అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 19 ఎపిసోడ్: 24 గంటలు డెడ్ లైన్, రిషి-మహేంద్రలో తగ్గేదెవరు-నెగ్గేదెవరు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూ సాగుతోంది. మార్చి 19 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు మార్చి19శనివారం ఎపిసోడ్

మహేంద్ర-గౌతమ్ ఇంట్లో క్యారెమ్స్ ఆడుతుండగా జగతి కాల్ చేస్తుంది. మహేంద్ర మాట్లాడాలి అనడంతో..ఇంటికి రావాలా అని అడుగుతాడు మహేంద్ర. ఆల్రెడీ ఇంటిముందు కార్లో ఉన్నానంటుంది. గౌతమ్ మనం మళ్లీ ఆడుదాం అనేసి వెళ్లిపోతుంటే.. జీవితంలో అంత విషాదం ఉన్నా అంకుల్ హ్యాపీగా ఉంటారు, ఈ రిషి గాడే వాడి సొమ్మోదే తిన్నట్టు మొహం ఏదోలా పెడతాడు. కిందకు వెళుతున్న మహేంద్రని దేవయాని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాడు. అదేంటి పిలిచినా వినిపించుకోవడం లేదని అనుకుంటూ వెనుకే వెళ్లిన దేవయాని జగతిని చూసి షాక్ అవుతుంది. వీళ్లకి కాలేజీలో జరిగిన సంఘటనతో ధైర్యం వచ్చేసింది, ఏకంగా ఇంటికే వచ్చేసింది, ఏదో ఒకటి చేయకపోతే ఏకంగా ఇంటికే వచ్చేస్తుందేమో అనుకుంటుంది దేవయాని.

Also Read: ''వదిలేదేలే'' అన్న శౌర్య, అక్కని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానన్న హిమ, కొత్త పాత్రలతో సరికొత్తగా
రిషికి ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దు, రిషిని కష్టపెట్టొద్దని చెప్పినా నువ్వెందుకు వినలేదు. రాజీనామా చేశావెందుకు
మహేంద్ర: ప్రతిదానికీ రిషి ఆనందం కోసం నువ్వు తాపత్రయం పడుతున్నావ్, ఇది కరెక్ట్ కాదు... నీకు రిషినే జీవితం, కానీ రిషి జీవితంలో నువ్వు లేవు..అయినా నువ్వు రిషికోసం ఆరాటపడుతుంటావ్, నేను నీలా ఉండలేను
జగతి; ఉండలేకపోతే నువ్వు రాజీనామా చేయడం ఏంటి, నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకు కోపం వచ్చి రాజీనామా చేస్తే తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించావా
మహేంద్ర: రిషి తండ్రిని, కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని కానీ జగతికి భర్తను కూడా
జగతి: నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు చేసింది కరెక్ట్ కాదు
మహేంద్ర: నువ్వు ప్రతి విషయాన్నీ ఒకవైపే ఆలోచిస్తున్నావ్.. ప్రపంచానికి నువ్వు వాడి తల్లివి అని తెలిస్తే వాడు అరుస్తాడు, మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేస్తే బాధపడకూడదు...నువ్వు గారాబం చేస్తూ అతిప్రేమ చూపిస్తున్నావ్... నేను రాజీనామా చేస్తేనే వాడు ఆలోచిస్తాడు, ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు
జగతి: తనేదో కోపంలో డెసిషన్ తీసుకున్నాడని, నువ్వు కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటి
మహేంద్ర: నేను రాజీనామా చేస్తే నిన్ను రాయబారానికి వాడుకుంటున్నాడు, నీకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రిషి బాధపడతాడని చూస్తున్నావ్ కానీ నా బాధ నీకు పట్టదా... రిషి తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి, మనం ప్రేమగా ఆలోచిస్తుంటే వాడు తప్పుల మీద తప్పులు చేస్తుంటాడు
జగతి: నువ్వు కాలేజీ వదిలేస్తే రిషి ఒంటరివాడవుతాడు
మహేంద్ర: నువ్వు ఒంటరి అయినప్పుడు ఎవరు నిల్చున్నారు, రిషి బాధపడతాడని నువ్వు-బాగుపడతాడని నేను అనుకుంటున్నాను. ప్రపంచానికి నువ్వు తల్లివి అని తెలిసినా వాడిలో ఎలాంటి మార్పు లేదు. నువ్వు సార్ అని వాడు మేడం అని పిలుస్తాడు. మీరంతా బాగానే ఉంటారు. దీనికి అంతం అంటూ ఉండాలి కదా
జగతి: మరోసారి ఆలోచించు, కాలేజీని విడిచిపెట్టకు
మహేంద్ర: నేను చేసింది కరెక్ట్ అని నీక్కూడా తెలుసు, పుత్రప్రేమ అడ్డొస్తోంది. రాజీనామా వెనక్కు తీసుకోవాలని రిషి నీతో చెప్పిస్తున్నాడా, అదేదో నాకే చెప్పొచ్చు కదా, రిషి నిన్ను కాలేజీ నుంచి పంపించాలని డిసైడ్ అయ్యాడు అది కరెక్ట్ కాదు.... 24 గంటల గడువు వాడు నాకివ్వడం కాదు..నేనే రిషికి ఇస్తున్నాను వాడినే నిర్ణయం మార్చుకోమను... 
జగతి: నేను ఏం చెబితే నీకు అర్థం అవుతుంది
మహేంద్ర: నువ్వు రిషి తల్లిగా కాకుండా మహేంద్ర భూషణ్ భార్యగా ఆలోచించు నీకే అర్థమవుతుంది...

Also Read: మహేంద్ర షాకింగ్ డెసిషన్, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ జగతిపై రిషి ఫైర్
దేవయాని: జగతికి కాలేజీలో అవమానం జరిగిందని సంతోషిస్తే దాని ధైర్యం ఇంకా పెరిగిపోతోంది. ఇలాగే వదిలేస్తే మరింత మితిమీరిపోతారు. రిషి అక్కడకు రావడంతో దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది.
దేవయాని: రిషి జగతి ఇంటికి వచ్చింది, ఇంటి ముందు కార్లో వచ్చి ఆగితే మహేంద్ర వెళ్లి కార్లో కూర్చున్నాడు నా కళ్లతో చూశాను, చుట్టు పక్కల వాళ్లు చూస్తే ఎలా ఉంటుంది చెప్పు, ఈ రోజు ఇంటిముందుకు వచ్చింది, రేపు గడపదాటి లోపలకు వస్తుందేమో రిషి అని దొంగ ఏడుపు ఏడుస్తుంటుంది. ఆ జగతి ధైర్యం చూశావా నీ తండ్రిని నీ నుంచి ఒక్కో అడుగు దూరం చేయడానికి ప్రయత్నిస్తుందేమో తన ఆలోచన నాకు తెలుసు నాన్న, నేను భయపడినవి అన్నీ జరుగుతున్నాయ్...నా మనసు కీడు శంకిస్తోంది..ఏదో జరగబోతోంది, మహేంద్ర తన వల్లో పడ్డాడు, నువ్వు అలా కాకూడదు, మహేంద్రని దూరం చేసుకోవద్దు నాన్న
రిషి: నాపై మీకెంత ప్రేమో నాకు తెలుసు, మీరు నన్ను అపురూపంగా పెంచారు..కానీ డాడ్ ని నేను ఎప్పటికీ దూరం చేసుకోను... డాడ్ ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి గడప తొక్కుతారేమో కానీ అంతకుమించి ఏం కాదు...
దేవయాని: నాకు కావాల్సింది కూడా ఇదే అని మనసులో అనుకుంటుంది.

రూమ్ లోకి వెళ్లి రిషి..24 గంటల్లో రాజీనామా వెనక్కుతీసుకోవాలని చెప్పాను కదా ఆ విషయంలో నచ్చచెప్పే పనిలో ఉన్నారేమో డాడ్ అనుకుంటాడు. ఏంటి వసుధార ఏం చేద్దాం అని మహేంద్ర అంటే మేడం చెప్పినట్టు దూసుకెళ్లిపోవడమే అంటుంది. ఇప్పుడు ఇంటికి వెళుతున్నాం కదా నువ్వు రిషిని ఫేస్ చేయగలవా అంటే.. నావైపు తప్పులేకపోతే ఎవర్ని అయినా ఫేస్ చేస్తా అంటుంది. నీ ఆలోచనలు, ధైర్యం చూస్తే నాకు ముచ్చట వేస్తుందన్న మహేంద్రతో...ఒకవేళ రిషి సార్ అరిచినా మనం బ్యాలెన్సె డ్ గా ఉండాలంటుంది.  ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. 

రిషి ఏం చేస్తున్నాడని గౌతమ్ ని అడుగుతుంది ధరణి. వాడు మేఘం లాంటోడు ఎప్పుడు మెరుస్తాడో, ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు కురుస్తాడో అర్థం కాదంటాడు. వాడి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదంటాడు. ఇంతలో మహేంద్రతో కలసి వసుధార రావడం చూసి సంబరపడిపోతాడు గౌతమ్. నువ్వు నాకో హెల్ప్ చేయాలన్న మహేంద్రతో...ఏం చేయాలో చెప్పండి అంకుల్ అంటాడు గౌతమ్. మాక్కొంచెం పని ఉంది నువ్వు డిస్టబ్ చేయకుండా ఉండటమే కావాలంటాడు. అంకుల్ నేను ఉపయోగపడతానేమో నేను కూడా వస్తానన్న గౌతమ్ తో...రానివ్వండి సార్ అంటుంది వసుధార. సరే రా గౌతమ్ అంటాడు మహేంద్ర.

దేవయాని ఇంట్లో: మెట్లపై నుంచి ఇదంతా గమనిస్తుంటాడు రిషి. డాడ్ ఈ టైమ్ లో వసుధార అని అడిగితే..మాక్కొన్ని పనులున్నాయ్ అని సమాధానం చెప్పిన మహేంద్ర పద వసుధార అంటాడు. ఎందుకొచ్చినట్టో తెలుసుకోవచ్చా అని రిషి అంటే..మహేంద్ర సార్ ని అడగాలని సమాధానం చెప్పేసి వెళ్లిపోతుంది. వాళ్లు ఎందుకొచ్చారో నేను తెలుసుకుంటాను నువ్వు నన్ను కూడా డిస్ట్రబ్ చేయకు అనేసి గౌతమ్ వెళ్లిపోతాడు. ఇదంతా పక్కనుంచే వింటుంది దేవయాని. మరోవైపు జగతి చిన్నప్పటి రిషి ఫొటోలు చూస్తూ  కూర్చుంటుంది. 

సోమవారం ఎపిసోడ్ లో
వసుధార ఎందుకు వచ్చింది, వీళ్లు నా దగ్గర దాస్తోంది అనుకుంటూ అక్కడకు వెళతాడు రిషి.ఏం చేస్తున్నారో చెబితే నేనుకూడా జాయిన్ అవుతా అంటాడు. ఇది కాలేజీ పని కాదు రిషి..మా పర్సనల్ పని అని మహేంద్ర రిప్లై ఇస్తాడు. వసుధార నువ్వైనా చెప్పు అంటే... నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని అంకుల్,మేడం సరిచేసే పనిలో ఉన్నారంటాడు గౌతమ్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Naveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP DesamUS Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABPNallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget