ఇంట్లో అంటుంది వసుధార... రిషి కాల్ కట్ చేస్తాడు... ఇద్దరూ కార్లో వెళతారు.. 
వసుధార: మనం ఎక్కడికి వెళుతున్నాం 
రిషి: ఆగ్రాకి వెళుతున్నాం
వసుధార:  ఆగ్రాకి ఎందుకు
రిషి: తాజ్ మహల్ చూసివద్దాం
వసుధార: సడెన్ గా తాజ్ మహల్ ఎందుకు
రిషి: వెటకారం కూడా నీకు అర్థంకాదా
వసుధార: మీరు అబద్ధాలు చెప్తారని అనుకోలేదు
రిషి: మళ్లీ ఇదొకటా..నీకు మనసులో ఏదీ దాచుకోవడం తెలిదా
వసుధార: మనసులో ఏమీ లేకపోతే తేలిగ్గా ఉంటుంది..హెడ్ వెయిట్ కూడా తగ్గుతుంది
రిషి: అంటే నాకు తలబిరుసు అంటావా
వసుధార: మీరు అలా అర్థం చేసుకుంటే ఏం చేయలేను.. ఇన్నిసార్లు అడిగాను ఎక్కడికి వెళుతున్నామో చెప్పలేదు
రిషి: మినిస్టర్ దగ్గరకు వెళుతున్నాం..
వసుధార: నేనెందుకు సార్...
రిషి: దిగు... 
వసుధార: ఊరికే అన్నాను నేనెందుకని

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
మినిస్టర్ ని కలసిన రిషితో... మీ అమ్మా నాన్న తెలివైనవాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వల్ల డీబీఎస్టీ ప్రతిష్ట మరింత పెరిగింది..సడెన్ గా ఆ ప్రాజెక్ట్ రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడుగుతారు. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ అనేసి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కార్లో వసుతో పాటూ వెళుతూ... నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని అందరూ అనుకుంటున్నారు కదా అంటే.. తప్పే సార్ కానీ మీరు తప్పు ఒప్పుకోరు కదా అంటుంది వసుధార...

Published at : 25 Mar 2022 09:11 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 25th March Episode 407

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం