Karthika Deepam మార్చి 16 ఎపిసోడ్: మళ్లీ చిక్ మంగుళూరుకి హిమ, అక్కడే ఆనంద్ ని కలవబోతుందా
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 16 బుధవారం 1301 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం మార్చి 16 బుధవారం ఎపిసోడ్
చిక్ మంగుళూరులో జరిగిన సంఘటనలు తలుచుకున్న శౌర్య అమ్మా-నాన్న పక్కన దీని ఫొటో ఎందుకని తీసేసి విసిరేస్తుంది. అప్పుడే ఎంటరైన హిమ కాళ్ల దగ్గర పడుతుంది ఆ ఫొటో. వెనక్కి అడుగేసిన హిమ ఆ ఫొటో చేతిలోకి తీసుకుని చూసి మళ్లీ కిందపెట్టేసి ఎంట్రన్స్ దగ్గర ఆగుతుంది. శౌర్యా ఏం చేస్తున్నావ్ నువ్వు అని ఆనందరావు అడగడంతో..
శౌర్య: అమ్మానాన్ని మింగేసిన రాక్షసి అది దాని ఫొటో ఇక్కడ ఎందుకు పెట్టారు, నాకు అమ్మానాన్నల్ని లేకుండా చేసిన తర్వాత అది నాకు ఎప్పటికీ ఏమీకాదు, అయితే గియితే నాకు శత్రువు అవుతుంది అంతే...కారు డ్రైవ్ చేయాలని హిమ కోరికే అమ్మా-నాన్నని చంపేసింది. వద్దు వద్దు అని మొండిగా డ్రైవింగ్ చేసింది కాబట్టే ఈ రోజు అమ్మానాన్న ఇలా మిగిలిపోయారు.
సౌందర్య: చెల్లెలి మీద అంత కోపం పెంచుకుంటే ఎలా శౌర్య
శౌర్య: అలాంటి చెల్లి నాకువద్దు, అది నా చెల్లెలు అని మీరు ఎవరికీ చెప్పొద్దు, నేను కూడా ఎవరికీ చెప్పను, నాకు అమ్మా నాన్న లేకుండా చేసిన రాక్షసిని నాకు చెల్లెలు అని ఎలా చెప్పుకోమంటారు
సౌందర్య: నువ్వు నమ్మినట్టే హిమ బతికేఉండి తిరిగి వస్తే కాదనగలవా, నా చెల్లెలు వద్దు అనగలవా
శౌర్య: హిమ నిజంగా బతికేఉన్నా నా కళ్లముందికి రాకపోవడమే మంచిది, వచ్చినా నాకున్న కోపానికి ఏం చేస్తానో తెలియదు
శ్రావ్య: చిన్నపిల్లవి అలా మాట్లాడకూడదు
శౌర్య: కళ్లముందే అమ్మానాన్న చావుకి కారణమైనదాని గురించి ఎలా మాట్లామంటారు..ఏదో ఒకరోజు నాకు ఎదురుపడుతుంది, ఆ రోజు మాత్రం నేను హిమని వదిలిపెట్టను నానమ్మా...
సౌందర్య: కనిపిస్తే ఏం చేస్తావ్
శౌర్య: చంపేస్తాను , తప్పుచేసిన వాళ్లగురించి తప్పుగా మాట్లాడకుండా ఎలా మాట్లాడతారు... హిమ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు, దానివస్తువులేవీ నా కళ్లముందు ఉంచొద్దు, నాకు చెల్లెలు లేదు ఉన్నా అది చెల్లలు కాదు...
సౌందర్య: శౌర్యా తప్పమ్మా...
శౌర్య: మీకు హిమే కావాలి అనుకుంటే నేను కూడా అమ్మా-నాన్న దగ్గరకి వెళ్లిపోతాను, నేను కూడా మీకు మిగలను , మళ్లీ దానిపేరు ఇంట్లో ఎవరైనా ఎత్తితే నేను మీకు దక్కను
Also Read: కాలేజీ నుంచి వెళ్లిపోయిన జగతి, వసుధారకి పెద్ద షాక్ ఇచ్చిన రిషి
ఇదంతా విన్న హిమ ఇంటిలోపలకు అడుగుపెట్టకుండా బయటకు వెళ్లిపోతుంది. నేరుగా మోనిత ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళితే శౌర్య నన్ను తిడుతుంది నేను ఎక్కడికి వెళ్లాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ ఆంటీ అని పిలుస్తుంది. అప్పుడే గోడకు ఉన్న కార్తీక్, మోనిత పూజ చేస్తున్న ఫొటో చూసి షాక్ అవుతుంది. మోనిత ఆంటీ,డాడీ కలసి పూజ చేశారా నాకు తెలియనే తెలియదు అనుకుంటూ ఆతర్వాత మోనిత చేతిలో బాబు ఆనంద్ ఉన్న ఫొటో చూస్తుంది. తమ్ముడి ఫొటో ఇక్కడుందేంటి, తమ్ముడిని ఆంటీ ఎత్తుకుందేంటి, నాకేం అర్థంకావడం లేదు, తమ్ముడు మోనిత ఆంటీ దగ్గరకు ఎందుకు వస్తాడు అని ఆలోచిస్తుంది. ( గతంలో మోనిత వచ్చి తమ్ముడిని ఎత్తుకుంటానని అడిగిన విషయం గుర్తుచేసుకుంటుంది), ఆంటీ వచ్చిన ప్రతీసారీ మమ్మల్ని పక్కకు వెళ్లేమనేవారు ఎందుకో అనుకుంటూ మళ్లీ పాత విషయాలన్నీ గుర్తుచేసుకుంటుంది. తమ్ముడు ఆంటీకి ఎక్కడ కనిపించాడు, ఆంటీ ఫొటో ఎప్పుడు తీసుకుంది ( తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారన్న సౌందర్య మాటలు గుర్తుచేసుకుంటుంది), అబద్ధాలు చెప్పడం అందరకీ అలవాటే కదా ( మనిద్దరి మధ్యా అంతచేసిన మోనితని అని అనుకున్న దీప-కార్తీక్ మాటలు గుర్తుచేసుకుంటుంది). తమ్ముడు మోనిత ఆంటీ కొడుకా..అంటే తమ్ముడు నిజంగానే నాకు తమ్ముడా అనుకుంటుంది.
Also Read: మోనిత, ఆనంద్ ఎవరో హిమకి తెలిసిపోయింది, సీరియల్ ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క
గేట్ బయట ఉన్న ఇంద్రుడు, చంద్రమ్మని పోలీస్ క్వశ్చన్ చేస్తాడు. మీరు దండుపాళ్యం బ్యాచ్ లా ఉన్నారంటూ అని బెదిరిస్తుండగా హిమ అక్కడకు వచ్చి వీళ్లు మా పిన్ని, బాబాయ్..డాక్టర్ మోనితని కలిసేందుకు వచ్చారంటుంది. పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో...ఎంత ధైర్యంగా మాట్లాడావ్ అని హిమని మెచ్చుకుంటూ..మీవాళ్లను కలిశావా అని అడుగుతుంది చంద్రమ్మ. నేను ఎప్పటికీ మీతో ఉండొచ్చా అని అడుగుతుంది. ఇంతమాట నువ్వంటే మేం ఎలా కాదంటాం తల్లీ, మాతోనే ఉండు మా కన్న బిడ్డలా చూసుకుంటాం అంటుంది. బిడ్డకి ఏం కష్టం వచ్చిందో ఏమో మనతో ఉంటానంటోంది కదా..ఇక నుంచి మన బిడ్డ మనతోనే ఉంటుంది నువ్వేం మాట్లాడకు అంటుంది ఇంద్రుడితో. మరోసారి శౌర్య మాటలు గుర్తుచేసుకుంటుంది హిమ.
మరోవైపు శౌర్య కూడా అమ్మా-నాన్న ఫొటో దగ్గర ఏడూస్తూ కూర్చుని యాక్సిడెంట్ కి ముందు జరిగిన విషయాలన్నీ గుర్తుచేసుకుంటుంది. శౌర్యని చూస్తూ ఇంట్లో అందరూ కూడా శోకంలోనే ఉంటారు.
ఆనందరావు: నువ్వు ధైర్యంగా ఉంటేనే ఆదిత్య, కోడలు ధైర్యంగా ఉంటారు
సౌందర్య: నా పెద్ద కోడలు, కొడుకే నాకు ధైర్యం..వాళ్లే లేనప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది
ఆనందరావు: వాళ్ల జ్ఞాపకాలుగా పిల్లల్ని చూసుకోవాలి కదా
సౌందర్య: వాళ్లు ఉన్నన్ని రోజులూ టెన్షన్ గానే బతికారు, సంతోషంగా ఉంటారు అనుకున్నప్పుడే వెళ్లిపోయారు, పూర్వ జన్మలో ఏం పాపం చేశామో ఏమో, ఏదో శాపం తగిలింది మన కుటుంబానికి... ఇంటి ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే మంచిది కాదంటారు...నా కూతురు స్వప్న నన్ను దుమ్మెత్తి పోస్తూ శాపం పెట్టింది, నాశనమైపోతారంది, ఆ శాపం తగిలిందేమో.. మన కుటుంబం ఏమో ఇలా అయిపోయింది.. పెద్దోడు-దీపా మనకు దూరమయ్యారు, సమాజంలో గొప్ప సర్జన్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ జీవితంలోకి ఆ మోనిత ఎప్పుడు ఎంటరైందో అప్పటి నుంచీ వాడికి మనశ్సాంతి లేకుండా పోయిందండీ
ఆనందరావు: మోనిత కార్తీక్ జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వాడికి ఆనందం దూరమైంది, ఇటు కార్తీక్ బాధపడ్డాడు, అటు దీప-పిల్లలు బాధపడ్డారు, మనం మాత్రం చూస్తూ ఉండిపోయాం...
సౌందర్య: పదకొండేళ్లు దూరమయ్యారు,పడరాని కష్టాలు పడ్డారు..పాపిష్టిదాన్ని నేనే సరదాగా వెళ్లి రమ్మన్నాను...ఏ ముహూర్తాన అన్నానో కానీ వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి రాలేదని ఏడుస్తుంది...
ఎపిసోడ్ ముగిసింది