By: ABP Desam | Updated at : 18 Mar 2022 08:04 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam 18th March Episode 1303 (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం మార్చి 18 శుక్రవారం ఎపిసోడ్
హిమని రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఇంద్రుడు, చంద్రయ్య డబ్బులు తీసుకొచ్చేందుకు బయటకు వెళతారు. వీళ్లంటి ఇంకా రాలేదు అనుకుంటుంది హిమ. మరోవైపు కూతురు స్వప్న ఇంట్లో పంచయితీ పెట్టింది సౌందర్య. భార్య-భర్త బంధం గురించి చిన్న క్లాస్ వేస్తుంది.
స్వప్న: డాడీ మెతకమనిషి మంచివారు కాబట్టి నీకు ఎలాంటి కష్టం కలగలేదు..మాకు మాకు మధ్య వంద తగాదాలు ఉన్నాయి మా ఇద్దర్నీ కలపాలని అనవసరంగా ప్రయత్నించకు, మేం విడివిడిగానే బావున్నాం, మీరేంటి మా మమ్మీ ఫోన్ చేయగానే పరిగెత్తుకు వచ్చేశారు, మీ మనసులో కలసిపోవాలని ఉందా ఏంటి
అల్లుడు: అత్తయ్యగారిమీద గౌరవంతో వచ్చాను
స్వప్న: సరే నాపై గౌరవంతో వెళ్లిపోండి
సౌందర్య: స్వప్న ఇది కెరక్ట్ కాదు
స్వప్న: నాకు ఏది మంచో ఏది చెడో తెలుసు
అల్లుడు: అత్తయ్యగారూ మీకు చెప్పినా వినలేదు
సౌందర్య: అత్తయ్యగారూ అని మీరు పిలుస్తుంటే నా పెద్దకోడలు దీప గుర్తొస్తోంది, నేనంటే ఎంత ప్రేమ అంటే నా పేరుతో మొదటి, చివరి అక్షరాలు కలపి సౌర్య అని దాని కూతురికి పేరు పెట్టింది. మన కుటుంబానికి ఎవరి శాపం తగిలిందో తెలియదు, కార్తీక్-దీప-హిమ అలా,మరు ఇలా అయిపోయారు. మీరు కూడా పిల్లల్ని పంచుకున్నారు, తండ్రి దగ్గర ఒకరు- తల్లి దగ్గర మరొకరు పెరుగుతున్నారు, ఉన్న ఆదిత్య-శ్రావ్య అమెరికా వెళ్లిపోతాం అంటున్నారు. మీరైనా కలసిపోండి అందరం కలసి ఉందాం
స్వప్న: మీకు టైంపాస్ కాకపోతే ఏదైనా చేసుకోండి, దయచేసి మా పర్సనల్ లైఫ్ లోకి రావొద్దు, అవసరం లేని ఉచిత సలహాలు ఇవ్వొద్దు...మీ ఇద్దరకీ దండం పెడుతున్నా మీరు వెళ్లిపోతే నేను ఇంటి పనులు చూసుకోవాలి. నేను ఎవ్వరి సలహాలు వినదలుచుకోలేదు, నాకు ఏ బంధుత్వం-చుట్టరికం వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి, నువ్వో ఇంకో పదిసార్లు వచ్చినా, పది సంవత్సరాల తర్వాత వచ్చినా ఇదే మాట చెబుతాను.
Also Read: మహేంద్ర షాకింగ్ డెసిషన్, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ జగతిపై రిషి ఫైర్
ఏడారిలో వర్షం కురవాలి అనుకోవడం ఎలా జరగదో..స్వప్న మనసు మారాలి అనుకోవడం అంతే కరెక్ట్ కాదు అంటాడు అల్లుడు. ఇంతలో పిల్లలు అమ్మమ్మా అంటూ వస్తారు. అందరం కలిసి ఉందాం అన్నది నా కోరిక మీ అమ్మ ఏమో పడనివ్వదు,మీరెప్పటికీ నాతోనే ఉండాలి అని అడుగుతుంది. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను పదండి అంటుంది.
మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మ దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతలో పోలీసులు వచ్చి పట్టుకుంటారు. వాళ్లు మంచివాళ్లు కాదని నాకు ముందే తెలుసు అంటాడు హోటల్ సర్వర్. వాళ్లు నిన్ను మోసం చేశారు, ఈ బిల్లు నువ్వు కట్టలేవు, మా ఓనర్ గారికి ఏదో ఒకటి చెబుతాను, నువ్వు ఏడవకు వెళ్లు అని చెబుతాడు సర్వర్. హిమ హోటల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నడిచి వెళుతుంటుంది. మరోవైపు సౌందర్యతో కలసి పిల్లలు ఇద్దరూ కార్లో వెళుతుంటారు. నాతో వస్తే మీ అమ్మ అరుస్తుందేమో అని అంటే..అవును అమ్మమ్మా కానీ నువ్వు సంతోషిస్తావ్ కదా అంటారు పిల్లలు.
Also Read:డాక్టర్ బాబు చెప్పినా వినని శౌర్య, సౌందర్యకి ఘోర అవమానం
హిమని చూసిన ప్రేమ్: హిమ ఓ హోటల్ ముందు ఆగి నీళ్లు తాగుతుంటే ప్రేమ్ చూస్తాడు. అమ్మమ్మా హిమ అక్కడుందని చెబుతాడు. చనిపోయిన హిమ హెలా కనిపిస్తుందని అడుగుతుంది. నువ్వు హిమ గురించి ఆలోచిస్తున్నావ్ అందుకే హిమలా ఆలోచిస్తున్నావ్ అంటుంది. అమ్మమ్మా వెనక్కు తిప్పు అని ప్రేమ్ చెప్పడంతో కారు వెనక్కు తిప్పుతుంది సౌందర్య. తిరిగి హోటల్ దగ్గరకు వెళ్లేసరికి నీళ్లు తాగేసి వెళ్లిపోతుంది హిమ. సౌందర్య ఫొటో చూపించి కన్ఫామ్ చేసుకుంటుంది. ఎటెళ్లింది అని అడిగి ఆ వైపు వెతికేందుకు వెళతారు. హిమ మాత్రం యాక్సిడెంట్ జరిగిన సంఘటన, అమ్మా-నాన్న చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ నడుస్తుంటుంది. మీరు కలసి ఉండమన్నారు-శౌర్య నాపై కోపంగా ఉంది నన్ను ఏం చేయమంటావ్ అమ్మా అనుకుంటుంది. వెనుకనుంచి వస్తున్న ఆటోని చూడకుండా నడుస్తున్న హిమని చేయిపట్టుకుని లాగుతుంది సౌందర్య. హిమా అంటూ ఏడ్చేస్తుంది. ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
బతికి వచ్చిన హిమని చూసి అంతా షాక్ అవుతారు. హిమ భయంగా శౌర్యవైపు చూస్తుంటుంది. ఆగు అని అరుస్తుంది శౌర్య. అసలు ఎందుకు వచ్చావ్ అని నిలదీస్తుంది.
Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న
Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్ యు చెప్పిన వసుధారకు సర్ప్రైజ్
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి