Guppedantha Manasu మార్చి 16 ఎపిసోడ్: వసు ప్రవర్తన చూసి అయోమయంలో రిషి, మహేంద్ర షాకింగ్ డెసిషన్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.కాలేజీలో రూమర్స్ కి చెక్ పెట్టేందుకు జగతిని వెళ్లిపోమని చెప్పకనే చెబుతాడు రిషి. మార్చి 16 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu ) మార్చి16 బుధవారం ఎపిసోడ్
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేసిన రిషితో గొడవపడిన వసుధార ఏంతో టెన్షన్ గా ఇంటికి వెళుతుంది. మేడం ఎలా ఉన్నారో ఏంటో అని భయపడుతూ డోర్ తీసి జగతిని చూసి షాక్ అవుతుంది. కూల్ గా కాఫీ తాగుతూ, బుక్ చదువుతూ సోఫాలో కూర్చుంటుంది జగతి.
జగతి: రా వసు కాఫీ తాగుతావా, ఈ రోజు కాఫీ చాలా బావుంది
వసుధార: మీరు అలా వచ్చేసినందుకు నాకు చాలా బాదేసింది, మీరేంటి ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు, రిషి సార్ ప్రాజెక్ ని ఎలా కాదంటారు, మీరు మాట్లాడాలి కదా మేడం
జగతి: రిషి డీబీఎస్టీ కాలేజీ ఎండీ, ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఉంది, దానికి మనం కట్టుబడి ఉండాలి కదా
వసుధార: మీకేం బాధ లేదా
జగతి: బాధ ఉండొచ్చు కానీ బాధపడి లాభం లేదుకదా, ఈరోజు స్పెషల్ వంటకాలు చేస్తాను నీకేం ఇష్టమో చెప్పు
వసుధార: ప్రాజెక్ట్ పోయిందన్న బాధలో ఉంటే మీరు వంటలు అంటారేంటి
జగతి: నీకు ప్రాజెక్ట్ పోయిందని బాధ ఉంటే..నాకు నా కొడుకు దూరమయ్యాడనే బాధ ఎంతుండాలి, మహేంద్రకి కాల్ చేసి రమ్మను, ఆయన భోజన ప్రియుడు
వసుధార: మీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు
జగతి: మనకు ఓ పని అప్పగించినప్పుడు చిత్తశుద్ధితో చేయాలి, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదని చెబుతున్నారు ఏం చేస్తాం
Also Read: మళ్లీ చిక్ మంగుళూరుకి హిమ, అక్కడే ఆనంద్ ని కలవబోతుందా
ఇంటికి వచ్చిన రిషిని చూసి ధరణి...డల్ గా కనిపిస్తున్నాడేంటి ఇలాంటి సమయంలో పలకరించకపోవడమే మంచిది అనుకుంటుంది. ఇంతలో ఎదురుగా వచ్చిన గౌతమ్...అరే రిషి నేనొక ప్రాజెక్ట్ గురించి ఇండియా వచ్చానని చెప్పాను కదా అది సక్సెస్ అయిందంటాడు. ఆ విషయాలు చెప్పేలోగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. చూశావా వదినా నేను ఏం చెప్పినా వినకుండా వెళ్లిపోతున్నాడు, వీడికి మనుషుల విలువ-ప్రెండ్ షిప్ విలువ తెలియదు వదినా అంటే.. అలా మాట్లాడకు గౌతమ్ రిషి చాలా మంచోడు అంటుంది ధరణి.
జగతి ఇంట్లో
మహేంద్ర: నువ్వు ఎలా ఉన్నావో ఎంత టెన్షన్ పడుతున్నావో అని నేను కంగారుపడుతుంటే నువ్వేంటి స్పెషల్ వంటకాలు చేస్తున్నావ్
రిషి ఏదో అన్నాడని ఏడుస్తూ కూర్చోవాలా, భోజనం మానేయాలా
మహేంద్ర: కొడుకుపై ప్రేమతో అలా మాట్లాడుతున్నావని నాకు తెలుసులే జగతి
మనిద్దరం వెళ్లి రిషితో మాట్లాడుదాం సార్
వసుధార నువ్వు ఈ విషయంలో ఎక్కువ రియాక్టవకపోవడమే మంచిది
మహేంద్ర: రిషి ఏంటి జగతి ఇలా తయారయ్యాడు
తయారవలేదు తయారు చేయబడ్డాడు, ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడకపోవడమే మంచిది
మహేంద్ర: ఇంత జరిగినా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా మాట్లాడుతున్నావో అర్థంకావడం లేదు
మన ప్రశాంతతని ఎవ్వరూ చెడగొట్టలేరు
మహేంద్ర: నువ్వు, నీ కొడుకు ఇలాగే వాదిస్తారు సరే తర్వాత ఏంటి, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వు కాలేజీ, సిటీ వదిలేసి వెళ్లిపోతావా
నేనెందుకు వెళ్లిపోతాను, నీ బాధ ప్రాజెక్ట్ పోయిందని కాదు నేనెక్కడికి వెళతాను అనా...
మహేంద్ర: రిషి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అర్థం అదేకదా
ఇప్పటికే అందరకీ దూరమై తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, మళ్లీ అలాంటి పని చేయను
మీ మనుసులో ఏముందో చెప్పండి మేం టెన్షన్ పడుతున్నాం
మహేంద్ర: అవును జగతి...నాకొచ్చే కోపానికి ఎలా ఆలోచిస్తున్నానో తెలుసా, నీ మనసులో ఏముందో చెప్పు... ప్రాజెక్ట్ పోయినందుకు బాధలేదా...
దార్లో వెళుతుంటే కాలికి ముల్లుగుచ్చుకుంటే ప్రయాణం ఆపేస్తామా, ఆ ముల్లుని తీసేసి ప్రయాణం కొనసాగించాలి, నేను పిరికిదాన్ని కాదు...నేనొక నిర్ణయం తీసుకున్నాను ( మాటలు బయటకు వినిపించవు ఏదో చెబుతుంది జగతి) నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, ఇది అందరి మంచికోసం తీసుకున్న నిర్ణయం, ఇందులో రిషి బాధపడే పనులు చేయొద్దు, దయచేసి నువ్వు అడ్డురావొద్దు. మహేంద్ర కాసేపు ఓపిక పట్టు నీకు విందు భోజనం సిద్ధం చేస్తాను....
Also Read: కాలేజీ నుంచి వెళ్లిపోయిన జగతి, వసుధారకి పెద్ద షాక్ ఇచ్చిన రిషి
రెస్టారెంట్ కి వచ్చి కూర్చుంటాడు రిషి. ఆ పక్కనుంచే వసుధార వెళ్లిపోతుంది కానీ రిషిని చూడదు. ఆ తర్వాత చూస్తుంది.
రిషి: చూసీ చూడనట్టు వెళుతున్నావ్ ఆర్డర్ తీసుకోవా
వసుధార: ఈ టేబుల్ నాది కాదు సార్
రిషి: టేబుల్ ని రద్దుచేసుకోవడం ఏంటి
వసుధార: మీరు మిషన ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేయగా లేనిది..టేబుల్ ని రద్దు చేసుకోలేనా
రిషి: ఉన్నట్టుండి అలా ఎందుకు అనుకున్నావ్
వసుధార: నా రెస్టారెంట్ డ్యూటీ నా ఇష్టం, ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదంటుంది... ( ఇదంతా రిషి ఊహించుకుంటాడు)
సార్ ఆర్డర్ ప్లీజ్ అనడంతో ఊహల్లోంచి బయటకు వస్తాడు రిషి...ఇంతవరకూ జరిగింది కలా...అయినా వసుధార నాపై అరుస్తుంది అనుకున్నాను అనుకుంటాడు.
రిషి: మీ జగతి మేడం ఏమనుకుంటున్నారు
వసుధార: మనం ప్రతీసారీ జగతి మేడం గురించి ఎందుకు మాట్లాడుకోవడం, మిషన్ ఎడ్యుకేషన్ గురించి వదిలేయండి, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదుకదా మళ్లీ మేడం టాపిక్ ఎందుకు
రిషి: ఏంటి రివర్స్ లో సాధిస్తోంది...
వసుధార: ఈ రోజు ఆర్డర్ మీరు ఇవ్వొద్దు...నేనే తెస్తాను
రిషి: నాకేమైంది ఈరోజు అని ఆలోచిస్తుండగా... స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార, ఎందుకీ స్వీట్..
వసుధార: తిన్నాక చెబుతాను సార్, చిన్న సెలబ్రేషన్ , నా తరపున పార్టీ అనుకోండి
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేస్తే బాధపడుతుంది అనుకుంటే రివర్స్ లో సంతోషంగా ఉందేంటి...
వసుధార: పక్కనున్న మరో బేరర్ ని పిలిచి నా టేబుల్స్ కాసేపు చూసుకో అని చెబుతుంది
రిషి: ఎన్నోసార్లు వచ్చాను ఎప్పుడూ లేనిది ఈ రోజు పరిచయాలేంటో అంటాడు
వసుధార: ఏం లేదు సార్ మిమ్మల్ని పరిచయం చేయాలి అనిపించింది చేశాను
రిషి: ఈ రోజు ఏంటో కొత్తగా కనిపిస్తున్నావ్
వసుధార: మా ఫ్రెండ్స్ కూడా వసుధారా రోజూ కొత్తగా కనిపిస్తావ్ అనేవారు
కాఫీ-ఐస్ క్రీం తీసుకొచ్చి ఇచ్చిన వసుని చూసి...గతంలో నేను అన్న మాటలు నాకే అప్పజెపుతున్నావా అంటాడు. ఇంతకీ ఏంటో ఈ ఉత్సాహం అంటే..చెప్పాల్సిన టైం వస్తే చెబుతానన్న వసు ఈరోజు బిల్ మొత్తం ఫ్రీ అంటుంది. వసుధారలో ఆ ఉత్సాహం ఏంటి..జగతి మేడం విషయంలో నాపై కోపంగా ఉంటుంది అనుకుంటే రివర్స్ లో ఉత్సాహంగా ఉందేంటి అనుకుంటాడు ఎపిసోడ్ ముగిసింది...
రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
రిషి: ఈ రోజు తమరి అత్సుత్సాహం ఎందుకో తెలుసుకోవచ్చా
వసుధార: ఉత్సాహంగా ఉండటం మంచిదే కదా సార్
రిషి:అదే ఎందుకో తెలుసుకోవచ్చా
వసుధార: గుడ్ నైట్ సార్
మహేంద్ర: జగతిపై కోపంతో నువ్వు నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు.
రిషి:ప్రాజెక్ట్ రద్దు చేయాలి అనిపించింది చేశాను
మహేంద్ర:నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకుంటే, నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను, డీబీఎస్టీ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను