Guppedantha Manasu మార్చి 23 ఎపిసోడ్: దగ్గరున్నప్పుడు విలువ తెలుసుకోలేం-దూరమయ్యాక తెలుసుకుని ఏమీ చేయలేం, మనసుని మెలిపెట్టే సన్నివేశం

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 23 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) మార్చి23 మంగళవారం ఎపిసోడ్

రెస్టారెంట్ కి వెళ్లి డ్యూటీ అయిన తర్వాత వసుధారని తీసుకుని బయటకు వెళ్లిన రిషి ఓ చోట కారు ఆపి సీరియస్ గా నిల్చుంటాడు. నా కొత్తప్రయాణం మొదలైంది నేను వెళుతున్నాను అన్న తండ్రి లెటర్ గుర్తుచేసుకుంటాడు. 
రిషి: ఏంటి వసుధార మాట్లాడవేంటి..చాలా విషయాల్లో సలహాలు సూచనలు ఇస్తుంటావ్ కదా..మా డాడీ ఇల్లు వదిలివెళ్లిపోవడంలో ఎవరిది తప్పంటావ్
వసుధార: మహేంద్ర సార్... అయినా ఇది మీ పర్సనల్ విషయం కదా
రిషి: మా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ సూచనలు ఇవ్వలేదా.. అడగకుండా ఉచితసలహాలు ఇస్తుంటారు కానీ అవసరానికి అడిగితే కనీసం ఏమీ చెప్పరు... మా డాడ్ అక్కడకు వచ్చి ఏం చెప్పారో నువ్వేం విన్నావో నాకు తెలియదు కానీ తను ఇలా చేయాల్సింది కాదు... డాడ్ ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి... వెళ్లి నిలదీయాలా, బతిమాలాలా , ఏం చేయాలి
వసుధార: మీ బాధను అర్థం చేసుకోగలను కానీ...
రిషి: సానుభూతి కాదు సలహా కావాలి.. స్టూడెంట్ గా కాదు..ఫ్రెండ్ గా ఆలోచించి చెప్పు. తెలిసీ తెలియని వయసులోనే అమ్మ వెళ్లిపోయింది. అన్నీ తెలిసి ప్రపంచాన్ని చూస్తుండగా డాడ్ వెళ్లిపోయారు. ఇక్కడ ప్రాబ్లెమ్ ఎవరిది, తప్పెవరిది, వాళ్లదా-నాదా...అరె అమ్మ గురించి ఎంత గొప్ప గొప్ప కథలు విన్నాను, బంధాలు-అనుబంధాల గురించి మాట్లాడుకుంటాం.. ఇద్దరూ వదిలి వెళితే తప్పు వాళ్లదా-నాదా...
వసుధార: మహేంద్ర సార్ అలా ఎందుకొచ్చారో...ఆ విషయంలో నేను ఏమీ మాట్లాడలేను 
రిషి: చాలా విషయాల్లో పాలు నీళ్లను వేరుచేసినట్టు మంచి చెడుని విశ్లేషించి మాట్లాడతావు కదా..ఇప్పుడెందుకు మాట్లాడవు? తల్లి బిడ్డని వదిలేసి వెళితే ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తప్పు తల్లిదా-బిడ్డదా... తండ్రి వదిలేసి వెళితే కొడుకు క్షోభపడుతుంటే ఆ తప్పు తండ్రిదా-కొడుకుదా.. తప్పెవరిది వసుధారా...వాళ్ల ఆలోచన సరైనదేనా..అలా ఒకరి తర్వాత మరొకరు వదిలేసి వెళ్లిపోతే ఏమనుకోవాలి.. అమ్మలేదని చిన్నప్పుడు ఏడ్చాను...నాన్న వెళ్లిపోయారని ఇప్పుడు ఏడ్వలేను కదా..న్యాయం అన్యాయాలు బాగా మాట్లాడగలవు...చాలాబాగా తీర్పు చెప్పగలవు కదా..ఎవరిది తప్పో చెప్పు వసుధార...
వసుధార: జగతి మేడం విషయంలో అయితే అని వసు మొదలెట్టేలోగా...
రిషి: జగతి మేడం అంటే నీకు అభిమానం...అందుకే తన తప్పొప్పులు నీకు కనిపించవు..డాడ్ ఎందుకిలా చేశారంటావ్
వసుధార: జరిగిన దాంట్లో ఎవరి తప్పేంటో చెప్పలేని పరిస్థితి
రిషి: అలా అని నా కర్మ ఇంతే అనుకోవాలా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
వసుధార: మీ ఆలోచనా విధానం మారితే కానీ జగతిమేడం-మహేంద్ర సార్ అర్థంకారు మీకు అనుకుంటుంది 

Also Read: మేనత్త ఇంట్లో హిమకి అవమానం, మావయ్య ఇంటికి చేరిన శౌర్య-అసలు కథ ఇప్పుడే మొదలైంది
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మహేంద్ర... రిషికి తినిపించిన సందర్భం గుర్తుచేసుకుంటాడు. తిను మహేంద్ర అని జగతి అంటే 
మహేంద్ర: ఇప్పుడేం వద్దు..రిషి గుర్తొస్తున్నాడు..పాపం వాడు తిన్నాడో లేడో .. ప్రతీసారీ డాడీ వచ్చాకే తింటానని నాకోసం ఎదురుచూసేవాడు
జగతి: దగ్గరున్నప్పుడు విలువ తెలుసుకోలేం..దూరమయ్యాక తెలుసుకుని ఏమీ చేయలేం... ఈ బంధాలింతే..
మహేంద్ర: ఇది తినండి డాడ్ అంటూ కొసరి కొసరి తినిపించేవాడు...బంధం విలువేంటో ఇప్పుడే తెలుస్తోంది..ఇన్నేళ్లూ నువ్వు అందర్నీ వదిలేసి ఎంత చిత్రవధకి గురయ్యావో కదా...
జగతి: డబ్బుల్లేకపోవడం పేదరికం కాదు..మనకుంటూ ప్రేమించేవారు లేకపోవడమే అసలైన పేదరికం.. ఎన్నోసార్లు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినకుండా కన్నీళ్లు పెట్టుకున్నాను తెలుసా.. ఈ బాధ నీకు వద్దు వెళ్లిపో మహేంద్ర..
మహేంద్ర: వెళ్లిపోతే తండ్రిగా రిషి ముందు గెలుస్తాను కానీ..భర్తగా ఓడిపోతాను... తండ్రిగా-భర్తగా కాదు ఓ మనిషిగా గెలవాలి అనుకుంటున్నా ....కొన్నాళ్లు గొంగళిపురుగులా ఉన్నా, కష్టాలు కన్నీళ్లు ఎదుర్కొ న్నా మళ్లీ మనం కలుస్తాం అనే ఆశతో ఉన్నాను. ఇన్నాళ్లూ తాడుకి చివరన ఉన్నా..ఇప్పుడీ బంధం ముడిపడుతుందని భావిస్తున్నాను
జగతి: ఇది చిక్కుముడిగా మారుతుందని భయపడుతున్నాను మహేంద్ర

రిషి కారు సౌండ్ విని డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి బయటకు పరుగుతీస్తాడు మహేంద్ర. రిషి కారులోనే కూర్చుని డోర్ వైపు చూస్తుంటాడు..తండ్రి ఏమూలనైనా కనిపిస్తాడేమో అని వెతుకుతూ ఉంటాడు. గుడ్ నైట్ చెప్పేసి వసుధార వెళ్లిపోతుంది..రిషి కూడా కాసేపు ఆగి అక్కడి నుంచి కదులుతాడు..ఇంతలో డోర్ తీసిన మహేంద్ర వెళ్లిపోతున్న రిషి కారువైపే చూస్తూ నిల్చుంటాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో రిషి కారు వెనక్కు వస్తుంది. మహేంద్ర మొహంలో సంతోషం చూసి జగతి మురిసిపోతుంది. తండ్రి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వసుధార చేతికి ఇస్తాడు. మనుషుల మీద కోపం మందులమీద చూపించొద్దని చెప్పు వసుధార అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మనుషుల మీద కోపం మందులమీద చూపించకండి మహేంద్ర అని జగతి కూడా సీరియస్ గా చెప్పేసి వెళ్లిపోతుంది. 
మహేంద్ర: రిషి ఏమన్నంటున్నాడు
వసుధార: రిషి సార్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం సార్
మహేంద్ర: నువ్వు వాడిపక్కనే ఉండు...వాడు ఎవరి మాటైనా విన్నాడంటే అది నీ ఒక్కదాని మాటే అనేసి వెళ్లిపోతాడు...

Also Read: శత్రువైతే యుద్ధం చేయాలి-ఆప్తుడు అయితే దగ్గరుండి బతిమాలాలి, గుప్పెడంత మనసులో అలజడి
ధరణి వడ్డిస్తుండగా దేవయాని, గౌతమ్ భోజనం చేస్తుంటారు. ఇంతలో రిషి రావడం చూసి ఎవరూ రిషిని ఏ ప్రశ్నలూ అడగొద్దు, బాధపెట్టొద్దు అని చెబుతుంది దేవయాని.  రా నాన్న అని నటన ప్రారంభిస్తుంది దేవయాని. కాల్ కట్ చేశావ్ ఎందుకు అని గౌతమ్ అడిగితే..ఏం మాట్లాడొద్దని చెప్పాను కదా అంటుంది. రా రిషి భోజనం చేయి అని అంటే నాకు ఆకలిలేదు మీరుతినండి అని కూర్చుంటాడు. మీనాన్నతో మాట్లాడావా-వెళ్లి కలిశావా-ఏం బాధపడొద్దు-ఎప్పుడోఓసారి ఇలా జరుగుతుందనే అనుకున్నాను అంటుంది దేవయాని. నేను బాధపడలేదు మీరు నా గురించి బాధపడొద్దు భోజనం చేయండి అని చెబుతాడు. అయినప్పటికీ కంచంలో చేతులు కడిగేసుకుని నువ్వు తినకుండా నేను తినలేను నాన్న..నువ్వు తిన్నావని తెలిశాక తింటాను.. నిన్ను ఎవరు ప్రేమగా చూడకపోయినా నా ప్రేమ తగ్గదు కదా అనేసి డ్రామా కంటిన్యూ చేస్తుంది. రిషి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏం చెప్పకుండా అన్నీ మనసులో దాచుకుంటాడు ఏంటి వదినా వీడు అని గౌతమ్ అంటే..దగ్గరవాళ్లకి కష్టం వస్తే ఓదార్చకపోయినా పర్వాలేదు కానీ కోపం ఎందుకు గౌతమ్ అంటుంది ధరణి. ఒక్కోసారి ఎవరి సమస్యలు వాళ్లే పరిష్కరించుకుంటే బావుంటుంది అంటుంది. ఎపిసోడ్ ముగిసింది...

రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
రిషిని కలిసిన వసుధార భోజనం చేయమని అడుగుతుంది. చిరాకు పడిన రిషితో మీరు భోజనం చేస్తే మహేంద్ర సార్ గురించి రెండు విషయాలు చెబుదామని వచ్చానంటుంది. అప్పుడు కూల్ అయిన రిషి భోజనం చేసేందుకు అంగీకరిస్తాడు. ఓసారి డాడ్ ని కలసి మాట్లాడాలి వసుధార హెల్ప్ తీసుకుంటే బావుంటుంది అనుకుంటాడు. అంతలో మహేంద్ర సార్ తో మాట్లాడాలి అంటే మీకు నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదుకదా..డైరెక్ట్ గా మీరే కాల్ చేసి మాట్లాడతారు కదా అంటుంది. 

Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 23rd March Episode 405

సంబంధిత కథనాలు

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్