Karthika Deepam మార్చి 19 ఎపిసోడ్: ''వదిలేదేలే'' అన్న శౌర్య, అక్కని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానన్న హిమ, కొత్త పాత్రలతో సరికొత్తగా

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 19 శనివారం 1304 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం మార్చి 19 శనివారం ఎపిసోడ్

హిమ ఓ హోటల్ ముందు నీళ్లుతాగుతుంటే ప్రేమ్ చూసి సౌందర్యకి చెబుతాడు. వెతుక్కుంటూ వెళ్లిన సౌందర్యకి రోడ్డుపై ఒంటరిగా ఉన్న హిమ కనిపిస్తుంది. వెనుకనుంచి వస్తున్న ఆటోని చూడకుండా వెళుతున్న హిమని చేయిపట్టుకుని లాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. మరోవైపు ఇంట్లో తల్లిదండ్రుల ఫొటోలు చూసి ఏడుస్తున్న శౌర్యని ఆదిత్య,శ్రావ్య, ఆనందరావు ఓదార్చుతారు. అన్నం తినమని అందరూ చెప్పినా అమ్మా-నాన్న గుర్తొస్తున్నారని బాధపడుతుంది. నా కళ్లముందే కారు లోయలో పడిపోయింది బాబాయ్ అంటుంది. ఇంతలో ప్రేమ్, నిరుపమ్ వస్తారు..ఆ వెనుకే సౌందర్య-హిమ వస్తారు. హిమని చూసి అంతా షాక్ అవుతారు. 

Also Read: ఇంటికొచ్చిన హిమ, శౌర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది- ఇదే కీలక మలుపు

హిమని చూసి శౌర్య ఆగ్రహంతో ఊగిపోతుంది. హిమ బతికేఉందా అని ఆనందరావు అడిగితే అవునండీ అంతా ఆ దేవుడి దయ అంటుంది సౌందర్య. యాక్సిడెంట్ రోజు జరిగినదంతా శౌర్య తలుచుకుంటుంది. ఇంట్లోకి వస్తున్న హిమని ఆగు అని అరుస్తుంది. శౌర్య: అసలెందుకు వచ్చావ్, అమ్మా-నాన్నని చంపేశావ్ కదా, ఇంకేం చేద్దామని వచ్చావ్
సౌందర్య: ఎందుకమ్మా అంత కోపం
నానమ్మా..తనని లోపలకు తీసుకురావొద్దు, అమ్మా-నాన్నల చావుకి అదే కారణం 
సౌందర్య: ఈ ఇంట్లో నీకెంత హక్కుందో దానికీ అంత హక్కు ఉంది...
ఆదిత్య: జరిగిందేదో జరిగిపోయింది
శౌర్య: ఇంట్లో తనో-నేనో ఒకరే ఉండాలి
హిమ: నేను వెళ్లిపోతాను
సౌందర్య: దాని మాటలు నువ్వు పట్టించుకోకు ఇంట్లోకి పద
శౌర్య: మా ఇద్దరిలో ఎవరో ఒకరే ఇంట్లో ఉండాలి
హిమ: నన్ను క్షమించు
శౌర్య: అమ్మా-నాన్నని చంపేశావ్..నాతో మాట్లాడొద్దు అనేసి లోపలకు వెళుతుంది.. అక్కడకు వచ్చిన హిమను నా గదిలోకి రావొద్దని చెప్పి పంపేస్తుంది. నేను చెప్పేది విను అన్న హిమతో..నువ్వేం చెప్పొద్దు అమ్మా-నాన్నని చంపేశావ్, అక్కడున్నది నేనే కదా , నీ డ్రైవింగ్ పిచ్చితోనే అమ్మానాన్నని చంపేశావ్, నువ్వు ఈ రూమ్ లోకి రావొద్దు వెళ్లిపో
హిమ: అనుకోకుండా అలా జరిగిపోయింది...అమ్మా-నాన్న లేకపోతే నాక్కూడా బాధ ఉంటుంది
శౌర్య: తాడికొండ వెళ్లి వచ్చినప్పటి నుంచీ నీ మాటల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది, అమ్మా-నాన్నని నువ్వే చంపావ్
హిమ: నువ్వు అలా అంటుంటే నాకింకా బాధేస్తోంది
శౌర్య: మనిద్దరం ఒకే దగ్గర పెరగకపోయినా నువ్వంటే చాలా ఇష్టం, నాకో సిస్టర్ ఉందని నాకు చాలా ఆనందంగా ఉండే... కానీ ఆ సిస్టర్ అమ్మా-నాన్నని చంపేస్తుందని అనుకోలేదు
హిమ: నన్ను క్షమించు శౌర్య,ప్లీజ్
శౌర్య: హిమ చేయి విదిలించుకుని వెళ్లిపోతుంది శౌర్య.

Also Read:  మహేంద్ర షాకింగ్ డెసిషన్, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ జగతిపై రిషి ఫైర్

హాల్లో నలుగురు మనవలని పెట్టుకుని అన్న తినిపిస్తుంది సౌందర్య. అన్నం తినమని అడిగినా వద్దంటుంది. అందరూ తింటున్నారు కదా తినిమ్మా అని ఆనందరావు అంటే..అందరూ తింటున్నారనే నేను తినడం లేదంటుంది. ఎందుకే ఇలా తయారయ్యావ్, మీ అందరికీ నాచేత్తో అన్నం తినిపించే అదృష్టం వస్తుందని నేను అనుకోలేదంటుంది సౌందర్య. కానీ దురదృష్టం వస్తుందని అనుకున్నాను అంటుంది శౌర్య. హిమ-శౌర్యని కూడా ప్రేమ్-నిరుపమ్ స్కూల్లో చేర్పించు ఆదిత్య అన్న సౌందర్యతో... అవును అమ్మమ్మ ఈ ఆలోచన బావుంది.  హిమ చేరిన స్కూల్లో నేను చదవను, అంతగా అయితే చదువు మానేస్తాను అంటుంది. పొద్దున్న నుంచీ అందరం బతిమలాడుతున్నా ఎందుకు మాట వినడం లేదని అంటారు. పాపం హిమ కుమిలిపోతోంది ఆ బాధే దానికి పెద్ద శిక్ష...ఇంకా నువ్వు ఇలా మాట్లాడి దాన్ని హింసించకు అనడంతో శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

హిమ: శౌర్యకి నేనంటే ఇష్టం, నాకూ శౌర్య అంటే ఇష్టం... అందుకే పచ్చబొట్టు వేయించుకున్నాం కానీ అమ్మా-నాన్నల కోపానికి నేనే కారణం అని తనకికోపం. నేను కారు నడపకుండా ఉండాల్సింది...నేను ఎంత బాధపడినా మీరు తిరిగిరారు కదా..తప్పు నాదే కదా.
శౌర్య: ఛీ ఛీ అనవసరంగా హిమ పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను, ఈ దరిద్రం ఎంత రుద్దినా పోవడం లేదు. 
సౌందర్య: ఏయ్ రౌడీ ఏం చేస్తున్నావ్
శౌర్య: అమ్మా-నాన్ని చంపేసిన హిమ పేరు నా చేతిపై ఉంటే ఎప్పుడూ అదే గుర్తొస్తుంది
సౌందర్య: కవలపిల్లలు ఎంతప్రేమగా కలసి ఉండాలి, జరిగిందేదో జరిగిపోయింది..హిమని ఎందుకు ప్రతీసారీ తిడుతున్నావ్, మీ ఇద్దరూ కలసి మెలిసి ఉండాలి కదా...
శౌర్య: ఈ పచ్చబొట్టు ఎలా తీసేయాలో చెప్పు
సౌందర్య: పచ్చబొట్టు చెరిగిపోదు, మీ బంధం ఎప్పటికీ పోదు...
శౌర్య: నేను దీంతో కలసి ఉండను

దాంతో కలిసే ఉండాలి నేను చెప్పాను కదా విను అని సౌందర్య అనడంతో ఇద్దరూ వెళ్లి నిద్రపోతారు. కలసి ఉంటే రెండు మూడు రోజుల్లో శౌర్యకి హిమపై ఉన్న కోపం పోతుంది అనుకుంటుంది. తెల్లారగానే సౌందర్య... కొడుకు-కోడలి-పిల్లల సందడంతా తలుచుకుంటుంది. 
ఆనందరావు: నిన్ను ఎలా ఓదార్చాలో అర్థంకావడం లేదు సౌందర్య
సౌందర్య: శౌర్య ఇంకా లేవలేదా
ఆనందరావు: నా దగ్గరకు రాలేదు
సౌందర్య: హిమ దగ్గర పడుకోను అంటూ మీ దగ్గరకే వచ్చిందండీ...
ఆనందరావు: నేను నిద్రపోయాక వచ్చిందేమో కానీ ఉదయం మాత్రం నా దగ్గర లేదు

శౌర్య కోసం అంతా ఇల్లంతా వెతుకుతారు...ఎక్కడా శౌర్య కనిపించదు.... ఏంటండీ మన ఇంటికి ఏమైందని సౌందర్య బాధపడుతుంది.

సోమవారం ఎపిసోడ్ లో
ఇంట్లోంచి వెళ్లిపోయిన శౌర్య ...ఎవర్నో కొడుతూ ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇస్తుంది. నాను నచ్చని బంధం అక్కా-చెల్లి అంటుంది...ఆటో వెనుక వదిలేదేలే అని రాసి ఉంటుంది.

 

Published at : 19 Mar 2022 07:51 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 19th March Episode 1304

సంబంధిత కథనాలు

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై  సమంత కామెంట్

టాప్ స్టోరీస్

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి