Guppedantha Manasu మార్చి 24 ఎపిసోడ్: రిషి మనసులో మాట చెప్పి షాక్ ఇచ్చిన వసు, ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయిన మ్యాథ్స్ లెక్చరర్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 24 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu) మార్చి24 గురువారం ఎపిసోడ్
ఇంట్లో ఒంటరిగా కూర్చుని తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి. అటు మహేంద్ర కూడా రిషిని తలుచుకుని బాధపడతాడు. ఫోన్లో తండ్రి ఫొటో చూసుకుంటూ ఏం చేస్తున్నారు మీరు అనుకుంటూ కాల్ చేయనా అని ఆలోచిస్తాడు. లోపలకు వచ్చిన వసుధారని చూసి రామ్మా అని పిలిచిన మహేంద్ర..ఈ ట్యాబ్లెట్స్ నా కొడుకుకి నాపై ఉన్న ప్రేమకి నిదర్శనం అంటాడు. ఇంతలో రిషి కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది వసుధార. ఏంటి ఏమీ మాట్లాడకుండా ఆగిపోయావ్ అని మహేంద్ర అనడంతో...అట్నుంచి తండ్రి వాయిస్ విన్న రిషి చాలా ఏమోషన్ కి గురవుతాడు. డాడ్ ఎలా ఉన్నారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగితే మీరే అడగండి ఫోన్ ఇస్తున్నా అని మహేంద్ర చేతిలో ఫోన్ పెడుతుంది. డాడ్ అని రిషి పిలిచినా మహేంద్ర ఏమీ మాట్లాడలేక కట్ చేసేస్తాడు. తెల్లారగానే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది జగతి ( కాఫీ తగ్గించాలి డాడ్ అన్న రిషి మాటలు గుర్తుచేసుకుంటాడు). రిషి మారాలని నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ తనని ఎంత బాధపెడుతున్నావో ఆలోచించు వెళ్లిపో మహేంద్ర అంటుంది జగతి. ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ రావడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి రమ్మంటున్నారంటుంది జగతి. ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు జగతి అని మహేంద్ర.. కానీ రిషి లేకుండా కొనసాగించలేం అని జగతి అంటారు. రిషిని మార్చడం నీవల్లే సాధ్యమవుతుందంటాడు మహేంద్ర... ఇంతలో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు
Also Read: హిమ-ప్రేమ్, జ్వాల(శౌర్య)-నిరుపమ్, కార్తీకదీపంలో సరికొత్త ప్రేమకథలు మొదలయ్యాయ్
గౌతమ్: అంకుల్ ని కలిసి వెళదాం అని వచ్చాను
మహేంద్ర: రిషి ఎలా ఉన్నాడు గౌతమ్
గౌతమ్: వాడేం బాలేడు... ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు, ఏదేదో ఆలోచిస్తున్నాడు..మీరిక్కడి ఎందుకు వచ్చారో తెలియదు కానీ మీరు లేకపోతే రిషి ఎలాగో ఉన్నాడు అంకుల్
జగతి: మహేంద్ర..అని జగతి దీనంగా పిలిస్తుంది
మహేంద్ర: గౌతమ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మహేంద్ర... వెళ్లడానికి కాదుకదా ఇక్కడకు వచ్చింది.. గౌతమ్ రిషితోనే ఉండు..జాగ్రత్తగా చూసుకో...
కాలేజీలో అడుగుపెట్టిన రిషి..ఈ పొగరు వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తాడు. ఇంతలో ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతుంది పుష్ప. అక్కడ వసుధార ఉందేమో అని ఊహించుకున్న రిషి రాగానే కలవాలని తెలియదా అంటాడు. కలవడం ఏంటి సార్ అనగానే ..పుష్పని గమనించి తడబడి ఏదో కవర్ చేస్తాడు. ఇంతలో మహేంద్ర కార్ రావడం చూసి ..డాడ్ కారు ...ఆయన వస్తున్నారా అని ఆశగా ఎదురుచూస్తాడు రిషి. అందులోంచి గౌతమ్-వసుధార దిగడంతో డిస్సప్పాయింట్ అవుతాడు. మీతో మాట్లాడాలి సార్ అని వసుధార అంటే..నీకు నచ్చినప్పుడు అంటే ఎలా దానికో టైం ఉంటుంది కదా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. క్లాస్ కి టైం అవుతోంది నేను వెళతానని చెప్పి వెళ్లిపోతుంది. రిషి భోజనం చేయలేదని తెలుసుకుని ఆ క్యారియర్ ని వెనక్కు తీసుకుంటుంది వసుధార.
Also Read: దగ్గరున్నప్పుడు విలువ తెలుసుకోలేం-దూరమయ్యాక తెలుసుకుని ఏమీ చేయలేం, మనసుని మెలిపెట్టే సన్నివేశం
వసుధార: లోపలకు రావొచ్చా
రిషి: రా అని సైగ చేస్తాడు.. నువ్వేంటి ఆ ప్లేట్ క్యారేజీ...అతన్ని వద్దని చెప్పి పంపించాను కదా
వసుధార: అందుకే నేను తెచ్చాను
రిషి: నాకు ఆకలి లేదు..నా మూడ్ బాగాలేదు... కోపంలో ఏదో అనేస్తాను మళ్లీ నువ్వు బాధపడ్తావ్
వసుధార: నేను బాధపడతానని తెలిసినప్పుడు మళ్లీ అనడం ఎందుకు
రిషి: బెంచ్ పై ఉన్న ఏదో వస్తువుని విసిరికొడతాడు
వసుధార: మీరు భోజనం చేస్తానంటే మహేంద్ర సార్ గురించి రెండు విషయాలు చెబుదామని వచ్చాను..మీరు కోపంగా ఉన్నారంటూ వెళ్లిపోతూ..వెనక్కి పిలిస్తే బావున్ను అని వసుధార.. ఆగితే బావున్ను అని రిషి అనుకుంటారు. ఇంతలో వెనక్కు తిరిగి సార్ పిలిచారా అనగానే అవును-కాదు అన్నట్టు తలూపుతాడు. చేయికడుక్కుని రండి వడ్డిస్తాను అంటుంది. చేయి నొప్పి అనే ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ఎందుకు కొట్టాలి, ఎందుకు బాధపడాలి అనుకుంటూ... నేను కలిపి ఇస్తాను స్పూన్ తో తినేయండి అంటుంది.
రిషి: నీకు కోపం రాదా
వసుధార: ఎందుకు రాదు..మీపైనే వస్తుందనేసి...అంటే..మీ కోపమే నాకు కోపం తెప్పిస్తుందని కవర్ చేస్తుంది
రిషి: నువ్వు తిన్నావా అంటే తింటాను లెండి మీరు తినండి అంటుంది.. తింటున్నంత సేపూ డాడ్ గురించి ఏదో చెబుతానన్నావ్ అని పదే పదే అడుగుతుంటాడు..
వసుధార: మొత్తం తినండి సార్ చెబుతాను
రిషి: మొత్తం తినేశాక ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు
వసుధార: ఏంలేదు సార్ మహేంద్ర సార్ కాలేజీని చాలా మిస్సవుతున్నారు..
రిషి: చాలా ఫీలవుతున్నట్టున్నారు ఓసారి డాడ్ ని కలసి మాట్లాడాలి..అందుకు వసుధార హెల్ప్ తీసుకోవాలి
వసుధార: నేను హెల్ప్ చేయడం ఏంటి..మీ స్టూడెంట్ ని అసిస్టెంట్ ని హెల్ప్ చేయమని అడగాలా..ఆర్డర్ వేయండి.. మహేంద్ర సార్ ని కలుస్తారా-జగతి మేడం ఉన్నారని ఇబ్బంది పడుతున్నారా- మహేంద్ర సార్ ని బయటకు తీసుకురావాలా-అయినా ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతారు...మహేంద్ర సార్ ని కలవాలి అంటే డైరెక్ట్ గా కలసి మాట్లాడుతారు కదా.. మీరిద్దరూ మాట్లాడుకోనంతగా గొడవేం పడ్డారని
రిషి: డాడ్ తిన్నారో లేదో..టైమ్ కి ట్యాబ్లెట్స్ వేసుకున్నారో లేదో...
వసుధార: ఇందాక ఏదో హెల్ప్ అన్నారు
రిషి: అవసరం అయినప్పుడు అడుగుతాను
ఈ సిన్‌తో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.