IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Karthika Deepam మార్చి 17 ఎపిసోడ్: డాక్టర్ బాబు చెప్పినా వినని శౌర్య, సౌందర్యకి ఘోర అవమానం

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 17 గురువారం 1302 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం మార్చి 17 గురువారం ఎపిసోడ్

బుధవారం ఎపిసోడ్ లో సౌందర్య, ఆనందరావుడిస్కషన్ తో సీరియల్ ముగిసి..ఈరోజు అదే డిస్కషన్ తో మొదలైంది.
ఆనందరావు: మోనిత కార్తీక్ జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వాడికి ఆనందం దూరమైంది, ఇటు కార్తీక్ బాధపడ్డాడు, అటు దీప-పిల్లలు బాధపడ్డారు, మనం మాత్రం చూస్తూ ఉండిపోయాం...
సౌందర్య: పదకొండేళ్లు దూరమయ్యారు,పడరాని కష్టాలు పడ్డారు..పాపిష్టిదాన్ని నేనే సరదాగా వెళ్లి రమ్మన్నాను...ఏ ముహూర్తాన అన్నానో కానీ వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి రాలేదని ఏడుస్తుంది...
సౌందర్య: ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను 

Also Read: వసు ప్రవర్తన చూసి అయోమయంలో రిషి, మహేంద్ర షాకింగ్ డెసిషన్
హిమ: బాబాయ్ పోలీసులు మిమ్మల్ని ఎందుకు ఆపారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటుంది హిమ. 
ఇంద్రుడు: మేం దొంగా పోలీస్ ఆడుతున్నాం
హిమ: ఏంటి పిన్నీ ఇదీ అని హిమ అంటే ఏంటి పిల్లని ఇబ్బంది పెడుతున్నావ్ అంటుంది చంద్రమ్మ.  పోలీసులను చూస్తే భయపడతావా బాబాయ్ ఎందుకు అని అడుగుతుంది. 
ఇంద్రుడు: కొందరికి నీళ్లంటే భయం, కొందరికి నిప్పంటే భయం అలా నాకు పోలీసుల్ని చూస్తే భయం.   మీ ఇంటి దగ్గర దింపేశాం కదా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని అడిగితే అక్కడ జరిగిన సంఘటన మొత్తం గుర్తుచేసుకుంటుంది. 
చంద్రమ్మ: నువ్వేం బాధపడకు మనం అందరం కలిసే ఉందాం . నీ మొహం చూస్తేనే ఆకలి వేస్తోందని తెలుస్తోంది అంటుంది. పెద్ద రెస్టారెంట్ కి వెళదాం అని హిమ అంటే.. రెస్టారెంటాకా అని చంద్రమ్మ, ఇంద్రుడు అవాక్కవుతారు. మన దగ్గర బడ్జెట్ అంతంతమాత్రమే అంటాడు ఇంద్రుడు. ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో అక్కడ తినడానికి సందేహ పడుతున్న హిమని చూసి ఇంద్రుడు పెద్ద రెస్టారెంట్ కి వెళదాం అంటాడు.  చూసి  ఇంద్రుడు (Indrudu) అక్కడి నుంచి పెద్ద రెస్టారెంట్ కి వెళ్దాం అని తీసుకుని వెళతాడు.
 
Also Read: మళ్లీ చిక్ మంగుళూరుకి హిమ, అక్కడే ఆనంద్ ని కలవబోతుందా
సౌందర్య-స్వప్న
అల్లుడికి కాల్ చేసిన సౌందర్య..నేను స్వప్న ఇంటికి వచ్చాను ఓ సారి ఇక్కడకు రండి అని చెబుతుంది. స్వప్న లోపలినుంచి వచ్చేసరికి సౌందర్య ఇల్లు ఊడుస్తుంటుంది.
స్వప్న: ఏంటీ ఈ నాటకాలు
సౌందర్య: నా కూతురి ఉల్లు నేను ఊడవడం నాటకాలా
స్వప్న: చేతిలోంచి చీపురు లాక్కుని...ద గ్రేట్ సౌందర్య గారూ నాటకాలే కదా, ఉరిమిఉరిమి చూసే నువ్వు ఊడ్వడం అంటే మహా నాటకమే కదా
సౌందర్య: నేను మీ మమ్మీని కాదా
స్వప్న: సడెన్ గా ప్రేమలు పుట్టుకొచ్చాయేంటి
సౌందర్య: ఏదో అనుకున్నాం, అయిపోయింది , ఇంకా పట్టించుకుంటామా
స్వప్న: కార్తీక్, దీప పోయారనే బాధ నాక్కూడా ఉంది. ఈ సందర్భాన్ని వాడుకుని సంబంధాలు కలుపుకోవాలి అనుకోవద్దు
సౌందర్య: గుండె కోసేలా మాట్లాడుతావేంటి
స్వప్న: బాధ అనిపిస్తోందా...ఒకప్పుడు నా కూతురిని ఇంతకన్నా అవమానించావ్ కదా
సౌందర్య: అందరం కలసి ఉందాం అనుకుంటున్నా
స్వప్న: అయినా నా సంసారం ఏం బావుందని 
సౌందర్య: నువ్వు అల్లుడు కలసిపోవడమే నాకు కావాలి....అందుకే అల్లుడుగారిని ఇక్కడకు రమ్మని చెప్పాను
స్వప్న: వాళ్లిద్దరూ యాక్సిడెంట్ లో పోయారు, మాటవరసకి డాడీని పలకరిద్దామని వచ్చాను, ఈ వంకతో మళ్లీ వరుసలు కలుపుకోవాలి అనుకోవద్దు, ఆయన్ని నువ్వు రమ్మనడం ఏంటో, రాయబారాలేంటో , మధ్యలో నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నువ్వెళితే నాకు పని ఉంది
సౌందర్య: నిరుపమ్ కనిపించడం లేదేంటి
స్వప్న: ఇప్పుడే చెబుతున్నా లేని ప్రేమలు పెంచుకోవద్దు

హిమని రెస్టారెంట్ కి తీసుకెళతారు ఇంద్రుడు,చంద్రమ్మ. మీరు కూడా కూర్చోండి అంటుంది హిమ. కూర్చున్నావేంటి చంద్రమ్మా మనకి పని ఉంది కదా అనగానే అవును కదా. అక్కడ కాసేపు హడావుడి చేస్తారు. నీకేం కావాలో తినేసెయ్ ఇప్పుడేం వస్తాం అని బయటకు వెళతారు. హిమ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఇద్దరూ చూసి మురిసిపోతారు. 

శౌర్య-కార్తీక్
శౌర్య బయట కూర్చుని ఏడుస్తుంటుంది. అమ్మా, నాన్నతో కలసి ఆడుకున్న సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటుంది. రౌడీ అని తండ్రి పిలిచినట్టు అనిపించి పరిగెత్తుకు వెళుతుంది. నాన్నా నీకేం కాలేదు కదా దెబ్బలేం తగల్లేదు కదా, అమ్మ ఎక్కడ అని అడిగితే  షాపింగ్ కి వెళ్లింది వచ్చేస్తుందిలే అంటాడు కార్తీక్. నువ్వు బాగానే ఉన్నావ్ కదా అంటే నేను బాగానే ఉన్నాను, జరిగిన దాంట్లో హిమ తప్పేం లేదు హిమని ఏమీ అనొద్దురా అంటాడ. ప్లీజ్ రౌడీ నా మాట విను అందులో హిమ తప్పేం లేదు..ఇద్దరూ కలసే ఉండాలి, మనసులో కోపాన్ని తీసేసెయ్, మా రౌడీ మంచిది కదా అంటే...తప్పందా హిమదే అంటుంది శౌర్య. నా మాట విను రౌడీ అని కార్తీక్, ఈ విషయంలో మీరెన్ని చెప్పినా నేను ఒప్పుకోను అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ మాయమవడంతో నాన్నా అని తోటంతా వెతుకుతుంది. జరిగినదంతా మళ్లీ గుర్తుచేసుకుని హిమపై ఆవేశంతో ఊగిపోతుంది...ఎపిసోడ్ ముగిసింది...

Published at : 17 Mar 2022 08:54 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 17th March Episode 1302

సంబంధిత కథనాలు

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్ 

Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్ 

SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?

SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?

Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ

Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ

Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్ 

Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్ 
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!

Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!