Guppedantha Manasu మార్చి 22 ఎపిసోడ్: శత్రువైతే యుద్ధం చేయాలి-ఆప్తుడు అయితే దగ్గరుండి బతిమాలాలి, గుప్పెడంత మనసులో అలజడి
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మార్చి 22 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu)మార్చి22 మంగళవారం ఎపిసోడ్
నేను వెళుతున్నా అని లెటర్ పెట్టేసి లగేజీతో సహా వచ్చేసిన మహేంద్రని చూసి జగతి షాక్ అవుతుంది.
జగతి: ఏంటి మహేంద్ర ఇది
మహేంద్ర: వచ్చేశాను జగతి, ఆ ఇంటిని వదిలిపెట్టి ఈ ఇంటికి వచ్చేశాను, లోపలకు రావొచ్చా
మరోవైపు రిషి..మహేంద్ర రాసిన లెటర్ పట్టుకుని కూర్చుని ఏడుస్తాడు. డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నా , నేను స్వేచ్ఛాజీవిని, నా కొత్త ప్రయాణం మొదలైంది నేను వెళుతున్నా అన్న తండ్రి మాటలు గుర్తుచేసుకుంటాడు. తండ్రితో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ( బ్యాంగ్రౌండ్ లో నాన్న సెంటిమెంట్ సాంగ్). నన్ను వదిలవేసి ఎలా వెళ్తారు డాడ్ అనుకుంటాడు.
జగతి: తొందరపడ్డావ్ మహేంద్ర, రిషి మనసు గాయపడొద్దని చిన్న చిన్న విషయాలను కూడా మరీ మరీ చెబుతాను, అలాంటిది ఏకంగా ఇల్లు వదిలేసి వస్తే రిషి ఏమనుకుంటాడు, అసలే రిషి మనసులో దేవయాని అక్కయ్య విషాన్ని నింపింది, నువ్వు వచ్చేస్తే దేవయాని చెప్పినవన్నీ నిజం అవుతాయ్ కదా..తొందరపడ్డావ్ మహేంద్ర...
మహేంద్ర: తొందరపడ్డావ్ అని నువ్వంటున్నావ్...ఆలస్యం అయిందని నేనంటున్నా. శరీరంలో ఓ భాగం పాడైపోతే దాన్ని డాక్టర్స్ కోసితీసేస్తారు...ఆ క్షణం నొప్పి ఉన్న ఆ తర్వాత బావుంటుంది. మనం మూడు అడుగులు వెళుతుంటే వాడు ఆరు అడుగులు వెనక్కు వెళుతున్నాడు. తల్లిప్రేమతో తనని బాధ పెట్టొద్దు అంటున్నావ్...ఇలా ఇంకెన్నాళ్లు
జగతి: చెప్పకుండా రాజీనామా చేశావ్, చెప్పకుండా ఇల్లు వదిలేసి వచ్చావ్...ఇన్నాళ్లూ తల్లిమీదే ద్వేషం..ఇప్పుడు నువ్వు కూడా అలా చేస్తే ఎలా
మహేంద్ర: తను ఏం చేసినా చెల్లుతుందని, తన ఆలోచన కరెక్ట్ అని రిషి అనుకుంటున్నాడు...దాన్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా...అంతేకానీ రిషిపై కోపం, ద్వేషం లేదు. మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నాడని నువ్వు కూడా చూస్తున్నావు కదా.. మనం ఊరికే ఉండిపోతే వాడు మారడు
జగతి: శత్రువైతే యుద్ధం చేయాలి-ఆప్తుడు అయితే దగ్గరుండి బతిమాలాలి..మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రాంగ్ నిర్ణయం తీసుకున్నాడే అనుకో..అంతమాత్రాన నువ్వు రావడం కరెక్ట్ కాదు. తప్పుని మరో తప్పుతో సరిచేయలేము కదా... రిషి మనసులో ఉన్నవి రిషి ఆలోచనలు కాదు.. దేవయాని అక్కయ్య చిన్నప్పటినుంచీ మారిన విషబీజాలు. వాటిని తొలగించాలి కానీ మనం రిషిని తప్పుపట్టకూడదు.. ఏదేమైనా నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు మహేంద్ర.
వసుధార: మహేంద్ర ఇల్లు వదిలి వస్తే రిషి సార్ మనసులో ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో
Also Read: తనను పెంచిన తల్లిదండ్రుల పనికోసం శౌర్య మళ్లీ సౌందర్య ఇంటికి వెళుతుందా
లెటర్ చదివిన దేవయాని ఆవేశంతో ఊగిపోతుంది. వెళ్లిపోయి జగతికి దగ్గరయ్యాడని బాధపడాలా-రిషికి దూరమయ్యాడని సంతోషించాలా అనుకుంటా మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తుంది.
దేవయాని: ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదనగానే..చినమావయ్యగారికి కాల్ చేయమంటారా అని అడిగిన ధరణిపై మండిపడుతుంది. వెళితే బతిమలాడాలా, పెద్దవాళ్లు చిన్నవాళ్లని బతిమలాడాలా అని ఫైర్ అవుతుంది.
గౌతమ్: అలా అంటే ఎలా పెద్దమ్మా నేను వెళ్లి తీసుకొస్తా
దేవయాని: వెళ్లిపోతున్నా అని లెటర్ పెట్టి వెళ్లిపోతే వెళ్లి తీసుకురావాలా...మహేంద్రకి రిషిపై ప్రేమ లేనప్పుడు ఎవరేం చేస్తారు గౌతమ్
గౌతమ్ ఏదో మాట్లాడబోతుంటే..ఇది మా ఫ్యామిలీ మ్యాటర్..నువ్వు నా ఫ్రెండ్ వే కాదనడం లేదు..ఇది మా సమస్య..అనవసరంగా నువ్వు కల్పించుకోవద్దని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
సంతోషంగా ఉన్న దేవయానిని ధరణి గమనిస్తుంది..
రెస్టారెంట్ కి వచ్చిన రిషిని చూసి... మహేంద్ర సార్ ఇల్లు వదిలి వచ్చారని అడగడానికి వచ్చి ఉంటారు ఆ విషయంలో నేను ఏం మాట్లాడగలను అనుకుంటుంది. ఏం కావాలి అని అడిగితే నీ టైమ్ కావాలి అంటాడు. డ్యూటీలో ఉన్నానని రిప్లై ఇవ్వగానే కాఫీ తీసుకురా అని చెబుతాడు. ఓవైపు పనిచేసుకుంటూనే మరోవైపు రిషిని గమనిస్తుంటుంది. కాఫీ చల్లగా అయిపోతోంది తాగండి అనగానే.. మరో కాఫీ తీసుకురా అంటాడు. అలా వసుధార రెస్టారెంట్ డ్యూటీ టైమ్ అయ్యేవరకూ కాఫీలు ఆర్డర్ చేస్తూనే ఉంటాడు. అవగానే వసుతో పాటూ బయలుదేరుతాడు.
Also Read: జగతి కోసం మహేంద్ర డేరింగ్ స్టెప్, రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది
అటు దేవయానితో ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా అని గౌతమ్ అంటే..కాల్ చేద్దాం అంటుంది. రిషికి కాల్ చేస్తే ఎక్కడున్నాడో చెబుతాడా అన్న గౌతమ్ తో అందుకే వసుధారకి కాల్ చేద్దాం అంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థంకావడం లేదు...మహేంద్ర వెళ్లిపోవడం-రిషి చెప్పకుండా వెళ్లడం ఏంటో అర్థంకావడం లేదు. ధరణి నుంచి కాల్ రావడంతో ఆ విషయం రిషికి చెబుతుంది వసుధార. ఆన్సర్ చేయకు కాల్ కట్ చేయి అని చెబుతాడు. నన్ను వసుధారకి కాల్ చేయమంటావా అని గౌతమ్ అంటే..నువ్వు రిషికి కాల్ చేయి అంటుంది. గౌతమ్ కాల్ కూడా కట్ చేస్తాడు రిషి. నాకు అర్థం అయిందిలే అంటుంది దేవయాని. ఇద్దరూ ఒకేచోట ఉన్నారనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది. నేను కాల్ ఎందుకు కట్ చేయమన్నానో, నిన్ను ఎందుకు రమ్మన్నానో, ఏం మాట్లాడతానో నీకు తెలుసా అని రిషి అంటే తెలుసు అంటుంది వసుధార. అందరకీ క్లారిటీ ఉంటుంది అంటాడు రిషి.
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మహేంద్ర సార్ కరెక్ట్ అంటావా వసుధార అని రిషి అడిగితే..ఇది మీ వ్యక్తిగతం అని సమాధానం ఇస్తుంది.
మా వ్యక్తిగత విషయాల్లో సూచనలు ఎప్పుడూ ఇవ్వలేదా అంటూనే సానుభూతి కాదు సలహా కావాలి... ఓ స్టూడెంట్ గా వద్దు ఓ ఫ్రెండ్ గా ఆలోచించి సలహా ఇవ్వు అంటాడు. అక్కడి నుంచి నేరుగా జగతి ఇంటికి వెళతారు ఇద్దరూ...