అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 21 ఎపిసోడ్: జగతి కోసం మహేంద్ర డేరింగ్ స్టెప్, రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూ సాగుతోంది. మార్చి 21 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు (Guppedantha Manasu ) మార్చి 21 సోమవారంఎపిసోడ్

 వసుధారని తీసుకుని ఇంటికొచ్చిన మహేంద్రని చూసిన రిషి... డాడ్ ఈ టైమ్ లో వసుధార అని అడిగితే..మాక్కొన్ని పనులున్నాయ్ అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.  ఎందుకొచ్చినట్టో తెలుసుకోవచ్చా అని రిషి అంటే..మహేంద్ర సార్ ని అడగండి అని సమాధానం చెప్పేసి వెళ్లిపోతుంది. వాళ్లు ఎందుకొచ్చారో నేను తెలుసుకుంటాను నువ్వు నన్ను కూడా డిస్ట్రబ్ చేయకు అని గౌతమ్ అంటాడు. రిషి ఒక్కడే రూమ్ లో ఆలోచిస్తుంటాడు. వీళ్లు నా దగ్గర ఏదో దాస్తున్నారు అనుకుంటాడు. అటు గౌతమ్ నన్ను కూడా కలుపుకోండి అని అడగడంతో సరే అంటారు. అటు ధరణి కాఫీలు తీసుకెళ్లి ఇస్తుంది. ఇక ఆగలేకపోయిన రిషి ఆ రూమ్ కి వెళతాడు.. 
రిషి: డాడ్ ఏం జరుగుతోంది
మహేంద్ర: జరగాల్సిందే జరుగుతోంది
రిషి: నన్ను కూడా పిలిస్తే జాయిన్ అయ్యేవాడిని కదా
మహేంద్ర: ఇది కాలేజీకి సంబంధించింది కాదు మా వ్యక్తిగతమైన విషయం..
రిషి: వసుధార ఏం చేస్తున్నారో నువ్వైనా చెబుతావా
గౌతమ్: నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని అంకుల్, మేడం సరిచేసే పనిలో ఉన్నారని వాగేస్తాడు గౌతమ్... మహేంద్ర వారిస్తున్నా వినకుండా..నిజం చెబితే నాకు తృప్తిగా ఉంటుంది. నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ఆపేశావంట కదా ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటోందట, ప్రాజెక్ట్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని మీటింగ్ పెట్టుకున్నాం, అందులో నేను కూడా జాయిన్ అయ్యానంటాడు.  ( వసుధార ఫైల్స్ తీసుకుని అక్కడి నుంచి జారుకుంటుంది). గౌతమ్ నువ్వెళ్లి వసుధారని డ్రాప్ చేసి రా అని అంటే..పర్లేదు సార్ నేను వెళ్లిపోతాను అంటుంది వసుధార. గౌతమ్ ని అడ్డుకుని రూమ్ లోకి పంపించేస్తాడు రిషి. 

Also Read: 24 గంటలు డెడ్ లైన్, రిషి-మహేంద్రలో తగ్గేదెవరు-నెగ్గేదెవరు
రిషి: డాడ్ నాకు చెప్పాల్సిన అవసరం లేదా
మహేంద్ర: ఏ విషయం గురించి మాట్లాడుతున్నావ్
రిషి: ఇంత జరుగుతున్నా చెప్పరా...
మహేంద్ర: మీరు ఆ ప్రాజెక్ట వద్దనుకున్నారు కదా
రిషి: డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఈ విషయం నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా
మహేంద్ర: నేను ఆ పదవికి ఎప్పుడో రాజీనామా చేసేశాను కదా
రిషి: నేను అంగీకరించలేదు కదా
మహేంద్ర: నేను మానసికంగా ఎప్పుడో కాలేజీకి దూరమైపోయాను
రిషి: ఓ నిర్ణయం తీసుకుంటే దానికి గడువు ఇవ్వాలి కదా...
మహేంద్ర: నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకుంటావ్, నన్ను మాత్రం రూల్స్ పాటించమంటున్నావ్...అర్థం కాలేదా... ఇంకా వివరంగా చెప్పాలా.. మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేసినప్పుడు ఎవ్వర్నీ అడగలేదు కదా..జగతి విషయం ఏ జరగాలని అనుకుంటున్నావో నాకు తెలుసు..అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు...
రిషి: నేను చేసింది తప్పు అంటున్నారా
మహేంద్ర: అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు, వ్యక్తుల మీద కోపాన్ని సంస్థపై చూపావ్, తప్పు చేశావో-ఒప్పు చేశావో నువ్వే ఆలోచించుకో... జగతికి నష్టం చేద్దామని ప్లాన్ చేశావ్... ఆ ప్రాజెక్టు లో నువ్వే లేవు.. ఆ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిర్వహిస్తోంది...దాన్ని జగతి చూసుకుంటోంది... నేను జగతి భర్తగా బాధ్యత నిర్వహిస్తున్నాను, వసుధార-గౌతమ్ కూడా ఇందులో ఉన్నారు...
రిషి: మనిద్దరి మధ్యా మేడం విషయంలో తప్ప మరే విషయంలోనూ గొడవలు రావు, ఆవిడ టాపిక్ వదిలేద్దాం... మరోసారి ఆ ప్రస్తావన వద్దు
మహేంద్ర: గుడ్ నైట్ రిషి నిద్ర వస్తోంది...

Also Read: ఒకరు ప్రకృతి-మరొకరు ప్రళయం, హిమ-శౌర్యగా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ ఎంట్రీ
రిషి చిన్నప్పటి ఫొటోలు చూస్తూ ఏవేవో ఆలోచించుకుంటుంది జగతి. నా ముందు నిలబడి ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడతావ్, ఈ జన్మకి ఇది సాధ్యమేనా...  ఒకప్పుడు ఈ ఫొటోలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి..కానీ ఇప్పుడు గుండె బండరాయిగా మారిందా...నాపై కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, మిషన్ ఎడ్యుకేషన్ ఎందరికో ఉపయోగపడుతుంది, మరెందరికో స్ఫూర్తి నిస్తుంది అనుకుంటుంది.. ఇంతలో దేవయాని నుంచి జగతికి కాల్ వస్తుంది...
దేవయాని: నీ విషయంలో పొరపాటు ఇంకెప్పుడూ చేయను, మాట్లాడాలని చేశాను
జగతి: వంటేం చేశారు, సినిమాలేం చూశారు, చీరలేం కొన్నారు...
దేవయాని: మనకు అంత చనువు లేదు కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి
జగతి: నేను అదే అనుకుంటున్నా...మరి ఫోన్ ఎందుకు చేశావో కనుక్కోవచ్చా
దేవయాని: ప్లేట్ తిప్పావా రూట్ మార్చావా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావ్.. నువ్వు రావడం మహేంద్ర వచ్చి కారెక్కడం
జగతి: చూశారా..కనిపించకపోయారా కాళ్లకు దండం పెట్టుకునేదాన్నిగా
దేవయాని: నువ్వు వచ్చి వెళ్లావ్...ఈరోజు నీ శిష్య పరమాణువు వచ్చింది...కలలు కంటున్నావా
జగతి: నేను ఇక్కడ హాయిగా నిద్రపోతున్నా...నేనెక్కడ ఆ ఇంటికి వస్తానో అని మీరు నిద్రపోవడం లేదు కదా
దేవయాని: నీ ధైర్యం ఏంటో..
జగతి: నా కొడుకే నా ధైర్యం... నా ధైర్యం ఏంటో చూసే రోజు త్వరలోనే వస్తుంది...మీకు పనిలేదు ఎంతసేపైనా మాట్లాడతారు, నాకు పని ఉంది బై

నాపై కోపంతో మిషన్ ఎడ్యుకేషన్ పక్కనపెట్టావ్... అందరిమంచికోసం ఆలోచించే నాయకుడు తన వ్యక్తిగతం పక్కనపెట్టాలి అప్పుడే నిజమైన నాయకుడు అవుతాడు అనుకుంటుంది.

రిషి-గౌతమ్: రూమ్ లో ఒంటరిగా కూర్చున్న రిషి ప్రాజెక్ట్ గురించి అంతా అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్.. ఏమైంది రా నీకు అంటే బాగానే ఉన్నా అంటాడు గౌతమ్. నీ ఫ్రెండ్ ని రా..ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఏదో సందర్భంలో నిజం చెబుతారు కానీ నువ్వు నాకెప్పుడూ అబద్ధమే చెబుతున్నావ్. తప్పుల మీద తప్పులు చేస్తున్నావేంటని గౌతమ్ ఏదో చెప్పబోతుంటే నువ్వు అన్నింట్లో జోక్యం చేసుకోవద్దని రిషి చెబుతాడు. నాకో క్లారిటీ ఉంది అంటాడు రిషి. నాకున్న అత్యంత అపురూపమైన బంధం డాడ్...నేను పోగొట్టుకోలేను-కొత్త బంధాన్ని కలుపుకోలేను...నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నేను ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు నాకు సలహాలు ఇవ్వొద్దంటాడు. అటు మహేంద్ర కూడా ఒంటరిగా కూర్చుని ప్రాజెక్ట విషయంలో రిషి మాటలు, ప్రవర్తన మొత్తం తలుచుకుంటాడు. 

తెల్లారేసరికి ధరణి హడావుడిగా పరిగెత్తుకు వచ్చి రిషిని నిద్రలేపుతుంది. చిన మావయ్యగారు కనిపించడం లేదని ఏడుస్తూ చెబుతుంది. నేను ఇల్లంతా వెతికాను రిషి ఎక్కడా లేరని ధరణి చెబుతుంది. గదిలో షెల్పులు అన్నీ ఖాళీగా ఉంటాయి...డాడ్ బట్టలు కూడా తీసుకెళ్లిపోయారేంటి అడుగుతాడు. అక్కడున్న లెటర్ చూసిన రిషి చదువుతాడు.
మహేంద్ర లెటర్లో: నా కొత్త ప్రయాణం మొదలైంది, నేను వెళుతున్నాను రిషి...ఎక్కడికో మీ అందరికీ తెలుసు...అని ఉంటుంది. అది చూసి రిషి కన్నీళ్లతో కుప్పకూలిపోతాడు.  

రేపటి ( మంగళవార) ఎపిసోడ్ లో
తలుపు తీసిన జగతి బట్టలు సర్దుకుని వచ్చేసిన మహేంద్రని చూసి షాక్ అవుతుంది. తొందరపడ్డావ్ మహేంద్ర అని జగతి అంటే.. ఇప్పటికే ఆలస్యం అయిందని నేననుకుంటున్నా అంటాడు. మహేంద్ర సార్ ఇల్లు వదిలి వచ్చేస్తే రిషిసార్ ఏమనుకుంటున్నారో అనుకుంటుంది వసుధార. నన్ను వదిలేసి ఎలా వెళతారు డాడ్ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget